Pages

1 మే, 2009

వేసవి వినోదం

వేసవి వచ్చింది వినోదాలకు ఆహ్వానం పలుకుతోంది . అదే ఇల్లు, అదే వాకిలి, అదే సందు, అదే ఊరు అదే వాతావరణం … చూసి చూసీ .. విసుగెత్తి ఏదో కొత్త దనం కావాలంటూ.. ఎప్పుడెప్పుడు రెక్కలు గట్తుకుని ఎగురుదామా అని ఎదురుచూస్తూంటారు చిన్నా పెద్దా అంతా.

సంవత్సరానికి సరిపడా ఆనందాన్ని , అనుభూతులని పోగేసుకోవాలంటె దానికి తగ్గట్తుగా సరైన సమయంలో సరైన ప్రణాళీకల ద్వారా చాలా కసరత్తు చెయ్యాల్సిందే. గడప దాటిన దగ్గరనుంచీ మళ్ళీ ఇంటికి చేరే దాకా మనం చేసే ప్రతి పనీ మన ప్రయాణం లో ఎన్నెన్నో కొత్త పాఠాలు నేర్పుతుంది. టూర్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చిన ఇబ్బందులను తలచుకుని బాధ పదేకంటె ముందే తగిన విధంగా జాగ్రత్తపడటం మంచిది.

ఎలా ప్రణాళిక చెయ్యాలి?

బడ్జెట్

మన బడ్జెట్ ని బట్తి మనం వెళ్ళాలను కునే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎంత ఖర్చు పెట్టగలమో ముందుగా ఆలోచిందుకొని వివరంగా ఖర్చుల ను ఊహించి చిట్టా తయారు చేసుకోవాలి.

ప్రయాణపు టిక్కేట్లు , ఇతర సరుకులు, షాపింగ్, పిల్లల చిరుతిళ్ళు, బంధువులకోసం కొనుక్కొని రావాల్సిన వస్తువులు, ఎంతమందికి ఏమేమి వస్తువులు కొని తేవాలి ముందుగానే రాసిపెట్తుకోవాలి.

అదనంగా ఊహించని ఖర్చులకోసం కొంత అదనపు మొత్తాన్ని కేటాయించుకోవాల్సిఉంటుంది.

ప్రతిసంవత్సరం ఇంటిల్లపాదీ ప్రశాంతంగా రోజు వారీ ఒత్తిడులక్ఉ దూరంగా చేసే సమ్మర్ ట్రిప్ కోసం ముందునుంచే ప్రతి నెలా కొంత మొత్తాన్ని దాచుకోవటం అనేది తెలివైన పద్ధతి.

స్పాట్:

వేసవి విహారం దాచుకున్న ప్రతి పైసాకీ అర్థాన్నిచ్చేదిగా ఉండాలి. మన ట్రిప్లో ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ఉపయుక్తం కావాలి. అందుకోసం మనం ఎంచుకునే ప్రాంతం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలి. కేవలం వినోదం కోసమే కాకుండా వేసవి విహారాలు విఙ్ఞానాన్ని పెంచేవిగా , మన సంస్కృతి , చారిత్రక విశేషాలపై అవగాహన కల్పించేవిగా ఉంటే బాగుంటుంది.ఎప్పుడూ యాంత్రిక జీవనంలో ఇరుక్కుని పరుగులు తీస్తూనే ఉంటాం కాబట్టి వీలైనంతవరకు ఏడాదికొక్కసారైనా ప్రకృతికి సమీపంలో ఉండేవిధంగా ప్లాన్ చేసుకోవటం మంచిది.


టిక్క్టెట్ రిజర్వేషన్:

అనుకున్న ప్రాంతానికి కనీసం పది పదిహేను రోజుల ముందైనా టిక్కెట్ల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.అప్పటికప్పుడు చూసుకుందాం లె అని నిర్లక్ష్యం చేస్తే మొదలుకే మోసం వచ్చి మొత్తానికి ట్రిప్ కేన్సిలవ్వటం ఉత్సాహం నీరుగారిపోవటం ఖాయం.టిక్కేట్ల విషయంలో సంబంధిత ఏజెంట్లు , టూరిశ్ట్ సర్వీసులను ఒక నెల ముందు నుంచే సంప్రదిస్తే బాగుంటుంది. ఆన్లైన్ లో టిక్కెట బుకింగ్ ద్వారా ఎంతో సమయం ఆదా అవుతూంది. రాను పోనుట్ిక్కెటల రిజర్వేషన్ చెయ్యించుకుంటె తిరుగు ప్రయాణపు టెన్షన్ ఉండదు.


సరంజామా:

లెస్ లగేజ్ మోర్ కఫర్ట్ అయినప్పటికీ… ప్రయాణంలో అవసరమైన వస్తువలను ముందు జాగ్రత్తతో సిద్ధం చేసుకోవాలి. వేసవి కాబట్తి కొత్త వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో స్నేహితులను విచారించి తెలుసుకోవాలి.ముఖ్యంగా పిల్లకైనా పెద్దలకైనా కాటన్ వస్త్రాలు, సౌకర్యవంతంగా ఉండెవి ఎంచుకోవాలి. చిన్నపిల్లలు గల వాళ్ళు జ్వరం, జలుబు, విరేచనాలు, వాంతులు, అజీర్తి, లాంటి అస్వస్థతలకువాడావలసిన మందుల జాబితా ను ముందే డాక్టరు వద్ద తీసుకుని సిద్ధం చేసుకోవాలి. గ్లూకోజ్, మంచినీళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.

స్వీట్ మెమరీస్

అందమైన సన్నివేశాలు, దృశ్యాలు తియ్యని అనుభవాలుగా మిగలాలంటె మీ ప్రయాణంలో నచ్చిన ప్రతి అంశాన్ని పదిలపర్చుకోవాల్సిందే.అందుకోసం ప్రత్యేకించి ఒక కిట్ ను సిద్ధం చేసుకోవాలి. మామూలు కెమేరా అయితే మూడు నాలుగు బ్యాటరీ సెట్లు, కొత్త రీళ్ళు, పెట్తుకోవాలి. డిజిటల్ కెమేరా లయితే రీచార్జ్ కోసం చార్జర్స్, అదనంగా మెమరీ కార్డులు(చిప్స్) సిద్ధం చేసుకోవాలి. పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కో డైరీ కొనిస్తే వాళ్ళ అనుభవాలు ఎప్పటికప్పుడు రాసుకునేలా చెయ్యటం వల్ల వాళ్ళలో రైటింగ్ స్కిల్స్ తో పాటు ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. వీలైతే వెళ్ళే ముందే అక్కడి విశేషాల గురించి తెలుసుకొనివ్ెళితే చాలా సమయం ఆదా అవుతుంది.స్పాట్స్ కి వెళ్ళేటప్పుడు ముందుగా తయారయ్య్యి వెళ్లటం వల్ల నచ్చిన చోట ప్రశాంతంగా ఎక్కువ సమయం గడిపే వీలుంది.


ఆహారం

ప్రయాణంలో సాధ్యమైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పిల్లలు కొత్త రకం వంటకాలకు ఆకర్షింపబడినా వాళ్ళపై కొంతవరకు నియంత్రణ అవసరం. ఇంటిదగ్గర ప్రయాణంలో తినేందుకు కొన్ని పదార్థాలు తీసుకుని వెళ్ళవచ్చు.

పెద్ద వాళ్లతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా పట్తించుకుంటూ వారిపై ప్రత్యేకించి శ్రద్ధ చూపాలి. చిన్న వాళ్లందరూ ముందు పరుగెడుతూ వెళ్ళీపోతే పెద్ద వాళ్ళు వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్తు ఫీలయ్యే ప్రమాదం ఉంది.

మీప్రయాణం సుఖవంతంగా సాగి వేసవి విహారం ఉల్లాసంగా సాగటానికి కుటుంబమంతా ఒకచోట కూర్చుని ఏమేం చెయ్యాలనుకుంటున్నారో చర్చించండి. ఆలోచనలు ఆచరణ సాథ్యమైనవైతే లిస్టౌట్ చేసుకోండి. హ్యావ్ ఎ స్మార్ట్ ట్రిప్......


2 కామెంట్‌లు:

ఈగ హనుమాన్ (హనీ), చెప్పారు...

కళ గారు!!
మంచి సలహాలు ఇచ్చి వేసవి ప్రయాణాన్ని సులభం చేసినందుకు ధన్యవాదాలు
ఈగ హనుమాన్

పరిమళం చెప్పారు...

useful post! thanks!

కామెంట్‌ను పోస్ట్ చేయండి