Pages

20 జన, 2011

ఎన్నాళ్లయిందో కదా….

బ్లాగులో భావాలు పంచుకుని , మిత్రుల అభిప్రాయాలు అందుకుని  చాలా కాలమయింది.కొంచెం సాధించానన్న సంతోషం , చాలా కోల్పోయాన్న వెలితి కేవలం బ్లాగుకు దూరమవటం మూలానే అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చావు కదా .ఏంటి సంగతులు అంటారా…? చాలా ఉన్నాయి.ఎన్ని…?  అంటే మీ ధృష్టి లో తక్కువేమో కనీ నాకు మాత్రం బోలెడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే…. ఎల్కేజీ పిల్లాడు ఒకటో తరగతి కొచ్చే సరికి ఎన్ని విషయాలు నేర్చుకున్నాడో… మొదట్లో వాడి మనసుకీ …. రెండేళ్ళ తర్వాత మారిన మనసుకీ … దాని అనుభవాలకీ ఉన్నంత  తేడా.   అది పరిపక్వత అవుతుందో , పరిణతి అవుతుందో కాలమే తేల్చాలి…….

 

 

ఈ సంవత్సర కాలంలో నేను నేర్చుకున్న, అర్థం చేసుకున్న విషయాలలో అతి ముఖ్యమైనది ఇవ్వాళ ప్రస్తావిస్తాను.

సంస్థలైనా . వ్యవస్థలైనా మనుగడ సాగించాలంటే కొన్ని విధి విధానాలు కావాలి.

సంస్థ పుట్టేటపుడు (మన అమ్మానాన్నలు మనకోసం కన్న కలల్లా) వ్యవస్థాపకులు బోలెడు కలలు కంటారు. ఆ కలల్లోంచే విధానాలు పుడతాయి.

సంస్థల భవిష్యత్తు ప్రథానంగా ౫ అంశాలపై ఆధారపడి  ఉంటుంది.

విధానాలు  రూపొందించుకోవటం,

వాటిని అమలు చేయటం,

ఫలితాలు సరి చూసుకోవటం,

గుణ దోషాలని గుర్తించి తగిన మార్పు,చేర్పులు చేసుకోవటం,

కాలంతో పోటీ పడటం………

 

ఈ ఐదు పనులు సమర్థవంతంగా చెయ్యగల వ్యవస్థ  ఎప్పటికీ నిత్య కళ్యాణం , పచ్చ తోరణం గా నిలుస్తుంది.