Pages

29 డిసెం, 2009

. బ్లాగు మితృలారా… నాతో మీగళాన్ని, కలాన్ని కలపండి….

 

 

అసలు ఏమిటీ సినిమాలు? ఏమిటీ పాటలు? ఏమిటీ చిత్రీకరణలు ?

ఎవరికి వారు మనసులో గొణుక్కుంటూ కాలం వెళ్ళబుచ్చటమే కానీ వాళ్లని  నియంత్రించే ప్రయత్నం చేయరా?

మీకు కోపం లేదా? అసలు రాదా? నాకు నచ్చక పోతే   చూడటం  మానేస్తా నని తప్పించుకుంటారా?

సామాజిక బాధ్యత మనకి అవసరం కాదా?

పాశ్చాత్యానుకరణ వెర్రిలో మునుగుతున్న యువతరాన్ని రక్షించుకునే కర్తవ్యం మనది కాదా?

అనగా అనగా కొన్నాళ్ళకి ఏదైనా అలవాటైపోతుంది.ఈ మధ్యలో వచ్చిన ఇంకో పాటలో చెప్పాకు చెప్పాకు అంటూ.., వయసన్న మాట మా వంశంలో లేదు.. మామన్నది తప్ప ఏ వరసా రాదు?  అంటూ మరో సినిమాలో ఎవరీ పాటలు రాసింది? అంటే జనానికి వేశ్యల్ని ఆదర్శంగా చూపిస్తున్నారా? వాళ్ల బతుకులు నరకాల్లా ఉండి ఆ కూపంలోంచి బయటపడలేక చస్తుంటే  వీళ్లకి పరాచకంగా ఉందా?…..

 

కొత్త దనం పేరుతో వెరైటీ ముసుగులో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు, అందులోని చెత్త పాటలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? మనమేమీ చెయ్యలేమా? కనీసం మన అయిష్టతను ప్రదర్శించలేమా?

మీరు చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం అని వాళ్ళు, మీరు తీస్తున్నారు కాబట్టే మీం చూస్తున్నాం అని మనము … చచ్చినట్టు సినిమాలలో దరిద్రాన్ని భరిస్తున్నాం. మిత్రులారా ! ఈ పాటలు , మాటల ప్రభావం తప్పొప్పుల రుచి తెలిసిన మనపై ఉండకపోవచ్చు. కానీ ఇంకా జీవితం విలువ తెలియని పసిమొగ్గలపైన ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రతిరోజు జరిగే సంఘటనల్లో కనిపిస్తూనే ఉంది.

నిజానికి నాది ఆవేశం కాదు. ఆందోళన. నేను మొత్తం నాలుగైదు రంగాల్లో పనిచేస్తూ ( బోధన, జర్నలిజం, రేడియో, బ్లాగింగ్, కవిత్వం…) గమనించిన విపరీతాల దృష్ట్యా  నా భావాలు మీ ముందుంచ దలిచాను. ఇవి పూర్తిగా నా వ్యక్తిగ అభిప్రాయాలైనప్పటికి  వాటికి పునాది మాత్రం సమాజమే అనటంలో ఎటువంటీ సందేహమూ లేదు. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించాలన్నఅవసరం లేదు.

మన చేతకాన్ని తనాన్ని ఆసరాగా తీసుకుని నోటికొచ్చిందల్లా వాళ్ళూ రాస్తుంటే .. వెర్రి తనం వెయ్యితలలు  వేసి అసభ్యమైన చిత్రీకరణలు చేస్తుంటే…. విఙ్ఞులైన  మనం  ఊరుకోవాల్సిందేనా?

నావంతు కర్తవ్యంగా  కనీసం ఈ సంవత్సరాంతంలోనైనా  మన వ్యతిరేకతను , నిరసనను ప్రదర్శించాలని సంకాపించాను.

అయితే ఏం చెయ్యాలి? అని ప్రశిస్తున్నారా?

మీరు చెయ్యవలసిందల్లా.. ఇప్పటివరకు మీకు నచ్చని అతి చెత్త పాటను, ఆ రాత రాసిన మహానుభావుడ్ని, పరమ చెత్తగా చిత్రీకరించిన దర్శకమహాశడ్ని గురించి చెప్పాలి. ఎక్కడైనాసరే..

