Pages

30 మే, 2009

వైరస్ లను తరిమికొట్టండి..

వైరస్ ల వల్ల సాధారణం గా తలెత్తే కొన్ని సమస్యలను యాంటీ వైరస్ల అవసరం లేకుండానే పరిష్కరించుకోవచ్చు.

సమస్యలు-పరిష్కారాలు:

౧. టాస్క్ మేనేజర్ డిజేబుల్ అయినపుడు:

start menu కి వెళ్ళి run పై click చేసి gpedit.msc అని type చేసి ok పై click చేస్తే group policy విండో ఓపెన్ అవుతుంది. అందులో user configeration కు వెళ్ళి administrative templates నుంచి system కు వెళ్ళి Cntrl+Alt+Del options ద్వారా కుడిపైపునున్న పేన్ లోకి వెళ్ళి 'remove task manager ' కు మార్చుకోవాలి.

౨. Command Prompt డిజేబుల్ అయినపుడు : Turn off Auto play: కనిపించనపుడు:

user config కు వెళ్ళి adminstrative templates నుండు system ను ఎన్నుకుని prevent access to command ని డిజేబుల్ చెయ్యాలి. అదే విధంగా turnoff auto play ని డిజేబుల్ చెయ్యాలి.

౩.Drives open కాకపోయినా / కనిపించపోయినా :

పైన చెప్పిన విధంగా user config కు వెళ్ళి administrative templates నుండి windows componenets కు అక్కడి నుంచి windows explorer వెళ్ళి hide these specified drives ని డిజేబుల్ చేసుకోవాలి.

Drives తెరిచేటపుడు :

పై విధంగా windows explorer కు వెళ్ళి న తరువాత prevent access to specified drives ను ఎం చుకోవాలి.

4.System performance పెంచుకోవడానికి :

1. M.S Config: ద్వారా:

అవసరం లేని ప్రోగ్రాములు రన్ లో ఉండటం వల్ల system speed తగ్గుతుంది.అందుచేత మనం ఎక్కువగా ఉపయోగించని ప్రోగ్రామ్స్ ను డిసేబుల్ చేసుకుని system speed పెంచుకోవచ్చు. కావాల్సినప్పుడు మళ్ళీ ఎనేబుల్ చేసుకుని వాటిని రన్ చేసుకోవచ్చు.

ఇందుకోసం startup and services tabs నుండి ఉపయోగించని ప్రోగ్రామ్స్ ను డిజేబుల్ చెయ్యాలి.

2.Desk Top performance :

Desk top పర్ఫార్మన్స్ , అపియరెన్స్ ల వల్ల కూడా సిస్టం పనితీరు మారుతుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఎంచుకోవడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి.

డైవ్స్ ని డబుల్ క్లిక్ చేసినపుడు 'open with ' అని వస్తే Drive root లో autorun.inf ని remove చెయ్యాలి.

3.Defragmentation : & Error Checking :

Drive పై right క్లిక్ చేసి ప్రాపర్టీస్ కు వెళ్ళీ టూల్స్ నుండి Defragent now / check errors పై క్లిక్ చేసుకోవాలి.

22 మే, 2009

బుజ్జి బ(బు)ల్లెమ్మకి దాహం వేసింది…….

వేసవి తాపం మనుషులకీ జంతువులకే కాదు … పక్షులకీ కీటకాలకీ కూడా…..

కాకపోతే ఎంతసేపూ మనం మన దాహాన్ని తీర్చుకునే పనిలోనే ఉంటాం కానీ వాటి దాహాన్ని పట్టించుకోలేం.అది పూర్తిగా మన తప్పు కాదు.

వాటికి ఎప్పుడు దాహం వేస్తుందో మనకెలా తెలుస్తుంది . కానీ ఈ రోజు నాకో లక్కీ చాన్స్ దొరికింది.

ఓ బుజ్జి బ(బు)ల్లెమ్మ కి దాహం వేసింది కాబోలు .. ఎంతకీ సింకులోనుంచి బయటకి రావటమే లేదు. ఏం జరిగిందబ్బా ఒకవేళ పైకి ఎక్కలేకపోతోందేమోనని దానికి ఆధారం అందించి చూశా…

ప్చ్.. సమస్యే లేదు. అది బయటికి రావటం లేదు.  సరే చూద్దాం అనుకుని దాన్నలా వదిలేసి నా పనినేను చేసుకుంటుంటే .. ఎందుకో నాకళ్ళు బతిమాలాయి .. ఓసి పిచ్చీ .. ఓసారి అదెలా ఉందో చూడూ.. అని

సరే… అని చూస్తే..అక్కడ రాణీ గారు … (ఇంతకీ రాజు గారో రాణీ గారో నాకు  తెలియదు లెండి) చక్కగా జలకాలాడుతూ.. మంచినీళ్ళూ తాగుతూ కనిపించింది.

ఇదిగో ఆ మారాణి దర్జా …. మీరూ చూడండి.

 

 

 

 

హాయ్.. హాయ్ గా .. కూల్ కూల్ గా…                    జలకాలాటలలో………                                అమ్మో ! చూసేశారా ! … ఐతే నే పోతన్నా!……..

 

may photos...birds... 147      may photos...birds... 146 may photos...birds... 148          బైబై………….

18 మే, 2009

భళి భళీ .. బాల కృష్ణయ్య…. (భాగవతం- దశమ స్కంధంలోని కృష్ణలీలలు.. వేసవిలో చిన్నారులకు చిరు కానుక)

సృష్టి పరిణామ క్రమం నాలుగు యుగాలుగా జరిగింది. విశ్వగమనంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం కలియుగం అనే నాలుగు యుగాలు నాలుగు చక్రాలుగా వర్ణింపబడ్డాయి.కృత యుగంలో ధర్మం నాలుగు పాదాల పై నడిచింది.

త్రేతా యుగంలో మూడు పాదాలపైనా, ద్వాపరయుగంలో రెండుపాదాల పైనా ధర్మం నిలబడింది. కానీ కలియుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తోంది.

అధర్మం ధర్మాన్ని పీడించినప్పుడు దుష్ట శిక్షణకై భగవంతుడు అవతరిస్తాడన్న సందేశాన్ని ఇచ్చిన హిందువుల పవిత్ర గ్రంథం శ్రీమద్భగవద్గీత అవతరించింది ద్వాపరయుగంలోనే. ద్వాపరయుగంలో రాక్షసాంశతో జన్మించిన రాజులు అమాయక ప్రజలను , సాధుజనులను బాధలకు గురిచేస్తోంటే భూమాత చూస్తూ భరించలేక , ఆ పాప భారాన్ని మోయలేక గోమాత గా మారి బ్రహ్మ దేవుని చేరి తన గోడును చెప్పుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరునితో కూడి పాల కడలిలో శేష శయ్యపై శయనించే విష్ణుమూర్తిని ప్రార్థించగా గగన వాణి ఇలా చెప్పింది.

chikkala (103)

" పరమాత్మ సాక్షాత్తూ దేవకి , వసుదేవుల కు కుమారునిగా జన్మించబోతున్నాడు. దేవతలంతా గోపీ జనాలుగా యదువంశంలో జన్మించి ఆ దివ్య బాలునికి సహకరిస్తారు. అవతార లక్ష్యం నెరవేరే వరకు దేవ గణమంతా వివిధ రూపాలలో భూమిపైనే నివసిస్తారు."

పిల్లలూ ఇక మనం 'భళి భళి బాల కృష్ణయ్య' కథ చెప్పుకుందాం . శ్రద్ధగా వినండి./చదవండి:

యాదవ వంశ మొదటి రాజు యదుమహారాజు పేరుతో ఆయన వంశీకులను యాదవులు అని పిలిచారు. ఉగ్రసేనుడు , దేవకుడు యదువంశ రాజులు. యాదవ రాజ్యాన్ని మధుర, శూర సేన రాజ్యాలు గా విభజించారు. శూరసేన రాజ్యాన్ని ఉగ్రసేనుడు , మధురను దేవకుడు పాలించారు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు, దేవకుని కుమార్తె దేవకి. మధుర రాజ్యంలోనే అంధకము అనే యదు వంశశాఖ లో శూరుడు అనే రాజు కుమారుడు వసుదేవునికి తన చెల్లెలు దేవకీదేవిని ఇచ్చి వైభవంగా వివాహం జరుపుతాడు కంసుడు. వివాహానంతరం బంగారు రథంపై తన చెల్లెలిని , బావను ఆమె అత్తవారింటికి పంపుతూ రథానికి తానే సారథ్యం వహిస్తాడు . సరిగ్గా అదే సమయంలో అశరీరవాణి అతన్ని ఇలా హెచ్చరిస్తుంది:

"కంసా ! నీవెంత గానో ప్రేమించే నీ సోదరి ఎనిమిదవ సంతానం నీకు మృత్యువు కానున్నది"

ఆ మాటలు విన్న కంసుడు నిలువునా భయకంపితుడై , కోపోద్రిక్తుడయ్యాడు. ఆ క్షణంలో తన ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యంగా తోచింది. వెంటనే అల్లారు ముద్దుగా చూసుకున్న తన చెల్లెలిని జుట్టు పట్టి లాగి ఆమె ను చంపబోగా వసుదేవుడు అడ్దుపడి అబల అయిన స్త్రీని చంపడం , అందునా నవ వధువుని చంపటం మహా దోషమని చెప్పి , కంసుడికి ప్రాణ భయంలేకుండా తమకు పుట్టిన సంతానాన్ని పుట్టీ పుట్టగానే అప్పగిస్తాననీ చెప్పి ఆమె ను వదిలిపెట్టమని వేడుకుంటాడు.

వసుదేవుడి మాటపై నమ్మకంతో కంసుడు ఆమె ను విడిచిపెట్టి ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళతాడు.కొంతకాలానికి దేవకీ వసుదేవులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనికి కీర్తిమంతుడనే పేరు పెట్టుకుం టాడు వసుదేవుడు.. అన్న మాట ప్రకారం వసుదేవుడు ఆ బాలుని కంసునికి అప్పగించగా ఎనిమిదవ సంతానం వల్ల మాత్రమే ప్రమాదమని భావించి ఆ బాలుని వసుదేవునికి తిరిగి ఇచ్చేస్తాడు కంసుడు.

narada

ఒకరోజు లోక సంచారం చేస్తూ నారదుడు భూలోకం లో కంసుని దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలడిగి మాటల మధ్యలో దేవకీ దేవి ప్రస్తావన తెస్తాడు. దేవకీ దేవి కి పుట్టబోయే బిడ్డ తప్పకుండా రాక్షసాంశతో పుట్తిన కంసుని సంహరిస్తాడని చెప్పి అతనిని భయానికి గురిచేస్తాడు. ఆ మాటలు విన్న కంసునికి ఆకాశవాణి పలుకులు కూడా గుర్తుకు వచ్చి ప్రాణాలపై నున్న అమితమైన ప్రేమతో చెల్లెలిని , బావను ఇనుప సంకెళ్లతో బంధిస్తాడు.వద్దని వారించిన తండ్రి ఉగ్రసేనుడిని కూడా కారాగారం పాలు చేస్తాడు.తరువాత దేవకీ వసుదేవుల కు పుట్టిన పసి గుడ్దులను ఆరుగురిని పుట్టీ పుట్టగానే నిర్దయతో చంపేస్తాడు.

దేవకీ వసుదేవులు భగవంతునిపై భారం వేసి కాలం గడుపుతున్నారు. మహా విష్ణువు యోగ మాయను పిలిచి దేవకీ దేవి గర్భంలో సప్తమ శిశువును ఆకర్షించి నంద గోకులంలోని రోహిణీ దేవి గర్భంలోకి చేర్చమని ఆదేశిస్తాడు. అలా దేవకి ఏడవ సంతానం పుట్టకుండానే రోహిణీ గర్భంలోకి చేరుతుంది. రోహిణీకి పుట్తిన శిశువు ఆదిశేషుని అవతారం. అలా దేవకీ గర్భంలోని శిశువుని యోగమాయ సంకర్షించటం వల్ల పుట్టిన శిశువును సంకర్షణుడని ,బలశాలి అయినందువల్ల బలరాముడనీ అన్నారు.తరువాత యోగమాయ విష్ణువు ఆదేశం పై గోకులంలోని నందుని భార్య యశోదగర్భంలో ప్రవేశిస్తుంది.

అక్కడ కంసుని కారాగారంలో బందీగా ఉన్న దేవకీ దేవి గర్భంలో శ్రీ మహా విష్ణువు ప్రవేశించగా ఆమె ఆ తేజస్సు వల్ల ఉదయిస్తున్న సూర్యుని లాగా ప్రకాశిస్తోంది. అది గమనించిన కంసుని విచారం రోజురోజుకీ పెరుగుతోంది. శిశువు ను పుట్టకుండానే సంహరించాలా లేక పుట్టగానే చంపాలా ? అన్న ఆలోచనలో పడ్డాడు. ఒక స్త్రీని అందునా గర్బిణి ని చంపటం వల్ల సంపద నాశనమౌతుంది. సంపద కోల్పోవటమంటూ జరిగితే లోకం తనను గౌరవించదు.కీర్తిని, ఐశ్వర్యాన్నికోల్పోయిన తరువాత జీవించటమే వ్యర్థం అనుకొని ఆ ఆలోచనను మానుకున్నాడు.ఒక నాడు పరమ శివుడు, పరబ్రహ్మ సకల దేవగణసమేతంగా వచ్చి దేవకీ గర్భంలొ ఉన్న అవతారపుతుషుని వేవేల స్తుతించి …. దేవకీ వసుదేవులను దీవించి, లోకంలో మర్కట కిశోర న్యాయం ,మార్జాల కిశోర న్యాయం అని రెండు రకాల న్యాయాలు ఉంటాయని చెపుతారు.

మొదటిదాని లో పురుష ప్రయత్నం ఉంటే.. రెండవ దానిలో ఆత్మార్పణం ఉంటుందనీ పిల్లి పిల్ల పూర్తిగా తన భారాన్ని తల్లి పై వేసి రక్షింపబదుతుందని చెప్పి అదేవిధంగా భారమంతా భగవంతునిపై వెయ్యమని చెప్పమాయమౌతారు.పరమాత్మ శ్రీకృష్ణావతరంలో అవతరించే సమయం అసన్నమయింది. రోహిణీ నక్షత్రయుక్త పవిత్ర లగ్నంలో ప్రకృతి పులకరింతలతో ఆ స్వామికి స్వాగతం పలికింది. అగ్నిహోత్రాలు జ్వలించాయి. దేవదుందుభి నాదాల తో దేవ గంధర్వ , యక్ష, కెన్న, కింపురుష జయజయ ధ్వానాల మధ్య పద్మంలోని రేకుల వంటి కన్నులతో , శంఖు , చక్ర గదాది ఆయుధాలతో మహాతేజస్సంపన్నునిగా జన్మిస్తాడు. అదే సమయానికి యోగమాయ కూడా జన్మిస్తుంది. దేవకీ వసుదేవులు ఆ మహా తేజస్సును ,తేజో మూర్తిని చూసి నమస్కరించి కీర్తించారు.

kannayya 9

దేవకీ వసుదేవుల ప్రార్థనలకు సంతోషించి భగవానుడు ఈ విధంగా పలికాడు. " దేవకీ దేవీ! గత జన్మలో మీరిరువురి పృశ్ని, సుతపులనే దంపతులు . నా పై అచంచల మైన భక్తితో నా సాక్షాత్కారానికై మహా తపస్సుచేయగా నేను ప్రత్యక్షమై వరముకోరుకోమనగా నా మీది వాత్సల్య భావముతో నా వంటి కుమారుని వరంగా ఇమ్మని మూడుసార్లు కోరారు. మీ కోరిక తీర్చటం కోసం ఆ జన్మలో పశ్ని గర్భుడనే పేరుతో మీకు పుత్రునిగా జన్మించాను. తరువాతి జన్మలో మీరు అదితి , కశ్యపులుగా పుట్టగా నేను మీకు ఉపేంద్రునిగా జన్మించి , వామనునిగా బలి చక్రవర్తిని అంతమొందించాను. ఈ జన్మలో దుష్ట శిక్షణ కోసం అవతరిస్తూ మీ మూడవ కోరిక తీర్చటం కోస నేటి మీ కష్టాలను కలిగించాను."

"కంసుని గురించి మీరు చింతించ వలసిన పనిలేదు. ఈ క్షణమే నన్ను వ్రేపల్లెలోని నందయశోదల వద్దకు చేర్చి అక్కడ నాతో పాటు జన్మించిన శిశువును ఇక్కడకు తీసుకుని రండి" అని చెప్పాడు.

kannayya7

వసుదేవుడు ఆ ఆదేశాన్ని శిరసా వహించి, అతనికి నమస్కరించి దేవకి సహాయంతో ఆ శిశువును ఒక చిన్న బుట్టలో ఉంచి వ్రేపల్లెకు బయలుదేరుతాడు. అతని కాళ్ళకున్న సంకెళ్ళు వాటికవే వీడిపోతాయి.చెరసాల తాళాలు పగిలి ద్వారాలు తెరుచుకున్నాయి. కాపలా కాస్తున్న భటులంతా స్పృహ కోల్పోయారు. కారు మేఘాలు ముసిరి గర్జనలతో పెను వర్షం కురుస్తూండగా వసుదేవుని తలపై నున్న చిన్ని కృష్ణునికి ఐదు తలల ఆదిశేషుడు గొడుగుపట్టాడు.

kannyya8

యమునా నది ఒక ప్రక్క వాసుదేవుని దర్శించిన ఆనందంతో ఉరకలెత్తుతూ వెనుకగా వచ్చి వ్రేలాడుతున్న చిన్ని చిన్ని పాదాలను ముద్దాడి, మరొక ప్రక్క వసుదేవునికి దారినిచ్చింది.నందుని గోకులాన్ని చేరుకుని వసుదేవుడు నిద్రిస్తున్న యశోదమ్మ పక్కలోని పాపాయిని తీసుకుని చిన్ని కృష్ణుణ్ణి ఆమె వద్ద ఉంచి వెనుదిరిగాడు.

యథావిధిగా తిరిగి కంసుని కారాగారానికి రాగా తలుపులు తెరుచుకున్నాయి. ఏడుస్తున్న చిన్నారి గొంతు విన్న సైనికులు కంసుడికి దేవకి ప్రసవించిందని చెప్పగా కంసుడు హుటాహుటిన వచ్చి ఆడ శిశువును చూసి మరింత ఆగ్రహంతో లాక్కొన్నాడు. దేవకి "నీవనుకున్న విధంగా నీకు హాని తలపెట్టటానికి ఇది మగ శిశువు కాదు. కాబట్టి నిన్ను ఏమీ చేయదు. మాపై దయ ఉంచి ఈ చిన్నారిని విడీచిపెట్టు" అని ప్రార్థించింది. ప్రాణాలపై నున్న తీపి వల్ల ఆమె మాటలు అతని చెవికెక్కలేదు.నిర్దయుడై ఆ శిశువును ఒడిసి లాగి కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి అక్కడే ఉన్న పెద్ద బండపై మోదాడు. ఆ శిశువు నింగికి ఎగిరింది. ఎనిమిది చేతులతో ఆయుధాలను చేతపట్తిన శక్తి రూపిణి గా యోగమాయ ఆవేశంతో ఇలా అంది:

" మూర్ఖా ! కంసా ! పసిపాపలని కూడా చూడకుండా దేవకి బిడ్డలను నీ కరవాలానికి బలిచేశావు. నిన్ను అంతం చేసేందుకు అవతరించిన బాలుని చేతిలో నీ చావు తప్పదు."

అని చెప్పి అంతర్ధానమైంది.

కంసుడి దుఃఖానికి అంతులేదు. ఎలాగైనా సరే ఆ బాలుడిని కనిపెట్టి తన మృత్యువును జయించాలని నిశ్చయించుకున్నాడు . తన సైనికులను పంపించి రాజ్యమంతా వెదికించి అప్పుడే పుట్తిన పసికందులను తుదముట్తించాడు. కానీ గోకులం అంతటా మధుర కు భిన్నమైన వాతావరణంలోఉంది. రేపల్లె సంతోష సంభ్రమాలలో మునిగి తేలుతోంది.నందుడు భార్యా సమేతంగా పూజాదికాలు నిర్వర్తించి , చిన్ని కృష్ణుని పేర దాన ధర్మాలు చేశాడు. యాదవులు తమ రాజు నందునికి , చిన్నారి బాలునికి రకరకాల కానుకలు సమర్పించుకున్నారు. కంసుని కి సామంతరాజులందరూ ప్రతిసంవత్సరం కానుకలు సమర్పించుకుంటారు. ఈ సారి కూడా అలాకానుకలిచ్చేందుకు నందుడు మధురకు బసచేయగా అక్కడికి వసుదేవుడు చేరుకుని చిన్నారుల యోగక్షేమాలు తెలుసుకుని కంసుని ఆగ్రహాన్ని గురించి చెప్పి త్వరగా ఇంటీకి పోయి బాలకులను కాపాడుకోమని చెబుతాడు. అది విన్న నందుడు భయభ్రాంతుడై హుటాహుటిన రేపల్లెకు చేరుకుంటాడు.

ఫూతన సంహారం:

అప్పటికే కంసుడు ఏ రూపాన్నయినా ధరించే శక్తి గల పూతన అనే రాక్షసిని పిలిచి నందుని కొడుకులను సంహరించమని పంపిస్తాడు. పూతన మామూలు మహిళ గా రూపం ధరించి నందుని ఇంటికి వచ్చి యశోదమ్మనడిగి ఏడుస్తున్న బాల కృష్ణుణ్ణి ఎత్తుకుని పక్కకు తీసుకెళ్ళ్లి విషపూరితమైన పాలివ్వబోయింది. మన అల్లరి కృష్ణుడేం తక్క్కువ తిన్నాడా? పాలుతాగుతూనే ఆమె ను బిగబట్టి ఉక్కిరి బిక్కిరి చెయ్యటం మొదలుపెట్టాడు. పూతన చిన్ని కృష్ణుడితో సహా ఆకాశానికి ఎగిరి బాలుణ్ణి విసిరి వెయ్యాలని ప్రయత్నించింది. గడుగ్గాయి కృష్ణుడు ఆమెను ఓ పట్టు పట్టి ప్రాణాలు తీశాడు. అమె అంతఎత్తునుండి నేలకొరిగింది. ఒకొఏసారి పెద్ద చప్పుడు కాగా యశోదమ్మ పరుగెత్తుకుంటూ .. కన్నయ్యా ! .. అని పెద్ద పెద్ద కేకలు పెడుతూ వచ్చి చూసేసరికి పెద్ద రాక్షసి నేలకూలింది. భయంకరమైనా ఆ రూఫంపై చిన్నారి బాలుడు ఆడుకుంటూ కనిపించేసరికి .. కంగారుగా పిల్లవాడ్ని గుండేలకు హత్తుకుని ఎన్నెన్నో దిష్టులు తీసింది.

putana

శకటాసుర భంజనం:

యశోదమ్మ ముద్దుల కన్నయ్య బోర్లా పడటం మొదలుపెట్టటంతో గోపజనాల ఆనందానికి అవధులులేవు. ఊరంతా పండుగ చేసుకున్నారు. నందయశోదలు పూజాదికాలు నిర్వహిసున్నారు. కృష్ణుడికి మంగళ స్నానాలు చేయించి యశోద ఆరుబయట ఉయ్యాల వేసి పడుకోబెట్టి లోనికి వెళ్ళింది. దబ్బుమన్న చపుడు వినబడి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఉయ్యాలలో కన్నయ్య ఆడుకుంటూ కనిపించాడు. కానీ పక్కనే ఉన్న బండి మాత్రం ముక్కలు ముక్కలై కనిపించింది. అప్పటికే చుట్తుపక్కల జనం గుమిగూడి వింతగా చూస్తూ చిన్ని కృష్ణయ్య కాలి దెబ్బకి అంత పెద్ద బండి ఎలా ముక్కలైందో అనుకుంటూ ఏదో గాలి సోకిఉంటుంది పిల్లాడికి అని చెప్పేసరికి యశోదమ్మ కంగారుగా పిల్లాడ్ని తీసుకుని లోనికి పరుగుతీసింది.కానీ చిన్ని కృష్ణయ్య తనను చంపటం కోసం కంసుడు పంపించగా వచ్చి తన మీదికి దూసుకొచ్చి తన కాలి దెబ్బకు ముక్కలైన శకటాసురుడిని చూసి ఓ చిరునవ్వు నవ్వాడు.

తృణావర్తుడు:

ఓ రోజు కంసుని ఆఙ్ఞపై తృణావర్తుడనే రాక్షసుడు వ్రేపల్లెకు వచ్చాడు.ఆ క్షణంలో యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చొన బెట్టుకుని ఆడిస్తున్నది. తృణావర్తుని గమనించిన మన బాలకృష్ణయ్య ఒక్క సారిగా తన బరువును పెంచేసరికి యశోద ఒక్క సారి పిల్లవాడ్ని అరుగు మీద కూర్చొనబెట్టి పనిమీద ఇంటిలోకి వెళ్ళింది. ఇక దొరికిందే సందుగా తృణావర్తుడు సుడిగాలిగా మారి విజృంభించి చిన్నారి చిన్నారి బాలునిపై విరుచుకుపడ్డాడు. పెనుధూళులు , రాళ్ళవాన, వీటికి తోడు చిమ్మ చీకట్ల తో ఆ ప్రాంతమంతా అంధకార మైపోయింది. ఇది గమనించిన యశోద గాభరాగా వచ్చి , అకాల మార్పుకు భయపడి బిడ్డ కోసం వెదికి కనిపించకపోయేసరికి గొల్లుగొల్లుమంటూ భోరున ఏడ్వసాగింది. గోపబాలికలు , గోపాలురు వచ్చి ఆమెకు ధైర్య వచనాలు పల్కుతున్నారు.ఒక్కసారిగా అందరినీ కలవరపాటు పాలుచేస్తూ ఆకాశం నుండి ఒక నల్లని భీకర ఆకారం పెను కేకలు పెడుతూ నేల కూలింది. దాని చేతిని గట్టిగా పట్తుకుని నందనందనుడు వ్రేలాడుతున్నాడు. గోపగోపీజనానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుఅయ్యింది. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళి అల్లరి కృష్ణుణ్ణి తీసుకొచ్చి తల్లికిచ్చారు." ఏ జన్మలో ఏ నోము నోచానో .. ఏ సిద్ధుని దర్శించామో, ఎవరికి ఏమి పెట్టానో ఆపుణ్య ఫలమే నేడు నాబిడ్డను కాపాడింది." అనుకుంటూ బిడ్డను హత్తుకుంది.

వెన్నదొంగ:

చిన్నారి కన్నయ్య ఓ రోజు ఆటలాడుతూ మన్ను తినటం చూస్తాడు బలరాముడు. వెంటనే వెళ్ళీ పనిలో ఉన్న యశోదను వెంటపెట్టుకొచ్చి చూపిస్తాడు.ఆమె కన్నయ్యను ప్రశ్నిస్తుంది. అమాయకంగా చూసి నేను తినలేదని చెప్పుతాడు కన్నయ్య.నోరు చూపించమని అడిగిన తల్లికి చిన్ని నోటిలో విశ్వాన్ని,కోటానుకోట్ల జీవరాశుల్ని చూపిస్తాడు.

పులకించిన యశోద వాసుదేవుని విశ్వరూపాన్ని చూసి తరించింది.

ఒక రోజు కన్నయ్య పెరుగుబాన పై ఓ బండరాయి విసిరి దాన్ని పగులగొట్టి ఆనందిస్తుండగా అదిచూసిన తల్లికి కోపం వచ్చి బరబరా ఈడ్చుకెళ్ళి ఓ లావుపాటి తాటితో ఒక రోటికి బంధిచింది. కృష్ణయ్య ఆ రోటితో పాటు ప్రాకులాడుతూ మద్ది చెట్ల మధ్య నుండి వెళ్ళగా పెద్ద చప్పుడు చేసుకుంటూ చెట్లు నేలకూలిపోతాయి. వాటి స్థానం లో శాప విమోచనం పొందిన గంధర్వులు కృష్ణుని వేనోళ్ళ స్తుతించి మాయమౌతారు. పిల్ల వాడికి పెద్ద ప్రమాదం తప్పిందనుకుంటూ యశోద కన్నయ్యనెత్తుకుని లోనికి పరుగులు తీసింది.

ఇక కన్నయ్య అల్లరి గోపికల ఇళ్ళకి చేరింది. చాటుమాటుగా వారి ఇళ్ళలో ప్రవేశించి పాలు, పెరుగు, వెన్న దొంగిలిచటం, మధ్యమధ్యలో తన్నులు తినటం జరుగుతుంది.

వారి ఇళ్ళలో ముంతలు పగులగొట్టి వాళ్ళ తిట్లు తినడం మామూలైపోయింది.

ఒకరోజు కృష్ణుని ఆగడాలు భరించలేక గోపికలంతా చేరి యశోదకు కన్నయపై ఫిర్యాదు చేస్తారు. మా కన్నయ్య అమాయకుడని వాళ్ళపై తిరిగి పోట్లాడుతుంది యశోద.

బలరామ కృష్ణులు పెరిగి పెద్దయ్యారు. గోపబాలురతో పాటు గోవులను మేపేందుకు గోవర్ధన గిరికి వెళ్లి గోవులు మేస్తుండగా ఆటపాటలలో తేలియాడేవారు.

గోపాలుని మధురమైన వేణుగానానికి పశువులు పరవశించ సాగాయి.

వత్సాసుర వధ:

అలా మేపుతుండగా ఒక రోజు వత్సాసురుడనే రాక్షసుడు కంసుని ఆదేశంపైన ఒక దూడగా మారి గోవుల మందలో కలిసిపోతాడు.అది గమనించిన కృష్ణుడు బలరామునికి సైగ చేసి ఆ దూడ రూపంలోని రాక్షసుని వెనుకకాళ్ళు పట్టి గిరగిరా తిప్పి చెట్టు కేసి బాదుతాడు.ఇక వత్సాసురుని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

బకాసుర వధ:

ఒక రోజు గోపబాలురతో బలరామ కృష్ణులు ఆడుకుంటుండగా ఒక పెద్ద బకము అంటే కొంగరూపంలో వచ్చిన రాక్షసుడు తటాలున వచ్చి కృష్ణుడిని మింగేస్తాడు. కొంగ గొంతులో చిక్కిన కృష్ణుడు దాని గొంతులో, దవడలమీద బాదటంతో అది నేల కూలింది.

అఘాసుర వధ:

ఒకరోజు గోపబాలురతో కలిసి గోపాలుడు ఆటలాడుతూ దోబూచులాడుతూంటే అక్కడికి వచ్చిన అఘాసురుడనే రాక్షసుడు తన అక్క పూతనను, అన్న బకుని చంపిన కృష్ణు ని ఎలాగైనా అంతం చేయాలని తలపెట్టి ఒక పెద్ద కొండచిలువగా మారి కృష్ణుని , గోపాలురని మింగాలని చూసింది. అది గమనించిన కృష్ణుడు దాని నోటిలో దూరిఒక్క సారిగా శరీరాన్ని పెంచేసరికి ఊపిరాడక గిలగిల కొట్తుకుంటూ చచ్చిపోతుంది.

బ్రహ్మ పరీక్ష:

ఒకరోజు కృష్ణుడి మహిమలను పరీక్షించదలచి సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు భూమిపైకి వచ్చి మేత మేస్తున్న గోవులను మాయం చేస్తాడు. ఆ సమయంలో గోపాలురంతా పచ్చికబయళ్ళపై గుమిగూడి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ చద్దిముద్దలు ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు. విషయం తెలిసిన కొందరు పరుగులు తీయబోగా , భోజనం మధ్యలో లేవడం తగదని వారిని వారిస్తాడు కృష్ణుడు. నే వెళ్ళీ చూస్తానని చెప్పి వెళ్ళి వెతుకగా గోవుల జాడ కానరాక వెనుదిరిగి వచ్చి గోపాలురు కూడా కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతాడు. అంతా విధాత మాయగా గ్రహించి చిరునవ్వుతో గోపబాలురను, గోవులను మళ్ళీ సృష్టిస్తాడు. దాదాపు ఒక సంవత్సరం గడిచినా వ్రేపల్లెలో ఎటువంటి మార్పూలేకపోయే సరికి బ్రహ్మ నిశ్చేష్టుడై కృష్ణుని ముందుకు వచ్చి వేవేల కీర్తించి మన్నించమని ప్రార్థిస్తాడు.

ధేనుకాసుర సంహారం:

ఒక రోజు గోపబాలురు ఆటలాడుతూ ఒక పెద్ద తాళవనంలోకి ప్రవేశించారు. నోరూరించే ఆ వనంలోని తాటిపళ్ళు తినాలని ఆశపడితే అక్కడున్న ధేనుకుడనే రాక్షసుడు గార్ధబ రూపంలో తనపరివారంతో నివసిస్తూ గోపాలుకులని భయపెట్టేసరికి అంతా వచ్చి కృష్ణుడికి వివరిస్తారు. బలరామకృష్ణులక్కడికి వెళతారు. బలశాలియైన బలరాముడు తాటి చెట్టును బలంగా కదిపితే పళ్ళు జలజలా రాలుతాయి. ఆ చప్పుడుకి ధేనుకాసురుడూ వచ్చి కృష్ణ బలరాములపై దాడిచేస్తాడు.మీదబడి కాళ్ళెత్తిన గాడిదను బలరాముడు ఒడిచి పట్తి గిరిగిర తిప్పి ఓ పెద్ద చెట్తుకేసి బాదుతాడు.అది అంతం కాగానే గోపాలురు ఆనందోత్సాహాలతో తాటిపళ్లను తనివితీరా తింటారు.

కాళీయమర్దనం:

ఒకరోజు గోవులను కాసి, ఆటలాడి అలసిపోయిన గోపాలురు సమీపంలోని యమునానదిలో నీరు తాగడానికి పోయి అందులోని విష సర్పం కాళీయుని విషజలం వల్ల ప్రాణాలు కోల్పోతారు.యమునా జలాలు నీలి రంగులోకి మారిపోవటం సమీపంలో పక్షులు కుప్పలుగా చచ్చిపోవటం , చెట్లన్నీ మాడిపోయికనిపించటంతో బాల కృష్ణుడు రంగంలోకి దిగుతాడు. తటాలున మడుగులోకి దూకి కాళిందిపై దాడి చేస్తాడు. అది మహాకోపంతో విషపు కోరలతో కృష్ణుడిపై ఎదురుదాడి చేస్తుంది.కృష్ణుడిని చుట్టిపడేయాలని ఎగబడిన కాళింది తోకపట్టి దాని శిరసుపైకెగిరి తాండవం చేస్తాడు. చిన్ని పాదాలైనా తలపై తగిలే దెబ్బలతాకిడికి తాళలేక సర్పం విషం , రక్తం కక్కుతుంది.

ఇక ఆ బాధచూడలేక కాళీయుని భార్యలు కృష్ణుని ప్రార్థిస్తారు.ఇకపై యమునా సమీపంలో కనిపించరాదని , సాగరానికి పొమ్మని ఆదేశించి దానిని వదిలిపెడతాడు.

గోవర్థనోద్ధరణం:

సకాలంలో వర్షాలు కురిపిస్తూ పాడిపంటలను ప్రసాదిస్తున్నందుకు గోపజనం ప్రతి సంవత్సరం ఇంద్రుడీకి యాగం చేసి హవిస్సులర్పిస్తారు. ప్రతిసంవత్సరం లాగే ఈసారి కూడా యాగానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ కృష్ణుడికి ఆ సంగతి చెబుతారు. ప్రకృతి సహజంగానే దాని ధర్మాన్ని నిర్వర్తిస్తుండగా ప్రత్యేకించి ఇంద్రపూజ చేయవలసిన అవసరం లేదనీ పశువులకు నిత్యమూ ఆశ్రయాన్నిచ్చే గోవర్థనగిరిని పూజించమని చెబుతాడు. దానితో ఆ సంవత్సరం ఇంద్రాది దేవతలకు బదులుగా గోపజనం గోవర్థన గిరిని పూజిస్తారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అవమానంగా భావించి ఆగ్రహించి వరుణాది దేవతలను పిలిచి తనను నిర్లక్ష్యం చేసిన వెర్రి బాలకులకు బుద్ధి చెప్పాలని , విర్రవీగుతున్న బుడతడు కృష్ణుడి గర్వాన్ని అణచాలనీ అందుకోసం ప్రళయాగ్నిని తలపించే రీతిలో జడివానలు కురిపించమనీ ఆదేశిస్తాడు.

అకస్మాత్తుగా చెలరేగిన వడగళ్ళవానకు రేపల్లె అంతా చెల్లాచెదరు అవుతుంది.ఆబాలగోపాలం సుడిగాలులకి , ఉరుములు , మెరుపులకి అల్లాదిపోతూ శరణు శరణంటూ

శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తుంది. అకాల వర్షానికి ఇంద్రుడి ఆగ్రహమే కారణమని గ్రహించి నందనందనుడు తన్ను శరణన్న వారికి అపాయం కలుగదని చెప్పి ఇంద్రుని అహంకారాన్ని పటాపంచలు చేయాలని తలచి అంతపెద్ద గోవర్థన గిరిని అవలీలగా చిటికెన వ్రేలిపై నెత్తి గొడుగు గా చేసి గోపజనాన్ని రక్షించాడు. దానితో ఇంద్రుడి గర్వం అణగి భగవంతునిగా కృష్ణుని గుర్తించి శరణు వేడుకుంటాడు. అతనిని క్షమించి సంపదతో గర్వం వస్తుందనీ తక్శణమే తాను ఆ సంపదలు దూరం చేసి కనువిప్పు కలిగిస్తానని అంటాడు.

అప్పుడు కామధేనువు కృష్ణుడిని చేరి మహాత్మా ! నీ వల్ల నాకులమంతా ఇంద్రుని బారినుండి రక్షించబడింది. ఎవరైతే రక్షకుడో అతనే ఇంద్రపదవికి అర్హుడు. నేను నిన్ను మాత్రమే ఇంద్రునిగా భావించి అభిషేకిస్తాను.ఇకపై నీతోనె ఉంటాను అనిపలికి కృష్ణు ని ఆకాశ గంగా జలాలను కలిపి తనపాలను ధారగా కురిపించి అభిషేకిస్తుంది

గోపాలుని వేణుగానామృతం:

నందకిశోరుని వేణుగానం ఆద్యంతం అమృతమయమై ఆబాలగోపాలన్నీ మైమరపింపజేస్తూ ఉండటంతో గోపికలు కృష్ణుడే లోకంగా సర్వం కృష్ణమయంగా భావించి జీవించసాగారు.

గోపికా వస్త్ర్రాపహరణం:

శరత్కాల పూర్ణీమ నాడు చల్లని వెన్నెలలో గోపికలు వస్త్రాలను గట్టుపై పెట్టి నది లోజలకాలాడుతుండగా వెన్నదొంగ అక్కడకు చేరి వారి వస్త్రాలను దాచిపెట్తి వారిని ఆటపట్టిస్తాడు.గోపికలందరూ గతజన్మలో కృష్ణుని సాంగత్యం కోసం తపస్సు చేసిన మునివర్యులే.

నారదుని రాక:

నారదుడు కంసుని చేరి కంసుని కి రానున్న ఆపదను గురించి మరలా హెచ్చరిస్తాడు. దేవకీ వసుదేవులు నందయశోదల దగ్గర పెరిగిపెద్దయ్యారని త్వరలోనే వారు కంసునిపై దండెత్తి వచ్చి అతనిని సంహరిస్తారని చెబుతాడు. అది విని ఆందోళన పడిన కంసుడు వివిధ రకాల ప్రయత్నాలతో బలరామకృష్ణులను అంతం చేయాలని చూసి విఫలుడౌతాడు.చివరికి ఒక పన్నాగం తో అకౄరుడిని కృష్ణుడి దగ్గరికి రాయబారిగా పంపి కృష్ణ బలరాముల జన్మ వృత్తాంతం చెప్పి ,తాను చేయబూనిన ధనుర్యాగానికి రాకుమారులను సాదరంగా మధురకు ఆహ్వానించాలని రేపల్లెకు పంపిస్తాడు.

అకౄరుడు నందయశోదలకు విషయం చెప్పి , నచ్చజెప్పి వారిని తనతో తీసుకెళతాడు. కృష్ణుడి ని వీడవలసి వచ్చేసరికి రేపల్లె శోక సముద్రమైపోతుంది.

కొన్ని ఏళ్లపాటు రాకుమారులను కోల్పోయిన దుఃఖంలో ఉన్న మధుర కృష్ణ బలరాములు వస్తున్నారన్న శుభవార్తతో పులకించి, వారికోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

మధురలో కృష్ణయ్య:

మధురకి రాగానే అన్నదమ్ములకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఒక సాలె వాడు ఎదురుపడి క్రుష్ణుడికి చిత్రవిచిత్రాలైన వస్త్రాలను బహూకరించాడు.తరువాత సుదాముడనే వాని కోరికపై అతని ఇంటికి వెళ్ళీ అతని పూజాదికాలందుకున్నారు.

కుబ్జ శాపవిమోచనం:

మధురపురవీధులలో విహరిస్తుండగా గూని యై అందవికారముగా ఉన్న ఒక స్త్రీ రాజాంతఃపురానికి సుగంధ పాత్రలను మోసుకుంటూ వెళుతుండగా కృష్ణుడామెను పిలిచి " సుందరీ! ఈ సుగంధాలు మాకూ ఇస్తా వా? అని అడుగుతూ ఆమెను తాకి ఆమె వైకల్యాన్ని పోగొడతాడు.

కంసుని అవస్థలు:

మధుర చేరిన బలరామకృష్ణులను చంపాలని కృష్ణుడు నిద్రాహారాలు మాని కుట్రలు పన్నడం మొదలుపెడతాడు.ఒక విశాలమైన వేదికపై మల్ల యుద్ధాన్ని అందుకు సరిఅయిన మార్గంగా ఎంచుకుని వారికి కబురంపుతాడు.

ఛాణూరముష్టికాసురులను కృష్ణుడిపైకి మల్ల యుద్ధానికి పంపించగా వారిద్దరూ ఆ రాక్షసులని అవలీలగా మట్టి కరిపించారు. ఇక ఆవేశాన్ని ఆపుకోలేక కంసుడు రంగప్రవేశం చేసి వారిపై దుముకుతాడు.కృష్ణుడతని మెడపట్తి కిరీటాన్ని విసిరి నేలపై ఈడ్చి అతనిని సంహరించాడు.

మధుర వాసుల జయజయ ధ్వానాలమధ్య దేవకీ వసుదేవులను బంధనాలనుండి విముక్తి చేశాడు.

17 మే, 2009

భళి భళీ బాలకృష్ణయ్య ! ... వేసవిలో చిన్నారుల కోసం భాగవతంలోని దశమ స్కంధం.. కృష్ణ లీలలు

సృష్టి పరిణామ క్రమం నాలుగు యుగాలుగా జరిగింది. విశ్వగమనంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం కలియుగం అనే నాలుగు యుగాలు నాలుగు చక్రాలుగా వర్ణింపబడ్డాయి.కృత యుగంలో ధర్మం నాలుగు పాదాల పై నడిచింది. త్రేతా యుగంలో మూడు పాదాలపైనా, ద్వాపరయుగంలో రెండుపాదాల పైనా ధర్మం నిలబడింది. కానీ కలియుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తోంది. అధర్మం ధర్మాన్ని పీడించినప్పుడు దుష్ట శిక్షణకై భగవంతుడు అవతరిస్తాడన్న సందేశాన్ని ఇచ్చిన హిందువుల పవిత్ర గ్రంథం శ్రీమద్భగవద్గీత అవతరించింది ద్వాపరయుగంలోనే. ద్వాపరయుగంలో రాక్షసాంశతో జన్మించిన రాజులు ప్రజలను , సాధుజనులను బాధలకు గురిచేస్తోంటే భూమాత చూస్తూ భరించలేక , ఆ పాప భారాన్ని మోయలేక గోమాత గా మారి బ్రహ్మ దేవుని చేరి తన గోడును చెప్పుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరునితో కూడి పాల కడలిలో శేష శయ్యపై శయనించే విష్ణుమూర్తిని ప్రార్థించగా గగన వాణీ ఇలా చెప్పింది. " పరమాత్మా ! సాక్షాత్తూ దేవకి , వసుదేవుల కు కుమారునిగా జన్మించబోతున్నాడు. దేవతలంతా గోపీ జనాలుగా యదువంశంలో జన్మించి ఆ దివ్య బాలునికి సహకరిస్తారు. అవతార లక్ష్యం నెరవేరే వరకు దేవ గణమంతా వివిధ రూపాలలో భూమిపైనే నివసిస్తారు." పిల్లలూ ఇక మనం 'భళి భళి బాల కృష్ణయ్య' కథ చెప్పుకుందాం . శ్రద్ధగా వినండి. యాదవ వంశ మొదటి రాజు యదుమహారాజు పేరుతో ఆయన వంశీకులను యాదవులు అని పిలిచారు. ఉగ్రసేనుడు , దేవకుడు యదువంశ రాజులు. యాదవ రాజ్యాన్ని మధుర, శూర సేన రాజ్యాలు గా విభజించారు. శురసేన రాజ్యాన్ని ఉగ్రసేనుడు , మధురను దేవకుడు పాలించారు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు, దేవకుని కుమార్తె దేవకి. మధుర రాజ్యంలోనే అంధకము అనే యదు వంశశాఖ లో శూరుడు అనే రాజు కుమారుడు వసుదేవునికి తన చెల్లెలు దేవకీదేవి ఇచ్చి వైభవంగా వివాహం జరుపుతాడు కంసుడు. వివాహానంతరం బంగారు రథంపై తన చెల్లెలిని , బావను ఆమె అత్తవారింటికి పంపుతూ రథానికి తానే సారథ్యం వహిస్తాడు . సరిగ్గా అదే సమయంలో అశరీరవాణి అతన్ని ఇలా హెచ్చరిస్తుంది: "కంసా ! నీవెంత గానో ప్రేమించే నీ సోదరి ఎనిమిదవ సంతానం నీకు మృత్యువు కానున్నది" ఆ మాటలు విన్న కంసుడు నిలువునా భయకంపితుడై , కోపోద్రిక్తుడయ్యాడు. ఆ క్షణంలో తన ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యంగా తోచింది. వెంటనే అల్లారు ముద్దుగా చూసుకున్న తన చెల్లెలిని జుట్టు పట్టి లాగి ఆమె ను చంపబోగా వసుదేవుడు అడ్దుపడి అబల అయిన స్త్రీని చంపడం , అందునా నవ వధువుని చంపటం మహా దోషమనీ చెప్పి , కంసుడికి ప్రాణ భయంలేకుండా తమకు పుట్టిన సంతానాన్ని పుట్టీ పుట్టగానే అప్పగిస్తాననీ చెప్పి ఆమె ను వదిలిపెట్టమని వేడుకుంటాడు. వసుదేవుడి మాటపై నమ్మకంతో కంసుడు ఆమె ను విడిచిపెట్టి ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళతాడు.కొంతకాలానికి దేవకీ వసుదేవులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనికి కీర్తిమంతుడనే పేరు పెట్తుకుంటాడు. అన్న మాట ప్రకారం వసుదేవుడు ఆ బాలుని కంసునికి అప్పగించగా ఎనిమిదవ సంతానం వల్ల మాత్రమే ప్రమాదమని భావించి ఆ బాలుని వసుదేవునికి తిరిగి ఇచ్చేస్తాడు కంసుడు. ఒకరోజు లోక సంచారం చేస్తూ నారదుడు భూలోకం లో కంసుని దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలడిగి మాటల మధ్యలో దేవకీ దేవి ప్రస్తావన తెస్తాడు. దేవకీ దేవి కి పుట్టబోయే బిడ్డ తప్పకుండా రాక్షసాంశతో పుట్తిన కంసుని సంహరిస్తాడని చెప్పి అతనిని భయానికి గురిచేస్తాడు. ఆ మాటలు విన్న కంసునికి ఆకాశవాణి పలుకులు కూడా గుర్తుకు వచ్చి ప్రాణాలపై నున్న అమితమైన ప్రేమతో చెల్లెలిని , బావను ఇనుప సంకెళ్లతో బంధిస్తాడు.వద్దని వారించిన తండ్రి ఉగ్రసేనుడిని కూడా కారాగారం పాలు చేస్తాడు.తరువాత దేవకీ వసుదేవుల కు పుట్టిన పసి గుడ్దుల్ని ఆరుగురిని పుట్టీ పుట్టగానే నిర్దయతో చంపేస్తాడు. దేవకీ వసుదేవులు భగవంతునిపై భారం వేసి కాలం గడుపుతున్నారు. మహా విష్ణువు యోగ మాయను పిలిచి దేవకీ దేవి గర్భంలో సప్తమ శిశువును ఆకర్షించి నంద గోకులంలోని రోహిణీ దేవి గర్భంలోకి చేర్చమని ఆదేశిస్తాడు. అలా దేవకి ఏడవ సంతానం పుట్టకుండానే రోహిణీ గర్భంలోకి చేరుతుంది. అలా రోహిణీకి పుట్తిన శిశువు ఆదిశేషుని అవతారం అలా దేవకీ గర్భంలోని శిశువుని యోగమాయ సంకర్షించటం వల్ల పుట్టిన శిశువును సంకర్షణుడని ,బలశాలి అయినందువల్ల బలరాముడనీ అన్నారు. (ఇంకా ఉంది)

13 మే, 2009

నిత్య కళ్యాణమస్తు !

ఓ చల్లని వేళ

ఓ అందమైన రోజు

కొక్కొరొకో అంటూ తొలికోడి కూత తో

సన్నాయి రాగం వినబడుతూంటే..

వెన్నెల పంచిన జాబిల్లి

వెళ్ళనంటూ మారాం చేస్తుంటే

వెలుగును మోసుకొచ్చిన

సూరీడు వస్తానంటూ తొందరపడుతోంటే....

వేడి వేడి వెచ్చని గాలుల్లో

చల చల్లని నవ్వుల ఝల్లుల్ని కురిపిస్తూ .....

ఓ శుభ ముహూర్తాన

ఒక గూటికి చేరటం కోసమే పుట్టిన

రెండు మనసుల్ని ఏకం చేసేందుకై.......

ఆకాశంలోని నక్షత్రాలన్నీ

ఆ ఇంటి ముందు రంగవల్లులయ్యాయి.

రంగురంగుల ధనువులోని

ఏడు రంగులనూ రంగరించి

రమ్యమైన పూలుగా మార్చి......

పూల తోరణాలు చేసి..

వచ్చే పోయే వారిని

రారమ్మంటూ ఒక్కటౌతున్న ఇద్దర్ని

ముద్దు మురిపాలతో జీవించమని

దీవించమంటూ

ఆశీర్వదించమంటూ...ఆహ్వానిస్తున్నాయి

ముచ్చటగా ముస్తాబై

పెళ్ళికూతురి గా మెరిసిపోతూ

ఓ అల్లరి అమ్మాయి చిలిపి కన్నులతో

కాబోయే తన రాజుని

మనసున్న మారాజుని

కొంటె చూపులతో ఓరగా

చూస్తూ...

నేరుగా చూడలేక

చూడకుండా ఉండలేక

ముప్పు తిప్పలు పడుతుంటే...

ఆ చూపుల బాణాలు గుచ్చుకుని

ఆ రారాజు ఆమె మనసుదోచిన

మహరాజు ....

తప్పించుకోలేక ఇక తప్పదనుకుంటూ

ఆమె గారాల సింగారాలకి

తలవంచి ఆ కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూసి

దొరికిపోయిన దొంగలాగా

ఉలిక్కి పడి .. ఓ చిరునవ్వు పువ్వు

ఆమె బుగ్గలపై విసిరి

గిలిగింతల పలకరింతలతో

ఆమెని పులకరింతల పాలు చేసి.....

సడిచెయ్యని గాలిలాగా సర్దుకున్నాడు.

మేళ తాళాలు మంగళ వాద్యాలు

సందడి చేస్తూ .. ఊరంతా పండగ చేసుండగా

సుతారంగా ఆమె చెయ్యందుకుని

దర్జాగా ధీమాగా ముందడుగేశాడు.....

ఆ బాజాలు భజంత్రీలు ఏటేటా మళ్ళీ మళ్ళీ

అదే సమయానికి మోగుతున్నాయి

ఆ అమ్మాయి అల్లరి చూపుల్ని

ఆ అబ్బాయి చిలిపి చేష్టల్ని

పదే పదే గుర్తుచేస్తున్నాయి

తియ్యటి తినుబండారాలు

కమ్మటి కబుర్లతో పెళ్ళిరోజు పండుగ

కన్నుల విందుచేస్తానంటూ

ఎప్పటిలాగే ఇప్పుడూ వచ్చేసింది

ఆశల ఆకాశంలో స్వేఛ్చగా విహరించే

ఆ పక్షుల జంట

స్వచ్చమైన పువ్వుల పై

మకరందాన్ని గ్రోలుతూ

పరుగులు తీస్తున్న ఆ తుమ్మెదల జోడీ

చిటపట చినుకులకు పరవశించి

నాట్యమాడే ఆ మయూరాలు

పచ్చని చెట్లపై ఊసులాడుకుంటున్న

చిలకా గోరింకలు

మనోహరమైన సెలయేళ్ళలో విహరిస్తోన్న

ఆ హంసల ద్వయం.... మరెవరో కాదు

నా నేస్తాలుగా.. దేవుడు నాకిచ్చిన బంధువులు

ఆనాటి ఆ వేడుకలు చూసే భాగ్యం నాకు లేకున్నా

ఆ కన్నుల కాంతులు కలకాలం

కళకళ లాడాలనీ

చిన్నారుల చిరునవ్వులు వెన్నెలలుగా చిరకాలం

వెలుగులు చిందించాలనీ.....

మనసారా ... కోరుకుంటూ... శుభాకాంక్షలందిస్తున్నాను

నాకు తోడుగా నాతో పాటుగా

నా నేస్తాలను దీవిస్తారా.....

ఎన్నెన్నో జన్మల బంధం .....

మనం నవ్వితే అవి గంతులేస్తాయి.

మనం బాధపడితే అవి కంటతడిపెడ్తాయి

. kanchi...... swamy , .... pets ..may 7th 030.jpg

మనకి జ్వరం వస్తే అవి లంకణం చేస్తాయి.

సింపుల్ గా చెప్పాలంటే మనం దగ్గరైతే అవి పండగ చేసుకుంటాయి.

మనం దూరమైతే అవి భారమైన గుండెతో బెంగపెట్తుకుంటాయి.

మన శతృవులపై విరుచుకుపడ్తాయి. మన మితృల్ని మనసారా ఆహ్వానిస్తాయి.

రంగు, రూపం , వేషం , భాష , జాతి, నీతి అన్నీ వేర్వేరే.

అయినా సరే. మన జీవన విధానంలో ఒక భాగమైపోయి ఆత్మీయత, అనుబంధాల మూటలు కట్తి గుండెనిండిన ప్రేమతో, ప్రేమ నిండిన గుండెతో మన గుండెల్ని గెల్చుకుంటాయి మూగజీవాలు.


kanchi...... swamy , .... pets ..may 7th 078.jpg

మనిషి ప్రకృతిపై సాధించిన గెలుపంటూ ఒకటి ఉందంటే అది కేవలం జంతువులని మచ్చిక చేసుకోవటం మాత్రమే.

వాటికి భాష రాదు.అయినా చూపులతో , చేష్టలతో మాట్లాడుతాయి.

ఇష్టం, కోపం, అలుక, దుఃఖం, సంతోషం ఇలా అన్ని భావాలను మనతో పంచుకోవాలని ప్రతీ క్షణమ్ మనతో గడపాలని తపిస్తాయి.

పెంపుడు జంతువులు.వాటితో గడిపే ప్రతినిముశమూ ఆహ్లాదమయం కావటం తో పాటు మన ఆరోగ్యానికి , ఆయుష్షుకి అదనపు మార్కులు ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

మనకి ఎన్నో వ్యాపకాలుంటాయి. కానీ వాటి వ్యాపకమంతా మనమే.

మనలో ఒకటిగా , మన వాళ్ళందరికంటె ఎక్కువ అభిమానాన్ని పెంచుకుని మనతో మమేకమైపోయి మనమే జీవితంగా బతికే పెంపుడు జంతువుల పట్ల మనం చూపే శ్రద్ధ ఏపాటిది?

రోజంతా మనల్ని గురించే ఆలోచించే పిచ్చిప్రాణులకోసం రోజులో మనం ఎన్ని నిముషాలు కేటాయిస్తున్నాం?

పెంపుడు జంతువుల సంరక్షణ , ఆరోగ్యం తదితర అంశాలపై ప్రత్యేకకథనంతో మీకు మీ పెట్స్ కి ఉన్న అనుబంధాన్ని రెండింతలు చేసుకోండి.

kanchi...... swamy , .... pets ..may 7th 153.jpg




మన ప్రాంతంలో దాదాపు 90% కి పైగాఅన్ని వర్గాల వారూ ఎంచుకునే ఆప్షన్ డాగ్స్. కుక్కలు విశ్వాసానికి మారుపేరు. అంతే కాకుండా ధనవంతులైనా పేదవారైనా వారి స్థాయికి తగ్గట్తుగా కుక్కల్ని పెంచుకునే వీలుంది. పేదవారి ఇంట్లో కుక్క ప్రేమను పంచితే ధనికుల కుక్క దర్పాన్ని ఒలకబోస్తుంది. అమెరికా అధ్యక్షుడంతటివాడే ఫస్ట్ డాగ్ వెంట పరుగులుతీయక తప్పలేదు కాబట్తి శునకాలిచ్చే ఆనందం అంతాఇంతా కాదనే చెప్పాలి.

శునకాల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:



౧.దంత సంరక్షణ:

పెట్స్ దంతాల సంరక్షణ విషయంలో మనం సాధారణంగా శ్రద్ధ చూపం. ఫలితంగా ౩ ఏళ్ళకే 80% కుక్కలునోటి సంబంధ వ్యాదులతో బాధ పడుతున్నాయి.

* సరైన దంత సంరక్షణ వల్ల 5 ఏళ్ల వరకు జంతువుల ఆయుశ్ష్హును పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

*వాటి దంతాలను శుభ్రపరచడానికి పల్చని చికెన్ సూప్ తీసుకుని చక్కగా రబ్ చెయ్యాలి.

కుక్క పళ్ళు తోమటానికి చికెన్ సూపా? :

నోరు తెరవమని మొట్టగానే తెరిచి పళ్ళు తోమించుకోవడానికి అవి మీ ఇంట్లోని పిల్లలు కాదుకదా. అలవాటయ్యేవరకు ఖర్చయినా తప్పదు మరి.

* సూపే ఎందుకంటే..

చికెన్ సూఫ్ మాయలో పడి మీతో అవి చక్కగా పళ్ళుతోమించుకుంటాయి.


* ఎట్తి పరిస్థితుల్లోనూ మనం వాడే టూత్ పేస్ట్ గానీ బేకింగ్ సోడా కానీ కుక్కలకి వాడకూడదు.దాని వల్ల వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.

* కుక్కల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రష్ తో సున్నితంగా పళ్లకి 45 డిగ్రీల కోణంలో పళ్ళు , చిగుళ్ళు కలిస్తే గమ్ లైన్ మీద ముందునుండి వెనుకగా పైకి కిందికి రుద్దటం వల్ల అక్కడ పేరుకున్న ఆహారపదార్థాలు , బాక్టీరియా దూరమౌతాయి. డాగ్స్ కోసం ప్ర్రత్యేకంగా రూపొందించిన టూత్ పేస్ట్స్ చికెన్ , ఫిష్ ఫ్లేవర్లలో మార్కెట్లో లభిస్తున్నాయి.

* పళ్ళు ధృఢంగా కావడానికి ప్రతీ భోజనానంతరం 2 లేదా 3 హార్డ్ బిస్కట్లను అలవాటు చెయ్యాలి.

2. ఆరోగ్య సంరక్షణ:

* అవసరం ఉన్నా లేకున్నా రెండు మూడు నెలలకోసారి వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళి ప్రాథమిక పరీక్షలు చేయించాలి.

* క్రమం తప్పకుండా ఆరుబయట నడిపిస్తూ పరుగెత్తిస్తూ ఉంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి.

* మెట్లెక్కటం , దిగటం వల్ల వాటి ఫిట్ నెస్ మెరుగుపడుతుంది.

* అలసటగా అనిపించినపుడు వ్యాయామం మంచిదికాదు.

* ఎప్పటికప్పుడు వాటి ఉష్ణోగ్రత పరిశీలిస్తూండాలి.

* పరిశుభ్రమైన చల్లని నీరు రోజంతా అందిస్తూండాలి.

*
3.పరిశుభ్రత:

* ప్రతి రోజూ కనీసం రెండురోజులకొక్కసారైనా శుభ్రంగా స్నానం చేయించి చక్కగా దువ్వాలి.

* వాటి కోసం ప్రత్యేకమైన టవల్ని వాడాలి.

4.వేసవి జాగ్రత్తలు:

* ఆరుబయట, వాకిట్లో పగలు ఉంచకూడదు.

* చల్లని ప్రదేశాల్లో వడగాలి తగలకుండా వీలైతే ఇంటిలోపల ఉంచాలి.

* దోమలు వ్యాప్తి చెందకుండా వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.

* మీ డాగ్ ఉండే చోట చల్లని నీళ్ళు చల్లుతూ ఉండాలి.


* పొరపాటున కూడా మీ కుక్కని కారులో ఉంచి లాక్ చెయ్యకండి. అందువల్ల గాలి చాలక బ్రెయిన్ డామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.


5.హార్ట్ వార్మ్స్:

* దోమల ద్వారా వ్యాప్తి చెందే పరాన్న జీవులు హార్ట్ వార్మ్స్. ఇవి కుక్కలు, పిల్లులను మృత్యువాతపడేస్తాయి.

ఇవి వ్యాప్తి చెందితే చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీ పెట్స్ హార్ట్ వార్మ్స్ బారిన పడకుండా ముందే పరీక్షలు చెయ్యించుకోవాలి.


6.ప్లీస్:

* తరచూ కొరుక్కోవటం, రుద్దుకోవటం వంటివి 'ఫ్లీ ఇనెస్టేషన్ 'సూచకాలు. తరచూ షాంపూలు, స్ప్రేస్ , డిప్స్, పుడర్స్, ఓరల్ మెడికేషన్స్ వంటివి వాటిద్వారా ప్లీస్ ను నియంత్రించవచ్చు.

7.టిక్స్:

వేసవిలో పెంపుడు జంతువులను ఇబ్బంది పెట్టే సమస్యలలో ప్రధానమైన సమస్య టిక్స్. ఇవి జంతువులకి అసౌకర్యాన్ని కలగజేయటంతో పాటు అనేకరకాల వ్యాధులను కలుగజేస్తాయి.డాక్టరు ను సంప్రదించి టిక్స్ నివారణ కు తగు చర్యలు తీసుకోవాలి.

8. డాగ్ టాయెస్:

ఇంట్లోని వస్తువులు, చెప్పులు , బూట్లు , బట్టలు కొరక్కుండా వాటి పళ్ళ దురద తీరాలంటే పళ్ళకి ఎక్సర్సైజ్ కోసం , అవి ఆరోగ్యం గా ఉండటం కోసం స్పెషల్ టాయెస్ కొనక తప్పదు.

టాయెస్ వల్ల అది హాపీ గా ఉండటం తో పాటు మిమ్మల్ని కూడా దాని ఆటలు, అల్లరితో కవ్వించి , మీ విసుగును పటాపంచలు చేస్తుంది.

చిన్న చిన్న కుక్కపిల్లలకి టీతింగ్ టాయ్స్ కొనాలి.

కుక్కల కోసం రకరకాల బొమ్మలు:

చ్యూయీస్

రబ్బర్ బాల్స్

టీతర్స్

స్క్వీకీ బాల్స్

క్రేజీ బాల్స్

ఇలా రకరకాల వస్తువులతో పాటు సాఫ్ట్ టాయ్స్ తో కూడా కుక్కలు చక్కగా ఆడుకుంటాయి.

పెద్ద కుక్కలకోసం ట్రిక్కులు:

* కుక్కల వయసు పెరిగే కొద్దీ మీపై ప్రేమ పెరుగుతుంది. వయసులో ఉన్నప్పుడు హుషారుగా మీ చుట్తూ తిరుగుతూ సందడి చేసినట్తు పెద్దవయసు కుక్కలు చెయ్యలేవు.వయసు పెరిగేకొద్దీ మెటబాలిజం రేటు తగ్గటమే దీనికి కారణం.

* కీళ్ళ నొప్పులు, కాటరాక్ట్ ,వినికిడి సమస్యలను ముందుగానే కనుగొని తగిన వైద్యం చేయించాలి.

* ఆర్థ్రైటిస్ లాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* వాటి బరువు నియంత్రణలో ఉన్నదీ లేనిదీ కూడా సరిచూస్తుండాలి.


* బయటి ఆహార పదార్థాలు వీలైనంత తక్కువ వాడి , ఇంట్లో వండిన వంటకాలే పెట్టటం ఉత్తమమైన పద్ధతి.

* ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్ వేయించాలి.

* కాల్షియం సప్లిమెంట్ల అవసరం ఉందేమో వైద్యుని సంప్రదించి టాఫీలు, చూయీల రూపంలో అందించాలి.

kanchi...... swamy , .... pets ..may 7th 017.jpg






ఊరెళ్ళేటప్పుడు ... కుక్కల మాటేమిటి?

* సెలవులకు ఊరెళ్ళాలనుకున్నపుడు మీతో పాటు దాన్ని తీసుకెళ్ళాలంటే అన్ని సార్లూ వీలుకాకపోవచ్చు. మొదటినుంచీ మీకు అత్యంత సన్నిహితులు, ముఖ్యంగా పశువుల్ని ప్రేమించగలిగేవారికే
అలవాటు చెయ్యాలి. కొన్ని రోజులు మీరు లేకపోయినా అది అక్కడ అడ్జస్ట్ అయ్యేలా అలవాటు చెయ్యాలి.


kanchi...... swamy , .... pets ..may 7th 171.jpg



ఊరు తీసుకెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:


* డాగ్స్ కోసం ప్రత్యేక మైన కిట్ ను సిద్ధం చేసుకోవాలి. అందులో దాని కి కావాల్సిన వస్తువులతో పాటు, మందులు, ఎప్పుడూ రెగ్యులర్ గా వాడేబ్రాండ్ బిస్కట్లు వగైరా పెట్తుకోవాలి.

* గంటలకొద్దీ దూర ప్రయాణం చేసేటప్ప్పుడు మాటల్లో పడి కుక్కను మర్చిపోకుండా మధ్య మధ్యలో అటూ ఇటూ దాన్ని తిప్పాలి.

*కొత్త చోటులో ఏమైనా అనారోగ్యానికి గురైనా ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత్తగా మందులు తీసుకుని వెళ్ళాలి.

* ట్రిప్ మొత్తానికి దానికి సరిపోయే ఆహారాన్ని ఇంటినుంచే తీసుకెళ్ళటం మంచిది.

kanchi...... swamy , .... pets ..may 7th 166.jpg




నోరు లేని జీవి కి ఎదురయ్యే సమస్యల్ని ముందుగానే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్తకుండా చెప్పినట్తు వింటూ మీతో పాటు ఇంటిల్లిపాదినీ ఆటల్తో ,అల్లరితో, గారాబాలతో అలరిస్తాయి మీ లవ్లీ పెట్స్.

7 మే, 2009

ఓ నవ్వు చాలు.....

నవ్వమని మరీ అంత బతిమాలించుకోకండి...

ఓ నవ్వుతో మిమ్మల్ని మీరు బ్రతికించుకోండి.

ఉద్యోగాలు, బాధ్యతలు , కష్టాలు , నష్టాలు మీకు మాత్రమే అనుకోకండి.

నవ్వటానికి ఇబ్బంది పడే వాళ్ళు ప్రతీ క్షణం చస్తూ బతికే వాళ్ళ జాబితాలోకెళ్ళిపోతారన్న సంగతి గుర్తించండి.

ఒక్క నవ్వుతో మీ మనసు వేల టన్నుల శక్తివంతమవుతుంది.

ఇది నిజం ప్లీజ్ ... నమ్మండి. కావాలంటే.. ఒక రోజంతా మీరు నవ్వుతూ గడపండి .

ఇంటా బయటా..ఆఫీస్లోనూ.. నవ్వుతూ ... కూల్ గా పనిచెయ్యండి.

తప్పనిసరైతే తప్ప ఎదుటివారి మీద విజృంభించకండి..

ఎలాంటి మూర్ఖులైనా సరే ... మీ చిరునవ్వుకి సలాం కొట్టకపోతే... అప్పుడు ... మీ ఇష్టం... ఇక పొరపాట్నకూడా నవ్వకండి.

ఇప్పుడు మాత్రం కింది లైన్స్ ఒక్కసారి చదవండి నవ్వగల శక్తి వస్తే నవ్వండి. లేకపోతే మౌనంగా వెళ్ళీపోండి.

----------------------------------------------------

న్యాయమూర్తి: సరిగ్గా రేపు ఉదయం 6 గంటలకు నిన్ను ఉరితీస్తాం .

సర్దార్జీ: హాహాహ్హహ్హా హ్హహ్హ....

న్యాయమూర్తి: ఎందుకలా నవ్వుతున్నారు? రేపే మీ ఉరి అన్నాకూడా మీకు ఏడుపురాదా?

సర్ధార్జీ: అయ్యయ్యో! జడ్జి గారూ ! ఇటు సూర్యుడు అటుపొడిచినా 8 అవ్వందే నేను నిద్రలేవను.

నాకు నేనుగా నిద్ర లేవాల్సిందే తప్ప ఆ దేవుడు కూడా నన్ను నిద్రలేపలేడు..... హ్హహ్హహ్హ్హహ్హ..


Powered by Zoundry

4 మే, 2009

తా చెడ్డ కోతి వన మంతా చెరిచింది..

ఆయ్యయ్యో!

దేవుడా...

చివరికి మాకు ఎలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావురా ?

------------------------------------------------------

'తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందట ' కోతులు ఈ మాట వింటే మనల్ని కరవక మానవు.ఎందుకటా?... మొదలెట్టారా? ... అదే చెప్తున్నా మరి..

ఎందుకంటే.. ఇప్పుడు కోతులకంటే మనుషులకే అవలక్షణాలు , వక్ర భావాలు పెరిగాయి కాబట్టి.

ఆధారం లేకుండా ఒట్టి కబుర్లు చెప్తున్నాననుకునేరు.

ఇవి ఒట్టి మాటలు కానే కావు. గట్టి మాటలే.

పాయింట్ కొస్తే...

భాగ్యనగరం లో కామోసు...

ఆ మగానుభావుడెవుడో కానీ...

గొర్రె కి మనిషికున్న అవలక్షణాలన్నీ నేర్పి తెగ మురిసిపోతున్నాడు.

అలాంటిలాంటి అవలక్షణాలు కాదు.

బుద్దిగా , ఆకులలములు తినే గొర్రె పిల్లకి మాంసం ( చికెన్) , బీరు, సిగరెట్లు, పాన్పరాగ్ , కిళ్ళీ... ఇలాంటి చెత్తాచెదారం అలవాటు చేసి అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు తెగ మురిసిపోవటం కూడాను.

మళ్ళీ చేసిన మహత్కార్యానికి చానెళ్ళ వెంటపడి పబ్లిసిటీ కూడా...

ముందు ఇలాంటి వాళ్ళకి అన్నం మానిపించి గడ్ది పెట్టటం అలవాటు చేస్తే సరి......

ఆ గడ్ది తిన్నాకైనా బుద్ధి వస్తుందేమో....

ఓరి దేవుడా!... తా చెడ్డ మనిషి ఊరంతా చెరుస్తుంటే.. చూస్తూ ఊరుకుంటున్నావేమిటయ్యా?/////////////



Powered by Zoundry

1 మే, 2009

వేసవి వినోదం

వేసవి వచ్చింది వినోదాలకు ఆహ్వానం పలుకుతోంది . అదే ఇల్లు, అదే వాకిలి, అదే సందు, అదే ఊరు అదే వాతావరణం … చూసి చూసీ .. విసుగెత్తి ఏదో కొత్త దనం కావాలంటూ.. ఎప్పుడెప్పుడు రెక్కలు గట్తుకుని ఎగురుదామా అని ఎదురుచూస్తూంటారు చిన్నా పెద్దా అంతా.

సంవత్సరానికి సరిపడా ఆనందాన్ని , అనుభూతులని పోగేసుకోవాలంటె దానికి తగ్గట్తుగా సరైన సమయంలో సరైన ప్రణాళీకల ద్వారా చాలా కసరత్తు చెయ్యాల్సిందే. గడప దాటిన దగ్గరనుంచీ మళ్ళీ ఇంటికి చేరే దాకా మనం చేసే ప్రతి పనీ మన ప్రయాణం లో ఎన్నెన్నో కొత్త పాఠాలు నేర్పుతుంది. టూర్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చిన ఇబ్బందులను తలచుకుని బాధ పదేకంటె ముందే తగిన విధంగా జాగ్రత్తపడటం మంచిది.

ఎలా ప్రణాళిక చెయ్యాలి?

బడ్జెట్

మన బడ్జెట్ ని బట్తి మనం వెళ్ళాలను కునే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎంత ఖర్చు పెట్టగలమో ముందుగా ఆలోచిందుకొని వివరంగా ఖర్చుల ను ఊహించి చిట్టా తయారు చేసుకోవాలి.

ప్రయాణపు టిక్కేట్లు , ఇతర సరుకులు, షాపింగ్, పిల్లల చిరుతిళ్ళు, బంధువులకోసం కొనుక్కొని రావాల్సిన వస్తువులు, ఎంతమందికి ఏమేమి వస్తువులు కొని తేవాలి ముందుగానే రాసిపెట్తుకోవాలి.

అదనంగా ఊహించని ఖర్చులకోసం కొంత అదనపు మొత్తాన్ని కేటాయించుకోవాల్సిఉంటుంది.

ప్రతిసంవత్సరం ఇంటిల్లపాదీ ప్రశాంతంగా రోజు వారీ ఒత్తిడులక్ఉ దూరంగా చేసే సమ్మర్ ట్రిప్ కోసం ముందునుంచే ప్రతి నెలా కొంత మొత్తాన్ని దాచుకోవటం అనేది తెలివైన పద్ధతి.

స్పాట్:

వేసవి విహారం దాచుకున్న ప్రతి పైసాకీ అర్థాన్నిచ్చేదిగా ఉండాలి. మన ట్రిప్లో ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ఉపయుక్తం కావాలి. అందుకోసం మనం ఎంచుకునే ప్రాంతం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలి. కేవలం వినోదం కోసమే కాకుండా వేసవి విహారాలు విఙ్ఞానాన్ని పెంచేవిగా , మన సంస్కృతి , చారిత్రక విశేషాలపై అవగాహన కల్పించేవిగా ఉంటే బాగుంటుంది.ఎప్పుడూ యాంత్రిక జీవనంలో ఇరుక్కుని పరుగులు తీస్తూనే ఉంటాం కాబట్టి వీలైనంతవరకు ఏడాదికొక్కసారైనా ప్రకృతికి సమీపంలో ఉండేవిధంగా ప్లాన్ చేసుకోవటం మంచిది.


టిక్క్టెట్ రిజర్వేషన్:

అనుకున్న ప్రాంతానికి కనీసం పది పదిహేను రోజుల ముందైనా టిక్కెట్ల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.అప్పటికప్పుడు చూసుకుందాం లె అని నిర్లక్ష్యం చేస్తే మొదలుకే మోసం వచ్చి మొత్తానికి ట్రిప్ కేన్సిలవ్వటం ఉత్సాహం నీరుగారిపోవటం ఖాయం.టిక్కేట్ల విషయంలో సంబంధిత ఏజెంట్లు , టూరిశ్ట్ సర్వీసులను ఒక నెల ముందు నుంచే సంప్రదిస్తే బాగుంటుంది. ఆన్లైన్ లో టిక్కెట బుకింగ్ ద్వారా ఎంతో సమయం ఆదా అవుతూంది. రాను పోనుట్ిక్కెటల రిజర్వేషన్ చెయ్యించుకుంటె తిరుగు ప్రయాణపు టెన్షన్ ఉండదు.


సరంజామా:

లెస్ లగేజ్ మోర్ కఫర్ట్ అయినప్పటికీ… ప్రయాణంలో అవసరమైన వస్తువలను ముందు జాగ్రత్తతో సిద్ధం చేసుకోవాలి. వేసవి కాబట్తి కొత్త వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో స్నేహితులను విచారించి తెలుసుకోవాలి.ముఖ్యంగా పిల్లకైనా పెద్దలకైనా కాటన్ వస్త్రాలు, సౌకర్యవంతంగా ఉండెవి ఎంచుకోవాలి. చిన్నపిల్లలు గల వాళ్ళు జ్వరం, జలుబు, విరేచనాలు, వాంతులు, అజీర్తి, లాంటి అస్వస్థతలకువాడావలసిన మందుల జాబితా ను ముందే డాక్టరు వద్ద తీసుకుని సిద్ధం చేసుకోవాలి. గ్లూకోజ్, మంచినీళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.

స్వీట్ మెమరీస్

అందమైన సన్నివేశాలు, దృశ్యాలు తియ్యని అనుభవాలుగా మిగలాలంటె మీ ప్రయాణంలో నచ్చిన ప్రతి అంశాన్ని పదిలపర్చుకోవాల్సిందే.అందుకోసం ప్రత్యేకించి ఒక కిట్ ను సిద్ధం చేసుకోవాలి. మామూలు కెమేరా అయితే మూడు నాలుగు బ్యాటరీ సెట్లు, కొత్త రీళ్ళు, పెట్తుకోవాలి. డిజిటల్ కెమేరా లయితే రీచార్జ్ కోసం చార్జర్స్, అదనంగా మెమరీ కార్డులు(చిప్స్) సిద్ధం చేసుకోవాలి. పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కో డైరీ కొనిస్తే వాళ్ళ అనుభవాలు ఎప్పటికప్పుడు రాసుకునేలా చెయ్యటం వల్ల వాళ్ళలో రైటింగ్ స్కిల్స్ తో పాటు ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. వీలైతే వెళ్ళే ముందే అక్కడి విశేషాల గురించి తెలుసుకొనివ్ెళితే చాలా సమయం ఆదా అవుతుంది.స్పాట్స్ కి వెళ్ళేటప్పుడు ముందుగా తయారయ్య్యి వెళ్లటం వల్ల నచ్చిన చోట ప్రశాంతంగా ఎక్కువ సమయం గడిపే వీలుంది.


ఆహారం

ప్రయాణంలో సాధ్యమైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పిల్లలు కొత్త రకం వంటకాలకు ఆకర్షింపబడినా వాళ్ళపై కొంతవరకు నియంత్రణ అవసరం. ఇంటిదగ్గర ప్రయాణంలో తినేందుకు కొన్ని పదార్థాలు తీసుకుని వెళ్ళవచ్చు.

పెద్ద వాళ్లతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా పట్తించుకుంటూ వారిపై ప్రత్యేకించి శ్రద్ధ చూపాలి. చిన్న వాళ్లందరూ ముందు పరుగెడుతూ వెళ్ళీపోతే పెద్ద వాళ్ళు వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్తు ఫీలయ్యే ప్రమాదం ఉంది.

మీప్రయాణం సుఖవంతంగా సాగి వేసవి విహారం ఉల్లాసంగా సాగటానికి కుటుంబమంతా ఒకచోట కూర్చుని ఏమేం చెయ్యాలనుకుంటున్నారో చర్చించండి. ఆలోచనలు ఆచరణ సాథ్యమైనవైతే లిస్టౌట్ చేసుకోండి. హ్యావ్ ఎ స్మార్ట్ ట్రిప్......