Pages

22 మే, 2009

బుజ్జి బ(బు)ల్లెమ్మకి దాహం వేసింది…….

వేసవి తాపం మనుషులకీ జంతువులకే కాదు … పక్షులకీ కీటకాలకీ కూడా…..

కాకపోతే ఎంతసేపూ మనం మన దాహాన్ని తీర్చుకునే పనిలోనే ఉంటాం కానీ వాటి దాహాన్ని పట్టించుకోలేం.అది పూర్తిగా మన తప్పు కాదు.

వాటికి ఎప్పుడు దాహం వేస్తుందో మనకెలా తెలుస్తుంది . కానీ ఈ రోజు నాకో లక్కీ చాన్స్ దొరికింది.

ఓ బుజ్జి బ(బు)ల్లెమ్మ కి దాహం వేసింది కాబోలు .. ఎంతకీ సింకులోనుంచి బయటకి రావటమే లేదు. ఏం జరిగిందబ్బా ఒకవేళ పైకి ఎక్కలేకపోతోందేమోనని దానికి ఆధారం అందించి చూశా…

ప్చ్.. సమస్యే లేదు. అది బయటికి రావటం లేదు.  సరే చూద్దాం అనుకుని దాన్నలా వదిలేసి నా పనినేను చేసుకుంటుంటే .. ఎందుకో నాకళ్ళు బతిమాలాయి .. ఓసి పిచ్చీ .. ఓసారి అదెలా ఉందో చూడూ.. అని

సరే… అని చూస్తే..అక్కడ రాణీ గారు … (ఇంతకీ రాజు గారో రాణీ గారో నాకు  తెలియదు లెండి) చక్కగా జలకాలాడుతూ.. మంచినీళ్ళూ తాగుతూ కనిపించింది.

ఇదిగో ఆ మారాణి దర్జా …. మీరూ చూడండి.

 

 

 

 

హాయ్.. హాయ్ గా .. కూల్ కూల్ గా…                    జలకాలాటలలో………                                అమ్మో ! చూసేశారా ! … ఐతే నే పోతన్నా!……..

 

may photos...birds... 147      may photos...birds... 146 may photos...birds... 148          బైబై………….

3 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

బెండకాయ కూరనా నీళ్ళ తో పాటు వుంది..గుడ్ ఫోటోగ్రఫీ ..

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చూడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది

పరిమళం చెప్పారు...

నన్ను అత్యంత భయపెట్టేవి మూడు అవి వరుసగా ...పాము , బల్లి , బొద్దింక .హైదరాబాద్ ఫ్లాట్స్ పుణ్యమాని ..బొద్దింకల భయం పోయింది .ఎంత ముద్దుగా రాశారండీ బుజ్జి బల్లెమ్మ అని !

కామెంట్‌ను పోస్ట్ చేయండి