నా ఆలోచన ప్రకారం ఈ ఏడాది చివరిలో ఒక స్పెషల్ కంటెస్ట్ నిర్వహించాలని, కొత్త సంవత్సరంలో కూడా .. ( డిసెంబర్౩౦ న చెత్త పాట కంటెస్ట్, జనవరి 1 న గొప్పపాట కంటేస్ట్ .. ఈ రెండిటిలో మీ ఎంపికలను వీలైనంత త్వరగా అందించవలసిందిగా కోరుతున్నాను. సంక్రాంతి వరకు ఈ  పోటీఉంటూంది.

సంక్రాంతికి ఉత్తమ సినిమా పాట , పరమ చెత్త పాట అవార్డు ఇద్దాం.

 

రింగ రింగ…. ఏమిటీ పాట?…. ఇది తెలుగు సినిమానా ? లేక పద్ధతీ పాడూ లేని  ఎం(ఇం)గిలీసు సినిమానా?

ఇలాంటివి ఎన్ని పాటలో.. మన దౌర్భాగ్యమో , సినిమావాళ్ళ అదృస్టమో తెలియదుకానీ పరమ చెత్త సాహిత్రానికే అద్భుతమైన మ్యూజిక్.. కంపోజింగ్ సెట్టవుతుంది.

ఓ సారి నేను ట్రెయిన్ ప్రయాణిస్తుంటే ఓ తండ్రి ముద్ద్దులొలిలే బుజ్జిబాబుని ( కనీసంఏడాది వయసుంటుందో లేదొ కానీ ) ఇంకా నిలబడలేక పోతున్నాడు ఆ పిల్లాడ్ని వేళ్ళకు పట్టుకుని ఒళ్ళో నిలబెట్టి నానా డాన్స్ చెయ్యరా .. అంటూ ఓ పాటని హమ్ చేశాడు.. ఆ పాటేమిటో తెలుసా?… టంట టంటా.. టంటం టాంట.. టంట టంటా.. టంటం టాంట.. టాంట టాంటడంట టంటంటం టంటంటా……. ( ఆకలేస్తే అన్నం పెడ్తా… పాట) పిచ్చి పిల్లోడు అయ్య అభిరుచులకి అద్దం పడుతూ ఓ.. పూనకం వచ్చినట్టుగా ఊగిపోతున్నాడు. ఆయనేమో ఇదంతా ఓ పెద్ద గిన్నిస్ బుక్ రికార్డ్ గా ఫీలైపోతూ బోగీలోవారందరికీ ఒకటే బిల్డప్…. నాకతన్ని చూస్తే ఓ పక్క జాలి, మరోపక్క పట్టరాని ఉక్రోషం ముంచుకొచ్చాయి.. మనసు చంపుకోలేక అడిగా ఇంత చిన్న వయసులొ పిల్లలకి నేర్పించడానికి మీకింకేం విషయాలు, పాటలు దొరకలేదా? అని. ఆయాన చెప్పాడు గర్వం గా  మావాడికి ఇంకే పాటా నచ్చదండీ…. ( అవును మరి వాడికి తెలుసు కదా .. ఏ పాట ఏమిటో….. కనీసం స్పష్టంగా నాన్నని పలకలేని పిల్లోడికి ఐటమ్ సాంగ్స్ .. మాత్రమీ నచ్చుతాయట…. ) చూశారా…..  ఇదే కదా నిజమైన కలికాలం ! పోగాలము దాపురించడమంటే ఇదే కదా !

 

మరి ఇంత చదివాక మీ అభిప్రాయం , ఆలోచన  కూడా ఆవిష్కరించనంటె మీ ఇష్టం…

మీరు ఓటుఇక్కడే వెయ్యాలన్న నియమం లెదు. ఈ విషయం పై బ్లాగు మితృలందరూ చిన్నదో పెద్దదో ఒక పోస్టు కేటాయించవలసిందిగా కోరుతున్నాను. అది రేపటి రాత్రి లోపు అయ్య్యిపోవాలి.

డిసెంబర్ 30  న  మీకు నచ్చని ఒక చెత్తపాటపై , జనవరి ఒకటిన మీకు నచ్చిన గొప్పపాట గురించి  పోస్టు చెయ్యటం కాని ఇక్కడ మీ ఓటు చెప్పటం కానీ చెయ్యగలరు.

మీ బ్లాగులో పోస్టు చేసేటట్లయితే ఆ  లింకు ఇక్కడఇ వ్వండి . మేమందరం వచ్చి మీ అబిప్రాయాలు, భావాలు పంచుకుంటాం……

ఈ ఆలోచనను విజయవంతం చేస్తారని ఆశిస్తూ…..

తెలుగుకళ – పద్మకళ.

20 కామెంట్‌లు:

Lavanya shalini చెప్పారు...

s nenu mee abhi prayani angikaristunanu akka
naku nachina song Godavari movie lo ee song నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా......
nachani pichi song vangatota vangathota valau kada song (pic ABHI)

Kathi Mahesh Kumar చెప్పారు...

సినిమాల్ని కంట్రోల్ చెయ్యడానికి ఒకవైపు సెన్సార్ మరోవైపు ప్రేక్షకులూ ఉన్నారు.కానీ ప్రస్తుతానికి ఇద్దరూ నిద్రపోతున్నారు. చాలా ఘాఢనిద్రలోకి జోకొట్టబడ్డారు.We are conditioned to be insensitive.ఉదాసీనత ఒక అలావాటైపోయింది.

రింగారింగా పాటచూసి ఆడియోస్థాయిలో సినిమాలో చిత్రీకరించలేదని నిరాశపడిన ప్రేక్షకులెందరో నాకు తెలుసు. అంటే దానిలో "చూపించగలిగింది ఇంకా చూపించలేదు" అని వాళ్ళ నిరాశ. సగటు ప్రేక్షకుడ్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మన చిత్రపరిశ్రమ.

సినిమాకు సామాజిక బాధ్యత ఉంది అని నాలాంటోడెవడైనా అంటే, "నీకు తెలుగు సినిమాలు చూడ్డంరాదు. తెలుగుభాష అంటే గౌరవం లేదుకాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావు" అని బయటోళ్ళు ఏవేవో అనేసుకుంటారు/అంటారు.అదేమాట సినిమా పరిశ్రమలో చెబితే "విమర్శకుడిగా నువ్వు ముదిరిపోయావు కమర్షియల్ సినిమా తియ్యడానికి పనికిరావు" అని తేల్చేస్తారు.

మీరు చెప్పిన సమస్య నిజమైనదేగానీ దానికి కారణం పాశ్చాత్య అనుకరణ మాత్రం ముమ్మాటికీ కాదు.రింగారింగా పాట మన రికార్డింగు డ్యాన్సులకు ఒక అనుకరణ మాత్రమే.

నిజంగా మనం ఇంగ్లీషు సినిమాల్ని అనుకరిస్తే గొప్పగొప్ప కళాఖండాలు తెలుగులో వస్తాయి. అది చేతగాకనే ఈ చౌకబారు మనోరంజనాన్ని మన తలలకు అంటగడుతున్నారు సినీపెద్దలు. మన sex starved ప్రేక్షకులు ఇలాంటివాటినే "ఇంకాఇంకా" అని లొట్టలేసుకుని చూసేస్తున్నారు.

మీకో వార్త చెప్పనా, నవంబర్-డిసెంబర్ మాసాల్లో రిలీజైన అన్ని తెలుగు సినిమాలూ అట్టర్ ఫ్లాపైన ఈ సందర్భంలో కమర్షియల్గా సక్సెసైన ఒకేఒక చిత్రం పేరేమిటో తెలుసా..."మన్మధులు" అనే డబ్బింగ్ చిత్రం. పక్కా బూతు చిత్రం. అది మన ప్రేక్షకులకు కావలసింది.

తెలుగు సినిమాలిలా ఉండేవరకూ ప్రేక్షకుడు మారడు. ప్రేక్షకులు ఇలా ఉండేంతవరకూ తెలుగు సినిమాలు మారవు. ఇంతేసంగతులు...చిత్తగించవలెను.

sumanivenkat చెప్పారు...

Good Post M'm
ఒకసారి ఈ లింక్ ను కూడా చూడండి. మీ అభిప్రాయానికి (బంగారానికి పరిమళం అద్దినట్లు పరిపోతుంది)
http://mahigrafix.com/forums/showthread.php?tid=2275&highlight=%E0%B0%97%E0%B0%B3%E0%B0%82+%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE

చదువరి చెప్పారు...

ఈమధ్య కాలంలో వచ్చే పాటలు వినడంలేదు. మన సినిమాల్లో మంచిపాటలు రావు అనే నిరాశ బహుశా కారణం కావచ్చు. అంచేత చెత్తపాటలను నేను ఎంచలేను.

మీ ఆవేదన, కోపం అర్థవంతంగా ఉన్నాయి. పరమ చెత్తపాటను ఎంపిక చేసాక, ఆ రాసినవాడికి, ఆ సినిమా దర్శకుడికీ 'మీ పాటకు జరిగిన సత్కారాన్ని చూసేడవండి' అని ఓ ముక్క రాసి పడేస్తే బాగుంటుంది.

Unknown చెప్పారు...

ఏవండి కంబలి లో తింటూ బోచ్చుని కని పెట్టండి అనట్టు గా వుంది , సినిమా పాటల్లో ద్వందర్దల స్తాయి పోయి డైరెక్ట్ గానే రాసేసే స్తాయి కి ఎదిగి పోయాం.పాత కాలం నాటి పాటల్లో కూడా ఇవి ఉండేవి .
ఉదాహరణకి ''పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని'' దసరాబుల్లోడు లో చేతిలి చెయ్యేసి చెప్పు బావ పాటలోని సాహిత్యం .ఇంకోటి కృష్ణ సినిమాలో పాట ఎన్నో కోతలు కోశారు అన్ని తెలుసనీ అన్నారు ఇంతేనా మీ పనితనమంతా ఇంతేనా? అని హీరోయిన్ అంటే అంతటి మాట అనకండి ఆఖరి దాక చూడండి చూస్తారు నా పని తన మేదో చూస్తారు అంటాడు. ఏమండి సారూ వో బట్లరు దొరగారు పాట అది . ఇంకా ఎదురులేని మనిషి సినిమాలో కసి గా వుంది కసి కసి గా వుంది పాట తెలుగు పాటల్లో ద్వందర్దాలకి స్వస్తి చెప్పి తిన్నగా బూతు పట్టాల మీదకు తీసుకొచ్చిన పాట .అలాగే సోగ్గాడు సినిమాలో చలి వేస్తోంది చంపేస్తోంది పాట కుడా రా రా కప్పు కుందాం , నన్ను నువ్వు నిన్ను నేను హత్తుకుందాం అని . చెప్పుకుంటూ పొతే ఎన్నో . ఇంకా కొత్త పాటల గురించి చెప్పుకోవాలంటే పండుముసలి గవర్నర్ రాసలీలా మాట్లాడ టానికి యెంత సిగ్గు పడాలో అంత సిగ్గు పడాలి .

sunita చెప్పారు...

నేను ఈ మధ్య కాలంలో తెలుగు పాటలు వినడమే మానేసాను. కనుక ఈ టపాలో పాల్గొనడానికి నా ఈ క్వాలిఫికేషను చాలదు.

వసంత చెప్పారు...

ఇవన్నీ ఒక ఎత్తైతే... ఆట లాంటి షోల్లో చిన్న చిన్న పిల్లలు ఇలాంటి పాటలకు బొడ్డు కిందకు డ్రెస్సులు వేసి డ్యాన్సులు వెయ్యడం.. జడ్జ్ లు పొగడటం చూస్తుంటే అందరిని పెట్రోలు పోసి తగలపెట్టాలనిపిస్తుంది...

రవి చెప్పారు...

సినిమా పాటలే గుర్తుండి ఛావట్లేదు. మరి గుర్తుంచుకుని ఎలా రాయాలండీ? అదీ చెత్త పాటలను?

నాకు తెలిసి, 2009 లో కాస్త గుర్తు ఉండగల పాట, "మేఘమా రావాలమ్మా, వానగా కరుగుటకు" అన్నది, ప్రయాణం సినిమాలో.

nalgonda చెప్పారు...

సినిమాల్ని కంట్రోల్ చెయ్యడానికి ఒకవైపు సెన్సార్, ప్రేక్షకులూ ఉన్నారు.కానీ ప్రస్తుతానికి ఇద్దరూ నిద్రపోతున్నారు. తెల దొరలను వేలగోటిన తెలుగు వారి సంప్రదాయాలలో మార్పు రాలేదు కావున ఈ ఉద్యమంలో నేను కూడా భాగస్వామి అవుతాను నాసహాయం మీకు వుంటుంది .

Anil Dasari చెప్పారు...

రింగా రింగా పాట ఏమిటి? ఎక్కడ లభిస్తుంది?

ఉత్తినే అడిగాలెండి :-) అదేదో చెత్త పాటని విన్నా కానీ అసలు పాట వినలేదు. చెత్త పాటలు వినటమే దండగ. మళ్లీ వాటికోసం ఓపిక చేసుకుని వందలాది చెత్త పాటలు విని వాటిలోకెల్లా అద్భుతమైన చెత్తన్నర పాటకి వోటేసి గెలిపించటమంటే .. కష్టమే. ఎవరేస్తారు అంత తీరిగ్గా? ఆలోచించండి.

మీ ఆవేదన, ఆందోళన అర్ధమయ్యాయి కానీ మీది అనవసర ప్రయాస అనిపిస్తుంది. దానికన్నా ఆ ప్రయాస మొత్తాన్నీ అతి గొప్ప పాట కోసం ఫోకస్ చేస్తే బాగుంటుందని ఉచిత సలహా.

Raja చెప్పారు...

కొత్త కొత్త ప్రయత్నాలు ఎవరైనా చేయొచ్చు... అందులో తప్పేం ఉంది.. ఆ ప్రయత్నాలలో జనాధరణ పొందినవే నిలుస్తాయి... వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేయనివ్వండి... గోడలు కట్టుకుని... కూర్చుంటే ఏదీ ముందుకెళ్ళదు.. ఏది మంచో ..ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ పిల్ల లకి నేర్పించండి వాళ్ళ వాళ్ళ పరిదులలో వాళ్ళని ఆనందించనివ్వండి..... అంతే కాని.... ఇవి బాలేవు...అవి బాలెవు అని చాదస్తపు మాటలు గోడ కట్టుకోవటమే అవుతుంది...

శరత్ కాలమ్ చెప్పారు...

http://sarath-kaalam.blogspot.com/2009/12/blog-post_29.html

లక్ష్మి చెప్పారు...

పద్మ కళ గారు మీ ఆవేశానికి అర్థం ఉంది, మొన్నీ మధ్యే ఆ రింగా రింగా పాటని అబ్బో బీట్ బాగుంది అంటూ నా కొలీగ్ ఫార్వర్డ్ చేస్తే విని నోరు వెళ్ళబెట్టా. నిజానికి నేను తెలుగు సినిమా (ఆ మాటకొస్తే కొత్తగా వస్తున్న సినిమాలు ఏ భాషావి ఐనా) వినటం మానేసి చాలా రోజులు ఐపోయింది. ఇంక వీటిని ఇంగ్లీషు సినిమాలతో పోల్చటం...ఉం...ఏమో నాకైతే వారిలోని సృజనాత్మక శక్తిని పక్కనపెట్టి కేవలం వికారాలాను మాత్రమే మనవాళ్ళు మన మీద పంప్ చేస్తున్నారు అనిపిస్తుంది

నాగప్రసాద్ చెప్పారు...

హ హ హ. నాకో విషయం గుర్తుకొస్తోంది. మాక్లాసులో ఉండే మా మరాఠి మిత్రుడికి కాస్తంత తెలుగునూ, తెలుగు సినిమాలనూ అలవాటు చేశాం. వాడు కూడా తెలుగు పాటలను, సినిమాలను ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ఒకసారి వాడు ఇంటికి వెళ్ళినప్పుడు, మన తెలుగు సినిమా పాటలు play చేశాడంట. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ అన్నయ్య గారి కొడుకు, ఇంకా నడవటం కూడా రాని వయస్సు అతనిది. ఒక తెలుగు పాట play చేస్తే మాత్రం సైలెంట్ అయ్యి నిద్రపోతున్నాడట. ఆ పిల్లాడు ఎప్పుడయితే ఏడుస్తాడో, అప్పుడు వాళ్ళు ఈ తెలుగు పాట ప్లే చేస్తారంట. అంతే, ఆ పిల్లాడు సైలెంట్ అయిపోతాడన్నమాట. మా మిత్రుడు ఇంటినుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం గురించి చాలా ఆశ్చర్యంగా చెప్పాడు.

ఇంతకీ ఆ తెలుగు పాట ఏమిటంటే, ఆర్య సినిమాలోని "అ..అంటే ...అమలాపురం..ఆ...అంటే...ఆహాపురం.." పాట. :) :) :).

తెలుగుకళ చెప్పారు...

http://sarath-kaalam.blogspot.com/2009/12/blog-post_29.html#comment-form

శరత్ గారు ఇచ్చిన లింక్
ఇది. ఇక్కడ క్లిక్ చెయ్యండి. అభిప్రాయాలు కూడా చదవండి..
శరత్ గారూ.. ఏ ఒక్కరూ పూర్తి మాస్ కాదు, ఏ ఒక్కరు పూర్తి క్లాస్ కాదు.
రెండూ మనమే.. మన ఆలోచన , అభిప్రాయాల్ని బట్తి కొద్దిపాటి తేడాలుంటాయి.
ఇక్కడ మీరు, మేము తేడాలు లేనే లేవు. మనమందరం బ్లాగు వేదికపై భిన్నాభిప్రాయాలున్నా మిత్రులమే...

తెలుగుకళ చెప్పారు...

http://sarath-kaalam.blogspot.com

తెలుగుకళ చెప్పారు...

లింక్ పై క్లిక్ చేస్తే వెళ్ళటం లేదు. కాపీ చేసి పేస్ట్ చెయ్యడం ద్వారా కానీ, లేదా శరత్ గారిపేరుపై క్లిక్ చేసి కానీ వారి బ్లాగుకు వెళ్లవచ్చు.

మిత్రులకి మనవి. మీ అభిప్రాయాలు మాత్రమీ వ్యక్తపరచవలసిందిగా మనవి.
మీ భావాలు వివాదాస్పదంగా , ఇతరుల భావాలను విమర్శించేలా ఉండకూడదు.
వీలైనంత వరకు స్నేహపూర్వకంగా , ఆరోగ్యకరమైన వాతావరణంలో మన భావాలు పంచుకుందాం. అలా చెయ్యలేని వారు నాపై దయ ఉంచి మౌనంగా ఉండాలని ప్రార్థన.

budugu చెప్పారు...

సునిత గారు, మంచి మాట చెప్పారు. ఆట జూనియర్స్ అని మొన్న ట్రయలర్‌లో చూశాను. నాలుగడుగులు లేని పిల్లలు అసయ్యమైన డ్రెస్సులతో పెల్విక్ మూమెంట్స్‌తో డాన్సులు. పెట్రోల్ పోసి తగలెట్టాలనిపించింది అంటే అనిపించదా మరి. దీనికి మాస్ అని పేరు పెట్టి మళ్ళీ సమర్థించే ప్.. అమెరికాలాంటి దేశాలే నయం. పెద్దలెంత విచ్చలవిడిగా ఉన్నా పిల్లలకు మాత్రం హద్దులు సరిగ్గా పాటిస్తారు. మన బుద్ధిలేని సెన్సారులు ఉన్నంత వరకూ ఇలాంటి నాన్‌సెన్స్ కు అంతం లేదు.
నన్ను గట్టిగా అడిగితే ఇప్పుడున్న సెన్సారును రద్దు చేసి సినిమాలను, మాస్ మీడియాలను మనం రీ-బ్రాండ్ చేయాలి. ప్రతి దానికి appropriate age group లేబిల్ వేసి జనాల అవేర్నెస్ పెంచాలి.

Telugu Movie Buff చెప్పారు...

పద్మకళ గారు,
ఇటువంటి పాటలు ANR, NTR సినిమాల కాలం నుంచే వున్నాయి. కాకపోతే ఇప్పుడు కొద్దిగా శ్రుతి మీరడమో, అర్ధమయ్యి లేనట్టు కాక మరీ డైరెక్ట్ గా రాయడంనో లేదా మరొకటో జరుగుతోంది.
అయితే వీటిని ఆపటం సాధ్యం కాదు. ఎందుకంటే అటువంటి మసాల పాటలే ఎక్కువ కాసులు కురుపిస్తున్నాయి. ఇటువంటి పాటల తప్పు కూడా ఏమి లేదు.
అంతా తల్లితండ్రులు చేతిలో వుంది. అందరూ కొన్ని విషయాలు కేర్ తీసుకుంటే బావుంటుంది like, reality shows లో పిల్లల చేత పిచ్చి డ్రస్సులు, గెంతులు వేయించటం; అటువంటి షౌస్, సాంగ్స్, సినిమాలు చూడకుండా కంట్రోల్ చేయడం. అలాగే ఈరోజుల్లో న్యూస్ చానల్స్ ..ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి.
ఈ రోజుల్లో మంచి పాటలు, సినిమాలు ఎక్కడ అని ముందే చెత్త అని అనేసుకుని వారి వల్ల కూడా ఇటువంటి పాటలు ఎక్కువగా వస్తున్నాయి.
క్షమించండి. generalize చేసి చెప్పాను. నేను ఎవరిని ఏమి అగౌరవపరచలేదు. కొందరి ఉద్దేశ్యంలో మంచి అనబడ పాటలు,సినిమాలకు ఆదరణ లేక ఇటువంటి పాటలు ఎక్కువ వస్తున్నాయి.

మాలా కుమార్ చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి