మనిషి మేథస్సు నుండి పుట్టిన అద్వితీయమైన ఆవిష్కరణలు కంప్యూటర్లయితే కంప్యూటర్ల ద్వారా ఇతరుల రహస్యాలను చేదిస్తారు హ్యాకర్లు. వినడాని కి ఈ మాట కొత్తగా ఉన్నా హ్యాకర్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయి.ఈ తరుణంలో హ్యాకింగ్ పట్ల ప్రాథమిక ఙ్ఞానం ప్రతిఒక్కరూ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
హ్యాకింగ్ అంటే ఏమిటి?
ఏదైనా ఒక కంప్యూటర్ నకు గానీ వెబ్ సైటు కి గానీ అనధికారికంగా చొరబడటాన్నే హ్యాకింగ్ అంటారు.
మనం రూపొందించుకునే మెయిళ్ళు, వెబ్ సైట్ల భద్రత కోసం
పాస్‌వర్డ్‌ను ఎంతో రహస్యంగా ఇచ్చుకుంటాం. హ్యాకర్లు ఆ పాస్వర్డ్ లను కనిపెట్టి అక్రమంగా చొరబడి విలువైన సమాచారాన్ని, రహస్యాలను తెలుసుకునే ప్రమాదం ఉంది.
పాస్వర్డ్ ఇచ్చేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
పాస్ వర్డ్ అన్నది సింపుల్ గా ఉండకూడదు.
(చాలా మంది పాస్ వర్డ్ గా వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు పెట్తుకుంటారు.) తెలిసిన వారి ఊహ కందే విధంగా పాస్వర్డ్ ఉండకూడదు.
కనీసం 13 నుండి 14 క్యారెక్టర్లు ఉండాలి.
పాస్వర్డ్ లో ఒక అంకె , ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యాపిటల్ లెటర్, , ఒక స్మాల్ లెటర్ ఉండాలి.
పాస్వర్డ్ ఎంటర్ చేసే చోట కీ లాగర్స్ ఉన్నయేమో చూసుకోవాలి.
ఒక వేళ ఉన్నట్లయితే అవి మీ పాస్వర్డ్ ను పట్టేస్తాయి.
అవి ఉన్నచోట పాస్వర్డ్ ను ఎంటర్ చేయకూడదు.
బయటి ప్రాంతాల్లో ( ఇంటర్నెట్ లలో ఈ విషయం గుర్తుంచుకోక తప్పదు.)
మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే వెబ్సైటు నిజమైనదా లేక నకిలీదా అన్న సంగతి కూడా పరిశీలించుకోవాలి.
మీరు పాస్‌వర్డు ఎంటర్ చేసే ముందు ఎస్ .ఎస్. ఎల్. సర్టిఫికేట్
(లాగ్ సింబల్ లో ) ఉందో లేదో సరి చూసుకోవాలి.
అది హెచ్.టి. టి.పి.ఎస్. కనెక్షన్ అయితే మంచిది.
దాదాపు అన్ని మెయిల్ సర్వీసులు (జిమెయిల్, యాహూ,హాట్‌మెయిల్ మున్నగునవి) హెచ్.టి.పి.ఎస్. నే వాడుతున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా యూ.ఆర్.ఎల్. సరైనదీ కానిదీ చూసుకోవాలి.
పాస్వర్డ్ ప్రతిసారీ టైప్ చెయ్యటమెందుకులే అని కొందరు బద్ధకించి కంప్యూటర్ కి పాస్వర్డ్ గుర్తుంచుకోమన్న ఆదేశాన్ని ఇస్తారు.
పర్సనల్ కంప్యూటర్ల కి మినహా ఇది ఇంకెక్కడా అంత శ్రేయస్కరం కాదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి, ఆరు అక్షరాలు ఉన్న ఎలాంటి పాస్ వర్డ్ నైనా 8 గంటలలో ఛేదించవచ్చు ..
అదే ఏడు అక్షరాలున్న పాస్వర్డ్ ని ఛేదించడానికి రెండు రోజులు పదుతుంది.
కానీ ఎనిమిది అక్షరాలు ఉన్న పాస్వర్డ్ ని ఛేదించడానికి అచ్చంగా మూడు సంవత్సరాల కాలం కావాలి
పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే చాలా వరకు మీ మెయిళ్లకి భద్రత లభించినట్లే.
హ్యాకింగ్ రకాలు:
హ్యాకింగ్ చేసే వారిని బట్టి, చేసే విధానాన్ని బట్తి అది రెండు రకాలు.
వైట్ హాట్ హ్యాకర్స్ :
హ్యాకింగ్ పద్ధతులపై ఆసక్తితో , అధునాతన శాస్త్రీయ విఙ్ఞానాన్ని అందించే కంప్యూటర్ అదనపు ఆవిష్కరణలపై ఆసక్తితో కంప్యూటర్ పరిఙ్ఞానాన్ని పెంపొందించుకోవటం కోసం హ్యాకింగ్ చేసే వాళ్ళని ’ వైట్ హాట్ హ్యాకర్స్ ’ అంటారు.ఇతరుల కంప్యూటర్లలోని సమాచారాన్ని , సాఫ్ట్ వేర్లని పాడుచేయకుండా కేవలం వ్యక్తిగత ఙ్ఞానాన్నిపెంచుకోవడానికి హ్యాకింగ్ చేస్తారు.వీరివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
బ్లాక్ హ్యాకర్స్:
స్వీయ అవసరాలకోసం , స్వంత లాభాలకోసం ఇతరుల సమాచారాన్ని, రహస్యాలను దొంగిలించటానికి ఇతర కంప్యూటర్ల పనితీరును పాడు చేయటానికి హ్యాకింగ్ ను మార్గంగా ఎంచుకునే వారిని బ్లాక్ హాట్ హ్యాకర్స్ అంటారు.వీరివల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అందువల్ల సంస్థలు వీరి బారిని పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి.
హ్యాకింగ్ ప్రయోజనం:
సైబర్ వార్ జరుగుతున్న ప్రస్తుత కాలంలో హ్యాకింగ్ పద్ధతి శతృవులకి బుద్ది చెప్పే ఒక ప్రభావవంతమైన సాధనంగా కూడా ఉపయోగపడటం విశేషం.
వివిధ దేశాలు తమ శతృ దేశాల ప్రసిద్ధ మైన వెబ్సైట్ల ని హ్యాక్ చేయటాన్ని ప్రతిష్టాత్మకంగా భావించటాన్ని బట్తి హ్యాకింగ్ జోరు ఎంత విస్తృతంగా ఉందో తెలుస్తోంది.
హ్యాకింగ్ పరిణామాలు ,దేశభవిష్యత్తు లను దృష్టిలో పెట్టుకుని
హ్యాకర్లు నైతికతా నిరూపించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
6 కామెంట్లు:
BAGUNDI MUGGULALO RANGULAKALA IS GOOD VIDYA RJ
ఈవ్యాఖ్య ఇంతకుముందు నేను రాసిన ముగ్గుల పోస్ట్ పై ఇచ్చారుకదా. విద్య ( అక్కడికి బదులుగా ఇక్కడ పొరపాటుగా ఇచ్చినట్టున్నారు)ధన్యవాదాలు.
పాస్ వర్డ్ గురించి చాలా విషయాలు తెలిసాయి. థ్యంక్యూ వెరీ మచ్. ఇన్ని కొత్త విషయాలు తెలుసుకొడమే కష్తం. ఫైగా మనందరికీ తెలిసేట్లు ద్రాక్షా పాకం లో వివరించడం, మరొక కసరత్తు. పద్మను కళాపాఠి (ఘనాపాఠి లాగ అన్న మాట) అనడం సబబేమో కదా?
పాస్ వర్డ్ గురించి చాలా విషయాలు తెలిసాయి. థ్యంక్యూ వెరీ మచ్. ఇన్ని కొత్త విషయాలు తెలుసుకొడమే కష్తం. ఫైగా మనందరికీ తెలిసేట్లు ద్రాక్షా పాకం లో వివరించడం, మరొక కసరత్తు. పద్మను కళాపాఠి (ఘనాపాఠి లాగ అన్న మాట) అనడం సబబేమో కదా?
ఆ మధ్య మాఇంటికి మా మేనల్లుడు వచ్చాడు. గెస్ట్ అక్కౌంట్ ఉపయోగించుకోమన్నాము కానీ మా విండోస్ అక్కౌంట్ పాస్ వర్డ్ లన్నీ హ్యాక్ చేసి మాకు చెప్పాడు :(
laxmi chepparu anni maggulu andaga unni
కామెంట్‌ను పోస్ట్ చేయండి