నింగి విరిగి నేల కూలినా....పుడమి గుండె బద్ధలై గగనానికి ఎగసినా....సూర్య చంద్రులు తారుమారైనా .... ’సత్య’మే గెలుస్తుంది . ఎప్పటికైనా !
అసత్యం అప్పుడప్పుడూ విర్రవీగినా , అధర్మం చెలరేగినా అది తాత్కాలికమే.
పరిణామం........ ప్రతి ఒక్కరు ఇష్టపడేది, ఆశపడేది. ఉన్న స్థితి నుంచి మార్పు కావాలని , అడుగడుగునా అభివృద్ధి చెందుతూ ఆకాశమే హద్దుగా ఎదగాలని కలలు కనని వాడు మనిషే కాడు. కాకపోతే తన ఎదుగుదల కోసం ఇతరులను అణగద్రొక్కే దుర్మార్గులు కొందరు, నలుగురికోసం తమని తాము అర్పించుకుంటూ ఒదిగి ఎదుగుతూ అందరి మదుల్లో గది కట్టుకునే వాళ్ళు కొందరు.
మార్పు రావాలంటూ నినదిస్తున్న మహానుభావులందరికీ మార్పు ఎంత తీవ్రం గా కూడా ఉంటుందో ,దాని పర్యవసానాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించాడు ఓ సత్యవంతుడు.
అవును అబద్ధం చెప్పానని స్వయంగా ఒప్పుకున్నా ప్రపంచం అతన్ని సత్యవంతునిగానే చూస్తుంది.
వ్యాపారంలో అబద్ధం చెప్పని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులు మాత్రం కాదు.దేవతలో....
"పులినోట్లో చిక్క కుండా దాని పై స్వారీ చెయ్యటం ఎంతో గొప్ప సాహసం" అంటూ సాహసాన్ని చేసి పులి బారినుంచి ఈ రాజు తప్పించుకున్నా పులిని మించిన వింత జీవి ఆయన్ను కప్పివేయటం తెలుగు ప్రజలకి తీరని దుఃఖానికి గురిచేసింది.
ఎవరి నోట విన్నా ఒకటే మాట. ఈ రాజు మారాజు, మంచి రాజు, మనసున్న మారాజు. అని.
వనవిహారమైనా , కారాగారమైనా సింహం సింహమే.కాకపోతే ఈ సింహం గర్జించదు. మౌనంగా ప్రపంచాన్ని జయిస్తుంది.
గెలిచిన వాడి కంటే ఓ డిన వాడికి కసి ఎక్కువ అన్నట్టు . దెబ్బతిన్న పులి మళ్ళీ విజృంభించక మానదు.
పుట్టిన గడ్డ నుంచి ప్రపంచం దాకా ఎదిగి పేరు తెచ్చుకునే వారు కొందరైతే ఆ గడ్డకే పేరు తెచ్చే ప్రతిభామూర్తులు కొందరే.
విశ్వవీధిలో సాంకేతికతా సామ్రాజ్యంలో ఓ సాధారణ తెలుగువాడు జయపతాకమెగరేసిన నాడు ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం. దారి గానక కూల బడిన ఓ దివ్య మూర్తిని దీనంగా చూస్తూ నిట్టూరుస్తున్నాం.
జైలు కెళ్ళటం మహనీయులకి కొత్తేమీ కాదు. బాపూజీ, శాస్త్రీజీ, పటేల్జీ, తిలక్..... ఎందరో . కల్మషం, కాఠిన్యం , రక్తపాతం, దుర్మార్గం అంటుకున్న జైలు గోడలని ఆవిరైపోతున్న కన్నీటి చుక్కలతో కడిగి, సంక్రాంతికి స్వచ్చమైన చూపుల తోరణాలు కట్టేందుకే ఈ పరిణామం....
కాకపోతే ఈ పరిణామం కొత్త సంవత్సరంలో మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయి బాధించటం నిజంగా బాధాకరం.పట్టాఅభిషేకాన్నీ, వనవాసాన్నీఒకేలా గా స్వీకరించి ఆరాముడు స్థితప్రఙ్ఞుడైతే , గెలుపునీ , ఓటమినీ సవినయంగా స్వీకరించిన ఈ రాముడూ చారిత్రక పురుషుడే.
వేలాది మందికి అన్నదానం , ప్రాణదానం చేస్తూ దేవుడైన మహనీయుడికి ఈ పరిస్థితి ఏమిటాని సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. గ్రహణం పట్టినంత మాత్రాన సూర్య చంద్రులు లోక రక్షకులు కాకపోరు.
ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తింటున్న మేరు నగాలు ఎన్నో ఏళ్ళ తరబడి సముద్రుణ్ణి చూస్తూ , చిరుమందహాసం చేస్తూ , ధీమాగా నిలబడి ఉండగా లేనిది..............
కళ్ళు తెరిచింది మొదలు, మూసే వరకు జనాల్ని పీడించుకు తినే జలగలు, అమాయకులని జీవచ్చవాలని చేసి పీక్కు తింటున్న రాబందులు యధేచ్చగా విర్రావీగగాలేనిది:
బైర్ర్రజుగా రామ రాజ్యం కోసం తపించి , లక్షలాది మంది గుండేల్లో గుడికట్టుకున్న మారాజువి....... అధర్మంతో పోటీ పడి తాండవమాడలేని అపర శివుడివి.........
చెయ్యి తడపందే కాలు కదపని సోమరిపోతు లంచగొండి శునకరాజాలు, ఆత్మ పరిశీలనకు అర్థం తెలియని భేషజాల బడా బాబులు, స్వేచ్చగా , యధేచ్చగా జైత్రయాత్రలు సాగిస్తుంటే గుండెపై చెయ్యి వేసి , కళ్లతో బదులివ్వగల ధీమంతుడివి, సహనశీలివి.
అశ్వత్థామ హతః - కుంజరః అని నిజమైన అబద్దాన్ని చెప్పిన యుధిష్టురుడు ధర్మరాజైతే.....
గోవర్థనగిరినెత్తి తనవారిని కాచిన కృష్ణుడు దేవుడైతే , నమ్ముకున్న వేలాదిమంది భవితవ్యం కోసం నీ పరువునే ఛత్రంగా చేసి తల క్రిందులైనా , తిరగబడినా ఏళ్ల తరబడి కునుకులేకుండా పోరాడి గెల్చుకున్న కీర్తి ప్రతిష్ఠల్ని, సంపదల్ని పణంగా పెట్టి నీ వారి కోసం ,నిన్ను విశ్వసించిన సంస్థ కోసం గొడుగుపట్టిన సత్యమూ దైవమే.
నిజం నిప్పులాంటిదైనా మనిషిని మనిషిగా నిలబెడుతుంది.......ఒక్కోసారి దేవుణ్ణి కూడా చేస్తుంది..
నాకు తెలిసిన ప్రపంచం చిన్నదే కావచ్చు.
నా అనుభవానికి వయసే లేకపోనూ వచ్చు.
మౌనంగా నా భావాలను పంచుకొని, చల్లగా జారుకోకుండా
మీ అభిప్రాయాన్నిచిరు వ్యాఖ్యలతో ఆవిష్కరించండి.
ఏది సత్యమో ..... ఏది అసత్యమో తెలియని నా లాంటి అయోమయాలకు ఙ్ఞానోదయం కలిగించండి...
8 కామెంట్‌లు:
బ్లాగు మిత్రు లారా బాగా గమనించండి. "పద్మ" పత్రం నుండి వెల్వడిన ప్రతి అక్షరం "సత్యం" "సత్యం" అని ఘోషిస్తూ ఉంది.ఐతే "ఏది సత్యం ? ఏదసత్యం? " అని శీర్షిక పెట్టి ఉండాల్సింది. ఓక్కో సారి సత్యం అసత్యం గా అసత్యం సత్యం గా కనిపిస్తుంది. ధర్మ శాస్త్ర కోవిదులే ఒక్కొసారి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక తికమక పడుతూ ఉంటారు. ఇక మనమెంత?
ఒక సాధారణ పల్లెటూరు "సత్యం" తెలుగు వాడి "వాడి" ప్రపంచ నలుమూలలకు ఎలుగెత్తి చాటారు.
ఈటోపిక్ ఎంచుకుని "పద్మ" తన "కళా" హ్రుదయాన్ని మరో మారు చాటుకుంది.
చట్టానికీ న్యాయానికీ మధ్యన ఉన్న రేఖను స్ప్రుసించారు మన "కళ" అనడం సబబెమో కదా! మనువు కాలం నుండి ఆ వూహా రేఖను ఛేదించి ఒక కొత్త కోణం లొ న్యాయ పరమైన విషయాలను మనవాళికి సాక్షాత్కరింప చేయాలని చేసే
మహొన్నత యత్నం ఈ హైటెక్ యుగంలో ఐనా ఫలిస్తుందా?
బ్లాగు సోదర సోదరీ మణులరా మీరూ మీ అభిప్రాయాన్ని నిర్మొహంటంగా తెలియ చెయ్యండి - టేకుమళ్ళ వెంకటప్పయ్య.
naaku ramaligaraju garu teliyadu.
kani yenduko rajugaru tappu cheyarani naa nammakam.
antaa manchi jaragaali raju gariki.
nenu roju devuduni ade korukuntunnanu.
raju garu malli vachi chakravarthiukavalani.
t.v vallu pichipichi tags petti rajugari ni
avamanaparacha kundaa undalani naa manavi.
papam rajugaari kutunbam gurinchi aalochichaliga.
మీలాగే చాలా మంది కోరుకుంటున్నారు. బంగారం ఎంత విలువయినది అయినా సమ్మెట దెబ్బలు తప్పవు. సత్యం ఉద్యోగులకు, పెట్టుబడిదార్లకు, రాజు గారికి మంచే జరగాలనే కోరుకుందాము.
adbutam meru chaypindi nijam
naku chala badha ga vundi
raju garu aa okkarini endilo kalapa kunda thana meeday mottam baram vasukunaru bhavusaa mahanu bavulu andaru meeru chaypinatu movnamganey vuntaraymo
chusara oka taputo manam rajugaru chasina mundu manchi manchi panulani marchipoyam aday manushula parvathana
but andaru ala vundaru kada meeru nirupincharu mee prati padam na madini kadipindi...
టేకుమళ్ళ వెంకటప్పయ్య garu kuda thana amulyamaina padhala tho nannu chala akattu kunaru
meru elagay andari devaynanu andukoni unduku sagalani na aakankshaaa
shalini
చాలా బాగా రాశారు. సత్యం కథ విన్నాకా ఇటువంటి ప్రతిస్పందన మాదేనేమోననుకున్నాము. కానీ చాలా మంది అభిప్రాయమిదేనని మీ మాటల్లో తెలుస్తోంది. చాలా సంతోషం. ప్రపంచంలో తిరుగులేనిది సత్యానికే. సత్యానికున్న శక్తి ఈ సత్యం నిలదొక్కుకున్న తీరులో కూడా స్పశ్టమవుతోంది. ధన్యవాదములు
ఈ పోస్టు రాయటానికి ఎందరో అభిప్రాయాలను ఆధారంగా తీసుకున్నాను.
రాసే సమయానికి జనంలో సత్యం అధినేతపై ఎంతో నమ్మకం ఉంది. రాసిన తరువాత కొంతకాలానికి ఒక్కొక్కటిగా నిజాలు బయటికొస్తోంటే .......ఏది నిజం? ఏది అబద్ధం ? ...... ఎవరిని నమ్మాలి?.... ఎవరిని నమ్మకూడదు?...... అన్నీ ప్రశ్నలే. ప్రతి ప్రశ్నకూ విభిన్న కోణాలలో సమాధానాలు.కానీ అన్ని సమాధానాల సారం ఒక్కటే.సత్యం రాజు అసత్యమాడి మోసం చేశాడని. కారణం ఏదైనా కావచ్చు. కానీ నమ్మకాన్ని కోల్పోవటమనేది అతిపెద్ద శిక్ష. ఈ శిక్షకు బాధ్యులు ఎవరు?.............
తప్పు చేశాడా లేదా అని ఆలొచించడం కంటే అసలు ఏమి జరిగింది, తన వ్యక్తిత్వం ఎంటి అనేవిషయాన్ని చక్కగా ఆవిష్కరించారు. నిజమే తన చేతులతో పెంచిన సంస్థ నిలువునా కూలుతుంటే మౌనంగా భరించడం నరకం. విషాన్ని సైతం మౌనంగా భరిస్తున్న రాజుకిది నిజమైన ఓదార్పు కాగలదు
నేను నిన్న కలిసిన ఒక పారిశ్రామికవేత్త అభిప్రాయం ఇక్కడ ఉంచుతున్నాను.
ఎవరేమన్నా రాజు ఒక ట్రెండ్ సెట్టర్! సంస్థని నిలుపుకోవటానికి అతని చర్యలు విఫలం కావటం వల్ల దోషిగా మిగిలాడు. అదే డైరెక్టర్ల బృందం అతని మాటతో కలిసి ఉన్నట్లైతే పరిస్థితి మరోలా ఉండేది.
అతని మాట ఒకటి ప్రస్థావించవలసిన అవసరం ఉంది.పారిశ్రామికవేత్త పరిశ్రమను స్థాపించేటపుడు నాయకులు షేర్ల కోసం ఎగబడే పరిస్థితి మారాలి. ఈ మాటని బట్టి అతని పరిస్థితి, వ్యతిరేకత స్పష్టమవుతోంది.
నిజానిజాల సంగతి అలా ఉంచి ఈ విషయంపై మరింతమంది విఙ్ఞుల అభిప్రాయాలను జోడించడం ద్వారా ప్రజానాడి ని వినిపిస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి