తెల్లవారే ముందు చిమ్మ చీకట్లో నుండి పొడుచుకు వచ్చిన సూర్య కిరణంలాగా మారైలు పండువెన్నెల్లో దారానికి పూలు గుచ్చుతున్నట్లుగా ఊళ్ళన్నిటినీ కలుపుకుంటూ దూసుకెళ్తోంది.అంతా గందరగోళం. ఎవరిగోల వారిది . ఇది ఏ సినిమాకీ టైటిలు కాదు. నే ప్రయాణిస్తున్న రైలులోని పరిస్థితి. వినేవాళ్ళు నలుగురైతే చెప్పే వాళ్ళు ఆరుగురు. ఎవరు చెబుతున్నారో ఎవరు వింటున్నారో చెప్పలేనంత గట్టిగా అరుచుకుంటున్నారు జనం. అదేలెండి మాట్లాడుకుంటున్నారు. గలగలా మాట్లాడటమన్నా , అలా మాట్లాడే వాళ్ళన్నా నాకు ఇష్టమే. కానీ రోజుకు ముగింపు చెప్పే రాత్రి సమయాల్లో మాత్రం నేను ఒంటరితనాన్నే ప్రేమిస్తాను.రోజంతా నేను చేసిన పనులను ప్రశ్నించుకుంటూ మరుసటి రోజుకోసం ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకోవటం నాకు చిన్నప్పటి నుండీ అలవాటు. పరుగుపందెంలో నేనే గెలవాలంటూ పోటీ పడే ఆటగాళ్ళలాగా చెట్లన్నీ పరుగెడుతున్నాయి. కానీ ఒక్కటే తేడా. అవి వెనక్కి పోతున్నాయి. ప్రకృతి ప్రేమికుడినైన నేను అందమైన దృశ్యాలు ఆస్వాదిద్దామంటే చుట్టూ ఉన్న మాటలు ఆటంకపరుస్తున్నాయి. ఇక ఉండబట్టలేక అలా ముందుకు నడిచి రైలు గుమ్మంలోకి చేరాను. అక్కడే కూర్చుని ప్రకృతిని చూస్తూ ప్రశాంతంగా గడపాలనిపించింది నాకు. కళ్ళముందు కంటికి ఇంపైన దృశ్యాలు ఎన్నో... విశ్రాంతి తీసుకుంటున్న పశువులు, చెట్టు చేమలు. నిశ్శబ్దంగా ఉన్న ఊళ్ళమధ్య నుంచి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ నేనూ, మారైలూ... వాళ్ళలో చాలా మంది నిద్రకు భంగం కలిగిస్తూనే ఉన్నాం.అయినా ఏమీ చేయలేని , ఉన్న గూడు వదిలిపోని జీవితాలు వాళ్ళవి. అందుకే ఏమీ పట్టనట్టు నిద్రపోతూ , నిద్రపోవటానికి ప్ర్రయత్నిస్తూ నా కళ్ళల్లో పడ్డారు. చంద్రుణ్ణి చూసి విచ్చుకున్న కలువలు, పూరిళ్ళ ముంగిళ్ళలోని జాజిపూల పందెళ్ళ నుండి సువాసనలు మెల్లగా నా దాకా చేరి ఒక్క నిముషం మా ఊరిని గుర్తుకు తెస్తుంటే ... ఆ ఆలోచనలు మెల్లగా మా ఇంటికి పరుగులు తీసాయి. రైలు చక్రాలకంటే వేగంగా. అలా వెళ్ళి వెళ్ళి, .. ’అందర్నీ పలకరించాలి ’ అనుకుంటూ ఇంటికెళ్ళి పోయినట్టూ , అమ్మా! నాన్నా! అంటూ వాళ్ళని తలుపు తట్టి పిలుస్తున్నట్లు అనిపించింది. వెంటనే అనుకున్నాను. " ఈ టైమ్ లో వాళ్ళు నిద్రపోతారేమో కదా ! "అని.అలా అనుకుంటూనే నేనూ మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నానని, ముందుకు తూలుతున్నానని తెలియనే లేదు. వేగంగా పరుగెత్తే రైలులోంచి విసిరేసినట్టు నేను క్రింద పడేదాకా. పడటం పడటం ముళ్ళ కంపలు, రాళ్ళ గుట్టలు కలిసి కట్టుకున్న గూటిలో పడ్డానేమో.. ఒక దానితో ఒకటి పోటీ పడి మరీ అవి నన్ను గాయపర్చాయి. అంత డబ్బు పెట్తి కొన్న టిక్కెట్తు నా జేబులోనే ఉన్నా నన్నెక్కించుకున్న రైలు మాత్రం నన్ననాథని నేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం స్టాప్.. స్టాప్.. అంటూ నన్ను పట్టించుకోకుండా పారిపోయే రైలుని పొలికేకలతో పిలుస్తూనే ఉన్నాను. గొంతు బొంగురుపోతోంది. నా పిలుపు వినబడేటంత దూరంలో చెట్టు చేమలు, చందమామ తప్ప మనుశులెవ్వరూ కనబడట్లేదు. అప్పటి దాకా ఎంతో అందంగా కనిపించిన చందమామ, చెట్లు, ప్రకృతి నన్ను చూసి ఏమీ చేయలేకపోయేసరికి నాకవి బద్ధ శతృవుల్లాగా కనిపించాయి.
- లచ్చిమి చెప్పారు...
౧౦౮ వారి సేవా తత్పరత కి జోహారులు దైవం మానవ రూపం లో అని అనొచ్చేమో వీరి గురించి చెప్పాలంటే కాని కొంత మంది ఆకతాయిలు వీరిని కూడా వదలటం లేదు. అల్లరితనం తో వీరిని ఆటపట్టిస్తున్నాం అనుకుంటూ బాధపెడుతున్నారు అట్లాంటి వారు అల్లరి వీడి ౧౦౮ వారికి సహకరిస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు కులాసాయేనా
- 3:41 AM
- లచ్చిమి చెప్పారు...
౧౦౮ వారి సేవా తత్పరత కి జోహారులు దైవం మానవ రూపం లో అని అనొచ్చేమో వీరి గురించి చెప్పాలంటే కాని కొంత మంది ఆకతాయిలు వీరిని కూడా వదలటం లేదు. అల్లరితనం తో వీరిని ఆటపట్టిస్తున్నాం అనుకుంటూ బాధపెడుతున్నారు అట్లాంటి వారు అల్లరి వీడి ౧౦౮ వారికి సహకరిస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు కులాసాయేనా
- 3:41 AM
- చక్రవర్తి చెప్పారు...
కధా కధనం చాలా బాగుంది. కాకపోతే ఒక చిన్న సలహా. వ్రాసే మధ్యలో చిన్న చిన్న విరామాలు ఇవ్వండి. అలాగే పేరాలు పేరాలుగా వ్రాయండి. కొంచం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే వీలైతే ౧౦౮ యాజమాన్యం అనుమతితో ఇలాంటి గొప్ప వ్యక్తుల ముఖ చిత్రాలు ప్రచురించడానికి ప్రయత్నించండి. ఎంతైనా మన కధలో వీళ్ళే హీరోలు హీరోయిన్లు కదా.
- 9:10 AM
- rani చెప్పారు...
touching! may god bless those 108 people!
- 9:30 AM
- telugukala చెప్పారు...
లచ్చిమి గారూ ! నేను పద్మకళ ని. వివరాలు పొంది కథ రచించాను.మీ ప్రశ్న కు సమాధానం: ఆ వ్యక్తి (కథలోని రమేశ్ )ఇప్పుడు కుశలంగానే ఉన్నారు.
- 12:00 PM
- Rajesh చెప్పారు...
ప్రారంభం చాల బావుంది (అదిరింది అనుకోండి). చక్రవర్తి గారి సలహాయే నాది కూడాను. 108 కు క్రుతజ్నతాభినందనలు
- 8:14 AM
- nandayarrachowdu చెప్పారు...
మీ కథ,కథనం బాగుందండి,అలాగే 108కి కృతజ్ఙతలు.
- 1:32 AM
- shake చెప్పారు...
ప్రజాసేవలో నూటఎనిమిది మరింత ప్రగతిపథంలో దూసుకెళ్ళాలని ఆశిద్దాం. కథ బాగుంది.
- 9:18 PM
Links to this post
క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి