15 జన, 2009

త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు

 

ముత్య్లాలంపాడు ఊరేగింపు, త్యాగరాజు ఆ.... 034

 

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో  త్యాగయ్య గా ప్రసిద్ధి చెందిన కాకర్ల  త్యాగయ్య కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు. ముత్తుస్వామి దీక్షితారు, శ్యామ శాస్త్రులు తక్కిన ఇద్దరు. ముగ్గురిలోనూ త్యాగయ్య శైలి సులభంగా పాడటానికీ , వినటానికీ ఇంపుగా ఉంటుంది. రామ భక్తునిగా , వాగ్గేయకారునిగా ప్రసిద్ధికెక్కిన త్యాగయ్య తంజావూరు ను ఏలిన రెండవ శరభోజి కాలం నాటి వాడు.

ఆయన పూర్వీకులు ఆంధ్రదేశంనుండి తమిళ నాటికి వలసపోయి, తంజావూరు సమీపంలోని తిరువాయూరులో స్థిరపడటం వల్ల త్యాగయ్య అటు తమిళులకూ , ఇటూ తెలుగువారికీ ఆప్తుడయ్యాడు. రాజాశ్రయం కోరకుండా, రాజుల సత్కారాలు స్వీకరించకుండా కేవలం ఆత్మానందం కోసం 600 కి పైగా కీర్తనలు రాశాడు.

తమిళ నాడులో కావేరీ నది ఒడ్దున తిరువాయూరు గ్రామంలో  గల త్యాగరాజ స్వామి సమాధి వద్ద గత 100 ఏళ్ళుగా జరుగుతున్న ఉత్సవాలకు దీటుగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను రాష్ట్రంలో కూడా వైభవంగా నిర్వహించే తలంపుతో 1995 లో ఏర్పడ్డ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఏటా విజయవాడ నగరంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలప్రాంగణంలో పెద్ద ఎత్తున సంగీతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఆరాధనోత్సవాలు  జనవరి 14 బుధవారం  ప్రారంభమయ్యాయి. 

రాష్ట్ర్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాలనుండి మొత్తం 260 మంది కళాకారులు ఉత్సవాలలో పాల్గొని కచేరీలు చేస్తారు. 

ముత్య్లాలంపాడు ఊరేగింపు, త్యాగరాజు ఆ.... 037

 

18 వతేదీ ఆదివారం ఉదయం 200 మంది కళాకారులు కలిసి ఒకేసారి త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం ఉత్సవాలలోని ప్రత్యేక అంశం. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేస్తుంది.

      వారంరోజుల పాటు  ప్రతిరోజూ రెండుపూటలా జరుగుతున్నసంగీతోత్సవాలకి సంగీతాభిమానులందరూ ఆహ్వానితులే.  

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి