Pages

8 నవం, 2008

మహిళల రక్షణలో రక్షణ చట్టం 2005

       ముక్కోటి దేవతల సాక్షిగా ఒక్కటైన బంధం మూడుపువ్వులు, ఆరుకాయలుగా పదికాలాల పాటు చల్లగా వర్థిల్లాలని ఇంటిల్లపాదీ ఆశీర్వదిస్తారు. అత్తవారింట్లో మొదటి అడుగు పెట్టే వేళ అమ్మాయి నోటికి తాళం వేసి చెవులతో కష్టమయినా, నష్టమయినా , సుఖమయినా , దుఃఖమయినా అన్నీ నీ భర్త ఇంట్లోనే అంటూ పుట్టిల్లు ఎన్నో సుద్దులు చెప్పి సాగనంపుతుంది. ఎవ్వరేమన్నా మారు మాట్లాడకుండా మౌనంగా భరించమని సహనాన్నే ఆభరణంగా అలంకరించి పంపుతుంది.

.bhanu dmstic vl 020

                    ఆమె అదృష్టవశాత్తూ మంచి కుటుంబంలో పడితే సరే. లేకపోతే దుర్వ్యసనపరుడైన భర్త , ఆవేశపరులైన కుటుంబసభ్యులు అత్తింటి అత్యాశలు, ఆరళ్ళు అన్నీ ఆమెపై దాడి చేస్తే ? భరించలేని కష్ట్టాలు క్షణక్షణగండాలుగా మారి బ్రతుకు దుర్భరమయితే ? పుట్టింటికి పయనం. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఆమెకి స్వాగతం లభిస్తుందా? కనీసం ఆదరణ దొరుకుతుందా ? అంటే చెప్పలేం. ఫలితమే ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు, వరకట్నపు చావులు. ఇటువంటి పరిస్థితుల్లో రోజురోజుకీ మహిళలపై పెరిగిపోతున్న దౌర్జన్యానికి అదుపుగా ఆటకట్టుగా ఆడపడుచులను ఆదరించే బలం కొండంత అండ గా నిలిచే గొప్పవరం , గృహహింస నుండి మహిళలను కాపాడే  ’రక్షణ చట్టం 2005'.

          మన సమాజంలో సహజంగా నెలకొన్న వివక్షత , ఆచారాలు , సంప్రదాయాలు, పద్ధతులవల్ల కుటుంబాలలో స్త్రీ , పురుషుల మధ్య అసమానతలు సర్వసాధారణమైపోయాయి. మితిమీరిన ఆవేశం, అహంకారం స్త్రీలపై హింసకు దారితీస్తున్న ప్రస్తుత తరుణంలో వారికి రక్షణ కల్పించి , మానసిక స్థైర్యాన్ని , బ్రతుపై విశ్వాసాన్ని కల్పించే దిశగా ఈ చట్టం తోడ్పడుతుంది.

ఏయే చర్యలు గృహహింస పరిధిలోకి వస్తాయి?

   శారీరకంగా గానీ , మానసికంగా గానీ  , మాటలు ,చేతల ద్వారా ఉద్వేగపర్చటం , బాధపెట్టడం , ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయటం ( డబ్బు లాక్కోవటం ..), స్త్రీ ఆరోగ్యాన్ని కుంటుపరచే  చర్యలకి పాల్పడటం వంటి పనులు గృహహింస పరిధిలోకి వస్తాయి.

 ఈ చట్టపరిధి లోకి ఎవరెవరు వస్తారు ?

     పుట్టుక ద్వారా , పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్నవారు ,ఒకే ఇంటిలో కలిసి ఉంటున్న స్త్రీ , పురుషులెవరైనా సరే ఈ చట్టపరిధిలోనికి  వస్తారు.

గృహహింసపై సమాచారాన్ని ఎవరు ఇవ్వవచ్చు ?

       బాధితురాలు స్వయంగా కానీ , బంధువులు, ఇరుగుపొరుగువారు, ఎవరైనా సరే రక్షణాధికారికి సమాచారం అందించవచ్చు.

bhanu dmstic vl 012 

 ఎవరికి /ఎలా తెలియజేయాలి ?

              జిల్లా స్థాయిలో స్త్రీ అభివృద్ధి సంక్షేమశాఖ తరపున  పనిచేసే రక్షణాధికారికి సమాచారం అందించవచ్చు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకుల అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోను శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ చట్ట  అమలుకు  రక్షణాధికారిగా వ్యవహరిస్తారు. సమస్యను బాధితురాలు నేరుగా కానీ , ఇతరుల సహాయంతో గానీ తెలియజేయవచ్చు.ఫోన్ కాల్ ద్వారా కూడా పరిస్థితి ని చెప్తే వెంటనే స్పందించి సిబ్బంది బాధితురాల్ని కలుస్తారు. ఆమెనుండి లిఖిత రూపంలో పిటిషన్ తీసుకుంటారు. తర్వాత వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. మహిళను హింసించటం వల్ల భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలు, చట్టపరమయిన ఏర్పాట్లు, జరిమానాలు, శిక్షలు వివరిస్తారు. చాలా వరకు కేసులు కౌన్సిలింగ్ స్థాయిలోనే పరిష్కృతం అవుతుండగా మొండి కేసులు , ఎంతచెప్పినా వినని వారిపై ’గృహ ఘటన నివేదిక ’ రూపంలో మేజిస్ట్రేటుకు (కోర్టుకు) ఫైలును అందించి దాని నకలును బాధితురాలికి అందజేస్తారు. కోర్టుకు దరఖాస్తు అందిన ౩ రోజుల్లో మొదటి వాదన , 60 రోజుల్లో తుది తీర్పు వెలువడుతుంది.

bhanu dmstic vl 017

ప్రతిబంధకాలు:

                సమాజంలో స్త్రీలహోదా , గౌరవం తదితర అంశాలు ఎన్ని కష్టాలయినా మౌనంగా హింసను భరించడానికి కారణమవుతున్నాయి. తన సమస్యను బయట పెట్టటం   వల్ల కుటుంబ జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని , పిల్లల భవిష్యత్తు పాడవుతుందని చాలా మంది గృహహింసా రక్షణ చట్టాన్ని ఉపయోగించుకొనే సాహసం చేయటం లేదు. మసిపూసి మారేడుకాయ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళ వల్ల ఈ చట్టం దురుపయోగం అవుతుందేమోనని భయపడేవాళ్లూ లేకపోలేదు.

         అడ్డంకులెన్ని ఉన్నా నిలువనీడ కరవవుతున్న పరిస్థితినుండి స్త్రీలను ఈ చట్టం కాపాడుతుంది. దీనివల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ సొంత ఇల్లయినా , అద్దె ఇల్లయినా ఆమెను బయటికి పొమ్మనే అధికారం ఎవ్వరికీ  లేదు. దానితోపాటు ఆర్థిక , ఆరోగ్యపరమయిన నష్టాల్ని భర్తీ చేయాల్సి రావటం , పిల్లల పోషణ ఇతర ఖర్చులకు నెలనెలా గానీ ఏకమొత్తం గానీ డబ్బు చెల్లించేలా ప్రతివాదిని ఆదేశిస్తుంది.

         ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్షతోపాటు రూ.20,000 లు. జరిమానా విధిస్తుంది.

       ఈ చర్యలు భార్యాభర్తల మధ్య తగవులు హింసకు దారితీయకుండా ఎంతవరకు అడ్డుకట్టవేస్తున్నాయనేది ప్రశ్నార్థకమే. ఇదివరలో లాగా  మనకెందుకులే అని ఊరుకోకుండా సమస్య తీవ్రమనిపిస్తే ఎవరైనా సరే బాధితుల పక్షాన రక్షణ కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే ఈ చట్టం మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. 

          ప్రతిచిన్న విషయాన్నీ పెద్దదిగా చేసుకుని భర్తలని సాధించే భార్యామణులకి కూడా ఈ చట్టం గొడుగుపట్టే అవకాశాలున్నాయని కొందరు , దీన్ని అదనుగా తీసుకుని మగవారిని ముప్పుతిప్పలు పెట్టే మహిళల సంగతేమిటని కొందరుప్రశ్నిస్తూనే ఉన్నారు.

   తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుసుకుని ఎవరి అంతరాత్మకు వారు తలవంచాల్సిన పరిస్తితి రాకుండా నడచుకోగలిగితే , సహనాన్ని, ఓర్పుని కలిగి సర్దుబాటు ధోరణి అలవర్చుకుంటుంటే ఏ చట్టం  తోనూ పనిలేదు.....

 

1 కామెంట్‌లు:

Nrahamthulla చెప్పారు...

వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని కులాంతర వివాహము అంటారు. వధూవరులు వేరు వేరు మతాలకు చెందిన వారైతే, వారి వివాహాన్ని మతాంతర వివాహము అంటారు. సాంప్రదాయక భారతీయ కుటుంబాలలో కులాంతర వివాహాలను ప్రోత్సహించరు. మతాంతర వివాహాలకు అసలు ఒప్పుకోరు. అయితే ప్రతికాలంలోనూ కొంతమంది అభ్యుదయవాదులు , మానవతావాదులు, హేతువాదులు ఇటువంటి ఆదర్శ వివాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత భారతీయ సమాజంలో మరింత హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరుగుతున్నా, జనబాహుళ్యపు ఆమోదాన్ని చూరగొనలేదు. కారణాలు 1. ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారి కంటె ఎక్కువ తక్కువని అనుకోవటం 2. మనుషులందరు సమానులు కాదనుకోవటం 3.అంటరానితనాన్ని పాటించటం...లాంటివి. ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ప్రోత్సాహకాలనిస్తోంది. రిజర్వేషన్ల కోసం కులపోరాటాలు తగ్గాలంటే మరింత హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగాలి. ప్రస్తుతం ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి మీరాకుమార్ చేప్పారు. బీజం క్షేత్రం ఏది ముఖ్యం ?: తండ్రి ఏ మతానికి లేదా కులానికి చెందుతాడో పిల్లలు కూడా అదే మతానికి లేదా కులానికి చెందేది బీజప్రధానసాంప్రదాయం. తల్లి ఏ మతానికి లేదా కులానికి చెందుతుందో పిల్లలు కూడా అదే మతానికి లేదా కులానికి చెందేది క్షేత్రప్రధానసాంప్రదాయం.

* ఇటీవల పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుల మతాల అడ్డుగోడలను ప్రేమ స మ్మెటతో బద్దలుకొట్టారు. తమ పిల్లల ప్రేమకు పట్టంకట్టారు. వారిలో ఇద్దరు ము ఖ్యమంత్రి కార్యాలయ అధికారులు .జన్నత్ హుస్సేన్ సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి. ఆయన కుమారుడు ప్రేమించింది ఓ బ్రాహ్మణ అమ్మాయిని. వీరిద్దరి ప్రేమను పెద్దలు ఆశీర్వదించారు. సీఎం ఆఫీసులో స్పెషల్ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూతురు అమెరికాలో చదువుతూ కమ్మ వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది.వాళ్ల పెద్దలు పెళ్లికి అభ్యంతర పెట్టలేదు.జీఏడీలో పొలిటికల్ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న ఆర్ఎం గోనెల కాపు వర్గానికి చెందిన వారు. ఆయన కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. అటువైపు, ఇటువైపు పెద్దలు వీరి ప్రేమకు 'జై' కొట్టారు. యువజన, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఏకే ఫరీడా ఒరిస్సాకు చెందిన అగ్ర కులస్థుడు. మదన్‌లాల్ అనే ఐపీఎస్ అధికారి ఎస్సీ వర్గానికి చెందిన వారు.ఫరీడా కూతురు, మదన్‌లాల్ కుమారుడు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి పెద్దల ఆమోదంతోనే జరిగింది.( http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/aug/8main3)

భారత దేశంలో కొందరు ప్రముఖ కులాంతర మతాంతర వివాహితుల జాబితా ;

* సరోజినీ దేవి చటోపాధ్యాయ (బెంగాలీ బ్రాహ్మణ)-డా.గోవిందరాజులు నాయుడు (ఆంధ్రుడు),
* మొగలాయి చక్రవర్తి అక్బరు (ముస్లిం) - రాజపుత్రులు
* ఇందిరా గాంధీ (కాశ్మీరీ బ్రహ్మణ్) - ఫిరోజ్ గాంధీ (జొరాస్ట్రియన్)
* రాజీవ్ గాంధీ () - సోనియా గాంధీ (ఇటలీ వనిత)
* డా.లక్ష్మి సలీం
* టైగర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (క్రికెటర్-ముస్లిం) - షర్మిలా టాగోర్ (హిందీ సినీనటి)
* సునీల్ దత్ (హిందీ నటుడు-హిందువు) - నర్గిస్ దత్ (హిందీ నటి-ముస్లిం)
* ఆసిఫ్ అలీ - అరుణా అలీ (పూర్వ కాంగ్రెసు నాయకులు)
* కె.యల్.మెహతా- ఐ యఫ్ యస్ - నవాబ్ జాది ఆఫ్ హైదరాబాద్
* షారుక్ ఖాన్ (నటుడు-ముస్లిం) - గౌరి ( నటి-హిందువు )
* హృతిక్ రోషన్ (హిందీ నటుడు -హిందువు) - సుజానే ఖాన్ (హిందీనటుడు సంజయ్ ఖాన్ కూతురు - షియా ముస్లిం)
* జ్యొత్స్న - ఇలియాస్ జంట ( వార్తా చదువరులు )
* అజహరుద్దీన్ (క్రికెటర్-ముస్లిం) - సంగీతా బిజిలాని (హిందీ నటి-హిందువు)
* జాకీష్రాఫ్ - ఆయేషా దత్
* సునీల్ శెట్టి - మనా ఖాద్రి
* సలీం ఖాన్ - హెలెన్
* రాజ్ బబ్బర్ - నాదిరా బబ్బర్
* నటి ఇలియానా తల్లి (ముస్లిం) తండ్రి (క్రిస్టియన్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి