23 సెప్టెం, 2008

కొత్త బంగారు లోకం ( రాజుగారి బంగారు పాపలా ...)

 

                                             కళ్లు ఉన్నది చూడటానికీ , కాళ్ళు ఉన్నది నడవటానికి , చెవులు వినటానికీ , చేతులున్నది పట్టుకోడానికి  . కానీ పళ్ళు ఉన్నది మాత్రం ఎంచక్కా పేస్టు వేసుకుని పొద్దున్నే బద్ధకం వదిలేదాకా రుద్దుకోవడానికి.ఇది నా మాట కాదండి బాబూ !  కొత్త బంగారు లోకం లోని కుర్రకారు మాట. ఏమిటీ విడ్డూరం ? అని ముక్కున వేలేసుకున్నారా?  ఎందుకంత ఆశ్చర్యం?

మీరు వినేను అన్నది ఖచ్చితంగా ఉన్నమాటే. ఎందుకు చెప్మా అంటారా? తినబోతూ రుచి , వినబోతూ వివరం అవసరమా చెప్పండి. కాస్త ఓపిక చేసుకుని చదివిపెట్టుదురూ ....................

            scholar DD news drctr 123

                               మన చిన్నప్పుడు పళ్ళు , కాయలు ఒకటేమిటి? దొరికిందల్లా  అడ్డం గా ,నిలువుగా ఇష్టమొచ్చినట్లుగా మేసేసే వాళ్ళం కదా! చెరుకుగడ ఈ చివర మొదలపెట్టి పోటా పోటీగా గడ గడా (అంతా) గబ గబా పీకి పీల్చి పిప్పి చేసి వదిలే వాళ్ళం. మరిప్పుడో చెరుకులు అంటే ..శివరాత్రి తి్రునాళ్ళలో దొరికే  పొడుగాటి స్టిక్కులని మీకు తెలుసా? ఆ చెరుకు ను ఎలా తినాలో తెలియకపోతే మీ ఇంటిలోని బంగారు కొండల్ని (పిల్లల్ని) అడగండి ... కళ్లు తెరిపిస్తారు. పై స్కిన్ను తీసేసి ,స్మాల్ స్మాల్ పీసులుగా చేసుకుని తినోచ్చట.

               ఇంకో విషయం మన బుడ్డోళ్ళు (పి ల్లలు) ములక్కాయ (మునగ) తినే పధ్ధతి చూస్తే జన్మలో దాన్ని ముట్టుకోవాలని అనిపించదు. "అబ్బబ్బ! ఎన్నిసార్లు చెప్పాలి ?  అది నోట్లో గుచ్చుకుంటుందని ? "అని ఫైరయ్యే వాళ్లు కొందరు. మూడు అంగుళాల ములక్కాయ ముక్కను ఒకేసారి నోట్లోకి దూర్చేసి, కళ్లు మూసుకుని పస పసనములుతొంటే ఆ దృశ్యం కనులారా చూడాల్సిందే కానీ వర్ణించడం నా వల్ల కాదు.

               మా నాన్నగారు అమ్మపై అరుస్తూఉండేవారు.  ములక్కాయ ముక్క మూడు అంగుళాలు ఉండాలని. ఒక చివర పట్టుకొని సగం గుంజు/గుజ్జు లాగి, మరలా రెండో వైపు తిప్పి పట్టుకొని సారం పీల్చడానికి ఆ కొలత లట. ఈ మాట చెప్తే వినేవాళ్ళెవరు ?

                  పొలం గట్ల మీద రాలిన చింత కాయల్ని జట్టుతో కలిసి వెళ్లి, ఏరుకుని తినటం లో ఉన్నమజా ఇప్పుడు ఏది?

దోర  చింత కోసం , పండిన తియ్యని చింతకాయ కోసం పోట్లాడుకుని, తలా పింజా లాక్కుని, తినటం వీళ్ళ కి చేతవ్వా?  చా!  అంత సీన్ లేదుకదా!

                         ఈ రోజుల్లో నారింజ పండు ,దబ్బకాయ, తినే పిల్లలు ఉంటారని చెప్పటం చాల కష్టమే. బత్తాయి, కమలా పళ్ళు వలుచుకుని తొనలు తీసేటంత ఓపిక ఎవరికి చెప్పండి ?  జస్ట్ 10 రూ.లు. పెడితే చాలు. జ్యూస్ కూల్ కూల్ గా రెడీ.  ఫ్రూటీ డబ్బాని పీల్చితే వచ్చే మజా రసం పండు చీకితే వస్తుందా చెప్పండి వీళ్ళకి  ?  పైగా అలా తినాలంటే చాటుమాటుగా తినాలి. ముక్కూ,మూతీ ఏకం అయిపోతాయని భయం లెండి పాపం.  ఎంచక్కా మాంగో జ్యూసు ,గ్రేపు జ్యూసు, ఆరంజి జ్యూసు......ఏమిటో ? టే కిటీజీ యార్ !

ఆ సపోటాలొకటి..... కడగాలి, పొరతీయాలి, మళ్లీ కడుక్కుని తినాలి.. అంత ఓపికా , తీరికా ఎవరికి?  బంగారం లాంటి పనసపండు వాసనే పడదుట కొందరికి.  వింతే కదా! పోనీ బొప్పాయి తినమంటే చప్పగా వుంది షుగర్ వేస్తే తింటానంటారు.

scholar DD news drctr 130

                   ఈతకాయలు, నేరేడు కాయలూ చూస్తేనే మనం నోరు ఊరేసుకొని వాటిపై వాల్లి టక్కున నోట్లో పడేస్తాం.మరి ఇప్పటి పిల్లలకి ఇవెందుకని నచ్చట్లేదో నాకర్థంకావట్లేదు.  స్వీటు, హాటు ఈ రెండే వీళ్ళకి తెలిసిన రుచులు. తప్పు వాళ్ళదా? మనదా ? ఆపిల్ పళ్ళూ జామకాయలు ఈ బుడతలెలా తింటారో తెలుసా? 'నాకు నచ్చినట్టు కట్చేసిస్తేనే తింటా !'  పైగా కండిషన్స్ ..ఏం  చేస్తారు పాపం పెద్దోళ్ళు .. ఎలాగోలా పొట్టలో పడితే చాలు. ఎలా తిన్నమనేదికాదు ప్రశ్న తిన్నామా ?  లేదా? అంతే. చక్కగా చిన్న ముక్కలు ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేసి చేతిలో పెట్టి ఇస్తే అందులో ఫోర్కు ఒకటి వేసుకుని ఎంచక్కా టి.వి చూస్తూ చప్పరిస్తూ గుటుక్కున మింగేస్తారు భడవలు. పాపం వాళ్ళనని ఏమిలాభం.?  పళ్ళని, కాయల్ని నమిలి తినాలని తినొచ్చని అలా తినటం వల్లే దంతాలు ,దవడా కండరాలు ఉంద  పళ్ళు స్థిరంగా ఉంటాయని మనకి తెలిసింది వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెయ్యించడం అవసరం కాదంటారా? ఒక్కటి మాత్రం నిజం ! తోటకూర కట్ట దొంగిలించిన పిల్లవాడు పెద్దయ్యాక గజదొంగై ఉరి శిక్షబారిన పడి చివరి కోరికగా వాళ్ళమ్మ చెవిని కొరికాడట. 'చిన్నప్పుడే నాకు తెలిసేలాగా చెప్తే ఈ రోజు నా కథ ఇలాగ ముగిసేదా? 'అంటూ కసిగా....అంతే మరి మొక్కై వంగనిది మానై వంగువంగుతుందా? మీ చేతుల్లో ఉన్న లేత మొగ్గలకి చక్కటి ఆహారపుటలవాట్లు నేర్పకుంటే మరి ఆనాకా పిజాలు బర్గర్ల్లు ఫాస్టుఫుడ్డు తింటున్నారని నోరెళ్ళబెట్టినా నో యూజు........ ఇన్ ఫ్రంట్ థెరీజ్ యె క్రొకొడాయిల్ ఫెస్టివల్.. బీ కేర్ఫుల్ ................................. ౧ గ్లాస్ జ్యూస్ కూల్ కూల్ గా దాంతో ఆహార నాళము నీ పళ్ళని ప్రేవులని శుభ్రం చేసే పీచు పదార్ధం లోనికి వెళ్ళే చాన్స్ లేదు. frootee dabba ni పీల్చితే వచ్చే మజా రసం పండు చీకితే వస్తుందా చెప్పండి వీళ్ళకి? పైగా అలా తినాలంటే చాటుమాటుగా తినాలి.ముక్కూ,మూతీ ఏకం అయిపోతాయని భయం లెండి పాపం. ఎంచక్కా మాంగో జ్యూసు ,గ్రేపు జ్యూసు, ఆరంజి జ్యూసు......ఏమిటో? టే కిటీజీ యార్! ఆ సపోటాలొకటి.....కడగాలి, పొరతీయాలి,మళ్లీ కడుక్కుని తినాలి.. అంత ఓపికా ,తీరికా ఎవరికి? బంగారం లాంటి పనసపండు వాసనే పడదుట కొందరికి.వింతే కదా! పోనీ బొప్పయి తినమంటే చప్పగా వుంది సుగర్ వేస్తే తింటానంటారు. ఈతకాయలు, నేరేడు కాయలూ చూస్తేనే మనం నోరు ఊరేసుకొని వాటిపై వాల్లి టక్కున నోట్లో పడేస్తాం.మరి ఇప్పటి పిల్లలకి ఇవెందుకని నచ్చట్లేదో నాకర్థంకావట్లేదు స్వీటు,హాటు ఈ రెండే వీళ్ళకి తెలిసిన రుచులు. తప్పు వాళ్ళదా? మనదా? ఆపిల్ పళ్ళూ జామకాయలు ఈ బుడతలెలా తింటారో తెలుసా? 'నాకు నచ్చినట్టు కట్చేసిస్తేనే తింటా!' పైగా కండిషన్స్ ..ఎం చెస్తారు పాపం పెద్దోళ్ళు .. ఎలాగోలా పొట్టలో పడితే చాలు. ఎలా తిన్నమనేదికాదు ప్రశ్న తిన్నామా?లేదా? అంతే. చక్కగా చిన్న ముక్కలు ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేసి చేతిలో పెట్టి ఇస్తే అందులో ఫోర్కు ఒకటి వేసుకుని ఎంచక్కా టి.వి చూస్తూ చప్పరిస్తూ గుటుక్కున మింగేస్తారు భడవలు. పాపం వాళ్ళనని ఏమిలాభం.? పళ్ళని,కాయల్ని నమిలి తినాలని తినొచ్చని అలా తినటం వల్లే దంతాలు ,దవడా కండరాలు ఉంది. పళ్ళు స్థిరంగా ఉంటాయని మనకి తెలిసింది వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెయ్యించడం అవసరం కాదంటారా? ఒక్కటి మాత్రం నిజం ! తోటకూర కట్ట దొంగిలించిన పిల్లవాడు పెద్దయ్యాక గజదొంగై ఉరి శిక్షబారిన పడి చివరి కోరికగా వాళ్ళమ్మ చెవిని కొరికాడట. 'చిన్నప్పుడే నాకు తెలిసేలాగా చెప్తే ఈ రోజు నా కథ ఇలాగ ముగిసేదా? 'అంటూ కసిగా....అంతే మరి మొక్కై వంగనిది మానై వంగువంగుతుందా? మీ చేతుల్లో ఉన్న లేత మొగ్గలకి చక్కటి ఆహారపుటలవాట్లు నేర్పకుంటే మరి ఆనాకా పిజాలు బర్గర్ల్లు ఫాస్టుఫుడ్డు తింటున్నారని నోరెళ్ళబెట్టినా నో యూజు........ ఇన్ ఫ్రంట్ థెరీజ్ యె క్రొకొడాయిల్ ఫెస్టివల్.. బీ కేర్ఫుల్

2 comments:
చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇప్పటి పిల్లలకు పండ్లను తొక్కతీసుకుని,నములుకుంటూ తినే సమయమిస్తున్నామా మనము ఇంట్లో ఉన్నంతసేపూ చదువూ చదువూ లేదా home work అంటూ సతాయింపు ఇంక వాళ్ళకు తీరిగ్గా పండును ఆస్వాదిస్తూ తినే అదృష్టంకూడానా పాపం వారికి,అన్నం తినేదానికే సమయం సరిపోవడంలేదు.అంతా corporate చదువు మహిమ.

4:09 PM
Rajesh చెప్పారు...

చిన్నప్పుడు తిన్న తిళ్ళు, తిరుగుళ్ళు, వాటికోసం తిన్న తిట్లు అన్ని గుర్తుచేసారు. బావుంది. ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేని చోట ఉన్నందుకు ఏదో బాధ.

9:54 AM

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్

 

 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి