Pages

27 అక్టో, 2008

బస్సుపాలైన బాల్యం

paddu 1 060

కాళ్ళా గజ్జావయసు

కండెలమ్ముకుంటోంది

బలపం పట్టాల్సిన చేతులు

నాలుగు రాళ్ళ కోసం

తంటాలుపడ్తున్నాయి

కలలు కనే కళ్ళు

భవిష్యత్తును

కానలేకపోతున్నాయి.

లేలేత చెక్కిళ్లు

ఎండకు మగ్గిపోతున్నాయి

ఇంతమంది మధ్యలో

ఈ పెద్దమనిషి కూడా

పోటీ పడి మరీ

సంపాదించేయాలని

ఆరాటపడుతోంది.... !

....................పద్మకళ

6 కామెంట్‌లు:

  1. బాలకార్మికులను చూస్తే చాలా బాధేస్తుందండి. మీస్పందన బాగుంది

    రిప్లయితొలగించండి
  2. నిజంగానే బాలకార్మిక వ్యవస్థ నశించాలి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపలేకపోతుంది. ఉన్న చట్టాలు సరిపోతాయి కానీ వాటిని కఠినంగా అమలు చేయాలి.

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత3:38 PM

    బాధగావుంది

    రిప్లయితొలగించండి
  4. bala kaarmikula gurinchi mee spandana baavundy..

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా రాశారు కళ గారు. బాల కార్మికుల నిర్మూలనకై ఎన్ని చట్టాలు వచ్చనా ఇంకా ఈ పరిస్థితి కొనసాగుతోందంటే చాలా బాధాకరం.

    రిప్లయితొలగించండి