Pages

30 ఆగ, 2009

ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గణపయ్య….!

balganesh 

 

ఓ బుజ్జి గణపయ్య మా అయ్య నీవయ్య

ఆది దంపతులకు నీవు గారాల పట్టివయ్య

వైభవంబుగ నీకు పుట్టినరోజు పండుగే చేయ

చేతులే జోడించి దండాలు పెట్టాము

మా కడకు రమ్మంటు మొక్కులే మొక్కాము

మా పిలుపు విన్నావు వాడ వాడల నువ్వు కొలువు దీరావు

 

ప్రాభవంబుగ నీకు ఉత్సవంబులేచేయ

నింగినే తుంచాము పందిళ్ళు వేశాము

నేలనే అలికాము అరుగుల్లు వేశాము

రంగురంగుల రంగుల రంగవల్ల్లుల తోడ ముంగిళ్ళు తీర్చిదిద్దాము

వెల్లువెత్తిన వానలే మా ఇళ్ళ్లు ముంచంగ

నీళ్ల పాయసాలు నీకు నైవేద్యమెట్టాము

ముక్కిపోయిన అటుకులు పెట్టి నిన్ను మోమాట పెట్టాము

మందుబెల్లం తెచ్చీ నిన్ను నంజుకొమన్నాము

పాల తాలికలకై నీదు తొండమ్ము వెదుకగా

మురిపాల మాటలతోటె సరిపెట్టాము

 

 

బూరెలు ,గారెలు మాయమాయె పులిహోర సల్విడులు శరణ్యమాయె

నీ పందిళ్ళలో మునుపటి సందళ్ళూ కరువాయె

ప్యాకేజీ పత్రిలో ఏ పత్రములున్నవో

ఎరుకలేనీ వారమయ్య మమ్ము మన్నించవయ్య

తొమ్మిది రోజులు నిన్ను భక్తితో పూజించి

ఆపైన నిగ్రహులమై

నీ విగ్రహమ్ముల మురుగు నీటి పాల్జేసినామని

ఆగ్రహించక మమ్ము అనుగ్రహించుమయ్య

ఎన్నెన్నో వంటకమ్ముల కై ఎదురు చూసిన నీకు

చప్పటి కుడుములు పప్పులేని ఉండ్రాళ్ళు గొప్పగా పెట్టాము

ఆరగించీ నువ్వు మా బాధలాలకించగవయ్య

 

బొజ్జనిండుగ మేసీ బ్రేవుమనుచును భారమ్ము మోయలెదనుచు

నీ వాహన రాజమును తోడ్కొన మరచేవు మా కొంప ముంచేవు

గడ్డు కాలమని గమనించి ఓ అయ్య

మమ్ము కరుణించి దీవించి  దయసేయవయ్య

గుంజీలు తీసేము క్షమియించమని నిన్ను వేడుకున్నాము

మాదు విద్యలు, వ్యాపారమ్ములు అవిఘ్నముగ

వర్థిల్లమని దయతో దీవించుమయ్య

2 ఆగ, 2009

అపురూపమీ స్నేహ బంధం

FriendshipDay9

ప్రాణం తో సమంగా తూగే ఒకే ఒక్క బంధం స్నేహ బంధం. లోకంలో ఎన్ని బంధాలున్నా స్నేహ బంధాన్ని మించిన బంధం లేదు.ప్రాణ స్నేహితుడు అన్న పదమే ఇందుకు నిదర్శనం. ప్రాణ అనే  పదం ఇంక ఏ  బంధానికి ఉపయోగించరు. ఎక్కడో పుట్తి ఎక్కడో పెరిగి అనుహ్యంగా కలిసినా ఎప్పటికీ తోడు ఉండే బంధం స్నేహ బందం.

రక్త సంబంధాన్ని కూడా మన్నించకుండా ఆస్థులకోసం స్వార్థం తో తెగనరుక్కుంటున్న ఈ రోజుల్లో కూడా స్నేహం కోసం  ప్రాణాలివ్వడానికి సిద్ధపడేవారికీ  ఎంత మాత్రమూ కొదువలేదు.

నిర్వచనాలకు అందని అపురూపమిన భావం స్నేహం. 

అత్యుత్తమమైన స్నేహం:

కళ్ళు _చేతులు 

చేతికి ఏమాత్రం నొప్పి తగిలినా కళ్ళు ఏడుస్తాయి. కళ్ళు కన్నీరు కార్చేలోపే చేతులు ఆ కన్నీటిని తుడుస్తాయి.నిజమైన స్నేహానికి కళ్ళు చేతులు చక్కటి ఉదాహరణ.

జీవన యానాన్ని సజావుగా నడిపించే షిప్ ఫ్రెండ్ షిప్

ఓడలు బళ్ళైనా బళ్ళూ ఓడలైనా తరాలు మారినా అంతరంగాలతో పె నవేసుకున్న బంధం ఎన్నడికీ  వీడని స్నేహ బంధం ఈ రోజు పుట్తిన రోజు జరుపుకుంటున్న సందర్భంలో మైత్రీ దినోత్సవ కానుకగా   తెలుగుకళ  మీకోసం సమర్పిస్తున్న  స్నేహ కుసుమం….


తల్లిదండ్రులు, ఆప్తులను కూడా ప్రక్కన బెట్తి స్నేహితులను గౌరవిస్తుంటాం.మనవ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటాం.

స్నేహం  మధ్యాహ్న కాలం తీవ్రం గా మొదలై సాయంత్రానికి తగ్గిపోయేదిగా ఉండకుండా ఉదయ భానుని లాగా క్రమేపీ పెరిగేదిగా ఉండాలి.

పటిష్టమైన ఒక భవంతిని నిర్మించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ అది చిరకాలం నిలిచిపోతుంది. పేక మేడలు క్షణాల్లో కట్టగలం కానీ అది క్షణం లో నేల కూలుతుంది. బలమైన స్నేహానికి నమ్మకమనే పునాది ఉండాలి. స్నేహితులు మనపై ఉంచుకున్న నమ్మకాన్ని జీవితాంతం నిలుపుకోగలవారే నిజమైన స్నేహిత్రులు అనిపించుకుంటారు.

 

 

 


ప్రాణాలిచ్చే స్నెహితుల తో పాటు స్నేహం పేరుతో జనాన్ని మోసపుచ్చే స్వార్థపరులు కూడా సమాజం లో ఉంటారన్న సంగతి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

 


ఎవరితో, ఎటువంటి వారితో  స్నేహం చెయ్యాలి?


మనం ఎంచుకునే స్నేహితులను బట్టి మన స్వభావం , వ్యక్తిత్వం తెలుస్తాయి. "టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ" అన్న ఆంగ్లోక్తి స్నేహాల ప్రభావాన్ని చెప్పకనే చెబుతుంది.
మంచి మార్గంలో  పయనించే వారి తో స్నేహం చేస్తే వారి మంచితనం తో పాటు, సంఘంలో  వారికున్న గౌరవం, మన్నన మనకి  కూడా దక్కుతాయి.గంధపు చెట్టు దగ్గర కాస్సేపు ఉండి వస్తే చాలు ఆ పరిమళం మనకు కూడా అంటుకుంటుంది.


చెడు సావాసాల బారిన పడ్డవారిని ఆ దేవుడి కూడా కాపాడ లేడు.
.

వీళ్ళు మంచివారు వీరు చెడ్డవారు అని తెలుసుకోవటం ఎంతో కష్టం . కాబట్టి  ఎప్పుడైనా పొరపాటున చెడ్డవారితో స్నేహం చెయ్యాల్సి వస్తే మన సాంగత్యంలో వారిని మంచిమాటలతో ప్రభావితం చేసి మంచి మార్గం లో పెట్టాలి. 

మహా వీరుడైన కర్ణుడు కేవలం దుస్సాంగత్యం వల్లనే కదా అంత గొప్ప వీరుడైనా సరే లోకనిందకు గురై ప్రాణాలు కోల్పోయాడు !

దుర్యోధనుడు  చెడ్డవాడని తెలిసినా , అతనిని మంచి మార్గం లో పెట్టకుండా అతను చేసే అన్ని పనుల్లోనూ భాగస్వామియై అతని పాపాల్ని పంచుకోవటం మాత్రమే కాకుండా స్నేహితునితో పాటు పతనమయ్యాడు కర్ణుడు.

స్వచ్చ మైన మనసుతో గుప్పెడు అటుకులతో స్నేహితుడిని ఆశ్రయించి దారిద్య్రం నుండి విముక్తి పొందిన కృష్ణుని బాల్య మిత్రుడు సుధాముడే కుచేలుని గా చరిత్రలో నిలిచిపోయాడు.

మహా వీరుడైన అర్జునుడు కూడా మిత్రుని పూర్తిగా విశ్వసించి అతనపై పూర్తి భారాన్నిమోసి విజేతగా నిలిచాడు.

సాక్షాత్తూ భగవంతుని అవతారమైన శ్రీరాముడు కూడా సుగ్రీవుని తో సావాసం చేసి అతని సాయాన్ని పొందాడు.

విలాసాల బారిన పడిన రాజకుమారులను దారిన పెట్టేందుకు విష్ణుశర్మ పంచతంత్రాన్ని బోధించాడు.అందులోని మిత్ర లాభం , మిత్ర భేదం విభాగాల్లోని కథలు స్నేహితుల వల్ల, స్నేహాల వల్ల కలిగేలాభాలను, స్నేహ్తితులతో వైరం వల్ల కలిగే పర్యవసానాలను చక్కగా వివరించాయి.

ధన గర్వంతో స్నేహితుడైన ద్రోణుని  అవమానించి  తిరస్కరించిన ద్రుపద మహారాజు తదనంతర కాలంలో అర్జునుని ద్వారా ద్రోణుని క్షమాపణ అడిగాడు. అయిన్నప్పటికీ వారి వైరం కురుక్షేత్రంతో గానీ ముగియలేదు.

 

----------------------------------------------------------------------------------------

స్నేహానికి స్వార్థానికి పొంతన కుదరదు. స్నేహమున్న చోట స్వార్థం, స్వార్థ మున్న చోట స్నేహం మనలేవు. రెండూ ఎప్పుడైనా కలిశాయంటే అక్కడనిజమిఅన స్నేహం చచ్చిపోయినట్టే.


కొంతమంది స్వలాభం కోసం కొత్త స్నేహితులను సంపాదించుకుంటూ ఉంటారు. అవి కేవలం పరిచయాలు మాత్రమే.  అన్ని పరిచయాలూ స్నేహాలు కావు. ఫ్రెండ్స్ అనుకున్నంత మాత్రాన సరిపోదు.

ప్రెండ్ షిప్ ను కలకాలం నిలబెట్తుకునే సత్తా ఉండాలి.


కొత్త స్నేహాలు పెంచుకోవటం మంచిదే . కానీ పాత స్నెహాలను మర్చిపోకూడదు.


ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కట్టుకుంటారు?

జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా  నీకు నేను ,నాకు నువ్వు ఎప్పటికీ తోడుగా ఉండి ఒకరినొకరు కాపాడుకుందాం !” అనే ప్రమాణానికి మారుగా ప్రెండ్ షిప్ బాండ్ కట్టుకుంటారు. ఎంత ఖరీదైన బాండ్ కట్టాం అనే దాని కన్నా ఎంత స్వచ్చమైన మనసుతో కట్టాం అనేదే ముఖ్యం.

 


ఎటువంటి వారు కట్తించుకోవాలి?

స్నేహితుల మనసును ప్రతిబింబించే బందాని గుర్తుగ కట్టె ప్రెండ్ షిప్ బాండ్ పై గౌరవం ఉన్న వారే దాన్నికట్తించుకోవాలి.

స్నేహానికి స్వార్థానికి పొంతన కుదరదు. స్నేహమున్న చోట స్వార్థం, స్వార్థ మున్న చోట స్నేహం మనలేవు. రెండూ ఎప్పుడైనా కలిశాయంటే అక్కడనిజమిఅన స్నేహం చచ్చిపోయినట్టే.
కొంతమంది స్వలాభం కోసం కొత్త స్నేహితులను సంపాదించుకుంటూ ఉంటారు. అవి కేవలం పరిచయాలు మాత్రమే.  అన్ని పరిచయాలూ స్నేహాలు కావు. ఫ్రెండ్స్ అనుకున్నంత మాత్రాన సరిపోదు.
కొత్త స్నేహాలు పెంచుకోవటం మంచిదే . కానీ పాత స్నెహాలను మర్చిపోకూడదు.

friendship_myspace_comments_04