Pages

21 జన, 2009

ముత్యమంత ముగ్గు .... ముంగిట ముచ్చట గొలుపు

         చూడు ఇల్లాని చూడు’ అని  పెద్దలు ఊరికే అనలేదు. ముంగిట్లో మెరిసే ముగ్గుని బట్టి ముదిత మనసు తెలిసిపోతుంది.

                 ముగ్గు వెయ్యటంలో ఒక్కో అతివది ఒక్కో శైలి.

సరిగ్గా పరిశీలిస్తే ముగ్గు పోతలో , గీతలో మనిషి మనస్తత్వం , పనితీరు, నైజం, ఆసక్తి, అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది.

గీత సన్నగా గీయగల్గటం , చిన్న చిన్న కళా రూపాలు, పువ్వులు, ఆకృతులు స్పష్టంగా గీయగలగటం అనేవి చాలా తక్కువ మందికి మాత్రమే చేతనైన నైపుణ్యాలు.

ముగ్గు కి సమతూకం చాలా ముఖ్యమైన అంశం.ఎటు నుంచి ఎటు చూసినా ముగ్గు ఒకేలా కనపడాలి. ఒక ప్రక్క పెద్దగా మరోప్రక్క కుంచిం చుకు పోయినట్లుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

’ఇంటిని

చుక్కల ముగ్గులు పెట్టటం ఒక కళ. చుక్కల ముగ్గులు ఎలా పుట్టయో మీకు తెలుసా ?

ఏ ఆధారం లేకుండా ముగ్గుపెడితే ముగ్గుకి ఒక రూపు రేఖ రాదని,ఈ ఆడాళ్ళు ముగ్గులు పెడుతూ పెడుతూ ఇల్లు , వళ్ళు మరచి  ఆంధ్రా నుంచి ఆగ్రా దాకా..... అలా పోతూనే ఉంటారని ముందుచూపుతో చుక్కలనే పరిధులని పెట్టారన్న మాట. పాపం ఆ పరిధుల్లో నే పడి ఇన్నాళ్ళు మన అమ్మమ్మలు,  అమ్మలు చుక్కల ముగ్గులతో సరిపెట్టుకున్నారు. కానీ మనం కాస్త ఎక్కువ తిన్న బాపతు కదా. అందుకే ఈతరం అమ్మాయిలు ఎక్కువగా చుక్కల ముగ్గుల కంటే కళాకృతుల కే (డిజైన్స్) ఎక్కువ మొగ్గు చూపుత్తున్నారు. ఆ మాటకొస్తే చుక్కల ముగ్గు ఎవరైనా ఇట్టే  పెటేస్తారు. కానీ చుక్కలు లేకుండా ముగ్గు వెయ్యటం లోనే అసలు పనితనం ఉంది . అందుకోసం ఎంతో సృజనాత్మకత ఉండి తీరాలి.  

అల్లిబిల్లి లతలు అల్లటం అతి కొద్ది మందికే  చేతనైన ఒక అద్భుతమైన  కళ. అందమైన పువ్వులు , లతలు, ఆకులు, రకరకాల రూపాలతో కళాకృతులు రూపొందించగలగటం

అసలైన ప్రతిభకు నిదర్శనం.

ముగ్గుల గురించి నన్ను మాట్లాడమంటే మీ చెవులు చిల్లు పడొచ్చు, ( ప్రస్తుతానికి చదువుతున్నారు కాబట్టి మీ కళ్ళు బైర్లు కమ్మచ్చు ) మీకు నాపై కడుపుమంట పుట్టొచ్చు.

అదుగో అప్పుడే మొదలైపోయింది మీ మంట. దాన్ని చల్లార్చటానికి మీ విసుగుని , చీకాకుని, కోపాన్ని బుగ్గి పాలు చేయటానికి సరదాగా ఓ ముగ్గుల పోటీ పెట్టనా ?

          ఓయ్ ! ఏందమ్మో! నీ కత అని నిట్టుర్చకండమ్మా !

ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ ముగ్గులు పెట్టి మీ కబుర్ల పెట్టె ( కంప్యూటర్ ఇది  నా భాషేనండోయ్ ! ) పై మీ ప్రతాపం చూపేరు. ( ఒకవేళ చూపినా పర్లేదు. పెయింట్ కెళ్ళో మరెక్కడికైనా వెళ్ళో మీరు మీ ముగ్గు గీసి నాబ్లాగులో పెట్టాలనుకుంటే దానికీ ఓ దారి ఉంది. కానీ ఇక్కడ కాదు. )

( రేపు సాయంత్రం సరిగ్గా  నాలుగు గంటలకు నా బ్లాగులో నిర్వహించబోయే ముగ్గుల పోటీ కి రండి. వివరాలు తర్వాతి పోస్టులో రేపటికల్లా ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం :

మీ పని న్యాయ నిర్ణయం.

నేను ఇప్పుడు పెట్టే ముగ్గులోంచి ఒక చక్కని ముగ్గుని ఎంఫిక చేసి ఓ బుల్లి వ్యాఖ్య ఇస్తే చాలు.

సరే మరి. ఆలస్యం అమృతం విషం......

ముదితల ముగ్గులు ముగ్ధ మనో హరంగా ముస్తాబై మీకోసం ఎదురుచూస్తున్నాయి. ముందుకు పదండి......... ఆ నాకిప్పుడు కొంచెం పనుందని జారుకునేరు.......

   మడిసన్నాక కూస్తింత కళా  పోషనుండాలి మరి..........

 

ముగ్గులు (5)

 

 

paddu10 042

 

paddu10 039

 

 

 saakshi1 162

 

saakshi1 167

 

కన్నుల పండువగా ఉన్నాయికదా!

అందుకే మరి ఇది కొత్త బంగారులోకం !

ఈ లోకం లో వింతలు , విశేషాలతో పాటు కంటికి కనిపించని ఎన్నో సున్నితమైన అంశాలని స్పృశిస్తూ ..... మీ మనసును ఆహ్లాద పరుస్తూ ..... రోజువారీ ఒత్తిడులనుంచి దూరంగా కనీసం కొద్ది నిముషాల పాటైనా మిమ్మల్ని విడిపించి ... మనశ్శాంతిని మీ పెదాలపై ఓ చల్లని చిరునవ్వు పువ్వుని పూయించే చిరు ప్రయత్నమే........... ఈ కొత్త బంగారులోకం ఆశయం........

12 కామెంట్‌లు:

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

"పద్దు 10042" (రెండవ ముగ్గు) అన్న ముగ్గు చాలా బాగుంది. అమ్మ ఆశీర్వాదం అన్నారు గదా తిరుగులేదు మరి.

సిరిసిరిమువ్వ చెప్పారు...

నా ఎంపికయితే సంక్రాంతి లక్ష్మి అండి. concept బాగుంది. Filling, outlines అన్నీ బాగున్నాయి. ఇలాంటివి వేయటం కూడా కాస్త కష్టమే.

ఇంకొక విషయం--రెండవది కూడా బాగుంది కాని అది flower carpet కిందకి వస్తుంది కాని ముగ్గు కాదు.

oremuna చెప్పారు...

అద్బుతంగా ఉన్నాయి. దేనికదే సాటి. అన్నింటినీ నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై చేస్తున్నాం!

తెలుగుకళ చెప్పారు...

మీ సత్వర స్పందనకి ధన్యవాదాలు.
అసలు పోటీ ఇకపైనే ఉంది.
ఇది పరిచయం మాత్రమే.
వివరాలకు తరువాతి పోస్టు చూడగలరు.

సుజాత వేల్పూరి చెప్పారు...

మీ అయిడియా భలే ఉంది కళా! "నాకు ముగ్గులేయడం రాదు" అని ఎవరన్నా చెపితే "ఏం? ఎందుకు రాదు? ఎలా రాదో చూద్దాం నేర్చుకోండి ముందు" అని వాదించాలనిపిస్తుంది.ముగ్గు వెయ్యడం అనేది ఒక కళ. పైగా అది గొప్ప వ్యాయామం కూడానూ! నా మటుకు నాకు చుక్కలు కనపడేలా మన వాళ్ళు మెలికల ముగ్గ్లు వేస్తారు చూడండి, మొన్న జ్యోతి గారు వాళ్ళింటిముందు వేసి బ్లాగులో పెట్టారు, అలాంటివి చాలా ఇష్టం. మా అమ్మగారు అలాంటివి బోలెడన్ని వేసేవారు. నాకంత సీన్ లేదు గానీ చుక్కల్ని కలుపుతూ వేసే ముగ్గులు వేయగలను.

ఇక్కడ మీరు పెట్టిన ముగ్గులన్నీ బాగున్నాయి.

విరజాజి చెప్పారు...

సుజాతగారూ, నాకూ మెలిక ముగ్గులు చిన్నపుడు వచ్చేవి కావు. కానీ ముగ్గంటే అసలు మెలికముగ్గే అని అమ్మ వాదించేది. నేను మామూలు ముగ్గు వేసినా, కనీసం చుట్టూతా అంచులైనా మెలిక ముగ్గు ఉండాల్సిందే. కానీ నేను పెళ్ళయ్యాక మెలిక ముగ్గులు బాగా నేర్చుకున్నాను. ఒక మోస్తరు మెలిక ముగ్గులు వేయగలను, ఇప్పుడు. మొత్తానికి మీకు బలే మంచి ఆలోచన వచ్చిందండీ కళగారూ..! మన బ్లాగు మిత్రుల "కళా పోషణ" తెలిసేలా మంచి విషయాన్ని ఎంచుకున్నారు..!!

విరజాజి చెప్పారు...

సుజాతగారూ, నాకూ మెలిక ముగ్గులు చిన్నపుడు వచ్చేవి కావు. కానీ ముగ్గంటే అసలు మెలికముగ్గే అని అమ్మ వాదించేది. నేను మామూలు ముగ్గు వేసినా, కనీసం చుట్టూతా అంచులైనా మెలిక ముగ్గు ఉండాల్సిందే. కానీ నేను పెళ్ళయ్యాక మెలిక ముగ్గులు బాగా నేర్చుకున్నాను. ఒక మోస్తరు మెలిక ముగ్గులు వేయగలను, ఇప్పుడు. మొత్తానికి మీకు బలే మంచి ఆలోచన వచ్చిందండీ కళగారూ..! మన బ్లాగు మిత్రుల "కళా పోషణ" తెలిసేలా మంచి విషయాన్ని ఎంచుకున్నారు..!!

నేస్తం చెప్పారు...

అద్బుతంగా ఉన్నాయి

అజ్ఞాత చెప్పారు...

నా ఓటు మొదటి ముగ్గుకి. ఎందుకంటే అది సాంప్రదాయకమైన ముగ్గు. మిగితావి చిత్రకళలా వున్నాయి. (కోపగించుకోకండి మరి, అడిగేరు కనక చెప్పేను). నాకు మూడంటే మూడు ముగ్గులు వచ్చు. మావూళ్లో తెలుగుక్లాసులలో విద్యార్థులచేత ముగ్గులేయించేదాన్ని.

రాధిక చెప్పారు...

రెండోది చాలా బాగుందండి.సంక్రాంతి లక్ష్మి ముగ్గు కూడా.నేను పుస్తకం లో చూసి ఓ మోస్తరుగా పెడతాను గానీ నిజానికి నాకు ఒకే ఒక్క ముగ్గు వచ్చు.అది దీపాల ముగ్గు.మా ఊర్లో పాలుతాగే పిల్ల కూడా పెడుతుంది ఆ దీపాల ముగ్గుని :) ఇప్పుడేమో ఇంత బోడీ వేసుకుని అంత సేపు వంగుని ముగ్గు పెట్టడం చాలా కష్టం :)

Indian Servers చెప్పారు...

orkut lo poll pettandi

sahitayam చెప్పారు...

its very nice

కామెంట్‌ను పోస్ట్ చేయండి