Pages

17 జన, 2009

చాటింగ్ ఉచ్చులో యువతరం

యువతరాన్ని పెడత్రోవన పట్టిస్తూ భవిష్యత్తును శూన్యంగా చేసే పెను ఉచ్చుల్లో ఆన్లైన్ చాటింగులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమయం సందర్భం లేకుండా గంటలపాటు విసుగూ , విరామం లేకుండా ఆన్లైన్ కబుర్ల కు నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల జీవితాన్ని నిర్ణయించే ప్రధానమైన దశలో ఎక్కువ సమయం చాటింగుల మూలంగా వ్యర్థమైపోతున్నది.

చాటింగుల పేరుతో ఎక్కడెక్కడి వాళ్లతోనో సరదా కబుర్లు చెబుతూ యువత జరిపే సంభాషణలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకి కూడా దారి తీస్తున్నాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు.ముక్కూ మొహం తెలియని కొత్త వ్యక్తులతో మాటామంతీ - అభిరుచులు, ఆసక్తులతో మొదలై చిలికి చిలికి గాలివానై తీవ్రస్థాయికి చేరుకుని వ్యక్తిగత విషయాలను కూడా పరాయివారితో పంచుకోవటం ఊహించని పరిణామాలకి దారితీస్తున్నది.

క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా సందేశాలు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించటంతో పాటు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఉండటం వల్ల లైవ్ చాటింగ్ లకి రోజురోజుకీ క్రేజ్ పెరుగుతోంది. చాటింగ్ తో సమయాన్ని వృథా చేసే వాళ్ళు నూటికి తొంభైశాతం యువతరమే.

జాగ్రత్తలు:

  • ఒక్కోసారి కొత్త కొత్త వ్యక్తులు మన చాట్ లిస్ట్ లోకి చొరబడి అనుమతి కోరతారు. యథాలాపంగా అంగీకరిస్తే ఒక్కో సారి మనల్ని పనిచేసుకోనీయకుండా మాటి మాటికీ పలకరిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారిని బ్లాక్ చెయ్యటం, చాట్ లిస్ట్లోనుంచి వారిని తొలగించటం చెయ్యవచ్చు.
  • సాధ్యమయినంతవరకు చాట్ లో మన వ్యక్తిగత వివరాలు చెప్పకుండా ఉండటం ఎంతో మంచిది. కాలేజీలు, ఆఫీసుల పేర్లు, ఫోన్ నంబర్లు అసలు ఇవ్వకపోతేనే మంచిది. కేవలం మెయిల్ఇచ్చినంతమాత్రాన ప్రమాదం లేకపోయినా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండక తప్పదు.

చాటింగ్ దుష్పరిణామాలు:

ఈ రోజుల్లో చాటింగుల మూలంగా ఎంతో మంది అమాయకులు మోసపోతుండటం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.

మోసగాళ్ళైన చాటర్ల మూలంగా అమాయకురాలైన అమ్మాయిలు బలిఅవుతున్నారు.

సమయం వృథా కావటంతో పాటు చదువుల పట్ల అనాసక్తి వల్ల విలువైన భవిష్యత్తు నాశనమవుతుంది.

చాటింగ్ వల్ల ప్రయోజనమూ లేకపోలేదు

విఙ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప ఆశయాలతో ముందడుగు వేస్తున్నా ఉపయోగించుకునే వారిని బట్టి అది అందించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.కత్తి ఒకటే అయినా దాన్నిఉపయోగించేవారి బట్టి ప్రయోజనం మారినట్టే చక్కగా ఉపయోగించుకుంటే చాటింగు మన అభివృద్ధికి రాచబాట వేస్తుంది.

  • తెలివైన వారు , విభిన్న రంగాలలో నిపుణులతో చాటింగ్ మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పిస్తుంది.
  • అనుకోకుండా వచ్చే సందేహాలను అప్పటికప్పుడు వెంటనే నివృత్తి చేసుకోవడానికి ఫోన్ కంటే కూడా చాట్లు బాగా ఉపకరిస్తాయి.
  • పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి చక్కని పరిష్కారాన్ని మిత్రుల ద్వారా పొందవచ్చు.

5 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

పద్మకళ గారు మంచి అంశాన్ని స్పృశించారు. ధన్యవాదాలు.

లక్ష్మి చెప్పారు...

padmakala gaaru, ammaayile kaadandi, konni saarlu ammayilu vese ucchulO padu\i abbayilu kuda mosapotunnaru (manam abhivruddhi chendutunnaamu :()

అజ్ఞాత చెప్పారు...

చాటింగుకు అతిగా చోటిస్తే చీటింగు తప్పదని బాగా చెప్పారు. మీకే నా ఓటింగు.

పరిమళం చెప్పారు...

పద్మకళ గారు,మంచి విషయాన్ని చెప్పారు.చాటింగ్ వల్ల ప్రయోజనమూ,దుష్పరిణామాలు చక్కగా వివరిoచారు. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

hai my dear sweet sister
really its true akka
nanu epati varaku chating chala bad anukunanu but today ni post chadivaka endulo kuda gud things vunaee ani telusu kunnanu thanks akka.
its very nice mam
good luck all the best
elantivi anno enkeynno maraynno meru rayalani manaspurthi ga koru kuntuuuuuuuu
ni chelli

కామెంట్‌ను పోస్ట్ చేయండి