23 సెప్టెం, 2008

నిజంగా నిజాలు ......

                            paddu10 005

 

 .   నిద్ర నటించటం సులువు -  నిద్ర నటిస్తున్న వారిని లేపటం కష్టం
        నిద్ర తెచ్చు కోవటం కష్టం - నిద్రిస్తున్న వారిని లేపటం సులువు.
.     అన్నాన్ని కొనగలం - ఆకలిని కొనలేం
        మన ఆకలిని తీర్చుకోవటం గొప్పకాదు - ఎదుటి వారి ఆకలిని తీర్చటం గొప్ప .
.      గెలుపుని అందరూ ఆస్వాదిస్తారు - ఓటమిని కొందరే అంగీకరిస్తారు .
         గెలిచి విశ్రమించే వాడి కంటే - ఓడి గెలుపుకై తపించే వాడే ధీరుడు.
.     రెండు పెదాలు పలికే మాటలేమిటో ......... పక్కనున్న రెండు చెవులు వింటే
         ఆ పెదాలకి మున్ముందు .................. మూతపడాల్సిన అవసరం రాదు.
 
.      నవ్వటం అదృష్టం - నవ్వించగలగడం ఒక వరం                  
 
         నవ్వి నొప్పించటం పాపం - నవ్వులపాలు కావటం శాపం.
                                                                 
 
                                                    తెలుగు కళ..................పద్మకళ

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి