17 ఫిబ్ర, 2009

జనవరి 2009 - ఇండియన్ వింగ్స్ అసోసియేషన్ - చీరాల బహుమతి పొందిన రెక్కలు ( నా కవిత...)


మల్లెతీగ సంపాదకులు శీ కలిమిశ్రీ, శ్రీ సుగమ్ బాబు, శ్రీ శివారెడ్డి,నేను , శ్రీ శ్రీనివాస్ గౌడ్
' ఇండియన్ వింగ్స్ అసోసియేషన్ ' - చీరాల వారి ఆధ్వర్యంలో జరిగిన రెక్కలు కవితా పోటీలలో నేను రాసిన రెక్కలకు ద్వితీయ బహుమతి లభించింది. బహుమతి పొందిన రెక్కలు:
నమస్కరిస్తే
నష్టం లేదు
ప్రణమిల్లితే
ప్రాణం పోదు
బేడా ఖరీదు చెయ్యవు ~
భేషజాలు
------------------------------------ ఈ కవిత రాయడానికి నాకు లభించిన స్ఫూర్తి : చాలా మంది తామే గొప్ప వాళ్ళమని గర్విస్తూ ఉంటారు. తాము గొప్ప వాళ్ళమనుకోవటం ఎంత మాత్రమూ తప్పు కాదు. తాము మాత్రమే గొప్ప అనుకోవటం తో పాటు ఇతరులను తక్కువగా భావించి, తమ గొప్ప తనాన్ని చాటుకోవాలనుకోవటం క్షమించరాని నేరం. గొప్ప వాళ్ళు, మహాను భావులు , మహనీయులు లోకంలో కోకొల్లలు. నిత్యం మనకి ఎదురు పడే పెద్దవాళ్లని , చిన్నవాళ్లైన విఙ్ఞానవంతులని గౌరవించటం మన సంస్కారం . ఎవరైనా ఎదురుపడితే నమస్కరించటం మన భారతీయ సంప్రదాయం . కొందరు ఇతరులకి నమస్కరించటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ముందుగా నమస్కరించటం వల్ల తమ ప్రతిష్ఠకి భంగం కలుగుతుందనీ, ఎదుటి వారి కంటే తమ స్థాయి పడిపోతుందనీ అనవసరమైన భయాలతో , అహంకారంతో ఉండే వారిని ఉద్దేశ్యించి ఈ రెక్కలు రాశాను. భేషజాలు లేని మనస్తత్వానికి ప్రతిచోటా ఆదరణ లభిస్తుందని నాకు తెలిసిన చిన్న విషయాన్ని కవితగా మలచాను. ఈ కవిత ని బహుమతి కి ఎంపిక చేసిన తొలి తెలుగు రెక్కల కవి శ్రీ సుగమ్ బాబు గారికి , మలి రెక్కల కవి శ్రీ పి. శ్రీని వాస్ గౌడ్ గారు తదితర న్యాయనిర్ణేతలకి ధన్యవాదాలు. తోచిన భావాలకి అక్షర రూపం పెట్టటం మాత్రమే నాకు తెలుసు. మహా పండితులున్న కవితా సామ్రాజ్యంలో కవయిత్రి అనిపించుకోవాలనుకోవటం పెద్ద సాహసమే అనుకుంటున్నాను. నేను అంత సాహసం చెయ్యటం లేదు కానీ నా కవిత కి లబించిన బహుమతి తో పాటు పొందిన ఇంకొక గొప్ప బహుమతి ఇచ్చిన ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ శివారెడ్డి గారి చేతుల మీదుగా మొట్టమొదటి బహుమతి (కవితలకి) అందుకోవటం నా అదృష్టం గా భావిస్తున్నాను.

9 వ్యాఖ్యలు:

మధుర వాణి చెప్పారు...

congratulations...!!!!

...Padmarpita... చెప్పారు...

Congrats!!!! REKKALU deserves it....

సిరిసిరిమువ్వ చెప్పారు...

అభినందనలు.

చైతన్య.ఎస్ చెప్పారు...

అభినందనలు

Tekumalla Venkatappaiah చెప్పారు...

భేషజం ఖేదానికి మూలం!
విభేదాలకు నాంది!
సుభాషణ మానవాళి కి భూషణం!
సు సంస్కారం సంస్కృతి కి సంకేతం!
ద్వితీయ బహుమతి - మీ అద్వితీయ ప్రతిభకు
ఆనందానికి చక్కని "కళా"కృతి.
"పద్మం" లో "రెక్కలు" తక్కువా?
మీకు బహుమతులకేమి తక్కువ!

తెలుగుకళ చెప్పారు...

మీ అభిమానానికి ధన్యవాదాలు.

nandayarrachowdu చెప్పారు...

congratulations...!!!!

శ్రీనివాస చెప్పారు...

"బేడా ఖరీదు చెయ్యవు - భేషజాలు"
నిజంగా నిజం.
అభినందనలు అక్కా :-)

kadanbari చెప్పారు...

"బేడా ఖరీదు చెయ్యవు - భేషజాలు"

Nice kavita!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి