30 ఏప్రి, 2009

నానో

ప్రేమ

పరీక్ష

ఫలితం

జీవితం

నానో

లక్ష్యం

చిక్కితే

మనసు

ఉప్పొంగే సముద్ర్రం

26 ఏప్రి, 2009

ఓ మనిషీ....

కళ్ళలో

కళ్ళుపెట్టి

నిన్నునువ్వు

రెప్పవాల్చకుండా

తలదించుకోకుండా

క్షణ కాలం

అద్దంలో సూటిగా

చూసుకునే

దమ్మునీకుందా?

పక్షిలా ఎగరాలని

ఆరాటపడ్డావు

నింగికి నిచ్చెనలు వేసి

అంతరంగంపై

రంగులు పులుముకుని

మెట్లెక్కించిన

నిచ్చెనను కాలితో

తన్నుతూ

ఎగబాకుతున్నావు

రెక్కలు చాచి

కోరరాని కోరికలకు

అర్రులు చాచి

రాబందువై పీడిస్తున్నావు...

చేపలా ఈదాలని

కలలు గన్నావు

తిమింగలమై

చిరుచేపల్ని

మింగేస్తున్నావు

అగాథాలను

సైతం వదలకుండా

ఆక్రమించుకుంటున్నావు

నిధుల వేటలో పడి

మృగమై మనిషివన్న సంగతి

మరచి తీరని దాహంతో

ప్రపంచమనే ఉప్పునీటిలో

విహరిస్తున్నావు

నిన్ను నీవుగా

నిలబెట్టుకోలేనపుడు

గుండెపై చెయ్యివేసి

నిర్భయంగా

వ్యక్తపరచుకోలేనపుడు

నువ్వొక కదిలే

వస్తువువన్న సంగతి మరచిపోతే

ఆత్మ సాక్షిని మరచి

సౌశీల్యం విడచి

పిచ్చిపట్టి తిరుగుతున్నావన్న

విషయం విడమరచి

చెబుతున్నా... విన్నా వినకున్నా...

ఓ మనిషీ !.... నువ్వు మనిషివన్న

సంగతి పదే పదే గుర్తుచేస్తున్నా.....

14 ఏప్రి, 2009

గుండె కోత.....

గుండెల్లో వేడి సెగలు
నరనరాల్ని పీడించే
భయభ్రాంతులు
అందమైన ప్రపంచాన్ని
అంతం చేసేందుకు
ఎక్కిన కొమ్మను
నరుక్కునేందుకు
వెర్రితలలు వేస్తున్న
మనిషి మూర్ఖత్వం.
నూరేళ్ళజీవితాన్ని
నేలపాలు చేస్తున్న వైనం
తలచుకుంటుంటే.......
ఉగ్రవాద భూతం
గంతలు కట్టుకుని
దారితప్పి రెచ్చిపోతోంటే...
పాలుగారే బుగ్గల
పాపాయిల్ని
పావులుగా చేసుకుని
బాల్యాన్ని చిదిమేస్తుంటే....
కర్తవ్యమేమిటంటూ
అంతరాత్మ ఘోషిస్తోంది
చేతగాని బ్రతుకు నీదంటూ..
నిస్సహాయంగా
పిచ్చిమనసు
నిట్టూర్చుతోంది
మత ఛాందసం
కలిపురుషునిగా మారి
సుకుమారమైన చేతుల్తో
మారణాయుధాలు
మోయిస్తూంటే....
బొమ్మలాటల బాల్యాన్ని
ప్రాణాల చెలగాటాలకు
ఉసిగొల్పుతుంటే......
పిచ్చి పిల్లల
తుపాకీలాటలకి పోయే
ప్రాణం ఖరీదెంతో
తెలియని
పిల్ల చేష్ఠలకి
గుండె తరుక్కుపోతోంది
కన్న బిడ్డల్ని
మానవ బాంబుల్ని
చేసే జీహాదీలు
తమ త్యాగానికి
గర్విస్తున్నారో..
కడుపుతీపి
రుచి మరచి
రక్తదాహంతో
మానవ మృగాలౌతున్నారో....
కనిపిస్తే
చెంపఛెళ్ళుమనిపించాలని
ఉంది
నిలువునా కడిగేయ్యాలనిపిస్తోంది

13 ఏప్రి, 2009

నానో..

తీవ్రవాదపు
ఆకలి
మల్లెపూలు
మంటలపాలు

5 ఏప్రి, 2009

స్నేహం

ఒకే ఒక్క
భావన
పరిచయం లేని
ప్రాణాల్నిసైతం
ప్రాణమిచ్చేందుకు
సన్నద్ధం చేస్తుంది

ప్రేమ.... ( మినీ కవిత)

కనురెప్పల
చివరపుడితే
అల్పాయుష్కురాలు
గుండెమూలల్లోంచి
పుట్తుకొస్తే
దీర్థాయుష్కురాలు
-------------------------------------------------------------

కామెంట్ .. ప్లీజ్...

శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ.....