21 అక్టో, 2008

బుజ్జి బొజ్జలకు బువ్వ

ఏమండోయ్ !

పెద్దలూ ! బాగున్నారా ?

ఏం చేస్తున్నారు ? మా సంగతి సరే, మీరేం చేస్తున్నారు ?

అంటూ మళ్ళీ మమ్మల్నే ప్రశ్నించడం మొదలుపెట్టారా ?

ఇదిగో కనిపిస్తున్నాం కదా !

బడి గంట ఒంటి గంట కొట్టింది,

మా బుజ్జి బొజ్జల్లో బుల్లి గంట మోగింది.

అందుకే వేడి వేడి అన్నంలో సాంబారు కలుపుకుని జుర్రుతున్నాం.

 

bangaaru talli 012bangaaru talli 011

ఇంతకీ ఏమిటీ  భోజనాల  బంతి ?

ఏమిటి విశేషం ? అనుకుంటున్నారా?

విశేషమే మరి. అక్టోబరు 13 నుండీ ప్రభుత్వం రాష్ట్రమంతా

హైస్కూల్లో కూడా మధ్యాహ్నభోజన  పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఇక మాస్కూల్లో కూడా అందుకోసం భారీగా సన్నాహాలు చేసి మా భోజనాల ఏర్పాటు చేసారు.

మీరు చూస్తున్న ఫోటోలు మా మొదటి మధ్యాహ్న భోజనాలప్పుడు మా టీచర్ తీసినవి.

మేమెలా ఉన్నాం ? బాగున్నామా ?

 

bangaaru talli 008bangaaru talli 014

 

ఇంతకీ భోజనాలు ఎలా ఉన్నాయనేనా మీ సందేహం ?

పర్లేదు. అన్నం సాంబారు.

రోజూ ఇదే మేత కావటంతో కొంచెం బోరు అనిపించినా ఇంటికెళ్ళాక మళ్ళీ అమ్మ చేతి వంట

మేస్తాం కాబట్టి ఓకే.

ఎన్నికల వల్లో, ప్రజాక్షేమమో , హాజరు పెంచడమో  ఏమో మాకయితే తెలియదు.

ఈ పథకం మాత్రం చాలా గొప్పదని అందరూ అంటున్నారు.

మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికెళ్ళి ,

గబగబా కుక్కుకుని పరుగెత్తి బడి గంట కొట్టేకంటే

ముందుపరుగెత్తే కంటే తాపీగా నాలుగుముద్దలు

తిని కడుపులో సాంబారు కదలకుండా పాఠాలు వినడం బాగుంది.

  bangaaru talli 010bangaaru talli 007

ఈ పథకం ఎంతకాలం సక్రమంగా సాగుతుందో ...

మధ్యదళారీలు, దురాశా పరులు చేరితే పిల్లలం అని కూడా ఆలోచించరని

మా కడుపు కొట్టేస్తారని ఎవరో అనుకుంటుంటే విని ఉలిక్కి పడ్డాం.

ఏ ప్రభుత్వమయినా పథకాలు ప్రవేశ పెట్ట గలదు కానీ

జనాల్లో చిత్తశుధ్ధిని ప్రవేశపెట్టలేదు కదా!

అందుకే మా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబువ్వ పథకం సజావుగా సాగాలని

కొంచెం పెద్ద మనసుతో దీవించరాదూ.....................................

9 వ్యాఖ్యలు:

చక్రవర్తి చెప్పారు...

కేవ్వు కేక.. అదిరిందండీ.. ఏది ఏమైనా చిన్నారులు కడుపు నిండితే అంతే చాలు. ఏదో విధంగా.. కొన్ని రోజులైనా చిట్టి కడుపులు చల్లగా ఉండాలన్న మీ ఆశయాన్ని కంట్రాక్టర్లు వాళ్ళ జేబులకు చిల్లు పడుతుందేమో అనే భయం మింగేయ్యకుండా ఆ దేవుడే కాపాడాలి అని ఆశిస్తున్నాను.

మీరు మాత్రం వీ వంతు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండండి, మీకు అండగా మేము ఎప్పుడూ ఉంటాము.

telugukala చెప్పారు...

మీ ప్రోత్సాహానికి, స్పందనకు ధన్యవాదాలు.

Rani చెప్పారు...

god bless the kids and the plan.
wish this plan continues without any problems.
I cant help to think and hope, those disposable plates are paper and not plastic.

అజ్ఞాత చెప్పారు...

చక్కగా అందరూ కలిసి తింటుంటే ఆ మజాయే వేరు
మేము ఇప్పటికీ ఒక 11 మంది దాక కలిసి తింటాం
ఆఫీసు లో క్లాసు లో అన్ని చోట్లా :):)
ఆ ఆనందం మీకు కలగాలని దాలరులవల్ల మీరు దాని కోల్పోకూడదని మనసారా దేవుణ్ణి ప్రార్దిస్తున్నా

అజ్ఞాత చెప్పారు...

చక్కగా అందరూ కలిసి తింటుంటే ఆ మజాయే వేరు
మేము ఇప్పటికీ ఒక 11 మంది దాక కలిసి తింటాం
ఆఫీసు లో క్లాసు లో అన్ని చోట్లా :):)
ఆ ఆనందం మీకు కలగాలని దాలరులవల్ల మీరు దాని కోల్పోకూడదని మనసారా దేవుణ్ణి ప్రార్దిస్తున్నా

nandayarrachowdu చెప్పారు...

దళారుల కళ్ళు ఈ పథకం మీద పడకూడదని ఆదేవున్ని ప్రార్థిస్తున్నాను

ravigaru చెప్పారు...

modati roju sambaru tarvata roju charu marnadu madyana manna mate maricharu inka pillalakem pedataru e padhakalanni inte bejaru.

ravigaru చెప్పారు...

మొదటి రోజు సాంబారు పిల్లల మోము లో హుషారు ,రెండో రోజు వేసారు వేడి చారు పిల్లల మోము లో నిరసాలు,మూడో రోజు మధ్యాన్నం మాటే మరిచారు ఇంక భోజనం ఎక్కడ సారూ?ఈ పదకలాన్నిప్రచారాలే పిల్లల కెప్పుడు విచారాలే.

వర్మ చెప్పారు...

అవునండి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఇది చాలా ముఖ్యమయింది. మాది ప్రాథమిక పాఠశాల కావటం వలన ఇది మాకు అనుభవమే. హైస్కూళ్ళలో ప్రభుత్వం ఎప్పుడో ప్రవేశపెట్టవలసింది, కానీ ఆలస్యమయ్యింది. ఈ పథకం వలన విద్యార్థుల హాజరు రేటు కూడా పెరుగుతుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి