2 అక్టో, 2008

ప్రాణ దాతలకి ప్రణామాలు.

అలుపు -అరమరిక ,విసుగు _విశ్రాంతి పదాల అర్థం తెలియని సేవా తత్పరులు ౧౦౮ (నూట ఎనిమిది )సిబ్బంది .గడియారమైనా అప్పడప్పుడు ప్రశాంతంగా ఆగి సేద తీరుతుందేమోగాని వీరు మాత్రం కాలంతో పోటీ పడి పరుగులు తీస్తూనే ఉంటారు. ప్రతి క్షణం ఏ కాలుడి తో పోరాటం చేస్తూనే ఉంటారు.

మీకు తెలుసా ? ఈ మధ్య రెండు ప్రాణాలు కృష్ణా జిల్లా ౧౦౮ అంబులెన్స్ లోనే ప్రాణం పోసుకున్నాయని?

ఈ రెండు వార్తలు విన్నప్పటి నుండీ అంబులెన్స్ కనపడగానే సలాం కొట్టాలనిపిస్తుంది.

నా సలాంకి ఇంకా మానవతావాదులు ఎవరైనా కలిసి బలమిస్తారని ఆశిస్తూ ఈ కవితని వారికి అంకితం చేస్తున్నాను....................

౧౦౮.మీ నేస్తం

కనిపించే చైతన్యం

అలుపెరుగనిదీ సైన్యం

నడిపించే నేతృత్వం

స్వార్థానికి బహుదూరం

ప్రజాసేవ మా పరమార్థం

ప్రాణ రక్షణ మాతక్షణ కర్తవ్యం !

అమూల్యం ప్రతిక్షణం

ఆపదలో మీరున్న క్షణం

బంధువుల మై మేమున్నాం

బాసటగా నిలుస్తాం !

గాలివాటున మీ పిలుపందుకుంటాం

సుడిగాలిలా మీ కడకు చేరుకుంటాం !

మమ్మల్నే మరుస్తాం

మీ కోసం శ్రమిస్తాం

ధైర్యానికి సారధులం

సహనానికి వారధులం

నూట ఎనిమిది మా పేరు

నమ్మకానికి మారు పేరు !

మీ రక్షణ కే ఈ నంబరు ! ................. 108 bangaaru talli 002

మా ప్రాణాలకు భరోసా మీరు !

మీ సేవా తత్పరతకిదే మా జోహారు ........... పద్మకళ

6 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నిరంతరం మన ప్రాణాలకోసం పాటుబడుతున్న వారికి మనమేమిచ్చి తీర్చుకోగలము వారి రుణము, ఇలా కవిత రూపంలో స్పందించడం తప్ప.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

మీ ఊహకు,కవితకు నా అభినందనలు.
ఈ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు తెలిసింది,ఈ నూటఎనిమిది వచ్చాక మాఊర్లో ప్రమాదాల పాలయిన వారిలో దాదాపు అందరూ సకాలంలో వైద్యసేవలు అందటం వల్ల క్షేమంగా బతికిబట్టకడుతున్నారని.ఈ కార్యక్రమాన్ని/పధకాన్ని ప్రవేశపెట్టినందుకు వై.యస్.ను అభినందించాలి

shake చెప్పారు...

నూట ఎనిమిది కి జోహార్లు.

shake చెప్పారు...

నూట ఎనిమిది కి జోహార్లు.

Rupesh చెప్పారు...

good keep it up

A.R.Ramesh
Y.V.R.Siddhartha college of education
Kanuru

అజ్ఞాత చెప్పారు...

your story is very nice,your imazinaton and your confidence also very good.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి