Pages

27 నవం, 2008

రెక్కలు

vista leaves

ఎటుచూసినా

తేనె

పూసిన

కత్తులే

ప్రశ్నించేవాడెప్పుడూ

పిచ్చోడే ! ............................౧.

-------------------------------------------

లేనివాడికి

దొరకదు

ఉన్నవాడికి

అరగదు

జానెడు పొట్టకు

బోలెడు తిప్పలు .................... ౨.

------------------------------------------------

కోట్లు

కూడబెట్టి

కునుకులేని

బ్రతుకు

బూడిదలో

పన్నీరు ................... ౩.

-------------------------------------------------

పేదరికంపై

పెత్తనం

అమాయికత్వంపై

ఆధిపత్యం

పనిమనిషీ

మనలాంటి మనిషే ! ..................౪.

------------------------------------------------

మనసు

గుప్పెడు

ఆశ

గంపెడు

విషవృక్షం

దురాశ ..................... ౫

-------------------------------------------------

'నా'నుండి

చూస్తే

అన్నీ

న్యాయాలే

తారుమారైన

తప్పొప్పులు 'నా - నీ' లు. ...................౬.

-------------------------------------------------

గోరుముద్దల్లో

కోటిసుద్దులు

జోలపాటల్లో

శతకోటి ఆశలు

అమృత భాండాగారం

అమ్మ !!!! ...............................౭.

-------------------------------------------------

.......తెలుగుకళ _ పద్మకళ. .

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి