Pages

31 మార్చి, 2009

గుండె గొంతుక......

గడపదాటితే
చాలు
నీడలా
వెంబడించే
అడుగులు
విసుగుతెప్పించే
అనుమానపు
చూపులు
కాపలా
కాస్తున్నామనుకుని
నన్ను
వేధించే
కఠిన హృదయాలు
రక్షిస్తానంటూ
శిక్షించే
రక్షణ కవచాలు
ఎదిగీ ఎదగని
మనసుని
బెంబేలెత్తిస్తూ
తనువుపై
పెత్తనం
చెలాయిస్తూ
మాటల
ఈటెల్తో
గుచ్చుతుంటే
నా మేలు కోరే
నా వారైనా
నన్ను నమ్మని
పరాయివారయ్యారని
గుండెపగిలేలా
ఏడ్వాలనిపిస్తున్నా
నేల రాలిన
నా కన్నీటి చుక్క
పెడర్థాల
పాలౌతుందని
భయపడి
కంటిలోని
బాధని
గొంతులోంచి
గుటకేస్తున్నాను
అర్థం లేని
కారణాలు
చూపించి
అర్థంతరంగా
బడి మాన్పించేస్తారని
మౌనంగా
భరిస్తున్నాను
మూడైదులకే
ముత్తైదువైన
అక్కయ్యకు
వారసురాల్ని
కాకూడదని
ముక్కోటి దేవతలకి
మొక్కుకుంటున్నాను.............

7 కామెంట్‌లు:

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

ఏమిటి ఈ మధ్య కవితావేశం పెల్లుబికి వస్తోంది.
ఆద్భుతమైన కవితలు అలవోక గా అల్లుతున్నారు.
శ్రీ శ్రీ గారు ఆవహించారా ? తిలక్ గారు తిట్తారా?
మంచి కవిత నేడు కొంచెం ఐనా చాలు.

సమస్యలన్నీ స్ప్రుసిస్తున్నారు.

అన్నమాచార్యుని పాట ఒకటి గుర్తుకొస్తోంది.
ఇతని కంటె మరి దైవము గానము. ఎక్కడ వెదకిన ఇతడే.
అన్నట్టుగా సాగుతొంది మీ కవితా గానం.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

ఏమిటి ఈ మధ్య కవితావేశం పెల్లుబికి వస్తోంది.
ఆద్భుతమైన కవితలు అలవోక గా అల్లుతున్నారు.
శ్రీ శ్రీ గారు ఆవహించారా ? తిలక్ గారు తిట్తారా?
మంచి కవిత నేడు కొంచెం ఐనా చాలు.

సమస్యలన్నీ స్ప్రుసిస్తున్నారు.

అన్నమాచార్యుని పాట ఒకటి గుర్తుకొస్తోంది.
ఇతని కంటె మరి దైవము గానము. ఎక్కడ వెదకిన ఇతడే.
అన్నట్టుగా సాగుతొంది మీ కవితా గానం.

Keep it up.

మధురవాణి చెప్పారు...

చాలా బాగుంది కళ గారూ.. సూటిగా,వాస్తవికంగా ఉంది.
ఎంతో మంది అమ్మాయిల మనసులో ఈ భావం ఉండే ఉంటుంది :(

trinadhreddy చెప్పారు...

మీ కవిత చాలా బాగుంది.బహుశా మీరు ఒక కవి అయ్యి ఉంటారు.

పరిమళం చెప్పారు...

కళ గారూ ! తల్లితండ్రుల అతి జాగర్త పిల్లల జీవితాలపై చూపించే ప్రభావం ఎలా ఉంటుందో చాలా బాగా చెప్పారు "మూడైదులకే ముత్తైదువైన " అంటూ ...........

Hima bindu చెప్పారు...

చాల బాగుంది

Nrahamthulla చెప్పారు...

పద్మకళగారూ
మానవత్వం నిండిన మీ అలోచనలు అభినందనీయం.ఆడదై పుట్టటం కంటే అడివిలో మానై పుట్టటం మేలు అనే సామెత ఈనాటికీ ఋజువౌతూనే ఉంది."నా మేలు కోరే నా వారైనా నన్ను నమ్మని
పరాయివారయ్యారని"అనే మాటలు చాలా బాధను కలిగించాయి.ఒక అమ్మాయి అవస్థలు చూసి నాకు కలిగిన భావాలు ఇవి:
పెళ్ళి నిన్ను వేరుచేసింది
ఈ పెళ్ళి నాకొద్దు అని ఎంత ఏడ్చావో
ఎన్నిసార్లు ప్రాదేయపడ్డవో
నిన్ను పరులకొదిలేశారు
నన్ను వదిలేస్తారా అని ఆనాడు అమాయకంగా అడిగితే
ఎన్నటికీ వదలo అని చెప్పి నిన్ను ప్రేమలో దింపారు
చేతులారా పరులకు నన్ను అప్పగిస్తున్నారని ఎడ్చావు
మనసు కరగని కఠినులు నీ పెద్దలు
కసాయి వాళ్ళకు నిన్ను అప్పజెప్పారు
నీ మనసు ఎరుగకుండా కొట్టి నీ పెళ్ళిచేశారు
ఆడపిల్లను ఆస్తిపరులకిచ్చి వదిలించుకోవటమే గొప్ప అనుకున్నారు
అవివాహితగా ఉంటానంటే విన్లేదు
ఉద్యోగం చేస్తానంటే వద్దన్నారు
పెళ్ళి చేసి పీడ వదిలిందనుకున్నారు
ఇప్పుడు నీకు మాట్లాడే స్వేచ్చకూడా లేదు
అడివిలోమానుకీ నీకు తేడా ఎమీ లేదు
ఈ అన్యాయం దేవుడిదా మనుషులదా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి