తెలుగుతేజం మరోసారి జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను చాటిచెప్పింది. డిసెంబరు 4 నుండి 8 వరకు జాతీయ స్థాయిలో దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగిన పోటీలలో విజయవాడ నగరానికి చెందిన ఎ.ఎస్.డి.ఎల్.సాహితి సృజనాత్మక రచన అంశంలో అనన్య సామాన్యమైన ప్రతిభ కనబరచి బాలశ్రీ అవార్డును సాధించి రాష్ట్రానికే వన్నె తెచ్చింది.
క్రియేటివ్ పర్ఫార్మెన్స్, క్రియేటివ్ ఆర్ట్, క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ సైంటిఫిక్ ఇన్నోవెషన్స్ అనే నాలుగు అంశాలలో సాహితి క్రియేటివ్ రైటింగ్ ( సృజనాత్మక రచన) ను ఐచ్చికాంశంగా ఎంచుకుంది.నాలుగు అంశాల్లోనూ జరిగిన పోటీల్లో మన రాష్ట్రం నుండి సాహితి మాత్రమే ఈ అవార్డును సాధించటం అభినందించదగ్గ విషయం.
సౌత్ జోన్లో బాలశ్రీ అవార్డుపొందిన ఆరుగురిలోనూ ఒక విజేతగా నిలవటంతో పాటు, జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డు ను పొందిన మొత్తం 53 మందిలో ఒక విజేతగా నిలిచింది.
2004 లో ప్రతిభా అవార్డును,2007 లో బాలరత్న అవార్డుని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవటంతో పాటు వివిధ స్థాయిలలో నృత్యం, సంగీతం తదితర అంశాలలో ఎన్నో బహుమతులు, గెల్చుకుంది. ప్రస్తుతం సాహితి ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతోంది.
3 కామెంట్‌లు:
ప్రతిభను ప్రోత్సహించడం, వెన్ను తట్టడం లాంటివి సుసాంప్రదాయం, సుసంస్కారం. ఇంతకన్నా సుమధుర బ్లాగుల సుందరికి ఏమి చెప్పగలం చెప్పండి.
ప్రతిభను ప్రోత్సహించడం, వెన్ను తట్టడం లాంటివి సుసాంప్రదాయం, సుసంస్కారం. ఇంతకన్నా సుమధుర బ్లాగుల సుందరికి ఏమి చెప్పగలం చెప్పండి. ఆవిడ "సాహితీ" సార్వభౌమి గా పేరొంది "కలం(ళ)" ద్వారా విచ్చిన "ఫద్మా"లను పూయిస్తోంది.
విజేతకు అభినందనలు. పోటీల నేపథ్యం, పద్ధతి ఏమన్నా కొంచెం వివరంగా చెప్తారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి