Pages

14 జూన్, 2009

కాస్త దయచూపండి

నిన్న మిట్ట మధ్యాహ్నం మండుటెండ. నేషనల్ హై వే మీద మంచి సెంటర్లో రద్దీ బాగా ఉన్న ఆంజనేయస్వామి గుడిపక్క ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అతన్ని దాటుకుంటూ కొందరు , నిట్టూరుస్తూ కొందరు, పట్టీ పట్టనట్టుగా పట్తించుకోకుండా పోయేవాళ్ళు కొందరు.

అరె కళ్లముందు ఒక మనిషి స్పృహ లేకుండా నడిరోడ్డుపై పడిఉంటే .. అసలేమీ స్పందన లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇక ఉండబట్టలేక పక్క వాళ్ళని అడిగితే .. వాళ్ళు అతన్ని తిట్టటం మొదలెట్టారు. "తిన్నది అరక్క పీకల్దాకా తాగి రోడ్డు మీద పడ్డాడంటూ.." . తాగుడు ని అసహ్యించుకోవచ్చు. తాగిన వాడ్ని అసహ్యించుకోవచ్చు. కానీ తాగిన మత్తులో దీనంగా చెత్త చెదారం, మురికి మీద పడి ఉన్న మనిషిని చూసి కనీసం అక్కడినుండి కాస్త పక్కకు జరపాలని కూడా ఎందుకు అనిపించదు వీళ్ళకి అనుకున్నాను. వాళ్ళని వీళ్ళని అడగటం మొదలు పెట్టాను. బాబూ ఎవరైనా కాస్త అతన్ని పక్కకి నీడకి లాగండి. ఎండకి చచ్చి పోతాడు . "అంటూ పక్కన నా సహోద్యోగి నా కోసం ఎదురు చూసీ చూసీ నాపై అసహనం వ్యక్తం చేశారు. నీకు అంత ఆవేదన అవసరమా? అతను కావాలని చేసుకున్నదానికి అంత జాలిపడనవసరం లెదంటూ....

ఏమో ! ఎవరి మాటలూ నా చెవికెక్కటం లేదు. ఎలా ? ఏం చెయ్యాలి? చూస్తూ చూస్తూ అతన్ని అలా వదిలి వెళ్ళాలనిపించలేదు. ఏమైనా సరే అనుకుంటూ .. ఒకరిద్దరిని అడిగాను. పక్కనే గుడిలోనున్న ఇద్దరిని అడిగి చూశా పాపం వాళ్ళకి అతనిపై కంటే నాపై జాలి వేసిందో ఏమో అతన్ని తిడుతూ నా గోల పడలెక వచ్చారు. మొత్తానికి ఈడ్చి ఈడ్చి అతన్ని గుడి వెనుకనున్న నీడలోకి లాగారు. హమ్మయ్య అనుకుంటూ .. చల్ల బడ్డ కళ్ళతో బస్టాప్ కి పరుగుతీసాను. నేను చేసిన పనిని తల్చుకుని ఎంతో తృప్తితో ఇంటికొచ్చి మితృలకి విషయం చెబితే ... విచిత్రం . వాళ్ళు ఒక నవ్వు నవ్వి.. తాగిన వాళ్ళు ఎండలో ఉన్నా చచ్చిపోరు. అని నా అమాయకత్వానికి ఓ చిన్న చురక వేశారు. ఒక్క క్షణం కళ్ళు మూసి మళ్ళి అనుకున్నాను. లేదు నేను చేసింది సరిఅయినదే. ప్రాణం పోదుకదా అని మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అక్కడ ఆ స్థితిలో ఉంటే వదిలేస్తామా? చెప్పండి? ఇంతా మీకు చెప్పింది.. నన్ను మెచ్చుకోమని కాదు. ఈ మాటలు గుర్తుంచుకుని సాటి మనిషి అసహాయస్థితిలో ఉన్నప్పుడు స్పందించమని. దయచేసి ప్రాణాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనుషులు చేసిన తప్పులకు అతని ప్రాణాలు కాపాడి తర్వాత తగిన శిక్ష వెయ్యండి అంతే కానీ చిన్న తప్పుకి పెద్ద శిక్ష వెయ్యకండి. "To Err is Human , To Forgive is Divine" " తప్పు చేయటం మానవ సహజం. క్షమించటం దైవత్వం." నిజంగా మీకు మనసుంటే మీ జీవితంలో కనీసం ఒక్క వ్యక్తిని అతనికున్న వ్యసనాన్నుండి విముక్తుడ్ని చెయ్యండీ. మంచి మాటలతో....... నమస్కారం!

12 కామెంట్‌లు:

Nrahamthulla చెప్పారు...

ప్రేమించలేదని చార్మినార్ మీదనుండి పడదోసే మృగాలున్నసమాజంలో ,సాటి మనిషి అసహాయస్థితిలో ఉన్నప్పుడు స్పందించమని కోరుతున్న ఈ చల్లని మనిషి ఎవరు?మానవత్వం కావాలని పరితపిస్తున్న పద్మకళకు అభినందనలు

Nrahamthulla చెప్పారు...

మానవత్వాన్ని ప్రేరేపించే కొన్ని సంఘటనలు:
* మనసు మంచి 'ముత్యం'

బస్టాండ్‌లు.. రైల్వేస్టేషన్‌లు.. చెత్తకుప్పలు... ఆస్పత్రులు.. గుళ్లు.. ఇలా ఎక్కడెక్కడో వదిలేసిన నెలల శిశువులను అక్కున చేర్చుకుంటుందామె. పురిటిబిడ్డలను పొదివిపట్టుకుని పెంచిందామె. లాలపోసింది... బువ్వపెట్టింది... పెద్దయ్యాక విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లిళ్లు చేసే బాధ్యతకూడా తానే స్వీకరించింది. పొత్తిళ్లలో శిశువులుగా ఆమె నీడన చేరిన ఎందరో నేడు పట్టభద్రులయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. అయినా, ఆమెతో అనుబంధాన్ని మాత్రం వీడలేదెవరూ. ఇంతకీ ఈమె ఎవరంటారా! కర్నూలు జిల్లాకు చెందిన ముత్తులక్ష్మి . ఇరవై ఎనిమిదేళ్లుగా ఇదే సేవలో తరిస్తోంది. ముత్తులక్ష్మి పెళ్లే చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశమే ఆమెకు కలుగలేదు. మదర్ థెరిస్సానే స్ఫూర్తి అంటుందామె. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ముత్తులక్ష్మి ఆశ్రమం ఉంది. ముత్తులక్ష్మి స్వగ్రామం మంత్రాలయం మండలం ఖగ్గలు . ముంబాయిలో ఉండేవారామె తలిదండ్రులు. అప్పుడే ఆమెలో ఈ సేవాతత్పరతకు బీజం పడింది. 'పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు మా బడికి మదర్ థెరిస్సా వచ్చారు. పిల్లలందరినీ ముద్దాడిన మదర్ నన్ను మాత్రం పట్టించుకోనేలేదు. ఎంతో చిన్నబుచ్చుకున్నాను. బోలెడంత ఏడుపొచ్చింది. కనీసం ఆమె చేతిస్పర్శ భాగ్యం కూడా కలగలేదే.. ఎందుకిలా జరిగిందని నాలో నేనే కుమిలిపోయా. అయితే, మదర్ వీడ్కోలు తీసుకునేముందు నవ్విన నవ్వు మరచిపోలేకపోయాను. ఆమె చూపు నన్ను వెన్నాడుతూనే ఉండేది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. రైల్వేఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు వినపడిన పసిపాప ఆక్రందన నన్ను కదిలించింది. వెతగ్గా ప్లాట్‌ఫారంపై ఎవరో వదిలి వెళ్లిన పసిగుడ్డు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడర్థమైంది. ఇక నుంచి నేనాచరించాల్సిన ధర్మం అదేనని. మదర్ సందేశం కూడా అదేనేమో..' అంటుందామె 28 ఏళ్లనాటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ... తర్వాతే జ్యోతిఆశ్రమం ఏర్పాటైంది. దాని నిర్వహణకోసం ముత్తులక్ష్మి ఎవరి పైనా ఆధారపడాలనుకోలేదు. కూలీ డబ్బులతోనే ఉన్నంతలో అందరికీ భోజనం పెట్టగలిగింది. ధర్మాత్ములందించిన సాయంతో శక్తిమేరకు పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పించింది. తానేదో ఘనకార్యం చేశాననుకోవడం లేదంటుందామె. ఉన్నంతలో ఆర్తులకు సాయపడ్డానన్న సంతృప్తి చాలు అంది . ఉడతాభక్తిన సాటిమానవులకు ఆమె చేస్తున్న సాయం అభినందనీయం కాదంటారా!(ఈనాడు 14.10.2008)

Nrahamthulla చెప్పారు...

* మానవత్వానిదే పైచేయి!

ముష్కరులు నిప్పెట్టిన ఇంట్లోకి ధైర్యంతో ముందడుగు-ముస్లిం కుటుంబానికి రక్షణ-భైంసాలో హిందూ వృద్ధురాలి ఔదార్యం ఆదిలాబాద్, న్యూస్‌టుడే: ఆదిలాబాద్ జిల్లా భైంసా లో దుర్గామాత ఉత్సవాలు.. అందరూ సంతోషంగా, ఉత్సాహంగా చూస్తున్నారు. పంజేషాచౌక్ వద్దకు రాగానే ఏం జరిగిందో ఏమో! ఒక్కసారిగా రాళ్ల వర్షం మొదలైంది. అల్లరిమూకలు ఇళ్లపైబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. తలుపులు పగులగొట్టి లోపలికి వస్తున్నాయి. జనమంతా భయభ్రాంతులయ్యారు. ముష్కరుల స్వైరవిహారాన్ని తలుపు సందుల్లోంచి చూస్తున్నారు. ఇంతలో తమకు తెలిసిన ఒక కుటుంబం.. తమ ఇంటి ఎదురుగానే అల్లరిమూకల కంట పడింది. దుండగులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. వారు మంటల్లో చిక్కుకొన్నారు. అందరూ ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో తలదూర్చితే ఏమైనా జరిగే ముప్పు! దీనికి ఆ 65 ఏళ్ల మహిళ భయపడలేదు. మానవత్వంతో ముందుకు కదిలారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపైకి వచ్చారు. తమతో కలిసిమెలిసి ఉండే ఆ ముస్లిం కుటుంబాన్ని అగ్నికీలల నుంచి రక్షించి తన ఇంటికి తెచ్చుకొని ఆశ్రయమిచ్చారు. ఆ హిందూ మహిళే తుల్జాబాయి . చాలా మంది అనుకొంటున్నట్టు భైంసా ప్రజలు రెండుగా విడిపోలేదు. అందుకు మానవత్వం తో తుల్జాబాయి చేసిన సాహసమే తాజా నిదర్శనం. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భైంసాలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. పంజేషాచౌక్ వద్ద మసీదు దాటిన తరువాత చిన్నపాటి కిరాణా దుకాణం ఉంది. అక్కడే తన కొడుకులు, కోడళ్లు, మనువళ్లు, మనుమరాళ్లతో తుల్జాబాయి ఉంటున్నారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం మొదలై అల్లరిమూకలు స్వైరవిహారం చేస్తుంటే.. అక్కడి జనమంతా ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు మూసుకొన్నారు. తుల్జాబాయి కుటుంబానిదీ అదే పరిస్థితి. కిటీకీ సందుల్లోంచి బయటకు భయంభయంగా చూస్తున్నారు. వారి ఇంటికి ఎదురుగా ఉండే సయ్యద్ ఉస్మాన్ ఇంట్లోకి అల్లరిమూకలు ప్రవేశించాయి. ఉస్మాన్ రిక్షా నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంఘటన సమయంలో ఆయన ఇంట్లో లేరు. దుకాణానికి వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య నసీమా, నలుగురు పిల్లలు ఉన్నారు. ముష్కరులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ పరిణామంతో హతాశురాలైన తుల్జాబాయి హృదయం తల్లడిల్లిపోయింది. ఘోరం ఆపేందుకు వెంటనే తలుపులు తెరిచి కొడుకులు, మనుమలను తీసుకుని ఉస్మాన్ ఇంటిలోకి ప్రవేశించారు. తమ వెంట బిందెలతో తెచ్చిన నీళ్ళు మంటలపై చల్లి నసీమా, నలుగురు పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల సాయంతో రాత్రి 7.30 అప్పుడు ఉస్మాన్ ఘటనాస్థలానికి చేరుకుని తన కుటుంబం గురించి ఆరాతీశారు. తుల్జాబాయి నివాసంలో సురక్షితంగా ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకొన్నారు. జరిగిన సంఘటన నుంచి తేరుకోవడానికి కట్టుబట్టలతో బాధిత కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. తుల్జాబాయి కి చంద్రబాబు ప్రశంస వర్గాల మధ్య ఘర్షణల్లో తుల్జాబాయి చూపిన తెగువను, మానవత్వాన్ని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రశంసించినప్పుడు ఈ విషయం తెలిసింది. నాటి ఘటన కళ్ల ముందు కదలుతోందని ఆమె 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. అల్లరిమూకల చేతిలో కత్తులు, కటార్లున్నాయి. విచక్షణరహితంగా ప్రవరిస్తూ ఇళ్లకు నిప్పుపెట్టాయి. దుండగులు ఇక్కడి వారు కాదు. వారు బయటి నుంచి వచ్చినట్టుగానే ఉంది అని ఆమె తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తామందరం కలిసిమెలిసి ఉంటున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఘర్షణ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.(ఈనాడు 14.10.2008) మానవత్వాన్ని కాపాడిన అమ్మవు నీవు అంటూ గద్దర్ తుల్జాబాయికి పాదాభివందనం చేశారు.(ఈనాడు 15.10.2008)

Nrahamthulla చెప్పారు...

* మద్యంలో కలిసిన మానవత్వం

రాజమండ్రి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు దుర్మరణం చెంది మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రమాదానికి గురైన లారీలోని బీరు సీసాల కోసం మందుబాబులు ఎగబడ్డారు. రాజమండ్రి నగరం మోరంపూడి సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున మద్యం సీసాల లారీ ఎదురుగా వెళుతున్న ట్రాలర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మద్యం సీసాల లారీ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ధ్వంసమైన లారీ క్యాబిన్ శిథిలాల్లో ఇరుక్కున్న అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ఒక పక్క నానా హైరానా పడుతుంటే వారికి సహాయపడాల్సింది పోయి కొందరు బీరుసీసాలు అపహరించుకుపోయేందుకు పాకులాడారు.(ఈనాడు15.10.2008)
* ముస్లిం యువకుని ఔదార్యం

భైంసా నిర్మల్ పట్టణాలలో మతఘర్షణలకు పాల్పడిన వారికి ఇది కనువిప్పు.హిందూ కుటుంబానికి చెందిన నరసింహరావు వర్మ కూతురు నిమిషా కు 11 నెలల పాపకు ముస్లిం యువకుడు అసద్ బిన్ సలామ్ రక్తదానమిచ్చి ప్రాణాలు కాపాడి మత సామరస్యాన్ని చాటాడు.ఇరువర్గాలూ మతవిద్వేషాలతో రగిలిపోతున్న సమయంలో మతోన్మాదులకు తన మానవత్వంతో కనువిప్పు కలిగించాడు.(సాక్షి 15.10.2008)
ఇలాంటి సంఘటనలను పదే పదే మనం చెప్పాలి.

తెలుగుకళ చెప్పారు...

రహ్మతుల్లాగారూ ! మంచి సమాచారం ఇచ్చారు.
Hats off to them

Nrahamthulla చెప్పారు...

* మనసు మంచి 'ముత్యం'

బస్టాండ్‌లు.. రైల్వేస్టేషన్‌లు.. చెత్తకుప్పలు... ఆస్పత్రులు.. గుళ్లు.. ఇలా ఎక్కడెక్కడో వదిలేసిన నెలల శిశువులను అక్కున చేర్చుకుంటుందామె. పురిటిబిడ్డలను పొదివిపట్టుకుని పెంచిందామె. లాలపోసింది... బువ్వపెట్టింది... పెద్దయ్యాక విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లిళ్లు చేసే బాధ్యతకూడా తానే స్వీకరించింది. పొత్తిళ్లలో శిశువులుగా ఆమె నీడన చేరిన ఎందరో నేడు పట్టభద్రులయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. అయినా, ఆమెతో అనుబంధాన్ని మాత్రం వీడలేదెవరూ. ఇంతకీ ఈమె ఎవరంటారా! కర్నూలు జిల్లాకు చెందిన ముత్తులక్ష్మి . ఇరవై ఎనిమిదేళ్లుగా ఇదే సేవలో తరిస్తోంది. ముత్తులక్ష్మి పెళ్లే చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశమే ఆమెకు కలుగలేదు. మదర్ థెరిస్సానే స్ఫూర్తి అంటుందామె. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ముత్తులక్ష్మి ఆశ్రమం ఉంది. ముత్తులక్ష్మి స్వగ్రామం మంత్రాలయం మండలం ఖగ్గలు . ముంబాయిలో ఉండేవారామె తలిదండ్రులు. అప్పుడే ఆమెలో ఈ సేవాతత్పరతకు బీజం పడింది. 'పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు మా బడికి మదర్ థెరిస్సా వచ్చారు. పిల్లలందరినీ ముద్దాడిన మదర్ నన్ను మాత్రం పట్టించుకోనేలేదు. ఎంతో చిన్నబుచ్చుకున్నాను. బోలెడంత ఏడుపొచ్చింది. కనీసం ఆమె చేతిస్పర్శ భాగ్యం కూడా కలగలేదే.. ఎందుకిలా జరిగిందని నాలో నేనే కుమిలిపోయా. అయితే, మదర్ వీడ్కోలు తీసుకునేముందు నవ్విన నవ్వు మరచిపోలేకపోయాను. ఆమె చూపు నన్ను వెన్నాడుతూనే ఉండేది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. రైల్వేఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు వినపడిన పసిపాప ఆక్రందన నన్ను కదిలించింది. వెతగ్గా ప్లాట్‌ఫారంపై ఎవరో వదిలి వెళ్లిన పసిగుడ్డు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడర్థమైంది. ఇక నుంచి నేనాచరించాల్సిన ధర్మం అదేనని. మదర్ సందేశం కూడా అదేనేమో..' అంటుందామె 28 ఏళ్లనాటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ... తర్వాతే జ్యోతిఆశ్రమం ఏర్పాటైంది. దాని నిర్వహణకోసం ముత్తులక్ష్మి ఎవరి పైనా ఆధారపడాలనుకోలేదు. కూలీ డబ్బులతోనే ఉన్నంతలో అందరికీ భోజనం పెట్టగలిగింది. ధర్మాత్ములందించిన సాయంతో శక్తిమేరకు పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పించింది. తానేదో ఘనకార్యం చేశాననుకోవడం లేదంటుందామె. ఉన్నంతలో ఆర్తులకు సాయపడ్డానన్న సంతృప్తి చాలు అంది . ఉడతాభక్తిన సాటిమానవులకు ఆమె చేస్తున్న సాయం అభినందనీయం కాదంటారా!(ఈనాడు 14.10.2008)

తెలుగుకళ చెప్పారు...

కథాసాగర్ చెప్పారు...

To Err is Human , To Forgive is Divine"
బాగా రాసారు.. కాని ఒక్క మాట. నేను ఇలాంటి సంఘటనలు రోజూ చూస్తుంటాను. కాని ఎందుకో కొంత మందిని చూస్తే జాలి అనిపించినా చేయలేని నిస్సహాయత లో ఉంటాము. ఒకటి సమాజం మనలను ఏమనుకుంటుందో అని .. మరియు వీడి కర్మ ఇంతే నని సరిపెట్టుకోవడం తప్ప.. అయినా మీరు చేసింది మంచిపనే.. అందుకు మీకు కృతఙ్ఞతలు.. కాని ఇలాంటి వారు మనకు చాల మంది కనిపిస్తారు రోజు..

అరుణాంక్ చెప్పారు...

మీరు చాలా మంచి పని చేసారు.మీరన్నట్లు కొంతమంది జాలి దయ లేక పొగా ద్వేషిస్తారు .మరికొంతమంది సహాయం చేయాలని ఉంటుంది,కాని చేయలేరు.కారణం ఎదయినా కావచ్చు.మనము ఏదయినా ముఖ్యమయిన పని మీద వెళుతూ ఉండవచ్చు .
విజయవాడ లోSKCV గురించి మీరు వినే ఉంటారు.ఒక AUSTRQALIAN(మణిహార..) దాన్ని స్తాపించాడు .ఈమద్యనే చనిపోయాడు .నిజంగా తను మణే.వెరేదేశం NUMCI వచ్చి ఇలా సెవ చేసాదు. ఒక సారి SKCV VILLAGE లో కలిసను కూదా.
VISITING కార్ద్స్ హనుమాన్ పేట లో వున్నSKCV లో చైంచాను. లేటుగా ఇచ్చారు .నాలుగు సార్లు తిరిగయినా తెచ్చుకున్నాను.బయత ఎక్కదయినా చేఇంచుకొవచ్చు ,కానీ వారికి కొంత సహాయం చేసినట్లు ఉంటుందని . వీది బాలలను సరయిన డారి లో పెట్టక పోతే .వారు ANTI SOCIAL ELEMENTS గా మారే ప్రామాదం ఉంది.

అజ్ఞాత చెప్పారు...

మిరు వ్రాసినది చదువుతూంటే, క్రిందటేడాది తన ఆఫీసు దగ్గర ఒకసారి, మా కోడలు రోడ్డు మీద ఎవరికో ఎక్సిడెంట్ అయిన మనిషిని చూసి, ఎవరూ పట్టించుకోకపోయినా తనే ఆ అబ్బాయిని హాస్పిటల్ కి తీసికెళ్ళి జాయిన్ చేసింది. ఆ తరువాత, వాళ్ళవాళ్ళకి ఫోన్ చేసి, వారు వచ్చేదాకా ఉండి ఆ తరువాత ఆఫీసు కి వెళ్ళింది.
అలాగే మా అబ్బాయి కూడా ఆఫీసు కెళ్ళే సమయం లో ఓ పెద్ద మనిషికి, నోట్లోంచి రక్తం కారుతూంటే చూసి, ముందుగా పొలీస్, ఆంబ్యులెన్స్ లకు ఫోన్ చేసి, వారు రావడం ఆలశ్యం అవుతోందని, తన కారు లోనే హాస్పిటల్ కి తీసికెళ్ళి జాయిన్ చేశాడు. అంతకుముందు, దగ్గరలోనే ఉన్న మిలిటరీ హాస్పిటల్ లో ప్రధమ చికిత్స చేయించాడు. ఇలాంటి వారిని చూస్తే ఇంకా మానవత్వపు విలువలు అంతరించలేదనిపిస్తూంది. ఇలాంటివి చెప్పుకోనఖర్లేదు. కానీ అలాంటి వారు ఇంకా ఉన్నారని తెలియచేయడానికే ఈ సంగతి ప్రస్తావించాను..

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

మనుషులెందరు పుట్టిరి! మనసు లేక!
దారి తప్పిన వారల దరిని చేరి
దానవత్వము రూపుమాపిన నరుడెపొ
పుడమి దాటగ పొందును పుణ్య ఫలము.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

మనుషులెందరు పుట్టిరి! మనసు లేక!
దారి తప్పిన వారల దరిని చేరి
దానవత్వము రూపుమాపిన నరుడెపొ
పుడమి దాటగ పొందును పుణ్య ఫలము.

Unknown చెప్పారు...

Sodari Padmakala,

emanukovaddu nenu telugulo typu cheyyalenu. anduke ila rasthunnanu. kaasthanta manavatha drushti vundi theerali. kaneesam evari paridhilo varu konchamiana deenavasthalo vunna vallani karunishthe bhagavanthudu santhoshisthadu. mana atma santhisthundi.

mee anna pokkuluri subbarao

కామెంట్‌ను పోస్ట్ చేయండి