2 ఆగ, 2009

అపురూపమీ స్నేహ బంధం

FriendshipDay9

ప్రాణం తో సమంగా తూగే ఒకే ఒక్క బంధం స్నేహ బంధం. లోకంలో ఎన్ని బంధాలున్నా స్నేహ బంధాన్ని మించిన బంధం లేదు.ప్రాణ స్నేహితుడు అన్న పదమే ఇందుకు నిదర్శనం. ప్రాణ అనే  పదం ఇంక ఏ  బంధానికి ఉపయోగించరు. ఎక్కడో పుట్తి ఎక్కడో పెరిగి అనుహ్యంగా కలిసినా ఎప్పటికీ తోడు ఉండే బంధం స్నేహ బందం.

రక్త సంబంధాన్ని కూడా మన్నించకుండా ఆస్థులకోసం స్వార్థం తో తెగనరుక్కుంటున్న ఈ రోజుల్లో కూడా స్నేహం కోసం  ప్రాణాలివ్వడానికి సిద్ధపడేవారికీ  ఎంత మాత్రమూ కొదువలేదు.

నిర్వచనాలకు అందని అపురూపమిన భావం స్నేహం. 

అత్యుత్తమమైన స్నేహం:

కళ్ళు _చేతులు 

చేతికి ఏమాత్రం నొప్పి తగిలినా కళ్ళు ఏడుస్తాయి. కళ్ళు కన్నీరు కార్చేలోపే చేతులు ఆ కన్నీటిని తుడుస్తాయి.నిజమైన స్నేహానికి కళ్ళు చేతులు చక్కటి ఉదాహరణ.

జీవన యానాన్ని సజావుగా నడిపించే షిప్ ఫ్రెండ్ షిప్

ఓడలు బళ్ళైనా బళ్ళూ ఓడలైనా తరాలు మారినా అంతరంగాలతో పె నవేసుకున్న బంధం ఎన్నడికీ  వీడని స్నేహ బంధం ఈ రోజు పుట్తిన రోజు జరుపుకుంటున్న సందర్భంలో మైత్రీ దినోత్సవ కానుకగా   తెలుగుకళ  మీకోసం సమర్పిస్తున్న  స్నేహ కుసుమం….


తల్లిదండ్రులు, ఆప్తులను కూడా ప్రక్కన బెట్తి స్నేహితులను గౌరవిస్తుంటాం.మనవ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటాం.

స్నేహం  మధ్యాహ్న కాలం తీవ్రం గా మొదలై సాయంత్రానికి తగ్గిపోయేదిగా ఉండకుండా ఉదయ భానుని లాగా క్రమేపీ పెరిగేదిగా ఉండాలి.

పటిష్టమైన ఒక భవంతిని నిర్మించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ అది చిరకాలం నిలిచిపోతుంది. పేక మేడలు క్షణాల్లో కట్టగలం కానీ అది క్షణం లో నేల కూలుతుంది. బలమైన స్నేహానికి నమ్మకమనే పునాది ఉండాలి. స్నేహితులు మనపై ఉంచుకున్న నమ్మకాన్ని జీవితాంతం నిలుపుకోగలవారే నిజమైన స్నేహిత్రులు అనిపించుకుంటారు.

 

 

 


ప్రాణాలిచ్చే స్నెహితుల తో పాటు స్నేహం పేరుతో జనాన్ని మోసపుచ్చే స్వార్థపరులు కూడా సమాజం లో ఉంటారన్న సంగతి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

 


ఎవరితో, ఎటువంటి వారితో  స్నేహం చెయ్యాలి?


మనం ఎంచుకునే స్నేహితులను బట్టి మన స్వభావం , వ్యక్తిత్వం తెలుస్తాయి. "టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ" అన్న ఆంగ్లోక్తి స్నేహాల ప్రభావాన్ని చెప్పకనే చెబుతుంది.
మంచి మార్గంలో  పయనించే వారి తో స్నేహం చేస్తే వారి మంచితనం తో పాటు, సంఘంలో  వారికున్న గౌరవం, మన్నన మనకి  కూడా దక్కుతాయి.గంధపు చెట్టు దగ్గర కాస్సేపు ఉండి వస్తే చాలు ఆ పరిమళం మనకు కూడా అంటుకుంటుంది.


చెడు సావాసాల బారిన పడ్డవారిని ఆ దేవుడి కూడా కాపాడ లేడు.
.

వీళ్ళు మంచివారు వీరు చెడ్డవారు అని తెలుసుకోవటం ఎంతో కష్టం . కాబట్టి  ఎప్పుడైనా పొరపాటున చెడ్డవారితో స్నేహం చెయ్యాల్సి వస్తే మన సాంగత్యంలో వారిని మంచిమాటలతో ప్రభావితం చేసి మంచి మార్గం లో పెట్టాలి. 

మహా వీరుడైన కర్ణుడు కేవలం దుస్సాంగత్యం వల్లనే కదా అంత గొప్ప వీరుడైనా సరే లోకనిందకు గురై ప్రాణాలు కోల్పోయాడు !

దుర్యోధనుడు  చెడ్డవాడని తెలిసినా , అతనిని మంచి మార్గం లో పెట్టకుండా అతను చేసే అన్ని పనుల్లోనూ భాగస్వామియై అతని పాపాల్ని పంచుకోవటం మాత్రమే కాకుండా స్నేహితునితో పాటు పతనమయ్యాడు కర్ణుడు.

స్వచ్చ మైన మనసుతో గుప్పెడు అటుకులతో స్నేహితుడిని ఆశ్రయించి దారిద్య్రం నుండి విముక్తి పొందిన కృష్ణుని బాల్య మిత్రుడు సుధాముడే కుచేలుని గా చరిత్రలో నిలిచిపోయాడు.

మహా వీరుడైన అర్జునుడు కూడా మిత్రుని పూర్తిగా విశ్వసించి అతనపై పూర్తి భారాన్నిమోసి విజేతగా నిలిచాడు.

సాక్షాత్తూ భగవంతుని అవతారమైన శ్రీరాముడు కూడా సుగ్రీవుని తో సావాసం చేసి అతని సాయాన్ని పొందాడు.

విలాసాల బారిన పడిన రాజకుమారులను దారిన పెట్టేందుకు విష్ణుశర్మ పంచతంత్రాన్ని బోధించాడు.అందులోని మిత్ర లాభం , మిత్ర భేదం విభాగాల్లోని కథలు స్నేహితుల వల్ల, స్నేహాల వల్ల కలిగేలాభాలను, స్నేహ్తితులతో వైరం వల్ల కలిగే పర్యవసానాలను చక్కగా వివరించాయి.

ధన గర్వంతో స్నేహితుడైన ద్రోణుని  అవమానించి  తిరస్కరించిన ద్రుపద మహారాజు తదనంతర కాలంలో అర్జునుని ద్వారా ద్రోణుని క్షమాపణ అడిగాడు. అయిన్నప్పటికీ వారి వైరం కురుక్షేత్రంతో గానీ ముగియలేదు.

 

----------------------------------------------------------------------------------------

స్నేహానికి స్వార్థానికి పొంతన కుదరదు. స్నేహమున్న చోట స్వార్థం, స్వార్థ మున్న చోట స్నేహం మనలేవు. రెండూ ఎప్పుడైనా కలిశాయంటే అక్కడనిజమిఅన స్నేహం చచ్చిపోయినట్టే.


కొంతమంది స్వలాభం కోసం కొత్త స్నేహితులను సంపాదించుకుంటూ ఉంటారు. అవి కేవలం పరిచయాలు మాత్రమే.  అన్ని పరిచయాలూ స్నేహాలు కావు. ఫ్రెండ్స్ అనుకున్నంత మాత్రాన సరిపోదు.

ప్రెండ్ షిప్ ను కలకాలం నిలబెట్తుకునే సత్తా ఉండాలి.


కొత్త స్నేహాలు పెంచుకోవటం మంచిదే . కానీ పాత స్నెహాలను మర్చిపోకూడదు.


ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఎందుకు కట్టుకుంటారు?

జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా  నీకు నేను ,నాకు నువ్వు ఎప్పటికీ తోడుగా ఉండి ఒకరినొకరు కాపాడుకుందాం !” అనే ప్రమాణానికి మారుగా ప్రెండ్ షిప్ బాండ్ కట్టుకుంటారు. ఎంత ఖరీదైన బాండ్ కట్టాం అనే దాని కన్నా ఎంత స్వచ్చమైన మనసుతో కట్టాం అనేదే ముఖ్యం.

 


ఎటువంటి వారు కట్తించుకోవాలి?

స్నేహితుల మనసును ప్రతిబింబించే బందాని గుర్తుగ కట్టె ప్రెండ్ షిప్ బాండ్ పై గౌరవం ఉన్న వారే దాన్నికట్తించుకోవాలి.

స్నేహానికి స్వార్థానికి పొంతన కుదరదు. స్నేహమున్న చోట స్వార్థం, స్వార్థ మున్న చోట స్నేహం మనలేవు. రెండూ ఎప్పుడైనా కలిశాయంటే అక్కడనిజమిఅన స్నేహం చచ్చిపోయినట్టే.
కొంతమంది స్వలాభం కోసం కొత్త స్నేహితులను సంపాదించుకుంటూ ఉంటారు. అవి కేవలం పరిచయాలు మాత్రమే.  అన్ని పరిచయాలూ స్నేహాలు కావు. ఫ్రెండ్స్ అనుకున్నంత మాత్రాన సరిపోదు.
కొత్త స్నేహాలు పెంచుకోవటం మంచిదే . కానీ పాత స్నెహాలను మర్చిపోకూడదు.

friendship_myspace_comments_04


9 వ్యాఖ్యలు:

Chakravarthy చెప్పారు...

స్నేహం అనేది ఓ అనిర్వచనమైన భావన. నేనున్నాననే భరోసా .. కష్టంలోనైనా సుఖంలోనైన స్పందనకు గురి అయ్యేది ఒక్క స్నేహం మాత్రమే.. అలాంటి స్నేహానికి చేడు అనేది ఏమీ లేదు. అంతా స్నేహమే.. చెడు చేసేటోళ్ళుకూడా వారి స్నేహితులకు చెయ్యరు. నమ్మక ద్రోహం చేసేటోళ్ళు కూడా మొదట స్నేహితులే..

Srinivas చెప్పారు...

స్నేహం యొక్క విలువను, దాని ఔచిత్యాన్ని చాలా చక్కగా వివరించినందుకు ముందుగా నా ధన్యవాదములు.
మైత్రీ దినోత్సవము నా ప్రాణమైన స్నేహితులందరికీ శుభాకాంక్షలు, ఈ బంధం ఇలాగే జీవితాంతం కొనసాగాలని అకాంక్షిస్తూ
శ్రీనివాస్ కర

ఉష చెప్పారు...

అసూయలోను స్నేహం మనలేదు. నా నుండి దూరమైన కొన్ని స్నేహబంధాలు ఆ రాకాసి చేత చిక్కినవే. అవకాశవాదాన్ని, కుటిలత్వాన్నీ నాకు రుచిచూపింది స్నేహపు ముసుగే. జీవితాన్ని పరిచయం చేసింది, ఇపుడు నన్ను ప్రాణాలతో నిలిపింది మాత్రం స్నేహమే. మీరన్న రెండు ప్రక్కల నాణేన్నీ చూశేసా. మీకు మైత్రి దిన మరువపు వన శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

chaalaabaagaa cheppaaru.
happy friendship day

balaavi చెప్పారు...

exlent super ga undhi friends & friend ship
mee lanti vari surpthi tho nenu oka blog start
chesunu tuppulu untea telyachyndi

శివ చెరువు చెప్పారు...

Belated Happy Friendship Day :)

Tekumalla Venkatappaiah చెప్పారు...

మంచి మిత్రులు మనకున్న పంచి ఇచ్చు
మమత మంచిగాను, నేస్తులేని మనిషి ఇల
నుగలడ?తరచి చూడంగ! పగలు రాత్రు
లందు మనమేలు గోరెడి పొందు హాయి!

Nrahamthulla చెప్పారు...

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..!
స్నేహం అనిర్వచనీయం.. అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది... ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా 'మైత్రి' మధురిమను పెంచుతోంది...కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. 'స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది'. 'జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది'. స్నేహం ఎంతో తియ్యనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా 'ఫ్రెండ్‌షిప్‌డే' ను ఘనంగా నిర్వహించుకుంటారు.

* స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- చింగ్‌చౌ
* శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - వివేకానందుడు
* విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు - గౌతమబుద్ధుడు
* మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్న ప్రియమైనది ఏదీ ఉండదు - గురునానక్
* కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
* అహంకారికి మిత్రులుండరు - ఆస్కార్‌వైల్డ్
* ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం - గాంధీ
* ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం -కార్డినల్‌న్యూమాన్
* చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - మార్టిన్ లూథర్‌కింగ్
* నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు0చువాడే నిజమైన నీ స్నేహితుడు - బెంజిమన్ ఫ్రాక్లిన్
* మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు - స్వీడెన్ బర్గ్
* మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - లియోటాల్‌స్టాయ్
* మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు - సెయింట్ బెర్నార్డ్

గాఢమైతే... ప్రమాదమే
ఒక స్నేహం జీవితాన్నే మార్చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాలంతోపాటు స్నేహపు విలువలు మారుతున్నాయి. ఇందుకనుగుణంగానే స్నేహం ఒడిలోని వెలుగు, చీకటి కోణాలపై దృష్టిసారించాలి. బలహీనతలను ఆసరాగా చేసుకుని పరిచయం చేసే వారితో కాస్తా దూరంగా ఉండేందుకు యత్నించాలి. ఉన్నతభావాలతో తమ సాన్నిహిత్యాన్ని కోరుకునే స్నేహితులకు స్నేహహస్తాన్ని అందించాలి. అంతరంగాల్లో మార్పురాకుండా స్వచ్ఛంగా ఉండాలి.

జీవన విధానంపై ప్రమాదం
ఇద్దరు వ్యక్తుల మధ్య పెరిగిన సాన్నిహిత్యం కూడా అనర్థాలకు దారితీస్తుంది. గాఢమైన మైత్రీ బంధం వల్ల ఏర్పడిన ప్రమాదం వారి జీవన విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కౌమారదశలో పెరిగే గాఢమైత్రీ ఒక్కోసారి పెను ఉపద్రవాలకు దారితీస్తుంది. ఈ సమయంలో పెరిగే పరిచయాలపై హద్దులుండాలి. అప్పుడప్పుడు ఎదురయ్యే దుష్పరిణామాల్ని తట్టుకునే ఆత్మస్త్థెర్యం కూడా ఇరువురిలో ఉండాలి. అవసరాలకనుగుణంగా జరిగిన పొరపాటును సరిచేసేందుకు చొరవచూపాలి.

స్నేహం.. జీవనవేధమే...
మధురమైన స్నేహాన్ని అందుకునేందుకు తమ భావాలను వారధిగా చేసుకోవాలి. బంగారు భవితకు దిశానిర్ధేశం చేసే క్రమంలో 'స్నేహం' జీవన విధానంలో మార్పులను తీసుకువస్తుంది. కల్మశం లేని స్నేహాన్ని అందించేలా చూస్తూనే హద్దులెరిగి ప్రవర్తించాలి. ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా, ఆప్యాయత, అనురాగాలతో మెలగాలి. మానసిక అంతరాల్ని తొలగించేందుకు ఒకరి కన్నా మరొకరు ముందుండేందుకు ఇరువురు ఉత్సాహం చూపాలి.
eenadu 3.8.2008

అజ్ఞాత చెప్పారు...

raju.gadwal@gmail.com

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి