Pages

22 ఆగ, 2024

కంచి కామకోతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి జయేంద్ర సరస్వతి గారితో ముఖాముఖి.....

’అందంగా నీకు నువ్వు కనబడాలంటే చక్కగా అలంకరించుకుని అద్దం ముందు నిలబడాలి. అలాగే సామాజిక వ్యవస్థ బాగుండాలంటే దానిపై భక్తి , అభిమానం, గౌరవం కలిగి ఉండాలి’ అంటూ భక్తులకు తన దివ్య సందేశాన్నిచ్చారు పూజ్య గురుదేవులు కంచి కామ కోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. విజయవాడలో మే రెండవ వారం లో జరిగిన ’చతుశ్శాస్త్ర విద్వన్మహాసభల’లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సందేశాన్ని సమాజానికి అందించే అవకాశం నాకు కలిగింది. ముఖాముఖి: నా ప్రశ్న: ప్ర: జయేంద్ర సరస్వతి స్వామి గారి సమాధానం: స్వా.జ: ప్ర: హిందూ మతం ప్రపంచానికిచ్చే సందేశం ఏమిటి? స్వా.జ: ఈశ్వరుడొక్కడే. అతడు నిర్గుణ నిరాకార స్వరూపుడు. కంటికి కనిపించకపోయినా విద్యుత్తు వివిధ రూపాలలో ప్రవహిస్తోంది.లైటు, ఫ్యాను,టీ.వీ, రేడియో లాంటి సాధనాల ద్వారా వివిధ రకాల పనులు చేయిస్తోంది. అలాగే భగవంతుడు కూడా సాకారుడై దర్శనమిస్తాడు.