27 మార్చి, 2010
మరో నేను దొరికేనా ….?
ఎన్నో ఏళ్ళుగా
ఎదురుచూస్తున్నాను
నా లాంటి మరో నేను కోసం
ఫలితం శూన్యం
అన్వేషిస్తూ , ఆలోచిస్తూ
సాగిపోతున్నాను
ప్రతి మలుపులో
అక్కడక్కడా
చిన్న ఆశ
చిన్న తపన
నా ఆలోచనల్ని
స్వీకరించి,
నాలా ఆలోచించే
నేను తారసపడవచ్చేమోనని
అదేమిటో
అనుకోకుండా
కనిపించి
అలా అనిపించి
కనుమరుగయ్యే
నీడలే అన్నీ…
నీడలు నిజాలు కావు కదా !
కిం కర్తవ్యం ?
అర్థమైంది
నేను డిజైనర్ పీస్ నని.
Thank God 4 not making duplicates for Me…..
I am the one .. Only one…
16 మార్చి, 2010
నవవసంతం … నవజీవన సారధ్యం …!
విరోధిని జయించాం
విరోధాలను వదిలేద్దాం !
వికృతికి చేరుకున్నాం
వికృతాలను అరికడదాం !
కారపు సవాళ్లనెదుర్కొని
చేదు నిజాలు గ్రహించి
ఉప్పని తప్పులు దిద్దుకుని
ఒగరు పొగరు నడచి
తియ్యదనపు పలుకులతో
పులుపు పులకింతలతో
షడ్రుచుల సందేశం
అరిషడ్వర్గాల వైరాగ్యం
మానవత్వపు మహోన్నత మార్గం
శతవసంతాల జీవన సరాగాలకు ఇదే ఇదే శ్రీకారం !
మితృలందరికీ వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు !










