Pages

15 జన, 2009

త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు

 

ముత్య్లాలంపాడు ఊరేగింపు, త్యాగరాజు ఆ.... 034

 

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో  త్యాగయ్య గా ప్రసిద్ధి చెందిన కాకర్ల  త్యాగయ్య కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు. ముత్తుస్వామి దీక్షితారు, శ్యామ శాస్త్రులు తక్కిన ఇద్దరు. ముగ్గురిలోనూ త్యాగయ్య శైలి సులభంగా పాడటానికీ , వినటానికీ ఇంపుగా ఉంటుంది. రామ భక్తునిగా , వాగ్గేయకారునిగా ప్రసిద్ధికెక్కిన త్యాగయ్య తంజావూరు ను ఏలిన రెండవ శరభోజి కాలం నాటి వాడు.

ఆయన పూర్వీకులు ఆంధ్రదేశంనుండి తమిళ నాటికి వలసపోయి, తంజావూరు సమీపంలోని తిరువాయూరులో స్థిరపడటం వల్ల త్యాగయ్య అటు తమిళులకూ , ఇటూ తెలుగువారికీ ఆప్తుడయ్యాడు. రాజాశ్రయం కోరకుండా, రాజుల సత్కారాలు స్వీకరించకుండా కేవలం ఆత్మానందం కోసం 600 కి పైగా కీర్తనలు రాశాడు.

తమిళ నాడులో కావేరీ నది ఒడ్దున తిరువాయూరు గ్రామంలో  గల త్యాగరాజ స్వామి సమాధి వద్ద గత 100 ఏళ్ళుగా జరుగుతున్న ఉత్సవాలకు దీటుగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను రాష్ట్రంలో కూడా వైభవంగా నిర్వహించే తలంపుతో 1995 లో ఏర్పడ్డ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఏటా విజయవాడ నగరంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలప్రాంగణంలో పెద్ద ఎత్తున సంగీతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఆరాధనోత్సవాలు  జనవరి 14 బుధవారం  ప్రారంభమయ్యాయి. 

రాష్ట్ర్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాలనుండి మొత్తం 260 మంది కళాకారులు ఉత్సవాలలో పాల్గొని కచేరీలు చేస్తారు. 

ముత్య్లాలంపాడు ఊరేగింపు, త్యాగరాజు ఆ.... 037

 

18 వతేదీ ఆదివారం ఉదయం 200 మంది కళాకారులు కలిసి ఒకేసారి త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం ఉత్సవాలలోని ప్రత్యేక అంశం. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేస్తుంది.

      వారంరోజుల పాటు  ప్రతిరోజూ రెండుపూటలా జరుగుతున్నసంగీతోత్సవాలకి సంగీతాభిమానులందరూ ఆహ్వానితులే.  

13 జన, 2009

అన్నపూర్ణయై ...ఆంధ్రావని సంక్రాంతి సంబరాలు............

 saakshi1 081

కలిసిఉంటే కలదు సుఖమంటూ.....ఆటైనా ...పాటైనా ....

అందరితో కలసి..........

 

saakshi1 086

 

 

 

 

 

 

 

ఉరకలెత్తే ఉత్సాహం తో..........

saakshi1 089

అచ్చమైన పల్లెటూరి  ప్రకృతిలాగా స్వచ్చమైన మనసుతో......saakshi1 162

ప్రతిరోజూ నిత్య వసంతంగా రంగులమయంగా కళ కళ లాడాలని........

 

saakshi1 092

పట్టుదల, ఆత్మ విశ్వాసాలు పందెం కోళ్ళ లాగా పోటీ పడుతూ....

 

saakshi1 169

తిరుగులేని విజయాలకు విఘ్నాలు తొలగిపోయి ,

సంక్రాంతి సంబరాలు మీఇంట అంబరాన్ని అంటాలని అభిలషిస్తూ.................

saakshi1 135 తెలుగుకళ.............పద్మకళ.......

6 జన, 2009

ప్రపంచ నాస్తిక మహా సభలు

నాస్తికమహా సభలు (49)  నాస్తికమహా సభలు (46) నాస్తికమహా సభలు (16) జనవరి 5,6,7 తేదీలలో విజయవాడలో 7 వ  ప్రపంచ నాస్తిక మహా సభలు జరిగాయి. నాస్తికం గురించి ఎప్పుడూ విన
టమే కానీ ప్రత్యక్షంగా నేను ఏ నాస్తికులనీ ఇంతవరకూ చూడక పోవటంతో అసలు వాళ్ళేం చెబుతారో చుద్దామని ఎంతో ఆసక్తితో వెళ్ళాను.

నాస్తికమహా సభలు (3)

నాస్తికమహా సభలు (8)

 

 

       దాదాపు 50 మందికి పైగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి హేమా హేమీలు ఈ సభలకి హాజరయ్యారు. మొదటిసారి విదేశీయుల భావాలని ప్రత్యక్షంగా పంచుకునే అవకాశం మా పత్రిక ద్వారా నాకు కలిగింది.

       హాజరైన విదేశీయులలో ప్రముఖులైన శాస్త్రఙ్ఞులు, రచయితలు, న్యాయవాదులు, వైద్యులు, ప్రూఫ్ రీడర్లు.... ఇలా చాలా మంది ఉన్నారు.ఒక్కోక్కరిదీ ఒక్కో అనుభవం.

నాస్తికమహా సభలు (12)

 

 

నాస్తికమహా సభలు (18)

 

       నేను స్వతహాగా దైవాన్ని విశ్వసిస్తాను. ఇంత విభిన్నమైన ప్రకృతి నడవటం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పుడప్పుడూ ఒక దానితో మరొక దానికి  పొంతన లేని చెట్ల ఆకులని, పువ్వులని, చూసి ముగ్ధురాలనై పోతాను.

      ఉన్న దాన్ని అటో ఇటో మార్చటం మనిషివల్ల అవుతుంది కానీ సృష్టికి ఎదురు వెళ్లి దానికి విరుద్ధంగా మనిషి ఏమీ చెయ్యలేడని నిర్మొహమాటంగా చెబుతాను.

నాస్తికమహా సభలు (21)

       అసలు ఆధ్యాత్మికతకు, మత మౌఢ్యానికి సంబంధమే లేదని నేనంటాను. మనమేమిటో , మన శక్తియుక్తులేమిటో మనకి చెబుతూ , తరతమ భేదాలు లేని వసుధైక కుటుంబ భావనని అందించే అద్వితీయమైన శక్తి ఆధ్యాత్మికత.

     నాస్తికమహా సభలు (49)     

 

అలసిపోయిన మనసుకి, నిరాశా,నిస్పృహలతో ఉన్న మనిషికి కొంత విశ్రాంతిని, ఓదార్పుని ఇచ్చి, కొత్త విశ్వాసాన్నిచ్చి నడిపిస్తుంది దైవంపై నమ్మకం.

             పాపభీతి మనుషులని ఎంతో కొంత బాధ్యత గలిగిన వారిగా చేస్తుంది. మనసులో ఏదో ఒక మూల ప్రతి ఒక్కరికీ ( భారతీయులకి) ఇలా చేస్తే భవిష్యత్తులో నా కేమైనా అవుతుందేమో నన్న భయాన్ని కలిగిస్తుంది.

         దైవం మన మనసులో ని భావాలని బట్టి మన కళ్ళకి కనిపిస్తుంది. చూసే చూపుని బట్టి ప్రపంచం మనముందు అగపడ్తుంది. విభిన్న మైన మనస్తత్వాలతో కలిసి పనిచేస్తూ , రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ మన మనసుకి అప్పుడప్పుడూ వద్దన్నా అంటుకున్న మాలిన్యం తాలూకు జిడ్డు వదలాలంటే  ఎంతో కొంత మేరకు దైవ చింతన ఉండాల్సిందే.

            ప్రపంచ నాస్తిక సభలకి మూడురోజులు హాజరైన తరువాత సభ్యుల అంతరంగాన్ని నాచిన్ని బుర్రకు అందినంతవరకు మీముందు ఉంచాలనుకుంటున్నాను.

 

౧. మతం అనేది మనిషికి పుట్టుకతో రాలేదు.

౨. మతపరమైన్ జన్యువు మనలో లేనేలేదు.

౩.పెద్దలే పిల్లల్లో మతాన్ని భయాన్నో , అలవాట్లద్వారానో ఆపాదిస్తున్నారు.

౪. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి.

౫.చేతబడులు లేవు. సైకిక్ సర్జరీల వంటివి మోసపూరితాలు.

౬.ప్రస్తుత మారణకాండకు మతమే మూల కారణం.

౭. మతాన్ని దాటి మనవత్వం వైపు సాగితేనే పురోగమనం సాధ్యం.

౮.మతాంతర వివాహాలను ప్రోత్సహించటం ద్వారా మనుషుల మధ్య నున్న అంతరాలని తొలగించాలి.

౯.యువ శక్తిని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకి మళ్ళించకఫోతే వారు తీవ్రవాదులుగా వినాశకారులుగా మారిపోతారు.

౧౦.ఎదుటి వారు చెప్పిందల్లా గుడ్దిగా నమ్మకుండా తర్క సహితమైన ఆలోచన చెయ్యాలి.

ఇలా ఇంకా ఉన్నాయి.నాస్తికమహా సభలు (44) మరో సారి వివరిస్తాను.