Pages

29 డిసెం, 2009

. బ్లాగు మితృలారా… నాతో మీగళాన్ని, కలాన్ని కలపండి….

 

 

అసలు ఏమిటీ సినిమాలు? ఏమిటీ పాటలు? ఏమిటీ చిత్రీకరణలు ?

ఎవరికి వారు మనసులో గొణుక్కుంటూ కాలం వెళ్ళబుచ్చటమే కానీ వాళ్లని  నియంత్రించే ప్రయత్నం చేయరా?

మీకు కోపం లేదా? అసలు రాదా? నాకు నచ్చక పోతే   చూడటం  మానేస్తా నని తప్పించుకుంటారా?

సామాజిక బాధ్యత మనకి అవసరం కాదా?

పాశ్చాత్యానుకరణ వెర్రిలో మునుగుతున్న యువతరాన్ని రక్షించుకునే కర్తవ్యం మనది కాదా?

అనగా అనగా కొన్నాళ్ళకి ఏదైనా అలవాటైపోతుంది.ఈ మధ్యలో వచ్చిన ఇంకో పాటలో చెప్పాకు చెప్పాకు అంటూ.., వయసన్న మాట మా వంశంలో లేదు.. మామన్నది తప్ప ఏ వరసా రాదు?  అంటూ మరో సినిమాలో ఎవరీ పాటలు రాసింది? అంటే జనానికి వేశ్యల్ని ఆదర్శంగా చూపిస్తున్నారా? వాళ్ల బతుకులు నరకాల్లా ఉండి ఆ కూపంలోంచి బయటపడలేక చస్తుంటే  వీళ్లకి పరాచకంగా ఉందా?…..

 

కొత్త దనం పేరుతో వెరైటీ ముసుగులో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు, అందులోని చెత్త పాటలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? మనమేమీ చెయ్యలేమా? కనీసం మన అయిష్టతను ప్రదర్శించలేమా?

మీరు చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం అని వాళ్ళు, మీరు తీస్తున్నారు కాబట్టే మీం చూస్తున్నాం అని మనము … చచ్చినట్టు సినిమాలలో దరిద్రాన్ని భరిస్తున్నాం. మిత్రులారా ! ఈ పాటలు , మాటల ప్రభావం తప్పొప్పుల రుచి తెలిసిన మనపై ఉండకపోవచ్చు. కానీ ఇంకా జీవితం విలువ తెలియని పసిమొగ్గలపైన ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రతిరోజు జరిగే సంఘటనల్లో కనిపిస్తూనే ఉంది.

నిజానికి నాది ఆవేశం కాదు. ఆందోళన. నేను మొత్తం నాలుగైదు రంగాల్లో పనిచేస్తూ ( బోధన, జర్నలిజం, రేడియో, బ్లాగింగ్, కవిత్వం…) గమనించిన విపరీతాల దృష్ట్యా  నా భావాలు మీ ముందుంచ దలిచాను. ఇవి పూర్తిగా నా వ్యక్తిగ అభిప్రాయాలైనప్పటికి  వాటికి పునాది మాత్రం సమాజమే అనటంలో ఎటువంటీ సందేహమూ లేదు. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించాలన్నఅవసరం లేదు.

మన చేతకాన్ని తనాన్ని ఆసరాగా తీసుకుని నోటికొచ్చిందల్లా వాళ్ళూ రాస్తుంటే .. వెర్రి తనం వెయ్యితలలు  వేసి అసభ్యమైన చిత్రీకరణలు చేస్తుంటే…. విఙ్ఞులైన  మనం  ఊరుకోవాల్సిందేనా?

నావంతు కర్తవ్యంగా  కనీసం ఈ సంవత్సరాంతంలోనైనా  మన వ్యతిరేకతను , నిరసనను ప్రదర్శించాలని సంకాపించాను.

అయితే ఏం చెయ్యాలి? అని ప్రశిస్తున్నారా?

మీరు చెయ్యవలసిందల్లా.. ఇప్పటివరకు మీకు నచ్చని అతి చెత్త పాటను, ఆ రాత రాసిన మహానుభావుడ్ని, పరమ చెత్తగా చిత్రీకరించిన దర్శకమహాశడ్ని గురించి చెప్పాలి. ఎక్కడైనాసరే..

నా ఆలోచన ప్రకారం ఈ ఏడాది చివరిలో ఒక స్పెషల్ కంటెస్ట్ నిర్వహించాలని, కొత్త సంవత్సరంలో కూడా .. ( డిసెంబర్౩౦ న చెత్త పాట కంటెస్ట్, జనవరి 1 న గొప్పపాట కంటేస్ట్ .. ఈ రెండిటిలో మీ ఎంపికలను వీలైనంత త్వరగా అందించవలసిందిగా కోరుతున్నాను. సంక్రాంతి వరకు ఈ  పోటీఉంటూంది.

సంక్రాంతికి ఉత్తమ సినిమా పాట , పరమ చెత్త పాట అవార్డు ఇద్దాం.

 

రింగ రింగ…. ఏమిటీ పాట?…. ఇది తెలుగు సినిమానా ? లేక పద్ధతీ పాడూ లేని  ఎం(ఇం)గిలీసు సినిమానా?

ఇలాంటివి ఎన్ని పాటలో.. మన దౌర్భాగ్యమో , సినిమావాళ్ళ అదృస్టమో తెలియదుకానీ పరమ చెత్త సాహిత్రానికే అద్భుతమైన మ్యూజిక్.. కంపోజింగ్ సెట్టవుతుంది.

ఓ సారి నేను ట్రెయిన్ ప్రయాణిస్తుంటే ఓ తండ్రి ముద్ద్దులొలిలే బుజ్జిబాబుని ( కనీసంఏడాది వయసుంటుందో లేదొ కానీ ) ఇంకా నిలబడలేక పోతున్నాడు ఆ పిల్లాడ్ని వేళ్ళకు పట్టుకుని ఒళ్ళో నిలబెట్టి నానా డాన్స్ చెయ్యరా .. అంటూ ఓ పాటని హమ్ చేశాడు.. ఆ పాటేమిటో తెలుసా?… టంట టంటా.. టంటం టాంట.. టంట టంటా.. టంటం టాంట.. టాంట టాంటడంట టంటంటం టంటంటా……. ( ఆకలేస్తే అన్నం పెడ్తా… పాట) పిచ్చి పిల్లోడు అయ్య అభిరుచులకి అద్దం పడుతూ ఓ.. పూనకం వచ్చినట్టుగా ఊగిపోతున్నాడు. ఆయనేమో ఇదంతా ఓ పెద్ద గిన్నిస్ బుక్ రికార్డ్ గా ఫీలైపోతూ బోగీలోవారందరికీ ఒకటే బిల్డప్…. నాకతన్ని చూస్తే ఓ పక్క జాలి, మరోపక్క పట్టరాని ఉక్రోషం ముంచుకొచ్చాయి.. మనసు చంపుకోలేక అడిగా ఇంత చిన్న వయసులొ పిల్లలకి నేర్పించడానికి మీకింకేం విషయాలు, పాటలు దొరకలేదా? అని. ఆయాన చెప్పాడు గర్వం గా  మావాడికి ఇంకే పాటా నచ్చదండీ…. ( అవును మరి వాడికి తెలుసు కదా .. ఏ పాట ఏమిటో….. కనీసం స్పష్టంగా నాన్నని పలకలేని పిల్లోడికి ఐటమ్ సాంగ్స్ .. మాత్రమీ నచ్చుతాయట…. ) చూశారా…..  ఇదే కదా నిజమైన కలికాలం ! పోగాలము దాపురించడమంటే ఇదే కదా !

 

మరి ఇంత చదివాక మీ అభిప్రాయం , ఆలోచన  కూడా ఆవిష్కరించనంటె మీ ఇష్టం…

మీరు ఓటుఇక్కడే వెయ్యాలన్న నియమం లెదు. ఈ విషయం పై బ్లాగు మితృలందరూ చిన్నదో పెద్దదో ఒక పోస్టు కేటాయించవలసిందిగా కోరుతున్నాను. అది రేపటి రాత్రి లోపు అయ్య్యిపోవాలి.

డిసెంబర్ 30  న  మీకు నచ్చని ఒక చెత్తపాటపై , జనవరి ఒకటిన మీకు నచ్చిన గొప్పపాట గురించి  పోస్టు చెయ్యటం కాని ఇక్కడ మీ ఓటు చెప్పటం కానీ చెయ్యగలరు.

మీ బ్లాగులో పోస్టు చేసేటట్లయితే ఆ  లింకు ఇక్కడఇ వ్వండి . మేమందరం వచ్చి మీ అబిప్రాయాలు, భావాలు పంచుకుంటాం……

ఈ ఆలోచనను విజయవంతం చేస్తారని ఆశిస్తూ…..

తెలుగుకళ – పద్మకళ.

8 డిసెం, 2009

తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి

కంప్యూటర్లో తెలుగు రాయడం


తెలుగులో టైపింగు
2007 లో నా ప్రశ్నలు…


1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __
3.అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?


ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం:
1. స్టార్ట్ మెనూ లో Settings > Control Panel కి వెళ్ళండి
2. Control Panel లో Regional and Language Options ని ఎంచుకోండి
3. Languages టాబ్ కి వెళ్ళి అక్కడ Install files for complex script and right-to-left languages (including Thai) అనే చెక్ బాక్సుని ఎంచుకోండి.
4. Apply అనే మీట ని నొక్కండి.
5. Do you want to restart your computer now? అన్నప్పుడు Yes అనే మీటని నొక్కండి.మీ కంప్యూటర్ రీబూట్ అయ్యిన తరవాత తెలుగు చక్కగా కనిపిస్తుంది.


http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe  .. ఇక్కడినుండి  ''iComplex_2.0.0.exe'''  ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. అంతే. మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది. కాని Windows 2000 , 98 వాడుతున్నప్పుడు ఇది పని చేయదు. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.


Win98 --http://etelugu.org/node/207
Win2000
--http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210

 


కంప్యూటర్లో తెలుగు రాయడం
లేఖిని  --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్  -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా  -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/
అను ఆపిల్  -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల  -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
అక్షర్  ---http://www.kamban.com.au/
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx


Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.

 


ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
•    ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత  -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
•    పద్మ పొడగింత  -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
•    తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
•    ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx


సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/


ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.


1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).
http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store


వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:
మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm


లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --


http://eemaata.com/font2unicode/index.php5


Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana  లాంటి కొన్నిఅను ఫాంట్ల  సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి  మార్చాలి . ఫాంట్లపై  పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.


అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

 

 


ఇవికూడాచూడండిః
•    ఈటీవీ2లో 20.5.2007న "తెలుగు-వెలుగు " కార్యక్రమం లో నా ఇంటర్ వ్యూ http://telugu.fliggo.com/video/GcLNlAgS
•    తెలుగు భాష - చర్చా వేదిక వ్యాసం “ఇలా చేస్తే బాగుంటుంది “విపుల నవంబర్ 2007 http://eenadu.net/vipnew3/display.asp?url=vip-kathalu13.htm


                                 నూర్ బాషా రహంతుల్లా డిప్యూటీ కలెక్టర్ విజయవాడ .

 

భ్హాష పట్ల మక్కువతో ఎనలేని కృషి సలుపుతున్న శ్రీ నూర్ బాషా రహంతుల్లా గారికి ఇంత విలువైన సమాచారాన్ని నాకు అందించినందుకు హృదయపూర్వక నమస్కారములు.

6 డిసెం, 2009

మితృలారా !… నా రెక్కల ప్రస్థానం నూరు మెట్లకు చేరింది…

బ్లాగు మితృలందరికీ ఒక చిన్న మాట.
నేటితో నా రెక్కలు నూరు పూర్తయ్యాయి.
త్వరలో నూరు రెక్కల సమాహారం గా ఒక పుస్తకాన్ని అందించబోతున్నాను.
ఆన్లైన్ లో ఉచితంగా పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను.
ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ....

తెలుగుకళ లో
రెక్కల కళ

ఔత్సాహికులు ఇప్పుడే చూడాలనుకుంటే నిరభ్యంతరంగా చూడొచ్చు.

just by clicking here:

http://rekkalu.blogspot.com

5 డిసెం, 2009

నా చిట్టి చెల్లి పుట్టిన రోజు… ఈ రోజు…

lavanya 

చారెడేసి కళ్ళు

చక్కని చెక్కిళ్ళు

కంటి రెప్పల చాటున

కోపతాపాలు,అలుకలు

 

ఓసారి హరివిల్లుగా

ముద్దుమోముపై

మురిపాలు చూపిస్తుంది

అరవిచ్చుకున్న తెల్లని సుకుమార

సుమాలు రంగరించి

వెండివెన్నెల నవ్వుల జల్లు కురిపిస్తుంది

ఓ సారి అపర కాళికగా

చండీశ్వరిగా గర్జిస్తుంది

క్షణాల్లో మమ్మల్ని గాభరాపెట్టేస్తుంది

 

మంచి - చెడు, కష్టం- సుఖం

ఓర్పు-ఓదార్పు, నవ్వు-ఏడ్పు

ప్రేమ-ద్వేషం , గెలుపు-ఓటమి

జంటపదాలైనా ఒకదాని వెంట ఒకటి

వెంటవచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా

నువ్వు – నేను ఎప్పటికీ

ఇంతే..

 

నాచిట్టి చెల్లీ – బంగరు తల్లీ

నీ నవ్వు నాకు ప్రాణం

నువ్వు నాకు

దేవుడిచ్చిన వరం

 

సుప్రభాతాలు స్వాగతిస్తుండగా

ఎదలయలు నీ రాకకై ధ్వనిస్తుండగా

మా పాలిట వెలుగువై

మా ముంగిట రంగవల్లివై

పదముగ్గురు అన్నదమ్ముల , ఎనమండుగురు అక్కల

చిట్టి చెల్ల్లి గా పుట్టిన పసిపాపవి !

ఏ నాటికీ నువ్వు మా కనుపాపవి !

 

పుట్టిన రోజు శుభాకాంక్షలతో

బంగరు భవిత నీ వెంట నడిచి రావాలని

కలకాలం సుఖసంతోషాలతో

నిండునూరేళ్ళూ వర్థిల్లాలని

ఆశీర్వదిస్తూ…

లావణ్యం గా లావణ్య నవ్వుల కోసం…ఎదురుచూస్తూ

నీ అక్క