పాట 1... మానస వీణ ... మధుగీతం.. 1977 * వేటూరి :
సంవత్సరం : 1977 చిత్రం : పంతులమ్మ
సంస్థ : నవత ఆర్ట్స్ దర్శకుడు : సింగీతం శ్రీనివాస రావు
సంగీత దర్శకుడు : రాజన్ నాగేంద్ర నటీ నటులు : రంగనాథ్ , దీప
గాయనీ గాయకులు : ఎస్.పీ . బాల సుబ్రహ్మణ్యం , పీ. .సుశీల
*********************************************************
ఆ.... మానస వీణ మధుగీతం…
మన సంసారం సంగీతం…
సాగరమధనం అమృత మధురం
సంగమ సరిగమ సవర పారిజాతం…
మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం…
సంసారం.. సంగీతం…
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాల హృదయ సరాగం… ||2||
ఎదలోయలలో నిదురించిన నా
కోరిక పాడేకోయిల గీతం…
శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల
కుసుమంచు నీ అందమే… మెరిసింది అరవందమై కురిసిం ది మకరందమే… || మానస వీణ ||
జాబిలి కన్నా . నా చెలి మిన్నా
పులకిం తలకేపూచిన పొన్నా …
కానుకలేమి నేనివ్వ గలను
కన్ను ల కాటు క నేనవ్వగలను…
పాల కడలిలా వెన్నె ల పొంగింది పూల పడవలా నా తనువూగింది…
ఏ మల్లె ల తీరాల నిను చేరగలను.. మనసున మమతెై కడ చేరగలను… || మానస వీణ ||
కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని
తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని…
కలిసేదాక అనుకోలేదు తీయని స్నేహమని
పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని… || మానస వీణ||
పాట 2 : మావి చిగురు తినగానే..
గీత రచయిత : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
నిర్మాత : మురార్ నాయుడు సంస్థ : యువ చిత్ర
దర్శకుడు : కె. విశ్వనాథ్ సంగీత దర్శకుడు : కె.వి.మహదేవన్
గాయనీ గాయకులు : పి.సుశీల , ఎస్. .బాలసుబ్రహ్మణ్యం
నటీ నటులు : చంద్ర మోహన్ , తాళ్ళూరి రాజేశ్వరి , వంకాయల సత్యన్నారాయణ (స్టేషన్ మాస్టర్)
*********************************************************
http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=83&Name=Seetamaalakshmi
మావిచిగురు తినగానే...... కోయిల పలికేనా....
మావిచిగురు తినగానే...... కోయిల పలికేనా....
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా...
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా...
ఏమో ఏమనునో గాని ఆమని... ఈవనీ....
మావిచిగురు తినగానే...... కోయిల పలికేనా
.... ఆఆ.... కోయిల పలికేనా....
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్ాాటలా...
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్ాాటలా...
తారాటలా సయ్ాాటలా... సయ్ాాటలా తారాటలా....
వననెలేకాదు వగలేకాదు ఎనిె నేరచినది మొనెటి పువుు....
వననెలేకాదు వగలేకాదు ఎనిె నేరచినది మొనెటి పువుు....
బింకాలు బిడియ్ాలు నుొంకాలు నుాడుమలు..
ఏమో ? ఎవురచదో గాని ఈవిరచ గడసరచ..
మావిచిగురు తినగానే...... కోయిల పలికేనా....
ఆఆ.... కోయిల పలికేనా...
. ఒకర ఒళ్ళు ఉయ్ాాల వేరొకరచ గుండె జంనుాల...
ఉయ్ాాల జంనుాల... జంనుాల ఉయ్ాాల...
ఒకర ఒళ్ళు ఉయ్ాాల వేరొకరచ గుండె జంనుాల...
ఒకరచ పెదవి పగడాలో వేరొకరచ కనుల దివిటీలో...
ఒకరచ పెదవి పగడాలో వేరొకరచ కనుల దివిటీలో...
పలకరచంతలో పులకరచంతలో....
ఏమో ఏమగునో కాని ఈ కథ.... మన కథ...
మావిచిగురు తినగానే...... కోయిల పలికేనా....
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా...
ఏమో ఏమనునో గాని ఆమని... ఈవనీ....
మావిచిగురు తినగానే...... కోయిల పలికేనా.... ఆఆ.... కోయిల పలికేనా....
శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...విని తరించరా ...
శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... శంకరా... శంకరా...
చిత్రం : శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహాత్మ్యం
అందరూ అంటుంటారు రామ రామ
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
చెల్లెమ్మా అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
ఆకలి ఆశ్లు ఈ లోకానికి మూలమమ్మ
ఆకలి ఆశ్లు ఈ లోకానికి మూలమమ్మ
ఆకలికి అందం ఉందా రామ రామ
పాలు తాగి మనిషి అవుతాడు
గడ్డి వేసి ఆవు పాలు ఇస్తుంది
పాలు తాగి మనిషి అవుతాడు
అది గడ్డి గొప్పతనమా
ఇది పాల దోషగుణమా
అది గడ్డి గొప్పతనమా
ఇది పాల దోషగుణమా
మనిషి చాలా దొడ్డడమ్మ చెల్లెమ్మ
చెల్లెమ్మా ....తెలివి మీరి చెడ్డడమ్మ చెల్లెమ్మ
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామ
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
చెల్లెమ్మా అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
ముద్దు గులాబీకి ముళ్ళు ఉంటాయి
మొగలిపువ్వు లోనా నాగుంటాది
ముద్దు గులాబీకి ముళ్ళు ఉంటాయి
మొగలిపువ్వు లో నాగులు ఉంటాయి
ఒక మెరుపు వెంట పిడుగు ఒక మంచి లోని చెడుగు
లోకం అంతా ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా ...లోతుకెళ్తే కథే వేరే పిచ్చమ్మ
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామ
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
చెల్లెమ్మా అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా
పేదవాడు నాడె పుట్టాడమ్మా
డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా
పేదవాడు నాడె పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడు ఈ పేదను తిననివ్వడు
కళ్ళు ఏని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్ళు నువ్వు చూడలేవు చెల్లెమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామ
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
చెల్లెమ్మా అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
పాట 6 : ఆకులో ఆకునై ... దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి : 1982 :: మేఘ సందేశం
సంవత్సరం : 1982
చిత్రం : మేఘ సందేశం
దర్శకుడు :
నిర్మాత :
నిర్మాణ సంస్థ :
గాయని :
నటీ నటులు :
గీత రచయిత : దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి :
********************************************************************************
సంవత్సరం : 1983
బృందావని ఉంది.. యమునా నది ఉంది
మధురాపురి ఉంది… కాళింది ఉంది…
లేని వాడొక్కడే శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన కళ్యాణ మూర్తి….
చరణం 1:
పుట్టగానే పెరిగేటి మాయబంధనాలకన్నా…
పుడుతూనే తొలిగేటి చెరసాలలే మిన్న…
ఆ కిటుకు తెలిసేరా…
ఆ కిటుకు తెలిసేరా… శ్రీకృష్ణమూర్తి
చెరసాలలో పుట్టె చైతన్యమూర్తి.
పాట 9.. ఈ దుర్యోధన దుశ్శా సన ... ప్రతిఘటన వేటూరి సుందర రామమూర్తి 1985
పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి
కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
పాట 10.. విధాత తలపున... సిరివెన్నెల .... సిరివెన్నెల సీతారామ శాస్త్రి 1986
ఓం! ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూపవిన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ...
సరస స్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది
సరస స్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగతతులే వినీలగగనపు వేదికపైన ప్రాగ్దిశ
పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగ ధ్వానం జనించు
అనాది రాగం ఆది తాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే విరించినై
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం సరస స్వర..
పాట 11 : తెలవారదేమో స్వామీ .. వేటూరి సుందరరామ్మూర్తి .... శృతిలయలు ..
******************************************
అలమేలు మంగకూ.. (2) తెలవారదేమో స్వామీ
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. తెలవారదేమో స్వామీ
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
పాట 12 : అందెల రవమిది పదములదా.... స్వర్ణ కమలం ...సిరి వెన్నెల సీతారామ శాస్త్రి 1986
చిత్రం : స్వర్ణ కమలంసంవత్సరం : 1986
దర్శకుడు : కే.విశ్వనాథ్
సంగీత దర్శకుడు : ఇళయరాజా
నిర్మాత : సీ.హెచ్.వీ. అప్పారావు
నిర్మాణ సంస్థ : భాను ఆర్ట్ క్రియేషన్స్
గీత రచయిత : సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
గాయనీ గాయకులు : ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
నటీ నటులు : వెంకటేష్ , భానుప్రియ
*********************************************************************************ఓం నమో నమో నమశ్శివాయ
పాట 15... ఎన్నెన్నో.. అందాలు .. చంటి :: వేటూరి సుందర రామ మూర్తి :: 1991
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు
ఇలలో ఉన్న హరివిల్లు
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు
తెలుగింటమ్మ తిరునాళ్ళు
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
పాట 16 : ఆకాశాన సూర్యుడండడూ .. సుందరకాండ :: 1992 :: వేటూరి సుందరరామమూర్తి
పాట 17: సురాజ్యమవలేని .. గాయం :: 1993 :: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం : గాయం
సంవత్సరం : 1993
గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
సంగీత దర్శకుడు: శ్రీ
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
నిర్మాణ సంస్థ : ఎస్.ఎస్. క్రియేషన్స్
గాయకుడు : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు : జగపతి బాబు , ఊర్మిళా మండోద్కర్ , రేవతి
********************************************************************************
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచేనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతుంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం
“సురాజ్యమనలేని స్వరాజ్యమెందుకని ”
కలహముల హాల హాలానికి మరుగుతున్నది హిందుసంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచేను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషం చిమ్మెను జాతి తనువున ఈ వికృత గాయం
సుఖాన మనలేని వికాసమెందుకని
సుమాల బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం
విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమనీ
పాతళంలో నిలచిన పౌరుల కరతాల ధ్వని చూసి
విలవిలలాడుతు వెలవెల బోయెను మువ్వన్నెల జెండా
జలజల కురిసెను తెగి పడిపోయిన ఆశల పువ్వుల దండ
విషాద వర్షంలో తను వివర్ణ చిత్రమనీ
పాట 18: చిలకా ఏ తోడు లేక ... శుభలగ్నం :: 1994 :: సిరివెన్నెల సీతారామశాస్త్రి
పాట 20 : మనసు కాస్త కలతపడితే.. శ్రీకారం :: 1995 :: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం : శ్రీకారంసంవత్సరం :: 1996, ఏప్రిల్ 19న vidudala
గీత రచయిత :: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
దర్శకుడు : సి. ఉమా మహేశ్వరరావు
సంగీత దర్శకుడు: ఇళయరాజా
నిర్మాత : గవర పార్థసారధి
నిర్మాణ సంస్థ : శ్రీ చాముండి చిత్ర పతాకం
గాయనీ గాయకులు : K. J. YESUDASU
*********************************************************************************
మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు ఎవరులేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది వేటాడు వేళతో పోరడమన్నది !! !! మనసు కాస్త కలత పడితే !!
కలసిరాని కాలమెంత కాటేస్తున్నా చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా తనువే మోడైనా
మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న
బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండదమ్మా !! మనసు కాస్త కలత పడితే !!
ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు ! పరిమార్చవే కీడు !
కాళివైతే కాలి కింద అణుగును చూడు ! నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే లోకమే రాదా నీ వెనకే !! మనసు కాస్త కలత పడితే !!
21 అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! 1997
తారాగణం : బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి
సంగీతం : శ్రీ
నిర్మాణ సంస్థ : ఆంధ్రా టాకీస్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి,
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!
చరణం 1:
కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
22...ఆడకూతురా నీకు అడుగడుగునా వందనం :
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం
మహారాజులే మగాళ్ళు అందరు తెల్లవారినా నిదుర లెవరు
కంటినిండా కునుకు కనలేదు నీవు ఎప్పుడు
సగం నిదురలోనే నిను లేపేను చీపురు
మగబిడ్డల యెగం ఏమిటో లేవగానే బోగం ఏమిటో
ఎగతాళిగా నిన్నేగని నవ్వే పాచిగిన్నెలు
బండచాకిరి రేబవలు చేసిన గుండె బరువువని నీ పేరు పెట్టిరి
పదహారువయేట ఇక మొదలు వరుడివేట
నీ బరువుదిన్చుకోవటమే తల్లితండ్రి ముచ్చట
పుటకనుండి చావు మద్యనా బతుకునంత అరగాదీసినా
ఎ జీతము ఎ సెలవు ఎరుగని ఒక దాసివి
పెళ్లి పీటపై కంఠాన్ని ముడేసి
నాతి చెరామి అంటాడు ఒట్టేసి
అక్షింతలతోనే మంత్రాలు నేలపాలు
మరునాటి నుండి నీ బతుకు బూటుకాలు
ఇంటికి దీపం ఇల్లాలు అత్తామామ కాదు అంటే చీకటి పాలు
మగవాడే నీ నోసటన రాసే మనో రాతలే
-----------------------------------------------------------
23. దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని
దర్శకత్వం : రామ్‌గోపాల్ వర్మ
నిర్మాత : అక్కినేని నాగార్జున
నటులు సుమంత్, ma నోజ్ బాజ్‌పాయ్ , అంతర మాలి
సంగీతం సందీప్ చౌతా
పంపిణీదారు అన్నపూర్ణ స్టుడియోస్
Singers : Rajesh, Anuradha Sri Ram
విడుదల 1999
*****************************************
దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన కడ దాక సాగనా !! దేవుడు !!
నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్న !! దేవుడు !!
ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వూ నీ నవ్వూ నాతొ లేకుంటే నేనంటూ ఉంటానా !! దేవుడు !!
24.raghvayya gari abbayi
*____________________________-----------
25.
25.కంటేనే అమ్మ అని అంటే ఎలా ? ...... ప్రేమించు 2001
దర్శకత్వం : బోయిన సుబ్బారావు
నిర్మాత : దగ్గుబాటి రామానాయుడు
నటులు : లయ సాయి కిరణ్ రూప మురళీ మోహన్ లక్ష్మి
సంగీతం : ఎం.ఎం శ్రీలేఖ
నిర్మాణ సంస్థ : సురేష్ ప్రొడక్షన్స్
విడుదల : 11 ఏప్రిల్ 2001
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
డా. సి. నారాయణ రెడ్డి - నంది ఉత్తమ గీత రచయిత
*********************************************************************
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
-----------------------------------------------------------
26.నీ నవ్వుల తెల్లదనాన్ని.. (ఆది) 2002
దర్శకత్వం : వి.వి.వినాయక్
నిర్మాణం : నల్లమలపు శ్రీనివాస్
తారాగణం : జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లా
సంగీతం : మణిశర్మ
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
గాయనీ గాయకులు : మల్లికార్జున్, సునీత -
గీత రచయిత : చంద్రబోస్
******************************************
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... !! నీ నవ్వుల !!
నా వైపే మొగ్గిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నాకోసం వేచిన నీకైతే అది రాసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ... !! నీ నవ్వుల !!
నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ... !! నీ నవ్వుల !!
నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే...
నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా... !! నీ నవ్వుల !!
-----------------------------------------------------------
27. ఇదిగొ రాయల సీమ గడ్డ , దీని కథ తెలుసుకొ తెలుగు బిడ్డ
నిర్మాణ సంస్థ : బొమ్మరిల్లు వారి
గీత రచయిత : డాక్టర్.సి.నారాయణ రెడ్డి
గాయనీ గాయకులు : ఎస్.పి.బాలు
దర్శకత్వం , నిర్మాత : వై.వి. ఎస్. చౌదరి
తారాగణం :నందమూరి హరికృష్ణ,సౌదర్య, సిమ్రాన్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : కొమ్మినేని వెంకటేశ్వర రావు
***********************************
ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
ఈ గడ్డలో పగల సెగలొద్దురా ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా
//ఇదిగో//
పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణబేరి వినవింపు
చంద్రగిరి దుర్గం నెలకొన్నదీ నేలలోనే
//ఇదిగో//
హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
చరిత్రకెక్కిన ధరణి ఇది పదాలనే సర పదాల నడిపిన అన్నమయ్య కృతులు
ఇహపరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర సర్పగతులు
అలలైపొంగిన అవని ఇది
//ఇదిగో//
తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..వందేమాతరం
మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి
గాడిచర్ల కల్లూరి సదాశివం అబ్బూరి హంపన్న లింగన్న, షేక్ బీర్ లబియాబి .. వందేమాతరం
ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా ఎందరెందరో
త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జనని ఇది
//ఇదిగో//
అంతనిచ్చెనంత నిరంతర విగస్వర వైభవంతో విరాజిల్లిన
రాయలసీమ మన రైతన్నల సీమ
ఈనాడు పుష్కల ముష్కల శక్తుల దురంతరాలతో అతలా
కుతలమవుతుంటే చూస్తూ ఉంటారా చూస్తూనే ఉంటారా
అయితే యువత ఉగ్రమించాలి నవత విప్లవించాలి
రాగొంతులా గర్జించే నాదమే మహోధ్యమమై
కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి
-----------------------------------------------------------
28.చీకటితో వెలుగే చెప్పెను ... నేనున్నాను 2004
దర్శకత్వం : వి. ఎన్. ఆదిత్య
నిర్మాత : డి. శివప్రసాద్ రెడ్డి
రచన : పరుచూరి సోదరులు (సంభాషణలు)
స్క్రీన్ ప్లే : వి. ఎన్. ఆదిత్య
కథ : భూపతి రాజా
నటులు : అక్కినేని నాగార్జున, శ్రియా సరన్, ఆర్తీ అగర్వాల్
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ : కామాక్షి మూవీస్
గీత రచయిత : చంద్రబోస్
గాయకులు : ఎం.ఎం.కీరవాణి , ఉపద్రష్ట సునీత
**********************************************
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేంకాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ...
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పను చూపుతో మార్గంచెప్పను
అడుగుతో గమ్యం చెప్పను నేనున్నాననీ....
నేనున్నానని నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
అందరూవున్నా అప్తుడు నువ్వై చేరువయ్యావనీ
జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నాననీ
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నాననీ
శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ ...నీకేంకాదని, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ....
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ... నిన్నటి రాతనీ మార్చేస్తాననీ....
---------------------------------------------------------------
29.జగమంత కుటుంబం నాది - చక్రం
- గానం: శ్రీ;
- దర్శకత్వం : కృష్ణ వంశీ
- తారాగణం : ప్రభాస్, ఆసిన్, బ్రహ్మానందం, ఛార్మీ కౌర్, ప్రకాష్
- నిర్మాణ సంస్థ : పద్మాలయా టెలీఫిల్మ్స
- గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
- గానం : శ్రీ కొమ్మినేని సంగీతం : చక్రి
- నిర్మాణ :
- *********************************************************
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి