Pages

31 జన, 2009

మనసులు దోచుకున్న గజల్ గంధర్వుడు ..... గజల్ శ్రీనివాస్

గజల్ శ్రీనివాస్ గారి గానం , ఆయన గానానికి అనుగుణం గా కంజీరా పై నాట్యమాడే ఆయన చేయి పలికించే సవ్వడులు, గజల్ కి మధ్య లో చెప్పే పిట్ట కథలు, చిలిపి కబుర్లు, జీవన సత్యాలు, మానవ సంబంధాలు, ప్రకృతి సోయగాలు................................... ఇవన్నీ ఎన్ని సార్లు చూసినా, విన్నా మళ్ళీ మళ్ళీ చూడాలని, వినాలనీ అనుకోని వారుండరేమో ! కార్యక్రమం జరుగుతున్నంత సేపు సహజత్వానికి చేరువగా.... హాయిగా ప్రశాంతంగా .....ఉంటుంది.

ఓ రోజు కార్యక్రమంలో నే పొందిన అనుభూతి కి దృశ్య రూపమే క్రింది కవిత.

యాంత్రిక జీవనంలో

బ్రతికే ఉన్నామన్న

సంగతి మరచిన

నిర్జీవజీవాల ని

ప్రకృతి కౌగిలికిచేర్చి

అమ్మ ఒడిని గుర్తుకుతెచ్చి

బాల్యపు ఊయలలూ పి

నిద్రిస్తున్నమనసుని తట్టి మాధుర్యాన్నిరుచిచూపించే

గాంధీ తత్వం

గజల్ శ్రీనివాసుని గానం

మానవత్వానికి రాచబాటగా

ప్రేమతత్వానికి పూలబాటగా

స్నేహసౌథానికి పూదోటగా

సహృదయ హృదయాలను

మైమరపించే

గళం కాదది గాంధర్వం

పదం కాదది ప్రణవనాదం

ఆద్యంతం అమృతవర్షం !

5 కామెంట్‌లు:

Sky చెప్పారు...

కళ గారు,

కవిత అదుర్స్. ఆయన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వినే అదృష్టం మీకు కలిగినందుకు కాస్త అసూయపడినా, ఆ గాన గంధర్వుడిని నాకు పరిచయం చేసినందుకు, ఆయనని త్వరలో కలుసుకునే అవకాశం నాకు కలగజేసినందుకు మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే... నేను కూడా నా బ్లాగ్ లో ఆయన గురించి త్వరలో ఒక టపా రాయబోతున్నాను.

అజ్ఞాత చెప్పారు...

He is great.
Follow the link for his album
http://www.chitramala.com/audio-songs/nenu-naa-illu-1265.html

Ganesh చెప్పారు...

I like his ghazals, but I dont know about him.
Now I came to know about him through your post.
Iam grateful to you for felicitating him through your blog's post.

ganesh

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

"పశ్యామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం.
జీవేషు శరదశ్శతం
మోదామ శరదశ్శతం
అజీతాశ్యమ శరదశ్శతం
భవామ శరదశ్శతం
శ్రుణవామ శరదశ్శతం"

ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బ్రతకాలి. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ,
చక్కగా మట్లాడుతూ, పరాధీనుడు కకుండా బ్రతకాలి అని అర్ధం.

"మా విద్విషావహై" ... మెము ఒకరికి ఒకరం ద్వేషించుకోము అని అర్ధం.

"సహనావవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవా వహై
తెజస్వినా వధీత మస్తు,
మా విద్విషావహై"

కలిసి రక్షించుకొందాము. కలిసి భుజిద్దాము. కలిసి శక్తిమంతులమౌదాము.

ఎంత చక్కని వేద సంస్క్రుతి !

ఎటువంటి సంస్క్రుతి నుండి ఎతువెల్తున్నాము మనం!
మన గమ్యం ఎమిటి? అగమ్య గోచరమేనా?

మిత్రులారా! ఈ బ్లాగు చదివి అలోచించండి.
.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

"పశ్యామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం.
జీవేషు శరదశ్శతం
మోదామ శరదశ్శతం
అజీతాశ్యమ శరదశ్శతం
భవామ శరదశ్శతం
శ్రుణవామ శరదశ్శతం"

ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బ్రతకాలి. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ,
చక్కగా మట్లాడుతూ, పరాధీనుడు కకుండా బ్రతకాలి అని అర్ధం.

"మా విద్విషావహై" ... మెము ఒకరికి ఒకరం ద్వేషించుకోము అని అర్ధం.

"సహనావవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవా వహై
తెజస్వినా వధీత మస్తు,
మా విద్విషావహై"

కలిసి రక్షించుకొందాము. కలిసి భుజిద్దాము. కలిసి శక్తిమంతులమౌదాము.

ఎంత చక్కని వేద సంస్క్రుతి !

ఎటువంటి సంస్క్రుతి నుండి ఎతువెల్తున్నాము మనం!
మన గమ్యం ఎమిటి? అగమ్య గోచరమేనా?

మిత్రులారా! ఈ బ్లాగు చదివి అలోచించండి.
.

కామెంట్‌ను పోస్ట్ చేయండి