10 ఫిబ్ర, 2009

సంవిధాన సరస్వతి - బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ముఖాముఖి

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. ఈ గడ్డపై వందలాది మతాలు , జీవన రీతులు ప్రజల మధ్య సోదరభావాన్ని , సమైక్యతను చాటిచెబుతున్నాయి. వేదాలు, పురాణాలను అధ్యయనం చేసి తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పంచిపెట్టే మహత్తర బాధ్యతను చేపడుతున్న మహనీయులు పూజ్యనీయులు. వారం రోజులపాటు ఆదిత్య హృదయం ప్రవచనాలందించడానికి విజయవాడ కు విచ్చేసిన సరస్వతీ పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ముఖాముఖి చేసే అవకాశం నాకు కలగటం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ప్రశ్న: పాశ్చాత్య వ్యామోహం నానాటికీ పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ కోసం మన కర్తవ్యం ఏమిటి?
సామవేదం వారు: గొప్ప గొప్ప భావాలు, సంస్కారాలు పాశ్చాత్యుల నుంచి అయినా నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. కానీ మనవైన సంస్కృతీ మూలాలు నశించకుండా జాగ్రత్త పడాలి.

ప్రశ్న: మొక్కై వంగనిది మ్రానై వంగదంటారు పిల్లల్ని సత్ప్రవర్తన గల వ్యక్తులుగా తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
జవాబు: నైతికత , ఆథ్యాత్మిక సంస్కారాలు పెద్దయ్యాక చూసుకుందాం అనుకోవటం సరికాదు. ఆథ్యాత్మికత వృద్ధుల విషయం కాదు. జీవిత చరమాంకంలో చేపట్టాల్సిన అంశం కానేకాదు. సంస్కృతి - ఆధ్యాత్మికతలు జీవితానికి సంబంధించిన సమగ్ర జీవన విధానాలు. జీవితం ఆరంభం లోనే జీవించటం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు. పనిగట్టుకుని పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు.

ప్రశ్న: రోజు రోజుకీ హింస పెరిగిపోతున్న పరిస్థితుల్లో యువత పయనించాల్సిన మార్గం ఏది?
జవాబు: విద్యా బోధనలో నైతికతకు ప్రాధాన్యత రాను రానూ తగ్గించటమే అన్ని అరిష్టాలకీ మూలకారణం. విలువలను బోధించే మానవ నాగరికతా సంబంధ గ్రంథాలను మత గ్రంథాలుగా భావించి బోధించకపోవటం విచారకరం. హింసని హీరోయిజంగా చూపటమే ముఖ్య లక్ష్యంగా సినిమాలు , సీరియళ్ళు యువతపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. పూర్వం ’ విద్యాదదాతి వినయం ’ అనేవారు . విద్యకి ప్రథమ ప్రయోజనం సంస్కారం. అంతిమ ప్రయోజనం సంపాదన. ప్రథమ ప్రయోజనాన్ని విద్యావ్యవస్థ విస్మరించకూడదు. తమ పిల్లలు కొత్తగా కనిపించాలనేది పెద్దల తాపత్రయం. అలా చెయ్యలేకపోతే వెనుకబడినట్లు భావించటం వల్ల విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పబ్ సంస్కృతి , ఆకర్షణలు , వ్యామోహాలను పెంచే వాతావరణం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి ఏకైక ఔషథం ఆథ్యాత్మిక యోగ జీవితం. దీన్ని పెంచటం కోసం సమాజంలో ప్రతిఒక్కరూ పూనుకోవాలి.

ప్రశ్న: ’పరమత సహనం’ అన్న పదానికి స్పష్టమైన అర్థం చెప్పండి. ప్రతి వ్యక్తీ పరమత సహనం కలిగి ఉండి , భావాన్ని చాటుతూ ఉన్నత జీవనాన్ని గడపాలంటే ఏమి చేయాలి?
జవాబు: ఎవరి మతంలో వారు బ్రతుకుతూ ఇతర మతాలను బ్రతకనివ్వటమే పరమత సహనం. సృష్టిలో ఏదో ఒక్క మతమే గొప్పది కాదు. ప్రతి మతమూ ప్రజాహితమే. ఎవరి తల్లి వారికి గొప్ప అయినప్పటీకీ ఇతర స్త్రీలను మాతృభావనతో చూడటం ఉత్తమ సంస్కారం. ఇదే సిద్ధాంతాన్ని మతాల పట్ల కూడా అన్వయించాలి. ఎవరు ఏ మతంలో పుట్టారో చనిపోయే వరకు అదే మతంలో బ్రతకాలి. ఇతర మతాలను గౌరవించాలి. తమ వదలకుండా ఇతర మతాలలోని గొప్ప భావాలను ఆమోదించవచ్చు. దీనికోసం మతం మారాల్సిన పనిలేదు. కొన్ని మతాలకి ప్రత్యేకత నిచ్చి మరికొన్ని మతాలను ఉపేక్షిస్తే అది కాలక్రమంలో అల్లకల్లోలాలకు దారితీస్తుంది.

ప్రశ్న: మనిషి జీవితంలో ఆథ్యాత్మికత ఎందుకు అవసరం ?
జవాబు: మానవ నాగరికతకు పరిపూర్ణత ఆథ్యాత్మికత . పశు స్థాయిలో జన్మించిన మానవుడు సంస్కారాలతో మనిషిగా ఎదిగి దివ్యజీవిగా పరిణమించడానికి ఆథ్యాత్మికతే శరణ్యం. ఆథ్యాత్మికత లేని జీవితాలలో శాంతి కరువవుతుంది. స్వార్థం పెరుగుతుంది. కామక్రోధాది ఉద్రేకాలను నిగ్రహించుకోలేము. ఆథ్యాత్మికత ఉన్న వారికి రజో గుణ , తమో గుణ ప్రకోపాలు తగ్గి, సహనం , త్యాగం వంటి సాత్విక గుణాలు అలవడతాయి. ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రశ్న: ’మన జీవితం దైవ నిర్ణయం ’ అని ప్రతి పనినీ భగవంతునిపై శరణాగతి భావనతో వదలివేయాలా? లేకపోవటానికి మన పుట్టుకను అర్థవంతం చేసుకోవటాన్కి (జన్మ సార్థక్యానికి) ప్రతి క్షణమూ మానవ ప్రయత్నం చేయాలా?
జవాబు: విధి నిర్ణయం గురించి మనకు అనవసరం . మానవ ప్రయత్నం పైనే మన దృష్టిని కేంద్రీకరించాలి. విధి నిర్ణయం అనే మాటను అనుభవం లో తీసుకోవాలి కానీ ఆచరణలో తీసుకోరాదు. పురుష ప్రయత్నాన్ని సఫలీకృతం చేయటానికి దైవ శక్తిని ప్రార్థిస్తాం. సుఖ దుఃఖాల అనుభవాలలో చెక్కుచెదరకుండా నిలిచేందుకు విధి నిర్ణయం అనే మాట మనో నిబ్బరానికి సహకరిస్తుంది.

ప్రశ్న: విద్యలన్నిటిలోనూ గొప్ప విద్య ఏది?
జవాబు:’అథ్యాత్మ విద్యా విద్యానాం’ అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమాత్ముని తెలుసుకునే విద్యే అసలైన విద్య. ఆథ్యాత్మికత తర్కానికి, యుక్తికి లొంగనిది. సాధన , ఉపాసన వల్లనే సాధ్యమవుతుంది.

ప్రశ్న: ఉత్తమమైన సంస్కారం ఏది?
జవాబు: ఏది ఇతరులు చేస్తే మనకు బాధ కలుగుతుందో దానిని మనం ఇతరులకు చెయ్యకుండా ఉండటం అత్యుత్తమ సంస్కారం.

శ్రీ షణ్ముఖ శర్మ గారు, శ్రీమతి పుష్పలత గారు

సూర్యుడు ఎంతో గొప్పవాడని , జ్వలించే అగ్ని గోళమైనా తన ప్రతాపాన్ని అల్ప ప్రాణులపై చూపకుండా ప్రతి ప్రాణిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే వెచ్చదనాన్ని ఇచ్చి కాపాడుతాడని చెప్పారు సామవేదం వారు. అలాగే అసామాన్యమైన పాండిత్యాన్ని , వేద విఙ్ఞానాన్ని తమ లోనే దాచుకుని నేనడిగిన సామాన్యమైన ప్రశ్నలకి నాకు అర్థమయ్యే భాషలో వివరంగా చెప్పి ఆ మాటలలోనే ఎంతో గొప్ప సారాంశాన్ని సమాజానికి అందించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

8 వ్యాఖ్యలు:

anveshi చెప్పారు...

Excellent.thanks for the interview/post.
samvedam gari to matlade avakaasam ravatam nijam ga adrustame.:)

కొత్త పాళీ చెప్పారు...

good show

subhadra చెప్పారు...

hi padma,
bagundi.
naa 2,4&last quesions nachai.
manchi,upayogapade post rasaru.
2nd one parents kosam avasaramaina vishayam.
muggula result yappudu.

Tekumalla Venkatappaiah చెప్పారు...

"పశ్యామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం.
జీవేషు శరదశ్శతం
మోదామ శరదశ్శతం
అజీతాశ్యమ శరదశ్శతం
భవామ శరదశ్శతం
శ్రుణవామ శరదశ్శతం"

ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బ్రతకాలి. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ,
చక్కగా మట్లాడుతూ, పరాధీనుడు కకుండా బ్రతకాలి అని అర్ధం.

"మా విద్విషావహై" ... మెము ఒకరికి ఒకరం ద్వేషించుకోము అని అర్ధం.

"సహనావవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవా వహై
తెజస్వినా వధీత మస్తు,
మా విద్విషావహై"

కలిసి రక్షించుకొందాము. కలిసి భుజిద్దాము. కలిసి శక్తిమంతులమౌదాము.

ఎంత చక్కని వేద సంస్క్రుతి !

ఎటువంటి సంస్క్రుతి నుండి ఎతువెల్తున్నాము మనం!
మన గమ్యం ఎమిటి? అగమ్య గోచరమేనా?

మిత్రులారా! ఈ బ్లాగు చదివి అలోచించండి.
.

తెలుగుకళ చెప్పారు...

"పశ్యామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం.
జీవేషు శరదశ్శతం
మోదామ శరదశ్శతం
అజీతాశ్యమ శరదశ్శతం
భవామ శరదశ్శతం
శ్రుణవామ శరదశ్శతం"

ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బ్రతకాలి. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ,
చక్కగా మట్లాడుతూ, పరాధీనుడు కకుండా బ్రతకాలి అని అర్ధం.

"మా విద్విషావహై" ... మెము ఒకరికి ఒకరం ద్వేషించుకోము అని అర్ధం.

"సహనావవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవా వహై
తెజస్వినా వధీత మస్తు,
మా విద్విషావహై"

కలిసి రక్షించుకొందాము. కలిసి భుజిద్దాము. కలిసి శక్తిమంతులమౌదాము.

ఎంత చక్కని వేద సంస్క్రుతి !

ఎటువంటి సంస్క్రుతి నుండి ఎతువెల్తున్నాము మనం!
మన గమ్యం ఎమిటి? అగమ్య గోచరమేనా?

మిత్రులారా! ఈ బ్లాగు చదివి అలోచించండి.

తెలుగుకళ చెప్పారు...

వెంకటప్పయ్యగారూ ! మీ వ్యాఖ్య పొరపాటున ఇంతకుముందు పోస్టుకి చేరింది. దాన్ని ఇక్కడకు తెచ్చాను. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

ఆధ్యాత్మిక,సామాజిక అంశాలపై ఆర్టికల్స్ అందించటమే ప్రధాన ధ్యేయం.ఒకసారి నా బ్లాగ్ చూడండి.
http://ahmedchowdary.blogspot.in/

అజ్ఞాత చెప్పారు...

http://ahmedchowdary.blogspot.in/

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి