13 ఏప్రి, 2009

నానో..

తీవ్రవాదపు
ఆకలి
మల్లెపూలు
మంటలపాలు

4 వ్యాఖ్యలు:

Tekumalla Venkatappaiah చెప్పారు...

నానో అంటే ఎంటి? నాన్నా! అని అర్థమా? లేక నానో టెక్నాలజీ అనా?
అర్థం కాలేదు.

తీవ్ర వాద తీవ్ర రూపం!
మల్లె తీవలు మంటల్లో
మాడి మసి అవుతున్నాయి!

వికసించకనే కుసుమాలు
వాడి వత్తలౌతున్నాయి!

బాల్యాన్ని కాటేసి మరీ
బావుటాలు యెగరేయాలా?

దుష్ట సంస్క్రుతి దునిమే
దుంధుభులు మోగుతాయా?

Tekumalla Venkatappaiah చెప్పారు...

నానో అంటే ఎంటి? నాన్నా! అని అర్థమా? లేక నానో టెక్నాలజీ అనా?
అర్థం కాలేదు.

తీవ్ర వాద తీవ్ర రూపం!
మల్లె తీవలు మంటల్లో
మాడి మసి అవుతున్నాయి!

వికసించకనే కుసుమాలు
వాడి వత్తలౌతున్నాయి!

బాల్యాన్ని కాటేసి మరీ
బావుటాలు యెగరేయాలా?

దుష్ట సంస్క్రుతి దునిమే
దుంధుభులు మోగుతాయా?

తెలుగుకళ చెప్పారు...

నానో కవిత్వం - పరిచయం

సూక్ష్మత, ఆర్ద్రత, గుప్తత కల్గిన కవిత్వం సరాసరి గుండెను తాకుతుంది. సూదిలా గుచ్చుకుని, ఉటంకించడానికి వీలుగానూ ఉంటుంది. నాలుగే నాలుగు పదాలు పాఠకుల్ని కదిలించి, జ్ఞాపకమై నిలిచిపోతే? సరిగ్గా ఈ ఆలోచనలోంచే రూపుదిద్దుకున్నై "నానోలు, కవిత్వం X 10-9"

వచన కవిత్వం నిడివి తగ్గినప్పుడు కవిత్వాన్ని 'మినీ కవిత్వం' అన్నారు. తర్వాత వచ్చిన రూప ప్రక్రియల్ని (నానీలు, హైకూలు) 'మైక్రో కవిత్వమన్నారు. నానో టెక్నాలజి రాజ్యమేలుతున్న నేటి రోజున కవిత్వాన్నీ సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో చెప్పడానికే "నానోలు". నానో అంటే సూక్ష్మాతి సూక్ష్మం (10-9) అని అర్ధం. ఈ పేరు భౌతిక శాస్త్ర పారిభాశిక పదం. నానోల పుట్టిన కాలం మే'2005. సృష్టికర్త - ఈగ హనుమాన్. నానోలు విరివిగా రాసిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవల్సంది: పోతగాని సత్యనారాయణ, బొమ్మరాత యెల్లయ్య, మాల్యశ్రీ, కాసర్ల రంగారావు, శిరంశెట్టి కాంతారావు..మరియు ఇంకొందరు..

ఇక, నానో రూప కవిత్వ లక్షణాలు చూద్దాం.
--> నాలుగు పాదాలు.
--> పాదానికి ఒకే ఒక్క పదం. సమాసం, సంధి ఐనా సరే.
--> యెంత సూక్ష్మత పాటిస్తే అంత చిక్కగా, పదునుగ, ప్రభావవంతంగా ఉంటాయి.

ఐతే సుమా! ఇది కవిత్వం, పదం మీద పదం-నాలుగు పదాలు కూర్చితే వచ్చేవి నానోలు కావు. ఈ జాగ్రత్త అత్యవసరం. కొన్ని నానోలు నా బ్లాగులో ఉన్నై రుచి చూడండి.
(ఈగ హనుమాన్- నానోల సృష్టికర్త)

దాదాపు అన్ని ముఖ్యమైన పత్రికలు నానోలని ప్రచురించాయి.
http://nanolu.blogspot.com

ఈగ హనుమాన్ (హనీ), చెప్పారు...

మీ ఈ నానో బావుందండి పద్మకళ గారు. ఎన్నొ ఆలొచనలను రేకెత్తించేదిగా ఉంది, మంచి ప్రయత్నం. నానోలు రాయడం కొనసాగిస్తూనే ఉండండి. విష్ యు ఆల్ ద్ బెస్ట్
ఈగ హనుమాన్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి