Pages

7 అక్టో, 2008

విధి - మన విధి

చూపులేని కన్నులు

ఏమీ చూడలేక రోదిస్తూంటే

చూసీ ఆగలేని కన్నులు

వేధిస్తున్నాయి

చూసిందల్లా కావాలని..............

నడవలేని కాళ్ళు

తమంత తాముగా

అడుగులో అడుగేసి

ముందడుగుకై తపిస్తోంటే

నడక నేర్చిన కాళ్ళు

పెడదారుల్లో పరుగెడుతున్నాయి

చిక్కిందల్లా దక్కించుకోవాలని

చేజిక్కించుకోవాలని.................

మాటరాని నాలుక

మదిలో ఉప్పొంగే భావ పరంపరను

మౌనంగా దిగమింగేస్తుంటే

మాటకారి నాలుక

మందిని-పది మందినీ

ఆడిపోసుకొంటోంది......................................

వినికిడి లేని చెవులు

పెదాల నాట్యాలను

పదాలుగా అనువదించుకుంటుంటే

వినేవాడి చెవులు

రోజంతా వినేది,

వినాలనుకునేది వినకూడనిదే........................

ఆపదలో ఉన్న చేయి

ఆధారం కోసం

ఆశగా ఎదురు చూస్తుంటే

అందీయవలసిన చేయి

అహంకారపు

హృదయ పీఠంపైనే

ఆగిపోయి నేను - నాది

అంటూ స్వార్థపు చాలనాలు చేస్తూ

తప్పించుకు తిరుగుతోంది....................................

నిర్విరామ జీవన పయనంలో

అలుపెరుగని మన నూరేళ్ల పోరాటంలో

అస్త్రాలు లేని ఈ సైనికులని

మన ఆదరణే అండగా

ప్రోత్సాహమే ఆయుధంగా

చేయూత నిస్తూ, సహకరిస్తూ

ఆ నిండుగుండెలని మనతో

కలుపుకొని మునుముందుకు సాగి

విధి ని ఎదురొడ్డి

మన విధిని నెరవేర్చ లేమా ?................

విధాత మెప్పు పొందగ లేమా ?.........

జగజ్జేతలం కాలేమా. ?.............

........

4 కామెంట్‌లు:

Rajesh చెప్పారు...

ఎందుకు కాలేం?
మనవ సేవయే మాధవ సేవ అని గుర్తుంచుకుని
పదండి ముందుకు, పదండి పోదాం.....

Health coach_nanda చెప్పారు...

మీ కవిత్వం బాగుందండి పద్మకళగారు,ఇలాగే వ్రాయండి.

Unknown చెప్పారు...

ఈ కళ్లు,కాళ్లు,చెవులు,చేతులు,నాలుక అన్నీ అంతే. ఇలాంటి కవితలు చదివైనా మారతాయేమో చూడాలి..............

Unknown చెప్పారు...

భవితను మేలుకొలిపే ఓ వీరనారీ ! ఈ జగతికి నీవొక గర్వకారణం.ఇదే స్ఫూర్తి తో జగతిని జాగృతం చేస్తూ ఉండు. ఎల్ల వేళలా నీ కవితలు సమాజానికి దిక్సూచి కావాలని ఆకాంక్షిస్తూ................

కామెంట్‌ను పోస్ట్ చేయండి