Pages

12 మే, 2013

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

 

chikkala1122

Maa Amma Bangaru Bomma !

అమ్మా !

ఏ లోకంతో మంతనాలు చేశావో ఏమో

ఈ ప్రపంచానికి నన్ను పట్టుకొచ్చావ్

నిండునూరేళ్ళ జీవితాన్ని కానుక చేశావ్

నడక నేర్పి నన్ను వదిలేశావ్
నేపరుగులు తీస్తే నువ్వాయాసపడతావ్
నాక్షేమం కోసం ఇల్లంతా దేవుళ్ళపటాలతో నింపేశావ్

స్తోత్రాలన్నీ బట్టీ కొట్టేశావ్
నా ఒళ్ళు వేడెక్కితే నీ కాళ్ళూచేతులూ చల్లబడిపోతాయ్

నేను కలవరిస్తే నువ్వు జాగారం చేస్తావ్
నేను లంకణముంటే నువ్వుపవాసం చేస్తావ్
నా ప్రపంచంలో ఓ మూల నువ్వు
నీ ప్రపంచం నిండా నేనే

నాకు రాబోయే బాధ ముందే పసిగట్టేస్తావ్
ఓదార్పు మంత్రంతో నాలో ఆవేదనల్ని కడిగేస్తావ్
నీ కనుపాపల చాటునున్న మౌనం
కన్నీటి బిందువులై కరిగిపోతున్న సంగతి మాత్రం
అత్యంత భద్రంగా దాచిపెట్టేస్తావ్ 

ఏ సాంకేతికతకూ లేని నూరుశాతం కనెక్టివిటీ
నీ ప్రేమ!
రీచార్జి ఖర్చూ లేదు
అద్దె కట్టే పనీ లేదు
అయినా నీతో రోజూ కాసిన్ని కబుర్లు పంచుకునేందుకు
మాయదారి లోకంలో నాకు తీరికా లేదు  

అయినా నీకు నాపై కోపం రాదు
ఎందుకంటే
నాకు నేను తెలియనపుడే నీకునేను తెలుసు
నా గురించి నాకంటే నీకంటే బాగా తెలుసు
నా బలాబలాలు నీకే ఎక్కువ తెలుసు
అందుకేనేమో నేనెన్ని తప్పులు చేసినా
కరుణామయుడిలా మన్నించేస్తావ్
చిన్ని చిరునవ్వుతో నాలోని మాలిన్యాలన్నీ కడిగేస్తావ్

నేస్తాల్లో నేస్తానివౌతావ్
దారి చూపే గురువువవుతావ్
నీ చూపే నాకు పెద్ద పాఠం
ఇన్నేళ్ళ నుండీ చదువుతూనే ఉన్నా ఆ పాఠాన్ని
ఎంతకీ తరగదు
నీ పాఠం పూర్తయితే
నేనీ భూమ్మీద క్షణం కూడా నిలువలేను
అందుకే నాకోసం నువ్వు నిత్యవసంతం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా
నీ అనురాగామృతంలో కలకాలం బతకాలని కోరుతున్నా….

 

Happy Mothers’ Day to Great Mothers …

Mrs.

Suryavathi, Seethamahalakshmi, Varalakshmi, Bhavani,

Sesha Ratnam, Krishnaveni, Sarada Kumari, Vaijayanthi

(ee ashtalakshmulu maa ammalu (maa amma, akkachellellu)

Sujatha ,Kamala,Sesha,Annapurna,Satyavathi,Peddabebipeddamma,chinna baby pinni,satyavathi peddamma, inkaa ammalandariki…

ప్రపంచానికి మహోన్నత వ్యక్తిత్వాలని
అందించిన మా బంగారు తల్లులు
శ్రీమతి/smt. ..
నాగ సరోజిని, దేవికారాణి, రాఘవమ్మ, సుమతి, వెంకటమ్మ, మేరి,
ఇంకా నాకు చెప్పలేనంత అమ్మ ప్రేమను పంచిన ఉమా మహేశ్వరి , విజయలక్ష్మి గార్లకు , హేము అమ్మకు
హ్రుదయపూర్వక నమస్కారములు !

1 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

కవిత చాలా సహజంగా ఉంది.బాగా వ్రాసారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి