31 జన, 2009

మనసులు దోచుకున్న గజల్ గంధర్వుడు ..... గజల్ శ్రీనివాస్

గజల్ శ్రీనివాస్ గారి గానం , ఆయన గానానికి అనుగుణం గా కంజీరా పై నాట్యమాడే ఆయన చేయి పలికించే సవ్వడులు, గజల్ కి మధ్య లో చెప్పే పిట్ట కథలు, చిలిపి కబుర్లు, జీవన సత్యాలు, మానవ సంబంధాలు, ప్రకృతి సోయగాలు................................... ఇవన్నీ ఎన్ని సార్లు చూసినా, విన్నా మళ్ళీ మళ్ళీ చూడాలని, వినాలనీ అనుకోని వారుండరేమో ! కార్యక్రమం జరుగుతున్నంత సేపు సహజత్వానికి చేరువగా.... హాయిగా ప్రశాంతంగా .....ఉంటుంది.

ఓ రోజు కార్యక్రమంలో నే పొందిన అనుభూతి కి దృశ్య రూపమే క్రింది కవిత.

యాంత్రిక జీవనంలో

బ్రతికే ఉన్నామన్న

సంగతి మరచిన

నిర్జీవజీవాల ని

ప్రకృతి కౌగిలికిచేర్చి

అమ్మ ఒడిని గుర్తుకుతెచ్చి

బాల్యపు ఊయలలూ పి

నిద్రిస్తున్నమనసుని తట్టి మాధుర్యాన్నిరుచిచూపించే

గాంధీ తత్వం

గజల్ శ్రీనివాసుని గానం

మానవత్వానికి రాచబాటగా

ప్రేమతత్వానికి పూలబాటగా

స్నేహసౌథానికి పూదోటగా

సహృదయ హృదయాలను

మైమరపించే

గళం కాదది గాంధర్వం

పదం కాదది ప్రణవనాదం

ఆద్యంతం అమృతవర్షం !

30 జన, 2009

హాకింగ్ వ్యవహారం

మనిషి మేథస్సు నుండి పుట్టిన అద్వితీయమైన ఆవిష్కరణలు కంప్యూటర్లయితే కంప్యూటర్ల ద్వారా ఇతరుల రహస్యాలను చేదిస్తారు హ్యాకర్లు. వినడాని కి ఈ మాట కొత్తగా ఉన్నా హ్యాకర్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయి.ఈ తరుణంలో హ్యాకింగ్ పట్ల ప్రాథమిక ఙ్ఞానం ప్రతిఒక్కరూ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

హ్యాకింగ్ అంటే ఏమిటి?

ఏదైనా ఒక కంప్యూటర్ నకు గానీ వెబ్ సైటు కి గానీ అనధికారికంగా చొరబడటాన్నే హ్యాకింగ్ అంటారు.

మనం రూపొందించుకునే మెయిళ్ళు, వెబ్ సైట్ల భద్రత కోసం

పాస్వర్డ్ను ఎంతో రహస్యంగా ఇచ్చుకుంటాం. హ్యాకర్లు ఆ పాస్వర్డ్ లను కనిపెట్టి అక్రమంగా చొరబడి విలువైన సమాచారాన్ని, రహస్యాలను తెలుసుకునే ప్రమాదం ఉంది.

పాస్వర్డ్ ఇచ్చేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:

పాస్ వర్డ్ అన్నది సింపుల్ గా ఉండకూడదు.

(చాలా మంది పాస్ వర్డ్ గా వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు పెట్తుకుంటారు.) తెలిసిన వారి ఊహ కందే విధంగా పాస్వర్డ్ ఉండకూడదు.

కనీసం 13 నుండి 14 క్యారెక్టర్లు ఉండాలి.

పాస్వర్డ్ లో ఒక అంకె , ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యాపిటల్ లెటర్, , ఒక స్మాల్ లెటర్ ఉండాలి.

పాస్వర్డ్ ఎంటర్ చేసే చోట కీ లాగర్స్ ఉన్నయేమో చూసుకోవాలి.

ఒక వేళ ఉన్నట్లయితే అవి మీ పాస్వర్డ్ ను పట్టేస్తాయి.

అవి ఉన్నచోట పాస్వర్డ్ ను ఎంటర్ చేయకూడదు.

బయటి ప్రాంతాల్లో ( ఇంటర్నెట్ లలో ఈ విషయం గుర్తుంచుకోక తప్పదు.)

మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే వెబ్సైటు నిజమైనదా లేక నకిలీదా అన్న సంగతి కూడా పరిశీలించుకోవాలి.

మీరు పాస్వర్డు ఎంటర్ చేసే ముందు ఎస్ .ఎస్. ఎల్. సర్టిఫికేట్

(లాగ్ సింబల్ లో ) ఉందో లేదో సరి చూసుకోవాలి.

అది హెచ్.టి. టి.పి.ఎస్. కనెక్షన్ అయితే మంచిది.

దాదాపు అన్ని మెయిల్ సర్వీసులు (జిమెయిల్, యాహూ,హాట్మెయిల్ మున్నగునవి) హెచ్.టి.పి.ఎస్. నే వాడుతున్నాయి.

అన్నిటికన్నా ముఖ్యంగా యూ.ఆర్.ఎల్. సరైనదీ కానిదీ చూసుకోవాలి.

పాస్వర్డ్ ప్రతిసారీ టైప్ చెయ్యటమెందుకులే అని కొందరు బద్ధకించి కంప్యూటర్ కి పాస్వర్డ్ గుర్తుంచుకోమన్న ఆదేశాన్ని ఇస్తారు.

పర్సనల్ కంప్యూటర్ల కి మినహా ఇది ఇంకెక్కడా అంత శ్రేయస్కరం కాదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి, ఆరు అక్షరాలు ఉన్న ఎలాంటి పాస్ వర్డ్ నైనా 8 గంటలలో ఛేదించవచ్చు ..

అదే ఏడు అక్షరాలున్న పాస్‍వర్డ్ ని ఛేదించడానికి రెండు రోజులు పదుతుంది.

కానీ ఎనిమిది అక్షరాలు ఉన్న పాస్‍వర్డ్ ని ఛేదించడానికి అచ్చంగా మూడు సంవత్సరాల కాలం కావాలి

పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే చాలా వరకు మీ మెయిళ్లకి భద్రత లభించినట్లే.

హ్యాకింగ్ రకాలు:

హ్యాకింగ్ చేసే వారిని బట్టి, చేసే విధానాన్ని బట్తి అది రెండు రకాలు.

వైట్ హాట్ హ్యాకర్స్ :

హ్యాకింగ్ పద్ధతులపై ఆసక్తితో , అధునాతన శాస్త్రీయ విఙ్ఞానాన్ని అందించే కంప్యూటర్ అదనపు ఆవిష్కరణలపై ఆసక్తితో కంప్యూటర్ పరిఙ్ఞానాన్ని పెంపొందించుకోవటం కోసం హ్యాకింగ్ చేసే వాళ్ళని ’ వైట్ హాట్ హ్యాకర్స్ ’ అంటారు.ఇతరుల కంప్యూటర్లలోని సమాచారాన్ని , సాఫ్ట్ వేర్లని పాడుచేయకుండా కేవలం వ్యక్తిగత ఙ్ఞానాన్నిపెంచుకోవడానికి హ్యాకింగ్ చేస్తారు.వీరివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

బ్లాక్ హ్యాకర్స్:

స్వీయ అవసరాలకోసం , స్వంత లాభాలకోసం ఇతరుల సమాచారాన్ని, రహస్యాలను దొంగిలించటానికి ఇతర కంప్యూటర్ల పనితీరును పాడు చేయటానికి హ్యాకింగ్ ను మార్గంగా ఎంచుకునే వారిని బ్లాక్ హాట్ హ్యాకర్స్ అంటారు.వీరివల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అందువల్ల సంస్థలు వీరి బారిని పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి.

హ్యాకింగ్ ప్రయోజనం:

సైబర్ వార్ జరుగుతున్న ప్రస్తుత కాలంలో హ్యాకింగ్ పద్ధతి శతృవులకి బుద్ది చెప్పే ఒక ప్రభావవంతమైన సాధనంగా కూడా ఉపయోగపడటం విశేషం.

వివిధ దేశాలు తమ శతృ దేశాల ప్రసిద్ధ మైన వెబ్సైట్ల ని హ్యాక్ చేయటాన్ని ప్రతిష్టాత్మకంగా భావించటాన్ని బట్తి హ్యాకింగ్ జోరు ఎంత విస్తృతంగా ఉందో తెలుస్తోంది.

హ్యాకింగ్ పరిణామాలు ,దేశభవిష్యత్తు లను దృష్టిలో పెట్టుకుని

హ్యాకర్లు నైతికతా నిరూపించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ముగ్గుల పోటీ - కళ్ళు చెదిరే ముగ్గులు.....

muggu 7

1. డూడూ బసవన్న

5muggu 

2.వేణుగోపాల

 

4 muggu

3.వెన్నదొంగ

 

muggu 2

 

4.సంక్రాంతి సమ్మేళనం

 

muggu 1.

 

5. ఓంకారం

 

muggu 6

 

6.పూల పూజ

 

3 muggu

 

7.సంక్రాంతి సిరి

 

muggu 8

 

8.మాలక్ష్మి

 

muggu 9 

 

9.భారతీయం

 

-paddu muggulu 035

 

10.రంగుల కల

muggu 10

 

11.సమైక్య భారతి

-paddu muggulu 048

 

12.సంక్రాంతి కొలువు

 

-paddu muggulu 064

 

 

13.బుజ్జి గణపతి

 

 

నచ్చిన ముగ్గుకి మీ ఓటెయ్యండి.(వ్యాఖ్యద్వారా)

23 జన, 2009

బ్లాగ్ ముగ్గుల పోటీ......

బ్లాగ్ ముగ్గుల పోటీకి సుస్వాగతం !

Picture 051

1.వెన్నెల

---------------------------------------

Picture 053

2.గొబ్బెమ్మ

---------------------------------------

 muggu 3 TV

౩. అరచేతిలో దీపం

----------------------------------------

ముగ్గులు (4)

4.సుదర్శనం

---------------------------------------

ముగ్గులు

5.పద్మం

----------------------------------------

ఇప్పటి వరకు వచ్చిన ఎంట్రీలు ఇవే.

అతిథులు ఇక  ఓటెయ్యటం మొదలు పెట్టొచ్చు.

మీకు నచ్చిన ముగ్గు పేరు , ఎందుకు నచ్చిందో రాయండి

మీ వ్యాఖ్యే ఈ పోటీలో న్యాయ నిర్ణయానికి ఆధారం.

పోటీ సరదాగ పెడుతున్నాం కాబట్టి ఎవ్వరూ ఏమీ అనుకోరు.

నిర్మొహమాటంగా చెప్పండి. వేసిన వారి పేర్లు బయట పెట్టకూడదన్నది నియమం.

ఇక్కడ ముగ్గు పంపిన వాళ్ళూ కూడా ఓటు వెయ్యొచ్చు. ఒకరు ఒకటి, రెండు స్థానాల ముగ్గులకే ఓటు వెయ్యాలి

ఇప్పటి దాకా పంపని వాళ్ళు పంపటానికి ప్రయత్నించండి.

21 జన, 2009

బ్లాగ్లోకంలో ముగ్గులపోటీ.... ఆత్మీయులందరికీ ఆహ్వానం !

’అయ్యయ్యో ! ఇదెక్కడి చోద్యమమ్మా !’అంటూ ముక్కున వేలేసుకోకండి. మీరు విన్నది అక్షరాలా నిజం ! మనసుంటే మార్గం ఉండకపోదు. నాకు తోచిన ఈ సద్సంకల్పానికి మీ చేయూత తోడైతే విజయం తథ్యమని నా విశ్వాసం.

బ్లాగ్బంధువుల్లారా !

          సంక్రాంతి సంబరాలు  ఐపోయాయి కదా అని నిట్టూర్చకుండా మీ వంతు ప్రోత్సాహాన్ని అందించండి.

      ఇందుకోసం మీరు  ఎవరికీ పైసా చెల్లించక్కరలేదు. మీరు ఉన్న చోటునుండి ఎక్కడికీ కదలనక్కరలేదు.

       మీరు చెయ్య వలసిందల్లా ఓ రెండు మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా తెలుగుకళ కు వచ్చి అందులో జరిగే ముగ్గుల పోటీ ముగ్గులను చూసి నిర్మొహమాటంగా మీకు నచ్చిన ముగ్గు ఏదో చెబితే చాలు. (ఓ చిన్ని వ్యాఖ్య చాలు.)

       సాధారణ ముగ్గుల పోటీకీ న్యాయనిర్ణేతలు ఇద్దరో ముగ్గురో మాత్రమే ఉంటారు. కానీ మన బ్లాగ్ముగ్గుల పోటీకి విచ్చేసిన అతిథులందరూ న్యాయనిర్ణేతలే.

  కాకపోతే పోటీలో మీ అభిప్రాయం తెలిపేటపుడు ముఖ్యంగా ముచ్చటగా 3  అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అవి:

  1. క్రింద ఇచ్చిన విభాగాల లో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ముగ్గుని ఎంపిక చేయాలి.
  2. పాల్గొన్న అభ్యర్థులు కూడా తమ ఓటు నిరభ్యంతరంగా వెయ్యొచ్చు. దొంగ  ఓటు వెయ్యడానికి ప్రయత్నిస్తే ఆన్లైన్ వ్యవహారం గాబట్టి దొరికిపోయే ప్రమాదం ఉందన్న సంగతి గమనించాలి.
  3. ఎవరి అభిప్రాయాన్ని కించపరచకూడదు.

మొత్తం 5 కేటగిరీలలో పోటీ ఉంటుంది.

1.చుక్కల ముగ్గు: ఇష్టం వచ్చినన్ని చుక్కలు వాడుకోవచ్చు.

2.సృజనాత్మక ముగ్గు:గీతల (ఫ్రీ స్టయిల్) తో కళాత్మకంగా

3.రంగుల ముగ్గు : రంగులు, పువ్వులు , చమ్కీలు...ఇష్టం వచ్చిన పదార్థాలుపయోగించి రంగవల్లులు తీర్చిదిద్దవచ్చు.

4.సాదా ముగ్గు: కేవలం తెల్లని గీత మాత్రమే కనబడాలి. రంగులు వాడకూడదు.

5.చిత్రాల ముగ్గు: దేవుళ్ళ బొమ్మలు , మిక్కీ మౌసులు,జెండాలు....... మీ ఓపిక.

అభ్యర్థులకి సూచనలు:

మీరు పంపే ముగ్గులు blogmuggulasandadi@gmail.com అన్న మెయిల్ కి (వేగుకి) పంపాలి.

ముగ్గు మీరు ఎప్పుడు ఎక్కడ వేసినదైనా సరే . ఫోటో కావచ్చు, ప్రింట్ కావచ్చు. తెల్ల కాగితంపై గీసి రంగులుదిద్దినా సరే.

కంప్యూటర్ సహాయంతో గీసి పంపినదైనా సరే.

అందమైన ముగ్గు తెరపై కనిపిస్తే చాలు.

ఆడాళ్ళు రాజ్యాలేలుతున్న ఈ కాలంలో ఉత్సాహవంతులైన పుణ్య పురుషులకి కూడా పోటీలకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకేం చూడండి అబ్బాయిలు తలచుకుంటే కానిది లేదంటూ ముగ్గులేస్తున్న ఈ కళాకారుని స్ఫూర్తిగా తీసుకోండి మరి:

saakshi1 164

  మీకు వచ్చినట్టు సరదాగా ముగ్గుగీసో , వేసో పోటీకి పంపండి.

 

చివరిగా :

మీరే మననంటే ఇంత కష్టపడి మీరు గీసి పంపే ముగ్గులకి ప్రతిఫలం వెలకట్టలేని అభినందనల వెల్లువ మాత్రమే నని విన్నవించుకుంటున్నాను.

సరదాగా నేను చేస్తున్న ఈ ప్రయోగానికి అందరి మద్దతూ లభిస్తుందని ఆశిస్తాను.

   బ్లాగ్ముగ్గుల పోటీలో కలుద్దాం........ సెలవు.

ముత్యమంత ముగ్గు .... ముంగిట ముచ్చట గొలుపు

         చూడు ఇల్లాని చూడు’ అని  పెద్దలు ఊరికే అనలేదు. ముంగిట్లో మెరిసే ముగ్గుని బట్టి ముదిత మనసు తెలిసిపోతుంది.

                 ముగ్గు వెయ్యటంలో ఒక్కో అతివది ఒక్కో శైలి.

సరిగ్గా పరిశీలిస్తే ముగ్గు పోతలో , గీతలో మనిషి మనస్తత్వం , పనితీరు, నైజం, ఆసక్తి, అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది.

గీత సన్నగా గీయగల్గటం , చిన్న చిన్న కళా రూపాలు, పువ్వులు, ఆకృతులు స్పష్టంగా గీయగలగటం అనేవి చాలా తక్కువ మందికి మాత్రమే చేతనైన నైపుణ్యాలు.

ముగ్గు కి సమతూకం చాలా ముఖ్యమైన అంశం.ఎటు నుంచి ఎటు చూసినా ముగ్గు ఒకేలా కనపడాలి. ఒక ప్రక్క పెద్దగా మరోప్రక్క కుంచిం చుకు పోయినట్లుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

’ఇంటిని

చుక్కల ముగ్గులు పెట్టటం ఒక కళ. చుక్కల ముగ్గులు ఎలా పుట్టయో మీకు తెలుసా ?

ఏ ఆధారం లేకుండా ముగ్గుపెడితే ముగ్గుకి ఒక రూపు రేఖ రాదని,ఈ ఆడాళ్ళు ముగ్గులు పెడుతూ పెడుతూ ఇల్లు , వళ్ళు మరచి  ఆంధ్రా నుంచి ఆగ్రా దాకా..... అలా పోతూనే ఉంటారని ముందుచూపుతో చుక్కలనే పరిధులని పెట్టారన్న మాట. పాపం ఆ పరిధుల్లో నే పడి ఇన్నాళ్ళు మన అమ్మమ్మలు,  అమ్మలు చుక్కల ముగ్గులతో సరిపెట్టుకున్నారు. కానీ మనం కాస్త ఎక్కువ తిన్న బాపతు కదా. అందుకే ఈతరం అమ్మాయిలు ఎక్కువగా చుక్కల ముగ్గుల కంటే కళాకృతుల కే (డిజైన్స్) ఎక్కువ మొగ్గు చూపుత్తున్నారు. ఆ మాటకొస్తే చుక్కల ముగ్గు ఎవరైనా ఇట్టే  పెటేస్తారు. కానీ చుక్కలు లేకుండా ముగ్గు వెయ్యటం లోనే అసలు పనితనం ఉంది . అందుకోసం ఎంతో సృజనాత్మకత ఉండి తీరాలి.  

అల్లిబిల్లి లతలు అల్లటం అతి కొద్ది మందికే  చేతనైన ఒక అద్భుతమైన  కళ. అందమైన పువ్వులు , లతలు, ఆకులు, రకరకాల రూపాలతో కళాకృతులు రూపొందించగలగటం

అసలైన ప్రతిభకు నిదర్శనం.

ముగ్గుల గురించి నన్ను మాట్లాడమంటే మీ చెవులు చిల్లు పడొచ్చు, ( ప్రస్తుతానికి చదువుతున్నారు కాబట్టి మీ కళ్ళు బైర్లు కమ్మచ్చు ) మీకు నాపై కడుపుమంట పుట్టొచ్చు.

అదుగో అప్పుడే మొదలైపోయింది మీ మంట. దాన్ని చల్లార్చటానికి మీ విసుగుని , చీకాకుని, కోపాన్ని బుగ్గి పాలు చేయటానికి సరదాగా ఓ ముగ్గుల పోటీ పెట్టనా ?

          ఓయ్ ! ఏందమ్మో! నీ కత అని నిట్టుర్చకండమ్మా !

ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ ముగ్గులు పెట్టి మీ కబుర్ల పెట్టె ( కంప్యూటర్ ఇది  నా భాషేనండోయ్ ! ) పై మీ ప్రతాపం చూపేరు. ( ఒకవేళ చూపినా పర్లేదు. పెయింట్ కెళ్ళో మరెక్కడికైనా వెళ్ళో మీరు మీ ముగ్గు గీసి నాబ్లాగులో పెట్టాలనుకుంటే దానికీ ఓ దారి ఉంది. కానీ ఇక్కడ కాదు. )

( రేపు సాయంత్రం సరిగ్గా  నాలుగు గంటలకు నా బ్లాగులో నిర్వహించబోయే ముగ్గుల పోటీ కి రండి. వివరాలు తర్వాతి పోస్టులో రేపటికల్లా ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం :

మీ పని న్యాయ నిర్ణయం.

నేను ఇప్పుడు పెట్టే ముగ్గులోంచి ఒక చక్కని ముగ్గుని ఎంఫిక చేసి ఓ బుల్లి వ్యాఖ్య ఇస్తే చాలు.

సరే మరి. ఆలస్యం అమృతం విషం......

ముదితల ముగ్గులు ముగ్ధ మనో హరంగా ముస్తాబై మీకోసం ఎదురుచూస్తున్నాయి. ముందుకు పదండి......... ఆ నాకిప్పుడు కొంచెం పనుందని జారుకునేరు.......

   మడిసన్నాక కూస్తింత కళా  పోషనుండాలి మరి..........

 

ముగ్గులు (5)

 

 

paddu10 042

 

paddu10 039

 

 

 saakshi1 162

 

saakshi1 167

 

కన్నుల పండువగా ఉన్నాయికదా!

అందుకే మరి ఇది కొత్త బంగారులోకం !

ఈ లోకం లో వింతలు , విశేషాలతో పాటు కంటికి కనిపించని ఎన్నో సున్నితమైన అంశాలని స్పృశిస్తూ ..... మీ మనసును ఆహ్లాద పరుస్తూ ..... రోజువారీ ఒత్తిడులనుంచి దూరంగా కనీసం కొద్ది నిముషాల పాటైనా మిమ్మల్ని విడిపించి ... మనశ్శాంతిని మీ పెదాలపై ఓ చల్లని చిరునవ్వు పువ్వుని పూయించే చిరు ప్రయత్నమే........... ఈ కొత్త బంగారులోకం ఆశయం........

20 జన, 2009

   ’ఇంటిని చూడు ఇల్లాని చూడు’ అని  పెద్దలు ఊరికే అనలేదు. ముంగిట్లో మెరిసే ముగ్గుని బట్టి ముదిత మనసు తెలిసిపోతుంది.

                 ముగ్గు వెయ్యటంలో ఒక్కో అతివది ఒక్కో శైలి.

సరిగ్గా పరిశీలిస్తే ముగ్గు పోతలో , గీతలో మనిషి మనస్తత్వం , పనితీరు, నైజం, ఆసక్తి, అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది.

గీత సన్నగా గీయగల్గటం , చిన్న చిన్న కళా రూపాలు, పువ్వులు, ఆకృతులు స్పష్టంగా గీయగలగటం అనేవి చాలా తక్కువ మందికి మాత్రమే చేతనైన నైపుణ్యాలు.

ముగ్గు కి సమతూకం చాలా ముఖ్యమైన అంశం.ఎటు నుంచి ఎటు చూసినా ముగ్గు ఒకేలా కనపడాలి. ఒక ప్రక్క పెద్దగా మరోప్రక్క కుంచిం చుకు పోయినట్లుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

 

చుక్కల ముగ్గులు పెట్టటం ఒక కళ. చుక్కల ముగ్గులు ఎలా పుట్టయో మీకు తెలుసా ?

ఏ ఆధారం లేకుండా ముగ్గుపెడితే ముగ్గుకి ఒక రూపు రేఖ రాదని,ఈ ఆడాళ్ళు ముగ్గులు పెడుతూ పెడుతూ ఇల్లు , వళ్ళు మరచి  ఆంధ్రా నుంచి ఆగ్రా దాకా..... అలా పోతూనే ఉంటారని ముందుచూపుతో చుక్కలనే పరిధులని పెట్టారన్న మాట. పాపం ఆ పరిధుల్లో నే పడి ఇన్నాళ్ళు మన అమ్మమ్మలు,  అమ్మలు చుక్కల ముగ్గులతో సరిపెట్టుకున్నారు. కానీ మనం కాస్త ఎక్కువ తిన్న బాపతు కదా. అందుకే ఈతరం అమ్మాయిలు ఎక్కువగా చుక్కల ముగ్గుల కంటే కళాకృతుల కే (డిజైన్స్) ఎక్కువ మొగ్గు చూపుత్తున్నారు. ఆ మాటకొస్తే చుక్కల ముగ్గు ఎవరైనా ఇట్టే  పెటేస్తారు. కానీ చుక్కలు లేకుండా ముగ్గు వెయ్యటం లోనే అసలు పనితనం ఉంది . అందుకోసం ఎంతో సృజనాత్మకత ఉండి తీరాలి.   

 అల్లిబిల్లి లతలు అల్లటం అతి కొద్ది మందికే  చేతనైన ఒక అద్భుతమైన  కళ. అందమైన పువ్వులు , లతలు, ఆకులు, రకరకాల రూపాలతో కళాకృతులు రూపొందించగలగటం

అసలైన ప్రతిభకు నిదర్శనం.

ముగ్గుల గురించి నన్ను మాట్లాడమంటే మీ చెవులు చిల్లు పడొచ్చు, ( ప్రస్తుతానికి చదువుతున్నారు కాబట్టి మీ కళ్ళు బైర్లు కమ్మచ్చు ) మీకు నాపై కడుపుమంట పుట్టొచ్చు.

 అదుగో అప్పుడే మొదలైపోయింది మీ మంట. దాన్ని చల్లార్చటానికి మీ విసుగుని , చీకాకుని, కోపాన్ని బుగ్గి పాలు చేయటానికి సరదాగా ఓ ముగ్గుల పోటీ పెట్టనా ?

          ఓయ్ ! ఏందమ్మో! నీ కత అని నిట్టుర్చకండమ్మా !

ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ ముగ్గులు పెట్టి మీ కబుర్ల పెట్టె ( కంప్యూటర్ ఇది  నా భాషేనండోయ్ ! ) పై మీ ప్రతాపం చూపేరు. ( ఒకవేళ చూపినా పర్లేదు. పెయింట్ కెళ్ళో మరెక్కడికైనా వెళ్ళో మీరు మీ ముగ్గు గీసి నాబ్లాగులో పెట్టాలనుకుంటే దానికీ ఓ దారి ఉంది. కానీ ఇక్కడ కాదు. )

( రేపు సాయంత్రం సరిగ్గా  నాలుగు గంటలకు నా బ్లాగులో నిర్వహించబోయే ముగ్గుల పోటీ కి రండి. వివరాలు తర్వాతి పోస్టులో రేపటికల్లా ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం :

మీ పని న్యాయ నిర్ణయం.

నేను ఇప్పుడు పెట్టే ముగ్గులోంచి ఒక చక్కని ముగ్గుని ఎంఫిక చేసి ఓ బుల్లి వ్యాఖ్య ఇస్తే చాలు.

సరే మరి. ఆలస్యం అమృతం విషం......

ముదితల ముగ్గులు ముగ్ధ మనో హరంగా ముస్తాబై మీకోసం ఎదురుచూస్తున్నాయి. ముందుకు పదండి......... ఆ నాకిప్పుడు కొంచెం పనుందని జారుకునేరు.......

   మడిసన్నాక కూస్తింత కళా  పోషనుండాలి మరి..........

 

ముగ్గులు (5)

 

 

paddu10 042

 

paddu10 039

 

 

 saakshi1 162

 

saakshi1 167

 

కన్నుల పండువగా ఉన్నాయికదా!

అందుకే మరి ఇది కొత్త బంగారులోకం !

ఈ లోకం లో వింతలు , విశేషాలతో పాటు కంటికి కనిపించని ఎన్నో సున్నితమైన అంశాలని స్పృశిస్తూ ..... మీ మనసును ఆహ్లాద పరుస్తూ ..... రోజువారీ ఒత్తిడులనుంచి దూరంగా కనీసం కొద్ది నిముషాల పాటైనా మిమ్మల్ని విడిపించి ... మనశ్శాంతిని మీ పెదాలపై ఓ చల్లని చిరునవ్వు పువ్వుని పూయించే చిరు ప్రయత్నమే........... ఈ కొత్త బంగారులోకం ఆశయం........

19 జన, 2009

మనసులని కలిపే మహా మంత్రం సారీ..........

’సారీ ’ అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో.........

ఆత్మీయతాను రాగాలని అందించగలదు

స్వాభిమానాన్ని పెంచి పోషించగలదు

దురహంకారాన్ని సైతం మటుమాయం చెయ్యగలదు

బద్ధ శత్రువులని కూడా ప్రాణ మిత్రులని చెయ్యగలదు

మానవత్వాన్ని మేల్కొలిపి అందరినీ మన వారిగా మార్చగలదు

మాటల్లో చెప్పలేని భావాల్ని , మనుషుల్లో పూడ్చలేని అగాథాల్ని సున్నితమైన రెండక్షరాల మాట, సుతారంగా గుండెలోతుల్లోంచి పుట్టుకొచ్చే ఓ అందమైన మాట మృదువుగా మనసుపొరల్ని స్పృశించి ఆ వెచ్చదనంతో అంతరంగాలలో గడ్డకట్టిన మూర్ఖత్వాన్ని గూడు కట్టుకున్న దుర్మార్గాన్ని కరిగించి విడదీయలేని బంధాలని వీడిపోలేని అనుభూతులని కానుకలుగా అందించే మహా మంత్రం సారీ !.......

చాలా సందర్భాల్లో నేను చెప్పే సారీ నా మనసుకు ఎంతో హాయినిస్తుంది.

౧ . పూలకోయటానికి ఇష్టపడని నేను రోజూ పూజకై పూలు కోస్తూ పొరపాటున మొగ్గల్ని తుంచినప్పుడు చెట్టుకి :

అమ్మా వికసించని నీ బిడ్డల్ని పొరపాటున త్రుంచిన పాపిని మన్నించమ్మా ! .....అంటూ నేచెప్పే సారీ......

౨.ఆదమరచి హాయిగా నిద్రిస్తున్న మూగజీవి ( ఓ కుక్క పిల్ల అనుకోండి) నా చప్పుడుకి ఉలిక్కి పడి లేచి కంగారుగా అటూ ఇటూ పరికించి చూసి ముడుచుకుని కూర్చుని అమాయకంగా మూతి బిగించిమళ్ళీ నిద్రలోకి జారుకుంటుంటే ....

అపరాధ భావంతో నాకళ్ళు దాని కాళ్ళను వెతుక్కుని , పిచ్చితల్లీ చెట్టంత ఎత్తుకి ఎదిగినా నీ చిన్ని దేహానికి ఇబ్బంది కలగజేశానే ఏం చేస్తే నాకు బుద్ధొస్తుందో ....నన్ను క్షమిస్తావా? అంటూ నే చెప్పే సారీ..........

ప్రతిరోజూ నే వస్తానని ప్రేమతో స్నానం చేయిస్తానని (అభిషేకం) ఎదురుచూసే నా శివయ్య ( మీదృష్టిలో శివలింగం) , గణేష్, బుజ్జమ్మ( ఇది నాపేరే బుజ్జి- అమ్మవారు), బాబా ,కన్నయ్య, అంజి గాడు ( ఆంజనేయుడు) ...ఈ నా పూజ మందిరంలోని ఈ గ్యాంగ్ పనికి మాలిన పనులతో నేను ఒక్కోసారి రెండురోజులైనా వాళ్ళని పట్టించుకోనప్పుడు ఒసేయ్ రాక్షసీ !.....మమ్మల్ని మర్చిపోయావా? అంటూ కసిగా నాకేసి చూస్తుంటే ...

అమ్మో ! ఎంతమాట ? మిమ్మల్ని మర్చిపోవటమేమిటి? అంటూ గబుక్కున పరుగెత్తుకుంటూ వెళ్ళి బుల్లి బక్కెట్టులో నీళ్ళుతెచ్చి బుడిగి బుడిగి మని వాళ్ళని నీళ్ళలో ముంచి , నెత్తిపై నీళ్ళు కుమ్మరించి గంధం బొట్టూ పెట్టి, పూలతో ముస్తాబు చేసి........ హడావుడిలో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను అంటూ గోముగా నేచెప్పే స్వచ్చమైన సారీ..

కార్యాలయానికి పరుగెత్తే సమయంలో ఖంగారుగా నా వాహనరాజాన్ని (మరీ రాజం అని ఊహించుకోవద్దు.. ద్విచక్రమే.. నాకది చాల్లెండి) శర వేగంగా నడుపుకుంటూ రివ్వున దూసుకెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అడ్డదారిలో మరో బండి ( దానిపై ఎవరున్నా ఐ డోంట్ కేర్) అడ్డకోలుగా వచ్చి నాకు అడ్డు తగిలితే మామూలుగా రావాల్సిన కోపానికి బదులుగా పెదాలపై పూసిన చిరునవ్వుపువ్వుతో సారీ !.......( అసలు నేచెప్పాల్సిన అవసరం లేకున్నా యథాలాపంగా వాళ్ళకంటే ముందే చెప్పేస్తా !)

ఇలా చెయ్యటం వల్ల ( తప్పు లేకున్నా మన్నించమని అడగటం వల్ల అసలు తప్పుచేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుంటారు. వాళ్ళు సారీ చెప్పకున్నా ఆ భావం మనకి స్పష్టంగా తెలిసిపోతుంది.

నిజానికి సారీ చెప్పినంత మాత్రాన మన సొమ్ము , పరువు , ప్రతిష్టా , గొప్పతనం ఏ మాత్రం తగ్గవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. (పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టు.) చెప్పలేకపోవటానికి ఒక్కోక్కరికీ ఒక కారణం ఉండవచ్చు. చెప్పటం వల్ల మాత్రం ఎవరికైనా సరే ఒకేరకమైన ఫలితం . అది ఎదుటివారి మనసు గెలుచుకోవటం. అంతటితో ఆగదు. వారి హృదయంలో మనకంటూ ఓచిన్ని గూడు సంపాదించుకోగలగటం.

ఒక్క సారి మనం కోరే మన్నింపు మనకి ఏ స్థాయి గౌరవాన్నిస్తుందంటే మనం తేరుకోలేని తప్పు చేసినప్ఫుడు కూడా మనల్ని సమాజం అర్థం చేసుకుంటుంది.అడక్కుండానే మనల్ని క్షమిస్తుంది.

ప్రముఖ గజల్ గాయకుడు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాట నాకింకా గుర్తుంది:

"క్షమించిన వాడు గొప్పవాడుకాదు.

క్షమాపణ అడిగిన వాడు గొప్పవాడు." అని ఈ అక్షరాలు ఈ కాలానికి అవసరమైన లక్షణమైన లక్షల మూటలు.

చిరంజీవి సినిమా శంకర్ దాదా MBBS లో ముసలి పనివాడికి సారీ చెప్పిన సీన్ నాకు చాలా ఇష్టం.

నేస్తాలూ ! ఒక్కసారి ఆలోచించండి:

అందరిలో మనల్ని చూడగలిగిన నాడు మనకి ఎలాంటి భేషజాలూ కలగవు. తప్పు చెయ్యటం సహజం . అది చిన్నదైనా , పెద్దదైనా . దాన్ని సరిదిద్దుకోవటం మాత్రం మన బాధ్యత. ఎందుకంటారా? అదీ చెప్తాను:

ఉదాహరణకి:మా పక్కింటి గుమ్మంలో ఒక కుక్క పిల్ల ఎవరినీ రానివ్వకుండా మొరుగుతూనే ఉంటుంది. ఆఖరుకి దాన్ని ఎంతో ముద్దు చేసే నన్ను చూసినా గట్టిగా మొరుగుతూ మీదికి ఎగబడుతూంది.నేను విసుక్కుందామంటే పక్కావిడ చేత్తో ఓ బ్యాట్ తో వచ్చి దాన్ని తప తపా బాదుతుంటే పాపం పిచ్చిది (కుక్కపిల్ల) నోర్మూసుకుంటుంది.నా కైతే గుండె పగిలినట్టై గట్టిగా ఏడ్వాలనిపిస్తుంది. తీరా ఆమె లోనికి వెళ్ళాక పిచ్చిమొహం మళ్ళీ మామూలుగా అరుస్తుంది.( అప్పటికి దానికి సారీ ...తెలియదులెండి పాపం)

ఇక ఏమీ చెయ్యలేక దాన్ని బాధ పెట్టటం ఎందుకులే అని ఈ మధ్య వదిలేసి నేనే సర్దుకొని ఎలాగో తిప్పలు పడుతున్నాను.

మొన్నామధ్య ఓరోజు

ఓ రోజు మధ్యాహ్నం మొక్కలకి నీళ్ళు పోస్తూంటే నా వైపే ఆశగా చూస్తూ కనిపించింది.దగ్గరికి వెళ్ళి నీళ్ళ బకెట్టు దాని దగ్గర పెట్టాను. అది ముందు మోమాటపడినా తర్వాత దాహాన్ని దాచుకోలేక నేపెట్టిన నీళ్ళని తాగింది. అందులో విశేషం ఏముందిలే అని మీరు నిట్టూర్చకండి. అసలు కథ ఇక్కడే ఉంది.

ఏమనుకుందో ఏమిటో గానీ ( బహుశా అది కూడా సారీ ...ఫీలై ఉంటుందని నాఅభిప్రాయం.) ఆ రోజు మొదలుకొని అది పిచ్చిగా మొరగటం మాని బుద్ధిమంతురాలిలాగా ( ఆల్ మోస్ట్ నాలాగే ) ఉండటం మొదలెట్టింది. అది కూడా నన్ను చూసినప్పుడు మాత్రమే అలా ప్రవర్తించటం భలే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

పశువుకే అపరాధ భావన కలిగి పరివర్తన చూపినప్పుడు

మనుషులం మనం ఎంత మారాలో ఆలోచించండి..........

ఎదుటివారిని చక్కగా అర్థం చేసుకుని చిన్న చిన్న త్యాగాలకు సిద్ధపడినపుడు, మనతో పాటు ఇతరుల్ని కూడా గౌరవించటం అలవాటు చేసుకున్నపుడు ప్రతి క్షణం మన్నించటానికి , మన్నించమని అడగటానికి సిద్ధ పడినపుడు అందరూ మనవారే. మనమూ అందరివారమే.............

17 జన, 2009

బాలశ్రీ గా విజయశ్రీ ని వరించిన సాహితి

saahiti balasri 002

తెలుగుతేజం మరోసారి జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠను చాటిచెప్పింది. డిసెంబరు 4 నుండి 8 వరకు జాతీయ స్థాయిలో దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగిన పోటీలలో విజయవాడ నగరానికి చెందిన ఎ.ఎస్.డి.ఎల్.సాహితి సృజనాత్మక రచన అంశంలో అనన్య సామాన్యమైన ప్రతిభ కనబరచి  బాలశ్రీ అవార్డును సాధించి రాష్ట్రానికే వన్నె తెచ్చింది.

క్రియేటివ్ పర్ఫార్మెన్స్, క్రియేటివ్ ఆర్ట్, క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ సైంటిఫిక్ ఇన్నోవెషన్స్ అనే నాలుగు అంశాలలో సాహితి క్రియేటివ్ రైటింగ్ ( సృజనాత్మక రచన) ను ఐచ్చికాంశంగా ఎంచుకుంది.నాలుగు అంశాల్లోనూ  జరిగిన పోటీల్లో  మన రాష్ట్రం  నుండి  సాహితి మాత్రమే ఈ అవార్డును సాధించటం అభినందించదగ్గ విషయం.

సౌత్ జోన్లో బాలశ్రీ అవార్డుపొందిన ఆరుగురిలోనూ ఒక విజేతగా నిలవటంతో పాటు, జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డు ను పొందిన మొత్తం  53 మందిలో ఒక విజేతగా నిలిచింది.

  2004 లో ప్రతిభా అవార్డును,2007 లో బాలరత్న అవార్డుని ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవటంతో పాటు వివిధ స్థాయిలలో నృత్యం, సంగీతం తదితర అంశాలలో ఎన్నో బహుమతులు,  గెల్చుకుంది. ప్రస్తుతం సాహితి ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతోంది. 

saahiti balasri 001

చాటింగ్ ఉచ్చులో యువతరం

యువతరాన్ని పెడత్రోవన పట్టిస్తూ భవిష్యత్తును శూన్యంగా చేసే పెను ఉచ్చుల్లో ఆన్లైన్ చాటింగులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమయం సందర్భం లేకుండా గంటలపాటు విసుగూ , విరామం లేకుండా ఆన్లైన్ కబుర్ల కు నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల జీవితాన్ని నిర్ణయించే ప్రధానమైన దశలో ఎక్కువ సమయం చాటింగుల మూలంగా వ్యర్థమైపోతున్నది.

చాటింగుల పేరుతో ఎక్కడెక్కడి వాళ్లతోనో సరదా కబుర్లు చెబుతూ యువత జరిపే సంభాషణలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకి కూడా దారి తీస్తున్నాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు.ముక్కూ మొహం తెలియని కొత్త వ్యక్తులతో మాటామంతీ - అభిరుచులు, ఆసక్తులతో మొదలై చిలికి చిలికి గాలివానై తీవ్రస్థాయికి చేరుకుని వ్యక్తిగత విషయాలను కూడా పరాయివారితో పంచుకోవటం ఊహించని పరిణామాలకి దారితీస్తున్నది.

క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా సందేశాలు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించటంతో పాటు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఉండటం వల్ల లైవ్ చాటింగ్ లకి రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. చాటింగ్ తో సమయాన్ని వృథా చేసే వాళ్ళు నూటికి తొంభైశాతం యువతరమే.

జాగ్రత్తలు:

  • ఒక్కోసారి కొత్త కొత్త వ్యక్తులు మన చాట్ లిస్ట్ లోకి చొరబడి అనుమతి కోరతారు. యథాలాపంగా అంగీకరిస్తే ఒక్కో సారి మనల్ని పనిచేసుకోనీయకుండా మాటి మాటికీ పలకరిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారిని బ్లాక్ చెయ్యటం, చాట్ లిస్ట్లోనుంచి వారిని తొలగించటం చెయ్యవచ్చు.
  • సాధ్యమయినంతవరకు చాట్ లో మన వ్యక్తిగత వివరాలు చెప్పకుండా ఉండటం ఎంతో మంచిది. కాలేజీలు, ఆఫీసుల పేర్లు, ఫోన్ నంబర్లు అసలు ఇవ్వకపోతేనే మంచిది. కేవలం మెయిల్ఇచ్చినంతమాత్రాన ప్రమాదం లేకపోయినా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండక తప్పదు.

చాటింగ్ దుష్పరిణామాలు:

ఈ రోజుల్లో చాటింగుల మూలంగా ఎంతో మంది అమాయకులు మోసపోతుండటం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.

మోసగాళ్ళైన చాటర్ల మూలంగా అమాయకురాలైన అమ్మాయిలు బలిఅవుతున్నారు.

సమయం వృథా కావటంతో పాటు చదువుల పట్ల అనాసక్తి వల్ల విలువైన భవిష్యత్తు నాశనమవుతుంది.

చాటింగ్ వల్ల ప్రయోజనమూ లేకపోలేదు

విఙ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప ఆశయాలతో ముందడుగు వేస్తున్నా ఉపయోగించుకునే వారిని బట్టి అది అందించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.కత్తి ఒకటే అయినా దాన్నిఉపయోగించేవారి బట్టి ప్రయోజనం మారినట్టే చక్కగా ఉపయోగించుకుంటే చాటింగు మన అభివృద్ధికి రాచబాట వేస్తుంది.

  • తెలివైన వారు , విభిన్న రంగాలలో నిపుణులతో చాటింగ్ మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పిస్తుంది.
  • అనుకోకుండా వచ్చే సందేహాలను అప్పటికప్పుడు వెంటనే నివృత్తి చేసుకోవడానికి ఫోన్ కంటే కూడా చాట్లు బాగా ఉపకరిస్తాయి.
  • పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి చక్కని పరిష్కారాన్ని మిత్రుల ద్వారా పొందవచ్చు.

16 జన, 2009

సత్యం వద .... ధర్మం చర........

 

నింగి విరిగి నేల కూలినా....పుడమి గుండె బద్ధలై గగనానికి ఎగసినా....సూర్య చంద్రులు తారుమారైనా .... ’సత్య’మే గెలుస్తుంది . ఎప్పటికైనా !

అసత్యం అప్పుడప్పుడూ విర్రవీగినా , అధర్మం చెలరేగినా అది తాత్కాలికమే.

పరిణామం........ ప్రతి ఒక్కరు ఇష్టపడేది, ఆశపడేది.  ఉన్న స్థితి నుంచి మార్పు కావాలని , అడుగడుగునా  అభివృద్ధి చెందుతూ ఆకాశమే హద్దుగా ఎదగాలని కలలు కనని వాడు మనిషే కాడు. కాకపోతే తన ఎదుగుదల కోసం ఇతరులను అణగద్రొక్కే దుర్మార్గులు కొందరు, నలుగురికోసం తమని తాము అర్పించుకుంటూ ఒదిగి ఎదుగుతూ అందరి మదుల్లో గది కట్టుకునే వాళ్ళు కొందరు.

          మార్పు రావాలంటూ నినదిస్తున్న మహానుభావులందరికీ మార్పు ఎంత తీవ్రం గా కూడా ఉంటుందో ,దాని పర్యవసానాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించాడు ఓ సత్యవంతుడు.

          అవును అబద్ధం చెప్పానని స్వయంగా ఒప్పుకున్నా ప్రపంచం అతన్ని సత్యవంతునిగానే చూస్తుంది.

            వ్యాపారంలో అబద్ధం చెప్పని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులు మాత్రం కాదు.దేవతలో....

      "పులినోట్లో చిక్క కుండా దాని పై స్వారీ చెయ్యటం ఎంతో గొప్ప సాహసం" అంటూ  సాహసాన్ని చేసి పులి బారినుంచి ఈ రాజు తప్పించుకున్నా పులిని మించిన వింత జీవి ఆయన్ను కప్పివేయటం తెలుగు ప్రజలకి తీరని దుఃఖానికి గురిచేసింది.

  ఎవరి నోట విన్నా ఒకటే మాట.   ఈ రాజు మారాజు, మంచి రాజు, మనసున్న మారాజు. అని.

వనవిహారమైనా , కారాగారమైనా  సింహం సింహమే.కాకపోతే ఈ సింహం గర్జించదు. మౌనంగా ప్రపంచాన్ని జయిస్తుంది.

గెలిచిన వాడి కంటే ఓ డిన వాడికి కసి ఎక్కువ అన్నట్టు . దెబ్బతిన్న పులి మళ్ళీ విజృంభించక మానదు.

    పుట్టిన గడ్డ నుంచి ప్రపంచం దాకా ఎదిగి పేరు తెచ్చుకునే వారు కొందరైతే ఆ గడ్డకే పేరు తెచ్చే ప్రతిభామూర్తులు కొందరే.

విశ్వవీధిలో  సాంకేతికతా సామ్రాజ్యంలో ఓ సాధారణ తెలుగువాడు  జయపతాకమెగరేసిన నాడు ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం. దారి గానక కూల బడిన ఓ దివ్య మూర్తిని దీనంగా చూస్తూ నిట్టూరుస్తున్నాం.

జైలు కెళ్ళటం మహనీయులకి కొత్తేమీ కాదు. బాపూజీ, శాస్త్రీజీ, పటేల్జీ, తిలక్..... ఎందరో . కల్మషం, కాఠిన్యం , రక్తపాతం, దుర్మార్గం అంటుకున్న జైలు గోడలని  ఆవిరైపోతున్న కన్నీటి చుక్కలతో కడిగి, సంక్రాంతికి స్వచ్చమైన చూపుల తోరణాలు కట్టేందుకే ఈ పరిణామం....

   కాకపోతే ఈ పరిణామం కొత్త సంవత్సరంలో మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయి బాధించటం నిజంగా బాధాకరం.పట్టాఅభిషేకాన్నీ, వనవాసాన్నీఒకేలా గా స్వీకరించి ఆరాముడు స్థితప్రఙ్ఞుడైతే , గెలుపునీ , ఓటమినీ సవినయంగా స్వీకరించిన ఈ రాముడూ చారిత్రక పురుషుడే.

      వేలాది మందికి అన్నదానం , ప్రాణదానం చేస్తూ దేవుడైన మహనీయుడికి ఈ పరిస్థితి  ఏమిటాని సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. గ్రహణం పట్టినంత మాత్రాన సూర్య చంద్రులు లోక రక్షకులు కాకపోరు.

        ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తింటున్న మేరు నగాలు ఎన్నో ఏళ్ళ తరబడి సముద్రుణ్ణి చూస్తూ , చిరుమందహాసం  చేస్తూ , ధీమాగా నిలబడి ఉండగా లేనిది..............

కళ్ళు తెరిచింది మొదలు, మూసే వరకు జనాల్ని పీడించుకు తినే జలగలు, అమాయకులని జీవచ్చవాలని చేసి పీక్కు తింటున్న రాబందులు యధేచ్చగా విర్రావీగగాలేనిది:

బైర్ర్రజుగా రామ రాజ్యం కోసం తపించి , లక్షలాది మంది గుండేల్లో గుడికట్టుకున్న మారాజువి....... అధర్మంతో పోటీ పడి తాండవమాడలేని అపర శివుడివి.........

చెయ్యి తడపందే కాలు కదపని సోమరిపోతు లంచగొండి శునకరాజాలు, ఆత్మ పరిశీలనకు అర్థం తెలియని భేషజాల బడా బాబులు, స్వేచ్చగా , యధేచ్చగా జైత్రయాత్రలు సాగిస్తుంటే గుండెపై చెయ్యి వేసి , కళ్లతో బదులివ్వగల ధీమంతుడివి, సహనశీలివి.

    అశ్వత్థామ హతః - కుంజరః అని నిజమైన అబద్దాన్ని చెప్పిన యుధిష్టురుడు ధర్మరాజైతే.....

గోవర్థనగిరినెత్తి తనవారిని కాచిన కృష్ణుడు దేవుడైతే , నమ్ముకున్న వేలాదిమంది భవితవ్యం కోసం నీ పరువునే ఛత్రంగా చేసి తల క్రిందులైనా , తిరగబడినా ఏళ్ల తరబడి కునుకులేకుండా పోరాడి గెల్చుకున్న కీర్తి ప్రతిష్ఠల్ని, సంపదల్ని పణంగా పెట్టి నీ వారి కోసం ,నిన్ను విశ్వసించిన  సంస్థ కోసం గొడుగుపట్టిన సత్యమూ దైవమే.

         నిజం నిప్పులాంటిదైనా మనిషిని మనిషిగా నిలబెడుతుంది.......ఒక్కోసారి దేవుణ్ణి కూడా చేస్తుంది..

 

   నాకు తెలిసిన ప్రపంచం చిన్నదే కావచ్చు.

    నా అనుభవానికి వయసే లేకపోనూ వచ్చు.

మౌనంగా నా భావాలను పంచుకొని, చల్లగా జారుకోకుండా

మీ అభిప్రాయాన్నిచిరు వ్యాఖ్యలతో ఆవిష్కరించండి.

         ఏది సత్యమో ..... ఏది అసత్యమో తెలియని నా లాంటి అయోమయాలకు ఙ్ఞానోదయం కలిగించండి...

15 జన, 2009

త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు

 

ముత్య్లాలంపాడు ఊరేగింపు, త్యాగరాజు ఆ.... 034

 

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో  త్యాగయ్య గా ప్రసిద్ధి చెందిన కాకర్ల  త్యాగయ్య కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు. ముత్తుస్వామి దీక్షితారు, శ్యామ శాస్త్రులు తక్కిన ఇద్దరు. ముగ్గురిలోనూ త్యాగయ్య శైలి సులభంగా పాడటానికీ , వినటానికీ ఇంపుగా ఉంటుంది. రామ భక్తునిగా , వాగ్గేయకారునిగా ప్రసిద్ధికెక్కిన త్యాగయ్య తంజావూరు ను ఏలిన రెండవ శరభోజి కాలం నాటి వాడు.

ఆయన పూర్వీకులు ఆంధ్రదేశంనుండి తమిళ నాటికి వలసపోయి, తంజావూరు సమీపంలోని తిరువాయూరులో స్థిరపడటం వల్ల త్యాగయ్య అటు తమిళులకూ , ఇటూ తెలుగువారికీ ఆప్తుడయ్యాడు. రాజాశ్రయం కోరకుండా, రాజుల సత్కారాలు స్వీకరించకుండా కేవలం ఆత్మానందం కోసం 600 కి పైగా కీర్తనలు రాశాడు.

