Pages

23 జన, 2009

బ్లాగ్ ముగ్గుల పోటీ......

బ్లాగ్ ముగ్గుల పోటీకి సుస్వాగతం !

Picture 051

1.వెన్నెల

---------------------------------------

Picture 053

2.గొబ్బెమ్మ

---------------------------------------

 muggu 3 TV

౩. అరచేతిలో దీపం

----------------------------------------

ముగ్గులు (4)

4.సుదర్శనం

---------------------------------------

ముగ్గులు

5.పద్మం

----------------------------------------

ఇప్పటి వరకు వచ్చిన ఎంట్రీలు ఇవే.

అతిథులు ఇక  ఓటెయ్యటం మొదలు పెట్టొచ్చు.

మీకు నచ్చిన ముగ్గు పేరు , ఎందుకు నచ్చిందో రాయండి

మీ వ్యాఖ్యే ఈ పోటీలో న్యాయ నిర్ణయానికి ఆధారం.

పోటీ సరదాగ పెడుతున్నాం కాబట్టి ఎవ్వరూ ఏమీ అనుకోరు.

నిర్మొహమాటంగా చెప్పండి. వేసిన వారి పేర్లు బయట పెట్టకూడదన్నది నియమం.

ఇక్కడ ముగ్గు పంపిన వాళ్ళూ కూడా ఓటు వెయ్యొచ్చు. ఒకరు ఒకటి, రెండు స్థానాల ముగ్గులకే ఓటు వెయ్యాలి

ఇప్పటి దాకా పంపని వాళ్ళు పంపటానికి ప్రయత్నించండి.

10 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

నా దృష్టిలో..
1. వెన్నెల - ఎందుకంటే.. ముగ్గుని సుద్ద ముక్కతో.. చేత్తో గీసారు. పైగా అంత పెద్ద మెలికల ముగ్గు నాలుగువైపులా ఒకే సైజులో వచ్చేలాగ వేసారు. అంటే.. ఏ భాగం తీసుకున్నా.. ఏ మాత్రం తేడా లేకుండా అంతా uniform గా ఉంది.
2. సుదర్శనం - ఇది పెయింట్ తో వేసినట్టున్నారు. చాలా చక్కగా ఉంది. బాక్ గ్రౌండ్లో ప్లైన్ గా ఉండి ఉంటే.. ముగ్గు అందం ఇంకా బాగా కనపడేది :(

ఇక పోతే.. అరచేతిలో దీపం ముగ్గులా కన్నా.. ఒక కళాకృతి లాగా అనిపించింది నాకు. పైగా ఫోటో పెద్దగా ఓపెన్ అవ్వలేదు. సరిగ్గా కనిపించలేదు అందుకని :(

అసలేమీ వేయకుండా.. వేసిన వాటి గురించి కామెంట్ రాయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది.
నిజానికి అన్నీ బావున్నాయి. అవి పంపిన ప్రమదలందరికీ అభినందనలు. ఏవో రెండు చెప్పాలి కాబట్టి.. అలా చెప్పానన్న మాటా :)
పద్మ కళ గారూ.. మీ ముగ్గుల పోటీ ఐడియా అద్భుతం.. మీకు కూడా అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

4.సుదర్శనం

Unknown చెప్పారు...

నా వోట్ 'సుదర్శనానికే'. ఎందుకంటే, మిగతావాటికన్నా చూడ్డానికి బాగుంది. వెయ్యడానికి కొంచం (లేక చాలా) కష్టపడాలి.

రాధిక చెప్పారు...

1.వెన్నెల
2.సుదర్శనం
3.పద్మం
4.అరచేతిలో దీపం
5.గొబ్బెమ్మ

సుజాత వేల్పూరి చెప్పారు...

I vote for sudarsanam!

తెలుగుకళ చెప్పారు...

మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు.
మీరు కూడా మీ ముగ్గులని పంపిస్తే బాగుంటుంది.
ఇంకా రెండు రోజులు వ్యవధి ఉంది.
వచ్చినవి వచ్చినట్టు జతచేస్తాను.

అజ్ఞాత చెప్పారు...

1)దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసే... సుదర్శనం
2)సుదర్శనుడు శ్రీమహావిష్ణువు నాభి ద్వారా విధాతనందించిన పద్మం

నేస్తం చెప్పారు...

1.సుదర్శనం -ఇది ఎక్కడా క్రమం తప్పకుండా చక్కగా వేసారు ..చాలా ఒపిక కావాలి..
2.అర చేతిలో దీపం... ఇది సరిగ్గా కనబడతం లేదు కాని అలా వేయడానికి చాలా కష్ట పడి ఉంటారు.
3.వెన్నెల- చుక్కలతో వేసారు కాబట్టి

నేస్తం చెప్పారు...

1.సుదర్శనం -ఇది ఎక్కడా క్రమం తప్పకుండా చక్కగా వేసారు ..చాలా ఒపిక కావాలి..
2.అర చేతిలో దీపం... ఇది సరిగ్గా కనబడతం లేదు కాని అలా వేయడానికి చాలా కష్ట పడి ఉంటారు.
3.వెన్నెల- చాలా అందం గా చక్కగా వచ్చింది..చుక్కలతో వేసారు కాబట్టి క్రమమం తప్పలేదు లేకపోతె secondకి వెళ్ళిపోయెది :)

చైతన్య చెప్పారు...

1. Vennela
2. sudarsanam

(mee muggula poti post eeroje chusanu... munduga chusi unte na muggulu kuda pampedanni... hmm... meeru marokasari ee poti nirvahinchinappudu tappakundaa palgontaanu.)

కామెంట్‌ను పోస్ట్ చేయండి