Pages

26 ఏప్రి, 2009

ఓ మనిషీ....

కళ్ళలో

కళ్ళుపెట్టి

నిన్నునువ్వు

రెప్పవాల్చకుండా

తలదించుకోకుండా

క్షణ కాలం

అద్దంలో సూటిగా

చూసుకునే

దమ్మునీకుందా?

పక్షిలా ఎగరాలని

ఆరాటపడ్డావు

నింగికి నిచ్చెనలు వేసి

అంతరంగంపై

రంగులు పులుముకుని

మెట్లెక్కించిన

నిచ్చెనను కాలితో

తన్నుతూ

ఎగబాకుతున్నావు

రెక్కలు చాచి

కోరరాని కోరికలకు

అర్రులు చాచి

రాబందువై పీడిస్తున్నావు...

చేపలా ఈదాలని

కలలు గన్నావు

తిమింగలమై

చిరుచేపల్ని

మింగేస్తున్నావు

అగాథాలను

సైతం వదలకుండా

ఆక్రమించుకుంటున్నావు

నిధుల వేటలో పడి

మృగమై మనిషివన్న సంగతి

మరచి తీరని దాహంతో

ప్రపంచమనే ఉప్పునీటిలో

విహరిస్తున్నావు

నిన్ను నీవుగా

నిలబెట్టుకోలేనపుడు

గుండెపై చెయ్యివేసి

నిర్భయంగా

వ్యక్తపరచుకోలేనపుడు

నువ్వొక కదిలే

వస్తువువన్న సంగతి మరచిపోతే

ఆత్మ సాక్షిని మరచి

సౌశీల్యం విడచి

పిచ్చిపట్టి తిరుగుతున్నావన్న

విషయం విడమరచి

చెబుతున్నా... విన్నా వినకున్నా...

ఓ మనిషీ !.... నువ్వు మనిషివన్న

సంగతి పదే పదే గుర్తుచేస్తున్నా.....

2 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

కవిత , చిత్రము రెండూ చాలా బావున్నాయి , మీరు శీర్షిక ఎందుకు పెట్టలేదు . "ఊహలకే రెక్కలు వస్తే "అన్నట్టుందండీ బొమ్మ .

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

Oh! Manishee thirigi choodu!

Chala chala bagundi. Mee kavitha sravanthi ilage konasaagalani asistunnanu.

కామెంట్‌ను పోస్ట్ చేయండి