Pages

19 డిసెం, 2008

నేనింతే !

నలుగురికోసం

బ్రతుకుతాను

నన్ను నన్నుగా

బ్రతికించుకుంటాను

 

మంచిదనిపిస్తే

ముందడుగు వేస్తాను

కాదనుకుంటే్

దేవుడినైనా ఎదిరిస్తాను

 

 

బద్ధకాన్ని చూసి

అసహ్యించుకుంటాను

నాన్చుడు తత్వమంటే

నొచ్చుకుంటాను

 

 

 

చప్పుడు చేసే చప్పట్లంటే

భయపడతాను

కన్నీటిని తుడిచే చేతులకి

సలాం కొడతాను

 

 

మనసారా మెచ్చుకుంటే

శిరసు వంచి నమస్కరిస్తాను

వెన్నుతట్టి దారి చూపేవారికి

జేజేలు పలుకుతాను, జోహార్లర్పిస్తాను

 

 

వింతలోకంలో పుట్టిన అరుదైన జీవిని .....

అస్తమానం ఆలోచనల తీరాలలో విహరిస్తూంటాను....

                                                                                            ..... . . . నేనింతే    !

5 కామెంట్‌లు:

  1. neninte kavita bagundi chappudu chese chetulu kooda mechchukolu kada? mee kavitalu aalochimpa chestunnayi..khuddus46@gmail.com

    రిప్లయితొలగించండి
  2. మీ స్పందనకు ధన్యవాదాలు.
    చేతులు చేసే చాలా చప్పుళ్ళు చేతుల్లోంచే పుడుతున్నాయన్నది నేను గ్రహించిన సత్యం.హృదయంలోనుంచి ఆ చప్పుళ్ళు పుట్టినప్పుడు చేతులకు తోడుగా కళ్ళు కూడా స్పందిస్తాయి.
    మన చేతల్లాగే చాలా సార్లు చేతులు కూడా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయాయి. కానీ కళ్ళు మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పవు.
    మనసుకి కళ్ళకి అవినాభావ సంబంధం ఉందన్న సంగతి ముమ్మాటికీ నిజం.మనసులో ఉన్న భావాలు దాచిపెట్టడం కళ్ళకి చేతకాదు.
    అందుకే ఎవరైనా అబద్ధం చెప్తున్నట్లనిపించినపుడు ’నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు’ అంటాం.
    ’Face is the index of mind' అనే కంటే ఆ మాటని కళ్ళకి వర్తించి చెప్పటం సబబు అని నేనంటాను.
    మనస్ఫూర్తిగా ఇచ్చే మెచ్చుకోలు చప్పుడు చేయకున్నా అవతలివారికి అందితీరుతుంది మీ స్పందన లాగా.

    వింతలోకంలో ఓనమాలు దిద్దుతున్న నాకు మీ అనుభవాల దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ.........

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత11:08 AM

    chala bagundii telugu bhashaloni madhuryannii manam kavitala dwara patala dwara aswadaistam ento goppaga undi

    రిప్లయితొలగించండి
  4. chala baguni నేనింతే
    super mam andulo konni padalu na gurinchi kuda
    vunaee
    niceeeeeeeeeeeeeeeeeeeee

    రిప్లయితొలగించండి