తమిళ నాడులో కావేరీ నది ఒడ్దున తిరువాయూరు గ్రామంలో  గల త్యాగరాజ స్వామి సమాధి వద్ద గత 100 ఏళ్ళుగా జరుగుతున్న ఉత్సవాలకు దీటుగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను రాష్ట్రంలో కూడా వైభవంగా నిర్వహించే తలంపుతో 1995 లో ఏర్పడ్డ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఏటా విజయవాడ నగరంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలప్రాంగణంలో పెద్ద ఎత్తున సంగీతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఆరాధనోత్సవాలు  జనవరి 14 బుధవారం  ప్రారంభమయ్యాయి. 

రాష్ట్ర్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాలనుండి మొత్తం 260 మంది కళాకారులు ఉత్సవాలలో పాల్గొని కచేరీలు చేస్తారు. 

ముత్య్లాలంపాడు ఊరేగింపు, త్యాగరాజు ఆ.... 037

 

18 వతేదీ ఆదివారం ఉదయం 200 మంది కళాకారులు కలిసి ఒకేసారి త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం ఉత్సవాలలోని ప్రత్యేక అంశం. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేస్తుంది.

      వారంరోజుల పాటు  ప్రతిరోజూ రెండుపూటలా జరుగుతున్నసంగీతోత్సవాలకి సంగీతాభిమానులందరూ ఆహ్వానితులే.  

13 జన, 2009

అన్నపూర్ణయై ...ఆంధ్రావని సంక్రాంతి సంబరాలు............

 saakshi1 081

కలిసిఉంటే కలదు సుఖమంటూ.....ఆటైనా ...పాటైనా ....

అందరితో కలసి..........

 

saakshi1 086

 

 

 

 

 

 

 

ఉరకలెత్తే ఉత్సాహం తో..........

saakshi1 089

అచ్చమైన పల్లెటూరి  ప్రకృతిలాగా స్వచ్చమైన మనసుతో......saakshi1 162

ప్రతిరోజూ నిత్య వసంతంగా రంగులమయంగా కళ కళ లాడాలని........

 

saakshi1 092

పట్టుదల, ఆత్మ విశ్వాసాలు పందెం కోళ్ళ లాగా పోటీ పడుతూ....

 

saakshi1 169

తిరుగులేని విజయాలకు విఘ్నాలు తొలగిపోయి ,

సంక్రాంతి సంబరాలు మీఇంట అంబరాన్ని అంటాలని అభిలషిస్తూ.................

saakshi1 135 తెలుగుకళ.............పద్మకళ.......

6 జన, 2009

ప్రపంచ నాస్తిక మహా సభలు

నాస్తికమహా సభలు (49)  నాస్తికమహా సభలు (46) నాస్తికమహా సభలు (16) జనవరి 5,6,7 తేదీలలో విజయవాడలో 7 వ  ప్రపంచ నాస్తిక మహా సభలు జరిగాయి. నాస్తికం గురించి ఎప్పుడూ విన
టమే కానీ ప్రత్యక్షంగా నేను ఏ నాస్తికులనీ ఇంతవరకూ చూడక పోవటంతో అసలు వాళ్ళేం చెబుతారో చుద్దామని ఎంతో ఆసక్తితో వెళ్ళాను.

నాస్తికమహా సభలు (3)

నాస్తికమహా సభలు (8)

 

 

       దాదాపు 50 మందికి పైగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి హేమా హేమీలు ఈ సభలకి హాజరయ్యారు. మొదటిసారి విదేశీయుల భావాలని ప్రత్యక్షంగా పంచుకునే అవకాశం మా పత్రిక ద్వారా నాకు కలిగింది.

       హాజరైన విదేశీయులలో ప్రముఖులైన శాస్త్రఙ్ఞులు, రచయితలు, న్యాయవాదులు, వైద్యులు, ప్రూఫ్ రీడర్లు.... ఇలా చాలా మంది ఉన్నారు.ఒక్కోక్కరిదీ ఒక్కో అనుభవం.

నాస్తికమహా సభలు (12)

 

 

నాస్తికమహా సభలు (18)

 

       నేను స్వతహాగా దైవాన్ని విశ్వసిస్తాను. ఇంత విభిన్నమైన ప్రకృతి నడవటం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పుడప్పుడూ ఒక దానితో మరొక దానికి  పొంతన లేని చెట్ల ఆకులని, పువ్వులని, చూసి ముగ్ధురాలనై పోతాను.

      ఉన్న దాన్ని అటో ఇటో మార్చటం మనిషివల్ల అవుతుంది కానీ సృష్టికి ఎదురు వెళ్లి దానికి విరుద్ధంగా మనిషి ఏమీ చెయ్యలేడని నిర్మొహమాటంగా చెబుతాను.

నాస్తికమహా సభలు (21)

       అసలు ఆధ్యాత్మికతకు, మత మౌఢ్యానికి సంబంధమే లేదని నేనంటాను. మనమేమిటో , మన శక్తియుక్తులేమిటో మనకి చెబుతూ , తరతమ భేదాలు లేని వసుధైక కుటుంబ భావనని అందించే అద్వితీయమైన శక్తి ఆధ్యాత్మికత.

     నాస్తికమహా సభలు (49)     

 

అలసిపోయిన మనసుకి, నిరాశా,నిస్పృహలతో ఉన్న మనిషికి కొంత విశ్రాంతిని, ఓదార్పుని ఇచ్చి, కొత్త విశ్వాసాన్నిచ్చి నడిపిస్తుంది దైవంపై నమ్మకం.

             పాపభీతి మనుషులని ఎంతో కొంత బాధ్యత గలిగిన వారిగా చేస్తుంది. మనసులో ఏదో ఒక మూల ప్రతి ఒక్కరికీ ( భారతీయులకి) ఇలా చేస్తే భవిష్యత్తులో నా కేమైనా అవుతుందేమో నన్న భయాన్ని కలిగిస్తుంది.

         దైవం మన మనసులో ని భావాలని బట్టి మన కళ్ళకి కనిపిస్తుంది. చూసే చూపుని బట్టి ప్రపంచం మనముందు అగపడ్తుంది. విభిన్న మైన మనస్తత్వాలతో కలిసి పనిచేస్తూ , రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ మన మనసుకి అప్పుడప్పుడూ వద్దన్నా అంటుకున్న మాలిన్యం తాలూకు జిడ్డు వదలాలంటే  ఎంతో కొంత మేరకు దైవ చింతన ఉండాల్సిందే.

            ప్రపంచ నాస్తిక సభలకి మూడురోజులు హాజరైన తరువాత సభ్యుల అంతరంగాన్ని నాచిన్ని బుర్రకు అందినంతవరకు మీముందు ఉంచాలనుకుంటున్నాను.

 

౧. మతం అనేది మనిషికి పుట్టుకతో రాలేదు.

౨. మతపరమైన్ జన్యువు మనలో లేనేలేదు.

౩.పెద్దలే పిల్లల్లో మతాన్ని భయాన్నో , అలవాట్లద్వారానో ఆపాదిస్తున్నారు.

౪. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి.

౫.చేతబడులు లేవు. సైకిక్ సర్జరీల వంటివి మోసపూరితాలు.

౬.ప్రస్తుత మారణకాండకు మతమే మూల కారణం.

౭. మతాన్ని దాటి మనవత్వం వైపు సాగితేనే పురోగమనం సాధ్యం.

౮.మతాంతర వివాహాలను ప్రోత్సహించటం ద్వారా మనుషుల మధ్య నున్న అంతరాలని తొలగించాలి.

౯.యువ శక్తిని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకి మళ్ళించకఫోతే వారు తీవ్రవాదులుగా వినాశకారులుగా మారిపోతారు.

౧౦.ఎదుటి వారు చెప్పిందల్లా గుడ్దిగా నమ్మకుండా తర్క సహితమైన ఆలోచన చెయ్యాలి.

ఇలా ఇంకా ఉన్నాయి.నాస్తికమహా సభలు (44) మరో సారి వివరిస్తాను.