తప్పు చేశావు నేస్తం
తిరిగిరాని లోకాలకు పోయి
దిద్దుకోలేని తప్పుచేశావు !
నువ్వు కడుపున పడ్డావని
పండగ చేసుకున్న
అనురాగపు జంట
బంగారు కలల పై
నిప్పుకణికలు చల్లి .............తప్పుచేశావు నేస్తం !
నవమాసాలు మోస్తూ
ఎప్పుడెప్పుడు నిన్ను కళ్ళారా చూస్తానా అని
ప్రతిక్షణం ఆరాటపడ్డ పిచ్చితల్లి
కళ్ళకు కన్నీటి కుండల్ని
కానుకలుగా ఇచ్చి......... తప్పు చేశావు నేస్తం !
గుండెలపై అడుగులేయించి
నడకలు నేర్పిన తండ్రిని
అరచేతుల్లో పెంచి ,
కనురెప్పగా కాచిన పాపానికి
వెన్నుపోటు పొడిచావు
బ్రతుకు భారం చేశావు ... తప్పు చేశావు నేస్తం !
నూరేళ్ళ జీవితాన్ని
నేలపాలు చేశావు
నీకై మేమున్నామంటూ
భరోసా ఇచ్చిన మిత్రుల్ని
చేతకాని వాళ్ళని చేశావు ... తప్పు చేశావు నేస్తం !
నిప్పురవ్వకే
విలవిల లాడే
సుకుమార దేహాన్ని
పొగలు సెగలతో
అగ్నికి ఆహుతి చేశావు...... తప్పు చేశావు నేస్తం !
గారాల పట్టిగా
ఎన్నో కళ్ళు ఎదురు చూడగా
ఏడుస్తూ వచ్చావు
నిర్దయురాలిగా
ఇన్ని కళ్ళని మాయ చేసి
ఏడ్పిస్తూ వెళ్ళావు................. తప్పు చేశావు నేస్తం !
చావడానికి చూపిన సాహసం
బ్రతకడానికి చేయలేదెందుకని ?.............
కన్నీటి సంద్రంలో మమ్మల్ని ముంచి
ఎక్కడున్నావో ... ఏం చేస్తున్నావో.....
నా ప్రశ్నకు బదులివ్వు నేస్తం................
నా ప్రశ్నకు బదులివ్వు......!
5 కామెంట్లు:
మీ నేస్తానికై మీరు పడ్డ ఆవేదన మీ కవితలో కనిపిస్తోంది ."చావడానికి చూపిన సాహసం
బ్రతకడానికి చేయలేదెందుకని ?.." బదులే లేని ప్రశ్న .బ్రతికున్నపుడు శాంతి నివ్వలేని లోకంలో నేనూ ఓ మనిషిని ఇప్పుడు దిగంతాల కేగాక వారి ఆత్మ శాంతికై ప్రార్దిస్తున్నా ....
"paarthuu gaaruu!
mee perukiee chinni krishnudi bommakee bhale jodi kudirmdi.
ika meeru ichchina waal papars suprb. nenu dwnld chesukunna.
annattu naaperu padma kala. naa blog add:Ltelugukala.blogspot.com
whnver u r free vst blog if u can ,,,,,,,,,,,,,,,bye"
Sep28 Comment. ee roju choosanu..
choosi mee blog ki ragane.. tappu chesavu nestam annaru... konchem kangaru paddanu..
taravatha motham chadivaka.. tappu cheyaledu anipinchindhi..
"nizame tanani tanu antham chesukodam lo choopinche dairyam lo sagam samasyalanu adhiminchadam lo pedithe.. bagunnu.."
-----
alaage.. meeku veelayithe na blog kuda oo sari choodandi..
pardheevam.blogspot.com
శ్రీశ్రీ గారి నేస్తానికీ మీనేస్తానికీ ఎ౦త పోలిక ఉ౦దో నేను చెప్పలేను కాని రె౦టిలో ఆర్ధత మాత్ర౦ అ౦తే ఉ౦ది. మీ రెక్కలను చూసి మీ కవితలను చూడకపోవడ౦ ఎ౦త నేరమో తెలుసుకున్నాను. ఇ౦త వైవిధ్యమైన భావావేశ౦ కలిగిన మీరు, ఇప్పటి వరకు నాకు తెలిసిన వాళ్ళలో అతిపెద్ద కవయిత్రి. మీకూ మీ కవనానికీ తలవ౦చి నమస్కరిస్తున్నాను.
మీ వ్యాఖ్యకు, అభిమానానికి హృదయపూర్వక వందనాలు.
keeeeeeka
కామెంట్‌ను పోస్ట్ చేయండి