ఓ బుజ్జి గణపయ్య మా అయ్య నీవయ్య
ఆది దంపతులకు నీవు గారాల పట్టివయ్య
వైభవంబుగ నీకు పుట్టినరోజు పండుగే చేయ
చేతులే జోడించి దండాలు పెట్టాము
మా కడకు రమ్మంటు మొక్కులే మొక్కాము
మా పిలుపు విన్నావు వాడ వాడల నువ్వు కొలువు దీరావు
ప్రాభవంబుగ నీకు ఉత్సవంబులేచేయ
నింగినే తుంచాము పందిళ్ళు వేశాము
నేలనే అలికాము అరుగుల్లు వేశాము
రంగురంగుల రంగుల రంగవల్ల్లుల తోడ ముంగిళ్ళు తీర్చిదిద్దాము
వెల్లువెత్తిన వానలే మా ఇళ్ళ్లు ముంచంగ
నీళ్ల పాయసాలు నీకు నైవేద్యమెట్టాము
ముక్కిపోయిన అటుకులు పెట్టి నిన్ను మోమాట పెట్టాము
మందుబెల్లం తెచ్చీ నిన్ను నంజుకొమన్నాము
పాల తాలికలకై నీదు తొండమ్ము వెదుకగా
మురిపాల మాటలతోటె సరిపెట్టాము
బూరెలు ,గారెలు మాయమాయె పులిహోర సల్విడులు శరణ్యమాయె
నీ పందిళ్ళలో మునుపటి సందళ్ళూ కరువాయె
ప్యాకేజీ పత్రిలో ఏ పత్రములున్నవో
ఎరుకలేనీ వారమయ్య మమ్ము మన్నించవయ్య
తొమ్మిది రోజులు నిన్ను భక్తితో పూజించి
ఆపైన నిగ్రహులమై
నీ విగ్రహమ్ముల మురుగు నీటి పాల్జేసినామని
ఆగ్రహించక మమ్ము అనుగ్రహించుమయ్య
ఎన్నెన్నో వంటకమ్ముల కై ఎదురు చూసిన నీకు
చప్పటి కుడుములు పప్పులేని ఉండ్రాళ్ళు గొప్పగా పెట్టాము
ఆరగించీ నువ్వు మా బాధలాలకించగవయ్య
బొజ్జనిండుగ మేసీ బ్రేవుమనుచును భారమ్ము మోయలెదనుచు
నీ వాహన రాజమును తోడ్కొన మరచేవు మా కొంప ముంచేవు
గడ్డు కాలమని గమనించి ఓ అయ్య
మమ్ము కరుణించి దీవించి దయసేయవయ్య
గుంజీలు తీసేము క్షమియించమని నిన్ను వేడుకున్నాము
మాదు విద్యలు, వ్యాపారమ్ములు అవిఘ్నముగ
వర్థిల్లమని దయతో దీవించుమయ్య
1 కామెంట్‌లు:
:)..
పాపం.. ఆ దేవుడికి కూడా మనతో పాటు బాధలు పడక తప్పదు మరి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి