జనవరి 5,6,7 తేదీలలో విజయవాడలో 7 వ ప్రపంచ నాస్తిక మహా సభలు జరిగాయి. నాస్తికం గురించి ఎప్పుడూ విన
టమే కానీ ప్రత్యక్షంగా నేను ఏ నాస్తికులనీ ఇంతవరకూ చూడక పోవటంతో అసలు వాళ్ళేం చెబుతారో చుద్దామని ఎంతో ఆసక్తితో వెళ్ళాను.
దాదాపు 50 మందికి పైగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి హేమా హేమీలు ఈ సభలకి హాజరయ్యారు. మొదటిసారి విదేశీయుల భావాలని ప్రత్యక్షంగా పంచుకునే అవకాశం మా పత్రిక ద్వారా నాకు కలిగింది.
హాజరైన విదేశీయులలో ప్రముఖులైన శాస్త్రఙ్ఞులు, రచయితలు, న్యాయవాదులు, వైద్యులు, ప్రూఫ్ రీడర్లు.... ఇలా చాలా మంది ఉన్నారు.ఒక్కోక్కరిదీ ఒక్కో అనుభవం.
నేను స్వతహాగా దైవాన్ని విశ్వసిస్తాను. ఇంత విభిన్నమైన ప్రకృతి నడవటం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పుడప్పుడూ ఒక దానితో మరొక దానికి పొంతన లేని చెట్ల ఆకులని, పువ్వులని, చూసి ముగ్ధురాలనై పోతాను.
ఉన్న దాన్ని అటో ఇటో మార్చటం మనిషివల్ల అవుతుంది కానీ సృష్టికి ఎదురు వెళ్లి దానికి విరుద్ధంగా మనిషి ఏమీ చెయ్యలేడని నిర్మొహమాటంగా చెబుతాను.
అసలు ఆధ్యాత్మికతకు, మత మౌఢ్యానికి సంబంధమే లేదని నేనంటాను. మనమేమిటో , మన శక్తియుక్తులేమిటో మనకి చెబుతూ , తరతమ భేదాలు లేని వసుధైక కుటుంబ భావనని అందించే అద్వితీయమైన శక్తి ఆధ్యాత్మికత.
అలసిపోయిన మనసుకి, నిరాశా,నిస్పృహలతో ఉన్న మనిషికి కొంత విశ్రాంతిని, ఓదార్పుని ఇచ్చి, కొత్త విశ్వాసాన్నిచ్చి నడిపిస్తుంది దైవంపై నమ్మకం.
పాపభీతి మనుషులని ఎంతో కొంత బాధ్యత గలిగిన వారిగా చేస్తుంది. మనసులో ఏదో ఒక మూల ప్రతి ఒక్కరికీ ( భారతీయులకి) ఇలా చేస్తే భవిష్యత్తులో నా కేమైనా అవుతుందేమో నన్న భయాన్ని కలిగిస్తుంది.
దైవం మన మనసులో ని భావాలని బట్టి మన కళ్ళకి కనిపిస్తుంది. చూసే చూపుని బట్టి ప్రపంచం మనముందు అగపడ్తుంది. విభిన్న మైన మనస్తత్వాలతో కలిసి పనిచేస్తూ , రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ మన మనసుకి అప్పుడప్పుడూ వద్దన్నా అంటుకున్న మాలిన్యం తాలూకు జిడ్డు వదలాలంటే ఎంతో కొంత మేరకు దైవ చింతన ఉండాల్సిందే.
ప్రపంచ నాస్తిక సభలకి మూడురోజులు హాజరైన తరువాత సభ్యుల అంతరంగాన్ని నాచిన్ని బుర్రకు అందినంతవరకు మీముందు ఉంచాలనుకుంటున్నాను.
౧. మతం అనేది మనిషికి పుట్టుకతో రాలేదు.
౨. మతపరమైన్ జన్యువు మనలో లేనేలేదు.
౩.పెద్దలే పిల్లల్లో మతాన్ని భయాన్నో , అలవాట్లద్వారానో ఆపాదిస్తున్నారు.
౪. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి.
౫.చేతబడులు లేవు. సైకిక్ సర్జరీల వంటివి మోసపూరితాలు.
౬.ప్రస్తుత మారణకాండకు మతమే మూల కారణం.
౭. మతాన్ని దాటి మనవత్వం వైపు సాగితేనే పురోగమనం సాధ్యం.
౮.మతాంతర వివాహాలను ప్రోత్సహించటం ద్వారా మనుషుల మధ్య నున్న అంతరాలని తొలగించాలి.
౯.యువ శక్తిని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకి మళ్ళించకఫోతే వారు తీవ్రవాదులుగా వినాశకారులుగా మారిపోతారు.
౧౦.ఎదుటి వారు చెప్పిందల్లా గుడ్దిగా నమ్మకుండా తర్క సహితమైన ఆలోచన చెయ్యాలి.
8 కామెంట్‌లు:
ఆ దేవుడి దయవల్ల ప్రపంచ నాస్తికసభలు విజయవంతం కావాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా.
పద్మ కళ గారు, విజయవాడ పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు మీకు అభినందనలు.
పద్మ గారు మీకు AIR తో అనుబంధం ఉన్నదా?
విజయవాడ పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు మీకు అభినందనలు.
నాకు teliya లేదు .నేను ravalasimdi.
ప్రపంచ నాస్తిక మహాసభలు ఉత్త శీర్షిక మాత్రమేనా? అదైనా ఫాంట్ రంగు బాగా లేదు. అస్పష్టంగా, కంటికి ఇబ్బందిగా వుంది. రంగు మార్చండి.
పద్మ కళ గారూ, కొద్దిరోజుల క్రితం ఈ టపా చూసాను కానీ ఇప్పుడు కనిపించడం లేదు! తీసివేసారా?
నాస్తికకేంద్రం విశేషాలు చూసి నాకు సంతోషం కలిగింది. రోజూ నివేదిక ఇసారనుకున్నాను కానీ ఒక్కరోజుతో ఆపివేసారేం? ఇదివరలో ఆ కేంద్ర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడిని.
విజయవాడ ఈ-తెలుగు గురించి మీ పార్టిసిపేషన్ చదువుతూనే వున్నాను. మీకు అభినందనలు.
మంచి కథనం. చాలా బాగుంది. విజయవాడ పుస్తక ప్రదర్శన సమయంలో మీ సహకారం ప్రశంసనీయం, అభినందనీయం.
భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు.బౌద్ధమతంలో దేవుడున్నాడనే భావనలేదు.కమ్యూనిస్టులు ప్రాధమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం... ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు.ఆస్తిక హేతువాదులు: మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు. నాస్తిక హేతువాదులు: దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు. ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.నరసరావుపేట ఆర్డీవో జడ్జి తమ బంగ్లాలలో సెంటిమెంటు కారణంగా నివసించటంలేదని అక్కడ గతంలో ఎవరో ఆకతాయులు నిమ్మకాయలు పసుపు కుంకుమ ముగ్గులు వేశారని ఆ భయంతోనే లక్షలాది రూపాయల ఖర్చుతో కట్టిన ఆ భవనాలను పాడుపెట్టారని వార్త.ఇలాంటి సమయాల్లో అది నిష్కారణ భయమని ఋజువు చేసేదే హేతువాదం.బాణామతి చేతబడి వట్టిదేనని హేతువాదులు అధికారులు బాగానే ప్రచారం చేస్తున్నారు.ఆస్తిక హేతువాదులు దేవుడిని ఒప్పుకుంటారు.మతం పేరుతో జరిగే అహేతుక విషయాలను మూఢాచారాలను ప్రశ్నిస్తూ ఉంటారు.మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు.నాస్తిక హేతువాదులు దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు.ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.నేను ఆస్తిక హేతువాదిని.వామపక్ష భావాలు లేదా నాస్తిక భావాలు గలవాళ్ళే హేతువాదుల్లో ఎక్కువగా చోటుచేసుకున్నారు.చివరిదశలో ఆధ్యాత్మిక బాట పట్టిన హేతువాదులు కొంతమంది ఉన్నారు.అలాగే నాస్తికులుగా మారిన భక్తులు కూడా ఉన్నారు.ఎవరి కారణాలు వారివి.అసలు నాకునేనే ఒక ఆశ్చర్యాన్ని.నాకు కూడా కొన్ని అపవిశ్వాసాలు ఉన్నాయి.బక్రీదులో బలులివ్వటం మాని రంజాన్ లో ఉపవాసాలే చేయమంటాను.ఇస్లామ్ అంటే శాంతి కాబట్టి ఆ మతాన్ని అవలంబించే ముస్లిములు ఇడీఅమీన్ ,బిన్ లాడెన్ లాగా కాకుండా శాంతికాముకులై ఉండాలని కోరుకుంటాను.తెలుగులో నమాజు చెయ్యనివ్వాలని అంటాను.నాస్తికుణ్ణి కాదుకానీ ఎందుకో హేతువాదుల్ని అభిమానిస్తాను.నా అంతిమ లక్ష్యం మానవతావాదమే కాబట్టి నా జీవితప్రయాణం మంచివైపేసాగాలని కోరుకుంటాను.
రహంతుల్లా గారూ ! నాస్తికత పై చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
"బక్రీదులో బలులివ్వటం మాని రంజాన్ లో ఉపవాసాలే చేయమంటాను" ఈ మాట నాకు బాగా నచ్చింది. ఒక్క బక్రీద్ మాత్రమే కాదు. అన్ని మతాల పండుగలకీ బలయ్యే మూగజీవుల కు రక్షణ కల్పించాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి