Pages

13 మే, 2009

ఎన్నెన్నో జన్మల బంధం .....

మనం నవ్వితే అవి గంతులేస్తాయి.

మనం బాధపడితే అవి కంటతడిపెడ్తాయి

. kanchi...... swamy , .... pets ..may 7th 030.jpg

మనకి జ్వరం వస్తే అవి లంకణం చేస్తాయి.

సింపుల్ గా చెప్పాలంటే మనం దగ్గరైతే అవి పండగ చేసుకుంటాయి.

మనం దూరమైతే అవి భారమైన గుండెతో బెంగపెట్తుకుంటాయి.

మన శతృవులపై విరుచుకుపడ్తాయి. మన మితృల్ని మనసారా ఆహ్వానిస్తాయి.

రంగు, రూపం , వేషం , భాష , జాతి, నీతి అన్నీ వేర్వేరే.

అయినా సరే. మన జీవన విధానంలో ఒక భాగమైపోయి ఆత్మీయత, అనుబంధాల మూటలు కట్తి గుండెనిండిన ప్రేమతో, ప్రేమ నిండిన గుండెతో మన గుండెల్ని గెల్చుకుంటాయి మూగజీవాలు.


kanchi...... swamy , .... pets ..may 7th 078.jpg

మనిషి ప్రకృతిపై సాధించిన గెలుపంటూ ఒకటి ఉందంటే అది కేవలం జంతువులని మచ్చిక చేసుకోవటం మాత్రమే.

వాటికి భాష రాదు.అయినా చూపులతో , చేష్టలతో మాట్లాడుతాయి.

ఇష్టం, కోపం, అలుక, దుఃఖం, సంతోషం ఇలా అన్ని భావాలను మనతో పంచుకోవాలని ప్రతీ క్షణమ్ మనతో గడపాలని తపిస్తాయి.

పెంపుడు జంతువులు.వాటితో గడిపే ప్రతినిముశమూ ఆహ్లాదమయం కావటం తో పాటు మన ఆరోగ్యానికి , ఆయుష్షుకి అదనపు మార్కులు ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

మనకి ఎన్నో వ్యాపకాలుంటాయి. కానీ వాటి వ్యాపకమంతా మనమే.

మనలో ఒకటిగా , మన వాళ్ళందరికంటె ఎక్కువ అభిమానాన్ని పెంచుకుని మనతో మమేకమైపోయి మనమే జీవితంగా బతికే పెంపుడు జంతువుల పట్ల మనం చూపే శ్రద్ధ ఏపాటిది?

రోజంతా మనల్ని గురించే ఆలోచించే పిచ్చిప్రాణులకోసం రోజులో మనం ఎన్ని నిముషాలు కేటాయిస్తున్నాం?

పెంపుడు జంతువుల సంరక్షణ , ఆరోగ్యం తదితర అంశాలపై ప్రత్యేకకథనంతో మీకు మీ పెట్స్ కి ఉన్న అనుబంధాన్ని రెండింతలు చేసుకోండి.

kanchi...... swamy , .... pets ..may 7th 153.jpg




మన ప్రాంతంలో దాదాపు 90% కి పైగాఅన్ని వర్గాల వారూ ఎంచుకునే ఆప్షన్ డాగ్స్. కుక్కలు విశ్వాసానికి మారుపేరు. అంతే కాకుండా ధనవంతులైనా పేదవారైనా వారి స్థాయికి తగ్గట్తుగా కుక్కల్ని పెంచుకునే వీలుంది. పేదవారి ఇంట్లో కుక్క ప్రేమను పంచితే ధనికుల కుక్క దర్పాన్ని ఒలకబోస్తుంది. అమెరికా అధ్యక్షుడంతటివాడే ఫస్ట్ డాగ్ వెంట పరుగులుతీయక తప్పలేదు కాబట్తి శునకాలిచ్చే ఆనందం అంతాఇంతా కాదనే చెప్పాలి.

శునకాల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:



౧.దంత సంరక్షణ:

పెట్స్ దంతాల సంరక్షణ విషయంలో మనం సాధారణంగా శ్రద్ధ చూపం. ఫలితంగా ౩ ఏళ్ళకే 80% కుక్కలునోటి సంబంధ వ్యాదులతో బాధ పడుతున్నాయి.

* సరైన దంత సంరక్షణ వల్ల 5 ఏళ్ల వరకు జంతువుల ఆయుశ్ష్హును పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

*వాటి దంతాలను శుభ్రపరచడానికి పల్చని చికెన్ సూప్ తీసుకుని చక్కగా రబ్ చెయ్యాలి.

కుక్క పళ్ళు తోమటానికి చికెన్ సూపా? :

నోరు తెరవమని మొట్టగానే తెరిచి పళ్ళు తోమించుకోవడానికి అవి మీ ఇంట్లోని పిల్లలు కాదుకదా. అలవాటయ్యేవరకు ఖర్చయినా తప్పదు మరి.

* సూపే ఎందుకంటే..

చికెన్ సూఫ్ మాయలో పడి మీతో అవి చక్కగా పళ్ళుతోమించుకుంటాయి.


* ఎట్తి పరిస్థితుల్లోనూ మనం వాడే టూత్ పేస్ట్ గానీ బేకింగ్ సోడా కానీ కుక్కలకి వాడకూడదు.దాని వల్ల వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.

* కుక్కల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రష్ తో సున్నితంగా పళ్లకి 45 డిగ్రీల కోణంలో పళ్ళు , చిగుళ్ళు కలిస్తే గమ్ లైన్ మీద ముందునుండి వెనుకగా పైకి కిందికి రుద్దటం వల్ల అక్కడ పేరుకున్న ఆహారపదార్థాలు , బాక్టీరియా దూరమౌతాయి. డాగ్స్ కోసం ప్ర్రత్యేకంగా రూపొందించిన టూత్ పేస్ట్స్ చికెన్ , ఫిష్ ఫ్లేవర్లలో మార్కెట్లో లభిస్తున్నాయి.

* పళ్ళు ధృఢంగా కావడానికి ప్రతీ భోజనానంతరం 2 లేదా 3 హార్డ్ బిస్కట్లను అలవాటు చెయ్యాలి.

2. ఆరోగ్య సంరక్షణ:

* అవసరం ఉన్నా లేకున్నా రెండు మూడు నెలలకోసారి వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళి ప్రాథమిక పరీక్షలు చేయించాలి.

* క్రమం తప్పకుండా ఆరుబయట నడిపిస్తూ పరుగెత్తిస్తూ ఉంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి.

* మెట్లెక్కటం , దిగటం వల్ల వాటి ఫిట్ నెస్ మెరుగుపడుతుంది.

* అలసటగా అనిపించినపుడు వ్యాయామం మంచిదికాదు.

* ఎప్పటికప్పుడు వాటి ఉష్ణోగ్రత పరిశీలిస్తూండాలి.

* పరిశుభ్రమైన చల్లని నీరు రోజంతా అందిస్తూండాలి.

*
3.పరిశుభ్రత:

* ప్రతి రోజూ కనీసం రెండురోజులకొక్కసారైనా శుభ్రంగా స్నానం చేయించి చక్కగా దువ్వాలి.

* వాటి కోసం ప్రత్యేకమైన టవల్ని వాడాలి.

4.వేసవి జాగ్రత్తలు:

* ఆరుబయట, వాకిట్లో పగలు ఉంచకూడదు.

* చల్లని ప్రదేశాల్లో వడగాలి తగలకుండా వీలైతే ఇంటిలోపల ఉంచాలి.

* దోమలు వ్యాప్తి చెందకుండా వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.

* మీ డాగ్ ఉండే చోట చల్లని నీళ్ళు చల్లుతూ ఉండాలి.


* పొరపాటున కూడా మీ కుక్కని కారులో ఉంచి లాక్ చెయ్యకండి. అందువల్ల గాలి చాలక బ్రెయిన్ డామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.


5.హార్ట్ వార్మ్స్:

* దోమల ద్వారా వ్యాప్తి చెందే పరాన్న జీవులు హార్ట్ వార్మ్స్. ఇవి కుక్కలు, పిల్లులను మృత్యువాతపడేస్తాయి.

ఇవి వ్యాప్తి చెందితే చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీ పెట్స్ హార్ట్ వార్మ్స్ బారిన పడకుండా ముందే పరీక్షలు చెయ్యించుకోవాలి.


6.ప్లీస్:

* తరచూ కొరుక్కోవటం, రుద్దుకోవటం వంటివి 'ఫ్లీ ఇనెస్టేషన్ 'సూచకాలు. తరచూ షాంపూలు, స్ప్రేస్ , డిప్స్, పుడర్స్, ఓరల్ మెడికేషన్స్ వంటివి వాటిద్వారా ప్లీస్ ను నియంత్రించవచ్చు.

7.టిక్స్:

వేసవిలో పెంపుడు జంతువులను ఇబ్బంది పెట్టే సమస్యలలో ప్రధానమైన సమస్య టిక్స్. ఇవి జంతువులకి అసౌకర్యాన్ని కలగజేయటంతో పాటు అనేకరకాల వ్యాధులను కలుగజేస్తాయి.డాక్టరు ను సంప్రదించి టిక్స్ నివారణ కు తగు చర్యలు తీసుకోవాలి.

8. డాగ్ టాయెస్:

ఇంట్లోని వస్తువులు, చెప్పులు , బూట్లు , బట్టలు కొరక్కుండా వాటి పళ్ళ దురద తీరాలంటే పళ్ళకి ఎక్సర్సైజ్ కోసం , అవి ఆరోగ్యం గా ఉండటం కోసం స్పెషల్ టాయెస్ కొనక తప్పదు.

టాయెస్ వల్ల అది హాపీ గా ఉండటం తో పాటు మిమ్మల్ని కూడా దాని ఆటలు, అల్లరితో కవ్వించి , మీ విసుగును పటాపంచలు చేస్తుంది.

చిన్న చిన్న కుక్కపిల్లలకి టీతింగ్ టాయ్స్ కొనాలి.

కుక్కల కోసం రకరకాల బొమ్మలు:

చ్యూయీస్

రబ్బర్ బాల్స్

టీతర్స్

స్క్వీకీ బాల్స్

క్రేజీ బాల్స్

ఇలా రకరకాల వస్తువులతో పాటు సాఫ్ట్ టాయ్స్ తో కూడా కుక్కలు చక్కగా ఆడుకుంటాయి.

పెద్ద కుక్కలకోసం ట్రిక్కులు:

* కుక్కల వయసు పెరిగే కొద్దీ మీపై ప్రేమ పెరుగుతుంది. వయసులో ఉన్నప్పుడు హుషారుగా మీ చుట్తూ తిరుగుతూ సందడి చేసినట్తు పెద్దవయసు కుక్కలు చెయ్యలేవు.వయసు పెరిగేకొద్దీ మెటబాలిజం రేటు తగ్గటమే దీనికి కారణం.

* కీళ్ళ నొప్పులు, కాటరాక్ట్ ,వినికిడి సమస్యలను ముందుగానే కనుగొని తగిన వైద్యం చేయించాలి.

* ఆర్థ్రైటిస్ లాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* వాటి బరువు నియంత్రణలో ఉన్నదీ లేనిదీ కూడా సరిచూస్తుండాలి.


* బయటి ఆహార పదార్థాలు వీలైనంత తక్కువ వాడి , ఇంట్లో వండిన వంటకాలే పెట్టటం ఉత్తమమైన పద్ధతి.

* ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్ వేయించాలి.

* కాల్షియం సప్లిమెంట్ల అవసరం ఉందేమో వైద్యుని సంప్రదించి టాఫీలు, చూయీల రూపంలో అందించాలి.

kanchi...... swamy , .... pets ..may 7th 017.jpg






ఊరెళ్ళేటప్పుడు ... కుక్కల మాటేమిటి?

* సెలవులకు ఊరెళ్ళాలనుకున్నపుడు మీతో పాటు దాన్ని తీసుకెళ్ళాలంటే అన్ని సార్లూ వీలుకాకపోవచ్చు. మొదటినుంచీ మీకు అత్యంత సన్నిహితులు, ముఖ్యంగా పశువుల్ని ప్రేమించగలిగేవారికే
అలవాటు చెయ్యాలి. కొన్ని రోజులు మీరు లేకపోయినా అది అక్కడ అడ్జస్ట్ అయ్యేలా అలవాటు చెయ్యాలి.


kanchi...... swamy , .... pets ..may 7th 171.jpg



ఊరు తీసుకెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:


* డాగ్స్ కోసం ప్రత్యేక మైన కిట్ ను సిద్ధం చేసుకోవాలి. అందులో దాని కి కావాల్సిన వస్తువులతో పాటు, మందులు, ఎప్పుడూ రెగ్యులర్ గా వాడేబ్రాండ్ బిస్కట్లు వగైరా పెట్తుకోవాలి.

* గంటలకొద్దీ దూర ప్రయాణం చేసేటప్ప్పుడు మాటల్లో పడి కుక్కను మర్చిపోకుండా మధ్య మధ్యలో అటూ ఇటూ దాన్ని తిప్పాలి.

*కొత్త చోటులో ఏమైనా అనారోగ్యానికి గురైనా ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత్తగా మందులు తీసుకుని వెళ్ళాలి.

* ట్రిప్ మొత్తానికి దానికి సరిపోయే ఆహారాన్ని ఇంటినుంచే తీసుకెళ్ళటం మంచిది.

kanchi...... swamy , .... pets ..may 7th 166.jpg




నోరు లేని జీవి కి ఎదురయ్యే సమస్యల్ని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్తకుండా చెప్పినట్తు వింటూ మీతో పాటు ఇంటిల్లిపాదినీ ఆటల్తో ,అల్లరితో, గారాబాలతో అలరిస్తాయి మీ లవ్లీ పెట్స్.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి