26 సెప్టెం, 2008

frootee dabba ni పీల్చితే వచ్చే మజా రసం పండు చీకితే వస్తుందా చెప్పండి వీళ్ళకి? పైగా అలా తినాలంటే చాటుమాటుగా తినాలి.ముక్కూ,మూతీ ఏకం అయిపోతాయని భయం లెండి పాపం. ఎంచక్కా మాంగో జ్యూసు ,గ్రేపు జ్యూసు, ఆరంజి జ్యూసు......ఏమిటో? టే కిటీజీ యార్! ఆ సపోటాలొకటి.....కడగాలి, పొరతీయాలి,మళ్లీ కడుక్కుని తినాలి.. అంత ఓపికా ,తీరికా ఎవరికి? బంగారం లాంటి పనసపండు వాసనే పడదుట కొందరికి.వింతే కదా! పోనీ బొప్పయి తినమంటే చప్పగా వుంది సుగర్ వేస్తే తింటానంటారు. ఈతకాయలు, నేరేడు కాయలూ చూస్తేనే మనం నోరు ఊరేసుకొని వాటిపై వాల్లి టక్కున నోట్లో పడేస్తాం.మరి ఇప్పటి పిల్లలకి ఇవెందుకని నచ్చట్లేదో నాకర్థంకావట్లేదు స్వీటు,హాటు ఈ రెండే వీళ్ళకి తెలిసిన రుచులు. తప్పు వాళ్ళదా? మనదా? ఆపిల్ పళ్ళూ జామకాయలు ఈ బుడతలెలా తింటారో తెలుసా? 'నాకు నచ్చినట్టు కట్చేసిస్తేనే తింటా!' పైగా కండిషన్స్ ..ఎం చెస్తారు పాపం పెద్దోళ్ళు .. ఎలాగోలా పొట్టలో పడితే చాలు. ఎలా తిన్నమనేదికాదు ప్రశ్న తిన్నామా?లేదా? అంతే. చక్కగా చిన్న ముక్కలు ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేసి చేతిలో పెట్టి ఇస్తే అందులో ఫోర్కు ఒకటి వేసుకుని ఎంచక్కా టి.వి చూస్తూ చప్పరిస్తూ గుటుక్కున మింగేస్తారు భడవలు. పాపం వాళ్ళనని ఏమిలాభం.? పళ్ళని,కాయల్ని నమిలి తినాలని తినొచ్చని అలా తినటం వల్లే దంతాలు ,దవడా కండరాలు ఉంది. పళ్ళు స్థిరంగా ఉంటాయని మనకి తెలిసింది వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెయ్యించడం అవసరం కాదంటారా? ఒక్కటి మాత్రం నిజం ! తోటకూర కట్ట దొంగిలించిన పిల్లవాడు పెద్దయ్యాక గజదొంగై ఉరి శిక్షబారిన పడి చివరి కోరికగా వాళ్ళమ్మ చెవిని కొరికాడట. 'చిన్నప్పుడే నాకు తెలిసేలాగా చెప్తే ఈ రోజు నా కథ ఇలాగ ముగిసేదా? 'అంటూ కసిగా....అంతే మరి మొక్కై వంగనిది మానై వంగువంగుతుందా? మీ చేతుల్లో ఉన్న లేత మొగ్గలకి చక్కటి ఆహారపుటలవాట్లు నేర్పకుంటే మరి ఆనాకా పిజాలు బర్గర్ల్లు ఫాస్టుఫుడ్డు తింటున్నారని నోరెళ్ళబెట్టినా నో యూజు........ ఇన్ ఫ్రంట్ థెరీజ్ యె క్రొకొడాయిల్ ఫెస్టివల్.. బీ కేర్ఫుల్ .................................

4 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇప్పటి పిల్లలకు పండ్లను తొక్కతీసుకుని,నములుకుంటూ తినే సమయమిస్తున్నామా మనము ఇంట్లో ఉన్నంతసేపూ చదువూ చదువూ లేదా home work అంటూ సతాయింపు ఇంక వాళ్ళకు తీరిగ్గా పండును ఆస్వాదిస్తూ తినే అదృష్టంకూడానా పాపం వారికి,అన్నం తినేదానికే సమయం సరిపోవడంలేదు.అంతా corporate చదువు మహిమ.

Rajesh చెప్పారు...

చిన్నప్పుడు తిన్న తిళ్ళు, తిరుగుళ్ళు, వాటికోసం తిన్న తిట్లు అన్ని గుర్తుచేసారు. బావుంది. ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేని చోట ఉన్నందుకు ఏదో బాధ.

అజ్ఞాత చెప్పారు...

PALLU LENITANAMU,FUTURELO SALINE,CATHETERLAKU IPPATINUNCHE ALAVAATU CHESTUNNARU-VIDYA RJ

అజ్ఞాత చెప్పారు...

thank you so much for giving a excellent suggestion.no pizza no burgur only fruits with out slicing is verygood than you

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి