Pages

5 ఏప్రి, 2011

అబ్బబ్బ ఎంత ఆరాటమో…

నేస్తాలకు నమస్కారం.చాలా కాలం తర్వాత మీతో సంభాషించే అదృష్టం కలిగింది.

 

విషయానికొస్తే…..

 

ఈ రోజు నాకో గొప్ప అనుభవం ఎదురయ్యింది.

ముక్కు పచ్చలారని (౩వ తరగతి ) పిల్లాడ్ని కార్పొరేట్ హాస్టల్ కబంధాల్లో చిక్కుకోకుండా కాపాడ గలిగాను.

 

వివరాల్లోకి వెళ్ళే ముందే డాక్టర్ గారికి ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను.నా మాటను గౌరవించినందుకు.

నాకు ఈ సాయంత్రం ఓ పేరెంట్ నుండి కాల్ వచ్చింది. మీ సలహా ఇవ్వగలరా … అంటూ…

సలహా చెప్పటమెంత పని? పాటించటం కష్టం కానీ .. అనుకుంటూ ఓ తప్పకుండా అని అన్నాను.

అవతలి వ్యక్తి ఓ డాక్టర్ అని తెలిసింది. భార్యా భర్తలిద్ధరూ డాక్ట\ర్లే. క్లినిక్ లో బిజీ.

 

గత్యంతరం లేక పెద్ద పిల్లాడ్ని ఓ హాస్టల్ లో పెట్టారు. ఇపుడు చిన్న పిల్లాడ్ని ఏం చెయ్యాలా అన్నదే వారి సమస్య.

 

ఇది వారి ఒక్కరి సమ్స్యే కాదు.మనలో చాలా మందిది.

కూటి కోసం కోటి పాట్లంటూ మనలో చాలా మంది రోజల్లా ఉద్యోగాలకే మన రోజు రాసిపడేసి వ్యక్తి గత జీవితాన్ని తీవ్రంగా నష్టపోతున్నాం.ఫలితంగా మన పిల్లల్ని దూరం చేసుకుంటున్నాం.

నేను రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్పా.

మీ బాబు అర్థరాత్రి కలలో  ఉలిక్కి పడి లేస్తే …. వాడి గుండెపై తట్టే వాళ్ళెవరు?

ప్రేమతో కూడిన స్పర్శతో హత్తుకుని భద్రతా భావాన్ని కల్పించే వారెవరు?

పసి బొజ్జ ఆకలిని పసిగట్టే దెవరు?

వాడి ఇష్టాయిష్టాల్ని గమనించి కడుపు నింపేదెవరు?

వాడి గల గల మాటల్ని ఆస్వాదించే దెవరు?

వాడి ప్రశ్నల్ని పట్టించుకునేదెవరు?

వాడి ఊసులకి ఊకొట్టే దెవరు?

౨౪ గంటల మీ రోజు లో మీకలల ప్రతి రూపమైన పాపాయికి ౧ గంట కేటాయించలేరా…?

మీ చిన్నప్ప్పుడు ఏ కాన్వెంటి చదువులు మిమ్మల్ని ఇంత చేసాయి?

 

 

నా ప్రశ్నలకి ఆ తండ్రి సమాధానం. అవునండీ … కానీ మా పిల్లాడు పట్నంలో పిల్లల కంటే చాలా వెనకపడి పోతున్నాడు.వాడు ఎదగడానికి ఏదన్నా చెయ్యాలని ఆరాటపడుతున్నాం . అని.

వెంటనే చెప్పాను. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ మాట నిజమైతే మరో ౪ ఏళ్ళ దాకా వాడిని మీకు దూరం చెయ్యకండి. తల్లిదండ్రుల్ని మించిన గురువు, వారి ప్రేమకు మించిన పాఠం లేదు అని చెప్పాను.

 

నా మాటల్ని వారు మనసుతో చూసారు, విన్నారు. వారి సమాధానం నాకు ఎంతో  సంతృప్తినిచ్చింది.