Pages

14 డిసెం, 2008

నా దారి.........

ఆశావాదినైన నేను

వినీలాకాశంలో విహంగాలని చూస్తూ

అద్భుతాల్ని అందుకోవాలని

గగనాన్నిఅధిరోహించాలని.........

నేల నుండి నింగికి పయనమయ్యాను

వెర్రికి వెనకాముందులేదా

అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే

నెమ్మదిగా నీళ్లు తాగమని

మరి కొందరు నా మేలుకోరి

చల్లని సలహాలిస్తుంటే ........

నాదారి పూలబాట కాదని తెలిసినా

గోదారినై ఎత్తు పల్లాలని దాటి సాగాలని ............

నాఅడుగుల వెంబడి

సుమాలు పుష్పించాలని .........

వాటిపై కొత్త దారులు కనిపించాలని.........

ఆ దారుల్లో కొత్త తరాలు

నూతనోత్తేజంతో దూసుకెళ్లాలని..........

నిరంతరం తపిస్తున్నాను

ప్రతిక్షణం గెలుపుకై ఆరాటపడుతూ

అప్పుడప్పుడూ అచేతనంగా నిలబడిపోతున్నాను

ఆ క్షణంలో........మసగబారిన

నా ఆలోచనా లోచనాలని సరిచేసి,

ఉత్సాహాన్ని ఊపిరిగా చేసి

నా బాట సాటి లేనిదంటూ....

నాలో నాపై ధీమాని కలిగించి

చెక్కు చెదరని విశ్వాసాన్ని ,

మొక్కవోని స్థైర్యాన్ని ప్రాణవాయువుగా ఇచ్చి.....

నేనెంచుకున్న రణరంగానికి

నన్ను సమాయత్తం చేసి

నా నుదుట విజయ తిలకం దిద్దే

నా నేస్తాలు భగవంతుడిచ్చిన

కోటానుకోట్ల వరాలు

దేవుడా ! నువ్వేమి ఇచ్చినా ఇవ్వలేకున్నా

నా ప్రాణాలనే నీపాదాల పై ఉంచి ప్రార్థిస్తున్నాను

ఉన్నత వ్యక్తిత్వాలని కోకొల్లలుగా

నాకు పరిచయం చెయ్యి

క్షణమొక పాఠంగా అంతులేని అనంత జ్‘నాన్ని గ్రోలి

అపారమైన విజ్నాన ఖని గా

దేదీప్యమానంగా వెలగాలని ఉంది

ఆ వెలుగు కలకాలం అందరికీ

పంచాలని ఉంది ఆరిపోయేదాకా........

నన్నర్థం చేసుకుంటే అది నా అదృష్టం

అపార్థం చేసుకుంటే అది నీ సృష్టిలోని లోపం !

1 కామెంట్‌లు:

సమిధ ఆన౦ద్ చెప్పారు...

ఈ రాత్రి మొత్త౦ మీ కవితా ప్రవాహ౦లోనే ఈతకొడుతూ గడిపెస్తానేమో. దైవ సృష్టిని ధిక్కరి౦చడ౦లో ఒకి౦త తర్క౦ తొ౦గిచూసినా, మీ కవితలో జాగృతానికి మీరు పడే తాపత్రయ౦ ముచ్చటగొలిపేలా ఉ౦ది. అ౦దుకే దేవుడు మీరు అడిగిన అపారమైన ఘనిని ఇచ్చాడు, ఇచ్చాడు కాబట్టే ఈ రక౦గా మీరు అ౦దరికీ ఆ ఘనిని ప౦చగలుగుతున్నారు. కాద౦టారా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి