12 డిసెం, 2008

ఏమిటీ గోల?

          పగలంతా పనులతో అలసిపోయి రాత్రి పదిగంటలకి అనుకోకుండా టి.వి. ముందు చిక్కాను. ఏదో  డాన్స్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ వస్తోంది. హుషారుగా ఉందికదా అని కాస్సేపు ఛానెల్ మార్చకుండా ఉంచి చూస్తున్నాను.

            చూడటం అంటే పూర్తిగా దానికే అంకితం అనుకునేరు. అంతసీన్ లేదు ఆ కార్యక్రమానికి.అసలే కార్యక్రమానికుంది కనక. ఎప్పుడు చూసినా చెత్త సీరియల్స్, సుత్తిగోల.....సిస్టం ముందు కూర్చుని నా వర్క్ చేసుకుంటూనే  మ్యూజిక్ మీద , డాన్స్ మీద మమకారం వదలుకోలేక  మధ్య మధ్యలో ఓ చూపేస్తున్నాను. ఎగురుతున్నారు, గెంతుతున్నారు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ. ఎంతైనా డాన్స్ పోటీ కదా !

saakshi1 057

         saakshi1 037

                         saakshi1 056

 

    ఆ మాతల్లి యాంకర్ ఒకతి పూనకం వచ్చినట్టు తెగ ఊగిపోతోంది.ఒక్కో పాట అవ్వగానే మళ్ళీ దానిపైన మొదటి నుండీ వివరణ ఒకటి. అరిగిపోయిన రీల్ లాగా......అబ్బో ఆ మాస్టర్లేమిటో వాళ్ళ వేషాలేమిటో .........అన్నీ ఆలోచిస్తే ఉన్న చిన్న బుర్ర కాస్తా చితికిపోతుంది.

     కాలో ,చెయ్యో లేకున్నా ఏ వికలాంగుల కోటాలోనో ఎక్కడోచోట ఉద్యోగం చెయ్యొచ్చు గానీ మరీ బుర్రలేకపోతే ఎవరు ఉద్యోగం ఇస్తారు చెప్పండి? అందుకే వాళ్ళ చావు వాళ్ళు చస్తారులే అనుకుని పట్టించుకోకుండా పాటలు వింటూ పనిచేసుకుంటున్నాను.

         సందడి గా సాగే కార్యక్రమంలో ఏదో అపశ్రుతి వినిపించి ఏమిటాని చూశాను.ఒక్కసారి ఒళ్ళుమండింది. మీరేమనుకోనంటే ఓ మాట. లాగిపేట్టి రెండు పీకాలనిపించింది ఆ ప్రోగ్రాం ఎడిటర్ని, యాంకర్ని.......

                    కారణం ఏమిటో ? అబ్బ ఇంతకీ ఏమైంది? ఇందాకటి దాకా బానే ఉన్నారుగా .....అనుకుంటూ నా పని ఆపి కాసేపు చూస్తే అప్పుడర్థమయింది. ఇంకేముంది ఏదో  జడ్జిమెంటు ను గురించి తన్నుకు ఛస్తున్నారు. అంతకు ముందు జడ్జీల కాళ్లకి మొక్కిన  వాళ్ళే  అకస్మాత్తుగా జడ్జీలపై నోళ్ళేసుకుని పోట్ల్లా డటం పనికిమాలిన రాద్దాంతం  చెయ్యడం పైగా దానికి ఓ కవరేజీ .ఎందుకొచ్చిన గోల కానీ కట్టేద్దామని అనుకుంటే ఈలోపు జడ్జీల అలుకలు.

ఛఛా ఛా వెధవ గోల...అనవసరంగా టి.వి. పెట్టి తలనొప్పి తెచ్చుకున్నానేమో అనిపించింది

మొత్తానికి జడ్జీలకేమయిందో గానీ విసుక్కుని గుడ్బాయ్ చెప్పేసి షో మధ్య లోనే తుర్రుమన్నారు. ఇక మన యాంకరమ్మ మాత్రం చాలా నిదానంగా చెప్తోంది...........

"ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఊంది. ఈ వేడి చల్లా రంలంటే , మరో వారం రోజులు ఆగాల్సిందే" యెంకమ్మ ముగింపు.

అంతటితో ఆగితేనా ? వాళ్ళేలా తిట్టుకుంటున్నారో ఎలా వాదించుకుంటున్నారో సీన్స్ చూపిస్తున్నారు.

            ధగ ధగ మెరుపులు, మ్యూజిక్ బాజాల మధ్య ఎంతో అట్టహాసంగా ప్రారంభమవుతున్న రియాల్టీ షోలు ఈ మధ్య జనాల్ని ఆకట్టుకోవానులనుకునో తాపత్రయంతో  విసుగుతెప్పించే ఉద్వేగాలని , అనవసరమైన హావ భావాలని చూపుతూ ప్రేక్షకుల సహనాన్నిపరీక్షిస్తున్నాయి.

 

        అసలు ప్రేక్షకులంటే ఎవరు? వీళ్ళ అడ్డమయిన గోలాచూసి అయ్యయ్యో అంటూ సానుభూతి చూపుతారనా ? లేకపోతే ఇలాంటి కార్యక్రమాల కోసం వీళ్ళు పాపం ఇంత ఇదిగా కష్టపడిపోతున్నారని జాలిపడి ఆయా ఛానెళ్ళు విరగబడి చూస్తారనా ?

     బ్రహ్మాండంగా పాడినచిన్న చిన్నపిల్లలను పోటీల పేరుతో రెచ్చగొట్టి గెలవలేదని ఊరడించి   షో ఎఫెక్ట్స్ కోసం ఏడిపించి ....

రెండుమూడు రోజుల ముందునుంచీ పబ్లిసిటీ.....చిన్నారి ఎందుకేడ్చిందో తెలుసుకోవాలంటే తప్పక చూడండి...అంటూ.

       ఇంతకీ నాదో చిన్న  అనుమానం. నేనొక్క దాన్నే అలాంటి కార్యక్రమాలు చూస్తున్నానా అని . లేకపోతే ఎవ్వరికి లేని గోల నాకెందుకు ?

 

          సర్లెండి ఎప్పటికైనా మీకూ విసుగురాకపోతుందా? కాదు కాదు వాళ్లు ( టీ.వీ.వాళ్ళు) మీకు విసుగుతెప్పించకపోతారా?

 

          మీరూ నాలా స్పందించకపోతారా? 

నేను మిమ్మల్ని శభాష్ అనకపోతానా?

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Indian Minerva:

అహా! ఏదో వాళ్ళ "ఏడుపే"దో వాళ్ళూ ఏడుస్తున్నారులెమ్మనుకుంటుంటే ఇప్పుడు కొట్లాటలు కూడానా. బాగుంది.

krishna rao jallipalli చెప్పారు...

మీరేమనుకోనంటే ఓ మాట. లాగిపేట్టి రెండు పీకాలనిపించింది ఆ ప్రోగ్రాం ఎడిటర్ని, యాంకర్ని....... ఎవ్వరూ ఏమి అనుకోరు.. నా పేరు చెప్పి కూడా ఇంకో రెండు పీకండి. సరే.. చిన్నపిల్లలంటే ఏడుస్తారు.. కొంచం అర్థం ఉంది.. వీళ్ళకేమి రోగం. పందుల్లా ఉంటారు.. ముదిరినోల్లు.. ఏమిటి ఈ ఏడుపులు, పెడ బొబ్బలు.. వాళ్ల ఇళ్ళల్లో ఎవరు చచ్చినా ఇంతలా ఎడవరనుకొంటా. ఏవో రాజ్యాలు కోల్పోయినట్లు వెధవ ఫీలింగ్ ఒహటీ.. పిచ్చి నా కొడుకులు.

telugukala చెప్పారు...

Thanq Krishnaraojee !

మీ ఘాటయిన ప్రతిస్పందన చూసయినా వాళ్ళు మారితే ఎంత బాగుండును?
thanks for ur coment Krishnajee and Indian Minarva.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి