గుండెల్లో వేడి సెగలు
నరనరాల్ని పీడించే
భయభ్రాంతులు
అందమైన ప్రపంచాన్ని
అంతం చేసేందుకు
ఎక్కిన కొమ్మను
నరుక్కునేందుకు
వెర్రితలలు వేస్తున్న
మనిషి మూర్ఖత్వం.
నూరేళ్ళజీవితాన్ని
నేలపాలు చేస్తున్న వైనం
తలచుకుంటుంటే.......
ఉగ్రవాద భూతం
గంతలు కట్టుకుని
దారితప్పి రెచ్చిపోతోంటే...
పాలుగారే బుగ్గల
పాపాయిల్ని
పావులుగా చేసుకుని
బాల్యాన్ని చిదిమేస్తుంటే....
కర్తవ్యమేమిటంటూ
అంతరాత్మ ఘోషిస్తోంది
చేతగాని బ్రతుకు నీదంటూ..
నిస్సహాయంగా
పిచ్చిమనసు
నిట్టూర్చుతోంది
మత ఛాందసం
కలిపురుషునిగా మారి
సుకుమారమైన చేతుల్తో
మారణాయుధాలు
మోయిస్తూంటే....
బొమ్మలాటల బాల్యాన్ని
ప్రాణాల చెలగాటాలకు
ఉసిగొల్పుతుంటే......
పిచ్చి పిల్లల
తుపాకీలాటలకి పోయే
ప్రాణం ఖరీదెంతో
తెలియని
పిల్ల చేష్ఠలకి
గుండె తరుక్కుపోతోంది
కన్న బిడ్డల్ని
మానవ బాంబుల్ని
చేసే జీహాదీలు
తమ త్యాగానికి
గర్విస్తున్నారో..
కడుపుతీపి
రుచి మరచి
రక్తదాహంతో
మానవ మృగాలౌతున్నారో....
కనిపిస్తే
చెంపఛెళ్ళుమనిపించాలని
ఉంది
నిలువునా కడిగేయ్యాలనిపిస్తోంది
2 కామెంట్‌లు:
మీ నాలుగు పదాల నానో వెనుక ఎ౦త అగ్ని దాగు౦దో, అ౦తా పెల్లుబికి బయటకి వచ్చినట్టు౦ది మీ ఈ కవితలో. అయినా ఈ జీహాదీలకు చె౦ప చెళ్ళుమనిపిస్తే ఏ౦ సరిపోతు౦ది. అ౦త రౌద్ర౦గా చెప్పిన మీ భావాలు, చివరన ఈ మాటకొచ్చేసరికి వద్దన్నా మీలో ఉన్న శా౦తి గుణాన్ని చూపి౦చేస్తున్నాయి కదూ! కానీ చాలా బాగా చెప్పారు. ఇలా౦టి వాటిని నిరోధి౦చడానికి నా దృష్టిలో సరైన ఆయుధ౦ విద్య ఒక్కటే. సరైన విద్యను అభ్యశిస్తే వీర౦దరికీ కులమతాల సరైన అవగాహన, వాటికున్న విలువె౦త అనేవి తెలుస్తాయేమో. దేవుడే దిక్కు భవిష్యత్ప్రప౦చానికి!
Hello Naa peru Ravinder, verri thalalu vestunna murkhatwam, kallaku ganthalu kattukuni brthukuthunna vainame
idaina maredaina gunde kothaina brathuku bhudidaina.
Allage naa blog ni kooda koncham chudandi ihttp://sriravireddy21.blogspot.com/
కామెంట్‌ను పోస్ట్ చేయండి