Pages

21 ఫిబ్ర, 2010

మనుగడ తో పోరాటం

Caesalpinia_pulcherrima_flowerCU

 

నిజానికి – అబధ్ధానికి మధ్య

జీవితం దుర్భరం

బాధ్యతకీ – నిర్లక్ష్యానికి మధ్య

క్షణక్షణం రణరంగం

మంచికి – చెడుకి మధ్య

అంతా అయోమయం

నేడు - రేపుల మధ్య

అంతర్మథనం

జయాప జయాల మధ్య

సంధికాలం సందిగ్ధం

పురస్కారాలు – తిరస్కారాల మధ్య

నైరాశ్యం

అభిమానాలు – అనుమానాల మధ్య

గందరగోళం

సుఖ - దుఃఖాల మధ్య

అనుదిన సమరం

స్నేహం – శతృత్వాల మధ్య

అంతులేని కలవరం

 

 

మనుగడకై పోరాటం

మన జీవన పయనం

 

నా బాట మాటెలాగున్నా

సర్వదా శుభాలు చేకూరాలని

మీకై ప్రార్థిస్తున్నా……

కొమ్ముచిక్కాల బాబా దివ్య దర్శనము పొందగరారండి……

 

chikkala (84) 

ఈ అయ్య !  మా అయ్య !

కొమ్ముచిక్కాల పురమున

కొలువు దీరిన బాబయ్య ! 

 

కొండంత రూపు

గుండె నిండు చూపు

కరుణాల వాలయై

కమనీయ రూపమై

 

కాషాయ కఫనీ

ధవళ వస్త్రముల ధవళ కాంతుల

పసిడి శోభల కనరారు

పూల మాలల అలరారు

మా తండ్రి రూపమే

అద్వితీయ తేజమే

chikkala (90)

 

 రాజఠీవి ని చూపు  రాజాధి రాజు

యోగ విద్యని ఒసగు   యోగి రాజు

తృతీయ వార్షికోత్సవ శుభదర్శన మీయ

వెన్నెల కురిపించు చిరు మందహాసముల

ముదమార  తలచె,  మనసార పిలిచె

 

కన్నులారగ చూడ తరలిరారండి !

అమృతమూర్తి అమృత హస్తముల

దీవెనలు గైకొనంగ శుభ తరుణమ్మిదే బయలుదేరండి !

 chikkala (91)

బాబా ఆలయ ముఖ ద్వారం- ( ఈ గేటు కి అటూ ఇటూ ఉన్న గచ్చు దాటి నాలుగైదు అడుగులేస్తే

గేటు క్రిందినుంచి ప్రవహించే నీటి బోదె , గేటు దాటగానే రోడ్దు భలే ఉంటాయి,)

 

గ్రామం: కొమ్ముచిక్కాల

మండలం : పోడూరు

జిల్లా : పశ్చిమ గోదావరి

 

శ్రీ సాయిబాబా వారి ఈ దివ్య మంగళ మూర్తి కొమ్ముచిక్కాల ( నేను పుట్టిపెరిగిన బృందావనం)

గ్రామములోనిది. బాబా వారి ఆలయం అత్యంత ఆకర్షణీయముగా, ప్రశాంతతకు నెలవుగా అలరారుతున్నది.అపురూపమైన శిల్ప సౌందర్యంతో , నిత్య పూజాదికములతో , అన్న సమారాధనలతో ఈ ఆలయం గ్రామానికి మొదట రూపొందించబడి సాదరంగా ఆహ్వానిస్తుంది.

గ్రామస్ఠులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు, దూర ప్రాంతాల నివసించునప్పటికీ జన్మభూమిపై అమితమైన  ప్రేమ కల వారు  ఎందరో  భక్త మహాశయులు ఈ ఆలయముని ఎంతో రమణీయముగా రూపొందించినారు.

 

chikkala (85) chikkala (86)

ఈ నిర్మాణం బాబా వారి పక్కన ఉంది.             ఇది బాబా ఆలయానికి ఉత్తరభాగం.

 

 

 

chikkala (89)

 

ఇదుగో ఆ స్వామి షిరిడీ నుండి మా ఊరికి వచ్చి , దూరాభారాలకి వెరసిన పేద పల్లె ప్రజలను దయతో దీవించ వచ్చిన ఆలయ అంతర్భాగం.

 

 

 chikkala (88) 

అంతరాలయంలో నామాల గట్టుపై , తరింపజేయవచ్చిన బంగరు బాబా !

రేపటికి ఈ బుజ్జిబాబు 3 ఏళ్ళ వయసు నింపుకుని నాలుగో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఎందరో అమ్మనాన్నలు తమ బిడ్డకి పుట్టిన రోజు పండుగను అంగరంగ వైభవంగా  చేయాలని ఆరాటపడుతున్నారు.

వారందరి తరపున మీకిదే ఆహ్వానం…………………

 

 

 

సుస్వాగతం

13 ఫిబ్ర, 2010

శంభో మఃహదేవ …. !

chikkala (162)  chikkala (166)

  మా ఊరి శివయ్య, గౌరమ్మ !

 

 

saakshi1 133 saakshi1 135

 

 

 

దశాపరాధంతు తోయేన                                  

క్షీరేన శతనాశనం , మహదైశ్వర్యం

సహస్రం దధ్నా ప్రోక్తం

మధునాత్ ఐతం తథా

ఘృత శత సహస్రంతు

ఇక్షుసారం ద్విలక్షకం
నారికేళోదకం కోటి

గంధతోయ మనంతకం

అభిషేక ప్రియో శివః

 

------------------- ఆగమశాస్త్రం ప్రకారం శివుడు పరమ దయాళువు.

 

మనం చేసే పది రకాల దోషాలు మహా దేవునికి చేసే నీటి అభిషేకం తో తొలగిపోతాయి.

పాలా భిషేకంతో వంద,

పెరుగు అభిషేకంతో వెయ్యి,

తేనె అభిషేకంతో 50,000 ,

నెయ్యి తో లక్ష దోషాలు,

చెరుకు రసం తో రెండు లక్షలు,

కొబ్బరి నీటిత్ కోటి,

సుగంధపు నీటితో అభిషేకం చేయడం ద్వారా  అనంతమైన దోషాలని హరిస్తాడట.

 

అటువంటి పంచామృతాలతో కలిపిన ద్రవాలతో ఆ దేవదేవునికి అభిషేకం   సకలపాప హరణం..