27 మార్చి, 2010

మరో నేను దొరికేనా ….?

ఎన్నో ఏళ్ళుగా

ఎదురుచూస్తున్నాను

నా లాంటి మరో నేను కోసం

ఫలితం శూన్యం

అన్వేషిస్తూ , ఆలోచిస్తూ

సాగిపోతున్నాను

ప్రతి మలుపులో

అక్కడక్కడా

చిన్న ఆశ

చిన్న తపన

నా ఆలోచనల్ని

స్వీకరించి,

నాలా ఆలోచించే

నేను తారసపడవచ్చేమోనని

అదేమిటో

అనుకోకుండా

కనిపించి

అలా అనిపించి

కనుమరుగయ్యే

నీడలే అన్నీ…

నీడలు నిజాలు కావు కదా !

కిం కర్తవ్యం ?

అర్థమైంది

నేను డిజైనర్ పీస్ నని.

Thank God 4 not making duplicates for Me…..

I am the one .. Only one…

2 వ్యాఖ్యలు:

SRRao చెప్పారు...

పద్మకళ గారూ !
చాలాకాలానికి మీరొక్కరే అని డిక్లేర్ చేస్తూ రాసారు. బావుంది.

Pranus చెప్పారు...

పద్మ కళ గారు అనుకోకుండా మీ blog చూసాను చాలాబాగావుంది ..మీ blog background కూడా చాలాబాగావుంది ...మీ posts అన్ని చదివాను చాలాబాగా వ్రాసారు ..Have A Nice Day...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి